Shuru
Apke Nagar Ki App…
వేటపాలెం జడ్పీ హైస్కూల్లో ఓజోన్ పొర పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని బాపట్ల జిల్లా, వేటపాలెం జడ్పీ హైస్కూల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. చిత్రలేఖనం పోటీలు, ర్యాలీ, మానవహారం నిర్వహించి హెచ్ఎం డి. సరోజిని విద్యార్థులకు ఓజోన్ పొర ప్రయోజనాలు, క్షీణత, పరిరక్షణ పై అవగాహన కల్పించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు 'క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ క్లబ్' ప్రెసిడెంట్ యు. వేణుగోపాలరావు బహుమతులు అందజేశారు.
Gopal U
వేటపాలెం జడ్పీ హైస్కూల్లో ఓజోన్ పొర పరిరక్షణ అవగాహన కార్యక్రమాలు ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని బాపట్ల జిల్లా, వేటపాలెం జడ్పీ హైస్కూల్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. చిత్రలేఖనం పోటీలు, ర్యాలీ, మానవహారం నిర్వహించి హెచ్ఎం డి. సరోజిని విద్యార్థులకు ఓజోన్ పొర ప్రయోజనాలు, క్షీణత, పరిరక్షణ పై అవగాహన కల్పించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు 'క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ క్లబ్' ప్రెసిడెంట్ యు. వేణుగోపాలరావు బహుమతులు అందజేశారు.
More news from Bapatla and nearby areas
- 22 అడుగుల ఎత్తు గల వినాయక విగ్రహం రేపల్లె ఆర్యవైశ్య యువత ఆధ్వర్యంలో ఏర్పడిన గణేష ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి ప్రాంగణంలో గత 22 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 14 నుండి ప్రారంభమైన గణేష్ మహోత్సవాలు 7 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య యువత అధ్యక్షులు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ బొలిశెట్టి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు లలిత సహస్రనామ పారాయణం సంపత్ గణపతి గానామృతం సౌందర్యలహరి పారాయణం పంచ హారతులు తీర్థప్రసాదాలు వినియోగము జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అవుతున్నారని, 20వ తేదీ అన్న ప్రసాద వితరణ స్వామి వారి లడ్డు వేలం పాట సాయంత్రం 4 గంటలకు వినాయక నిమర్జనం ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కేరళ వారిచే అందకాసురుడు, రోబోటిక్ ప్రోగ్రాం, సరస్వతీ నాదస్వర బృందం, పామరు వారిచే క్లాసికల్ సన్నాయి మేళం లతో గణేష్ నిమజ్జనాన్ని రేపల్లె పెనుమూడి కృష్ణ నది వద్ద నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.2
- అమరావతిలో కనుల పండుగగా పంచముఖ వినాయకుని గ్రామోత్సవం కృష్ణా నదిలో నిమజ్జనం అమరావతి: పల్నాడు జిల్లా అమరావతిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పంచముఖ నాయకుని గ్రామోత్సవం గురువారం సాయంత్రం కనుల పండుగ గా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుని బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.1
- సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడు, సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడుకి మహిళలు పూజా కార్యక్రమం చేసి పిల్లలచే ఆటపాటలు చేయించుచున్న కమిటీ వారికి ధన్యవాదాలు.2
- లంభోధర బ్రదర్స్ యూత్ హాజీ పేట, మైలవరం గ్రామం, మైలవరం మండలం, మైలవరం నియోజకవర్గం.1
- మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్ల విస్తరణ పనులు ప్రారంభిస్తామని తెలిపిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మార్కాపురం జిల్లా కేంద్రంలో త్వరలో రోడ్లు విస్తరిస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక ఓ డిగ్రీ కళాశాల యువతతో ముఖాముఖి కార్యక్రమంలో ట్రాఫిక్ సమస్య ఉందని ఓ విద్యార్థిని అడిగారు. దీంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రం కావడంతో ప్రజల అవసరాల నిమిత్తం రాకపోకలు ఎక్కువయ్యాయన్నారు. సీఎం తో మాట్లాడి త్వరలో రోడ్లను విస్తరించే పనులను చేపడతామన్నారు. యువతీ యువకులు సహకరించాలని కోరారు.1
- పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.1
- మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన సిట్ అధికారులు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకోచ్చారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు'లో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు.పీటీ వారెంట్‌పై కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడకు తరలింపు.మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఈడీ అధికారులు.1
- జమ్వాసు గ్రామంలో బొలెరోతో గుద్ది వృద్ధురాలి ప్రాణం తీసిన భూ వివాదం భూ వివాదం నేపథ్యంలో బొలెరోతో గుద్ది వృద్ధురాలి ప్రాణం తీసిన సంఘటన మహారాష్ట్రలోని జమ్వాసు గ్రామంలో జరిగింది. భూ వివాదం ఓ వృద్దురాలి ప్రాణం తీసింది. ప్రత్యర్థులు ముసలావిడ ఉంటున్న ఇంటిని బొలెరో వాహనంతో 4-5 సార్లు గుద్దారు. దీంతో 75 ఏళ్ల సోనాబాయి మఖారం జాదవ్ స్పాట్‌లోనే చనిపోయింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వృద్ధురాలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది. ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.1