logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉపాధి హామీ కార్మికుల ధర్నాకు సబ్ కలెక్టర్ సానుకూల స్పందన కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లకు వినతిపత్రం సమర్పించారు.జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ డివిజన్‌లో పని ప్రదేశాల్లో మంచినీరు, టెంట్లు, మెడికల్ కిట్లు లేవని, మూడు నెలలుగా వేతనాలు బకాయి పడ్డాయని తెలిపారు. రెండు ఫోటోల విధానం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుకు సంవత్సరానికి కనీసం 200 పనిదినాలు కల్పించాలని కోరారు.సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని అంగీకరించారు. పని ప్రదేశాల్లో తక్షణం కనీస సదుపాయాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, మండల అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా పని ప్రదేశాలు సందర్శిస్తానని, ఇన్చార్జ్ ఎంపీడీవో గౌరీ శంకర్‌ను తక్షణం చర్యలు తీసుకోవాలని మందలించారు.

3 hrs ago
user_Krishna
Krishna
ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
3 hrs ago

ఉపాధి హామీ కార్మికుల ధర్నాకు సబ్ కలెక్టర్ సానుకూల స్పందన కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లకు వినతిపత్రం సమర్పించారు.జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ డివిజన్‌లో పని ప్రదేశాల్లో మంచినీరు, టెంట్లు, మెడికల్ కిట్లు లేవని, మూడు నెలలుగా వేతనాలు బకాయి పడ్డాయని తెలిపారు. రెండు ఫోటోల విధానం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుకు సంవత్సరానికి కనీసం 200 పనిదినాలు కల్పించాలని కోరారు.సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని అంగీకరించారు. పని ప్రదేశాల్లో తక్షణం కనీస సదుపాయాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, మండల అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా పని ప్రదేశాలు సందర్శిస్తానని, ఇన్చార్జ్ ఎంపీడీవో గౌరీ శంకర్‌ను తక్షణం చర్యలు తీసుకోవాలని మందలించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లకు వినతిపత్రం సమర్పించారు.జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ డివిజన్‌లో పని ప్రదేశాల్లో మంచినీరు, టెంట్లు, మెడికల్ కిట్లు లేవని, మూడు నెలలుగా వేతనాలు బకాయి పడ్డాయని తెలిపారు. రెండు ఫోటోల విధానం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుకు సంవత్సరానికి కనీసం 200 పనిదినాలు కల్పించాలని కోరారు.సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని అంగీకరించారు. పని ప్రదేశాల్లో తక్షణం కనీస సదుపాయాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, మండల అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా పని ప్రదేశాలు సందర్శిస్తానని, ఇన్చార్జ్ ఎంపీడీవో గౌరీ శంకర్‌ను తక్షణం చర్యలు తీసుకోవాలని మందలించారు.
    1
    కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లకు వినతిపత్రం సమర్పించారు.జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ డివిజన్‌లో పని ప్రదేశాల్లో మంచినీరు, టెంట్లు, మెడికల్ కిట్లు లేవని, మూడు నెలలుగా వేతనాలు బకాయి పడ్డాయని తెలిపారు. రెండు ఫోటోల విధానం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుకు సంవత్సరానికి కనీసం 200 పనిదినాలు కల్పించాలని కోరారు.సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని అంగీకరించారు. పని ప్రదేశాల్లో తక్షణం కనీస సదుపాయాలు కల్పించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని, మండల అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా పని ప్రదేశాలు సందర్శిస్తానని, ఇన్చార్జ్ ఎంపీడీవో గౌరీ శంకర్‌ను తక్షణం చర్యలు తీసుకోవాలని మందలించారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మంగళవారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీకొన్నారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడకు చెందిన బిల్లా మహేందర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
    1
    జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. మంగళవారం రాత్రి తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి బైక్ నడుపుతున్న వ్యక్తి ఢీకొన్నారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తిని జన్నారం మండలంలోని మందపల్లి రేండ్లగూడకు చెందిన బిల్లా మహేందర్ గా గుర్తించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • 📍 ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 📌 కార్మికుల డిమాండ్స్‌పై నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సమయం పట్టొచ్చని అన్నారు. 📌 అన్ని అంశాలను పరిశీలించేందుకు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
    1
    📍
ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
📌 కార్మికుల డిమాండ్స్‌పై నిర్ణయాలు తీసుకోవడంలో కొంత సమయం పట్టొచ్చని అన్నారు.
📌 అన్ని అంశాలను పరిశీలించేందుకు నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    2 hrs ago
  • జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...
    4
    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఉన్న వెయ్యి సంవత్సరాల పురాతన గడి బురుజులను కాపాడాలి. అవినీతిని అంతం చేయాలి. నిద్రిస్తున్న నాయకులు, అధికారులు మేల్కొని తగు చర్యలు తీసుకుని చారిత్రాత్మక పురాతన నిర్మాణాలను కాపాడాలీ...
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్,సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు,సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సెల్ ఫోన్లు ఇవ్వడం బానే ఉంది కాని, ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవీ ఇంచార్జి వినూత్న,బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ,మండల సూపర్ వైజర్లు లలిత, మంజుల,విమల,మౌనిక,జంగుబాయి,సుమలత, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.
    1
    రాష్ట్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టు కింద అంగన్ వాడి టీచర్లకు అందజేస్తున్న 5G ఫోన్లను ఈరోజు నెరడిగొండ మండల కేంద్రంలో నియోజకవర్గంలోని బోథ్, సోనాల, ఇచ్చొడ, నెరడిగొండ, బజార్ హత్నూర్,సిరికొండ మండలాలకు చెందిన 289 మంది అంగన్ వాడి టీచర్లకు,సూపర్ వైజర్లకు, బ్లాక్ కోఆర్డినేటర్లకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సెల్ ఫోన్లు ఇవ్వడం బానే ఉంది కాని, ప్రభుత్వం అంగన్ వాడిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీవీ ఇంచార్జి వినూత్న,బ్లాక్ కోఆర్డినేటర్ శివాజీ,మండల సూపర్ వైజర్లు లలిత, మంజుల,విమల,మౌనిక,జంగుబాయి,సుమలత, అంగన్ వాడి టీచర్లు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    10 hrs ago
  • పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి *సానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్ మిషన్స్ డొనేషన్* యూనివర్సిటీ, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఆన్ హైజీన్ (ఎంపవరింగ్ హైజీన్)” కార్యక్రమం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో * ముఖ్యఅతిథిగా ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్& ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి * హాజరై సానిటరీ ప్యాడ్స్ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ యూనివర్సిటీకి అందజేశారు. అనంతరం డాక్టర్ హరిణి మాట్లాడుతూ సమాజంలో జెండర్ సమానత్వం పీరియడ్స్ పై మాట్లాడడానికి నిశ్శబ్దం వీడండి ఆడపిలల కి సపోర్ట్ ఇవ్వండి ఎదగడానికి యువత మీ కళలు సాకారం చేసుకోండి అన్నారు * మహిళలు మరియు విద్యార్థుల్లో హైజీన్‌పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి అని సూచించారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం, పరిశుభ్రత,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని,ధైర్యంగా మాట్లాడాలని సూచించారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. డాక్టర్ సత్య ప్రభా (హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, గైనకాలజీ) మాట్లాడుతూ, యౌవన దశ నుంచే శానిటరీ హైజీన్‌పై సరైన అవగాహన ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శానిటరీ ఉత్పత్తులను సక్రమంగా వినియోగించడం ద్వారా గైనకాలజీ సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ గీతా రెడ్డి గారు (ప్రొఫెసర్, జనరల్ సర్జరీ & డెర్మటాలజిస్ట్) మాట్లాడుతూ, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముందని సూచించారు. శానిటరీ డిస్పోజల్ మిషన్‌ల వినియోగం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లను సరైన విధంగా డిస్పోజ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ మిషన్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. డాక్టర్ ఉమేష్ కుమార్ వైస్ ఛాన్స్లర్ శాతవాహన యూనివర్సిటీ మాట్లాడుతూ మాట్లాడుతూ హెల్త్ పై అవగాహన చేయడం, సాంట్రీ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ చేయడం చాలా గొప్ప విషయం అందుకు ప్రతిమ ఫౌండేషన్ కి ధన్యవాదాలు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్స్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ యు. ఉమేశ్ కుమార్ – వైస్ ఛాన్స్లర్, శాతవాహన విశ్వవిద్యాలయం (ముఖ్య అతిథి), ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ – రిజిస్ట్రార్, శాతవాహన విశ్వవిద్యాలయం (ప్రెసిడెంట్) డాక్టర్ బోయినపల్లి హారిణి – ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & డైరెక్టర్, ప్రతిమ గ్రూప్స్, డాక్టర్ సత్య ప్రభా – హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (గైనకాలజీ), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కీనోట్ స్పీకర్), డాక్టర్ గీతా రెడ్డి – ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ (డెర్మటాలజిస్ట్), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ నజిముద్దిన్ మున్వార్ – చీఫ్ వార్డెన్, యూనివర్సిటీ హాస్టల్స్, శాతవాహన విశ్వవిద్యాలయం, డాక్టర్ సావిత్రి శాతవాహన యూనివర్సిటీ ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    3
    పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి
*సానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్  మిషన్స్
డొనేషన్* 
యూనివర్సిటీ, ప్రతిమ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో “హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఆన్ హైజీన్ (ఎంపవరింగ్ హైజీన్)” కార్యక్రమం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో అంబేద్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో *
ముఖ్యఅతిథిగా ప్రతిమ ఫౌండేషన్ ఫౌండర్& ప్రతిమ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి * హాజరై  సానిటరీ ప్యాడ్స్  డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ యూనివర్సిటీకి అందజేశారు.
అనంతరం డాక్టర్ హరిణి మాట్లాడుతూ సమాజంలో
జెండర్ సమానత్వం  
పీరియడ్స్ పై మాట్లాడడానికి నిశ్శబ్దం వీడండి
ఆడపిలల కి సపోర్ట్ ఇవ్వండి ఎదగడానికి 
యువత మీ కళలు సాకారం చేసుకోండి
అన్నారు
* మహిళలు మరియు విద్యార్థుల్లో హైజీన్‌పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని అన్నారు. పరిశుభ్రతపై అవగాహనతో యువత ఆరోగ్యవంతమైన సమాజానికి దోహదం చేయాలి అని సూచించారు. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం, పరిశుభ్రత,ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.నెలసరి సహజ ప్రక్రియ అని, దీనిపై భయపడాల్సిన అవసరం లేదని,ధైర్యంగా మాట్లాడాలని సూచించారు  భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. 
డాక్టర్ సత్య ప్రభా (హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, గైనకాలజీ) మాట్లాడుతూ, యౌవన దశ నుంచే శానిటరీ హైజీన్‌పై సరైన అవగాహన ఉండటం అత్యంత కీలకమని పేర్కొన్నారు. శానిటరీ ఉత్పత్తులను సక్రమంగా వినియోగించడం ద్వారా గైనకాలజీ సమస్యలను నివారించవచ్చని వివరించారు. ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. డాక్టర్ గీతా రెడ్డి గారు (ప్రొఫెసర్, జనరల్ సర్జరీ & డెర్మటాలజిస్ట్) మాట్లాడుతూ, పరిశుభ్రతలో నిర్లక్ష్యం వల్ల చర్మ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముందని సూచించారు.  శానిటరీ డిస్పోజల్ మిషన్‌ల వినియోగం ద్వారా పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఉపయోగించిన శానిటరీ న్యాప్కిన్లను సరైన విధంగా డిస్పోజ్ చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని అన్నారు. ఈ మిషన్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచించారు. నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. 
డాక్టర్ ఉమేష్ కుమార్ 
వైస్ ఛాన్స్లర్ శాతవాహన యూనివర్సిటీ మాట్లాడుతూ మాట్లాడుతూ హెల్త్ పై అవగాహన చేయడం, సాంట్రీ డిస్పోజల్ మిషన్స్ డొనేషన్ చేయడం చాలా గొప్ప విషయం అందుకు 
ప్రతిమ ఫౌండేషన్ కి ధన్యవాదాలు రాబోయే రోజులలో హెల్త్ క్యాంప్స్ చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో 
ప్రొఫెసర్ యు. ఉమేశ్ కుమార్ –  వైస్ ఛాన్స్లర్, శాతవాహన విశ్వవిద్యాలయం (ముఖ్య అతిథి), ప్రొఫెసర్ పి. సతీష్ కుమార్ – రిజిస్ట్రార్, శాతవాహన విశ్వవిద్యాలయం (ప్రెసిడెంట్)
డాక్టర్ బోయినపల్లి హారిణి – ప్రతిమ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & డైరెక్టర్, ప్రతిమ గ్రూప్స్, డాక్టర్ సత్య ప్రభా – హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ (గైనకాలజీ), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కీనోట్ స్పీకర్), డాక్టర్ గీతా రెడ్డి – ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ (డెర్మటాలజిస్ట్), ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 
డాక్టర్ నజిముద్దిన్ మున్వార్ – చీఫ్ వార్డెన్, యూనివర్సిటీ హాస్టల్స్, శాతవాహన విశ్వవిద్యాలయం,
డాక్టర్ సావిత్రి  శాతవాహన యూనివర్సిటీ 
ప్రతిమ ఫౌండేషన్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • Post by Merugu Rajitha
    1
    Post by Merugu Rajitha
    user_Merugu Rajitha
    Merugu Rajitha
    Actor కటారం, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
    16 hrs ago
  • కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహకారంతో 15 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను సిర్పూర్ శాసనసభ్యుడు డా.పాల్వాయి హరీష్ బాబు మంగళవారం ప్రారంభించారు. అదే కార్యక్రమంలో 10 కొత్త స్ట్రెచర్ బెడ్లు కూడా అందజేశారు.గత ఆరు నెలల్లో ఆసుపత్రి సేవలు గణనీయంగా విస్తరించాయని శాసనసభ్యుడు తెలిపారు. రోజువారీగా 300 మంది అవుట్‌పేషెంట్లు, 20 మంది ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలు అందుతున్నాయి. నెలకు 50కి తక్కువ కాకుండా నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. వివిధ విభాగాల స్పెషలిస్ట్ వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు.కేంద్ర ప్రభుత్వ కాయకల్ప స్కీమ్ కింద ఈ ఆసుపత్రి గుర్తింపు పొందే అవకాశం ఉందని, దానికోసం వైద్య సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు. 100 పడకల కొత్త భవన నిర్మాణం వేగంగా సాగుతుందని చెప్పారు.డయాలసిస్ సేవల విస్తరణలో భాగంగా కాగజ్‌నగర్‌లో అదనంగా 5, సిర్పూర్‌లో 5, కౌటాల పీహెచ్‌సీలో 5, బెజ్జూర్ సామాజిక ఆసుపత్రిలో 5 పడకలు కొత్తగా మంజూరయ్యాయి. ఇప్పటికే నియోజకవర్గంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఉంది. మొత్తంగా కొత్తగా 20 డయాలసిస్ పడకలు అందుబాటులోకి రానున్నాయి.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, డీసీహెచ్‌ఎస్ డా.అవినాష్, ఆర్‌ఎంఓ డా.శ్రీధర్ బాబు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
    1
    కాగజ్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సహకారంతో 15 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను సిర్పూర్ శాసనసభ్యుడు డా.పాల్వాయి హరీష్ బాబు మంగళవారం ప్రారంభించారు. అదే కార్యక్రమంలో 10 కొత్త స్ట్రెచర్ బెడ్లు కూడా అందజేశారు.గత ఆరు నెలల్లో ఆసుపత్రి సేవలు గణనీయంగా విస్తరించాయని శాసనసభ్యుడు తెలిపారు. రోజువారీగా 300 మంది అవుట్‌పేషెంట్లు, 20 మంది ఇన్‌పేషెంట్లకు వైద్య సేవలు అందుతున్నాయి. నెలకు 50కి తక్కువ కాకుండా నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. వివిధ విభాగాల స్పెషలిస్ట్ వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు.కేంద్ర ప్రభుత్వ కాయకల్ప స్కీమ్ కింద ఈ ఆసుపత్రి గుర్తింపు పొందే అవకాశం ఉందని, దానికోసం వైద్య సిబ్బంది కృషి చేయాలని పిలుపునిచ్చారు. 100 పడకల కొత్త భవన నిర్మాణం వేగంగా సాగుతుందని చెప్పారు.డయాలసిస్ సేవల విస్తరణలో భాగంగా కాగజ్‌నగర్‌లో అదనంగా 5, సిర్పూర్‌లో 5, కౌటాల పీహెచ్‌సీలో 5, బెజ్జూర్ సామాజిక ఆసుపత్రిలో 5 పడకలు కొత్తగా మంజూరయ్యాయి. ఇప్పటికే నియోజకవర్గంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఉంది. మొత్తంగా కొత్తగా 20 డయాలసిస్ పడకలు అందుబాటులోకి రానున్నాయి.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షాహిన్ సుల్తానా, కౌన్సిలర్లు, డీసీహెచ్‌ఎస్ డా.అవినాష్, ఆర్‌ఎంఓ డా.శ్రీధర్ బాబు తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.