logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అమరావతి అజేయమని ఆంధ్రుల సంకల్పం అనంతమని మాజీ ఎమ్మెల్సీ వట్టికూటి వీరవెంకన్న చౌదరి(కూర్మాపురం అబ్బు... అమరావతి అజేయమని ఆంధ్రుల సంకల్పం అనంతమని మాజీ ఎమ్మెల్సీ వట్టికూటి వీరవెంకన్న చౌదరి(కూర్మాపురం అబ్బు) పేర్కొన్నారు. మండపేట లో గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల అనిశ్చితికి ఇక శాశ్వతంగా ముగింపు పలికిందన్నారు. రైతుల త్యాగాలు, ప్రజల ఆశయాలు, ఆంధ్రుల ఆత్మగౌరవం కలిసి నేడు చట్టరూపంలో సాకారం అయ్యాయన్నారు. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించడం ద్వారా, రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయబడిందనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదంతో అమరావతి గాధకు కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో, అమరావతి ఒకే ఒక్క శాశ్వత రాజధానిగా వెలుగొందబోతోందనీ చెప్పారు. మూడు రాజధానుల పేరుతో జరిగిన రాజకీయ క్రీడలకు ముగింపు పలికి, అభివృద్ధి మార్గంలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్లే సమయం వచ్చిందనీ అన్నారు.ఇది కేవలం ఒక నిర్ణయం కాదనీ ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి విజయం గా అభివర్ణించారు.ఇది రైతుల త్యాగాలకు గౌరవమన్నారు. ఇది భవిష్యత్ తరాలకు నూతన ఆశల దీపమని పేర్కొన్నారు. అమరావతి వెలుగులు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి శిఖరాలకు చేర్చాలని ఆకాంక్షించారు.జయహో అమరావతి అని ఆయన పేర్కొన్నారు.

7 hrs ago
user_Raju Nandikolla
Raju Nandikolla
Local Politician మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
7 hrs ago
53f52135-6737-4922-b670-c2199538c3c0

అమరావతి అజేయమని ఆంధ్రుల సంకల్పం అనంతమని మాజీ ఎమ్మెల్సీ వట్టికూటి వీరవెంకన్న చౌదరి(కూర్మాపురం అబ్బు... అమరావతి అజేయమని ఆంధ్రుల సంకల్పం అనంతమని మాజీ ఎమ్మెల్సీ వట్టికూటి వీరవెంకన్న చౌదరి(కూర్మాపురం అబ్బు) పేర్కొన్నారు. మండపేట లో గురువారం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల అనిశ్చితికి ఇక శాశ్వతంగా ముగింపు పలికిందన్నారు. రైతుల త్యాగాలు, ప్రజల ఆశయాలు, ఆంధ్రుల ఆత్మగౌరవం కలిసి నేడు చట్టరూపంలో సాకారం అయ్యాయన్నారు. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించడం ద్వారా, రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయబడిందనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదంతో అమరావతి గాధకు కొత్త అధ్యాయం ప్రారంభమైందన్నారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో, అమరావతి ఒకే ఒక్క శాశ్వత రాజధానిగా వెలుగొందబోతోందనీ చెప్పారు. మూడు రాజధానుల పేరుతో జరిగిన రాజకీయ క్రీడలకు ముగింపు పలికి, అభివృద్ధి మార్గంలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్లే సమయం వచ్చిందనీ అన్నారు.ఇది కేవలం ఒక నిర్ణయం కాదనీ ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి విజయం గా అభివర్ణించారు.ఇది రైతుల త్యాగాలకు గౌరవమన్నారు. ఇది భవిష్యత్ తరాలకు నూతన ఆశల దీపమని పేర్కొన్నారు. అమరావతి వెలుగులు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి శిఖరాలకు చేర్చాలని ఆకాంక్షించారు.జయహో అమరావతి అని ఆయన పేర్కొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • రాజవొమ్మంగి, శుక్రవారం: మండల కేంద్రంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గౌరీ శంకర్ సిబ్బందితో కలిసి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ సూచించారు.
    1
    రాజవొమ్మంగి, శుక్రవారం: మండల కేంద్రంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గౌరీ శంకర్ సిబ్బందితో కలిసి ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ జంక్షన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సీఐ సూచించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    12 min ago
  • ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏
    1
    ఈ రోజు Good Friday సందర్భంగా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రేమ, క్షమ, నమ్మకం నేర్చుకుందాం 🙏
    user_Kumar Kurapati
    Kumar Kurapati
    చెరుకుపల్లె హెచ్.ఓ అరుంబాక, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • లేబర్ కోడ్లను రద్దు చేయాలని కొమరాడలో 'బ్లాక్ డే' నిరసన కొమరాడ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొమరాడ మండల కేంద్రంలో కార్మికులు మరియు ఉపాధి హామీ కూలీలు కలిసి ఈరోజు 'బ్లాక్ డే' నిర్వహించారు. సిఐటియు  ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12న సమ్మె చేపట్టి వ్యతిరేకించినప్పటికీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొండిగా ఏప్రిల్ 1 నుండి లేబర్ కోడ్లను అమలు చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఈ నాలుగు కోడ్లను తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. ఈ కొత్త చట్టాల వల్ల కార్మికులతో పాటు దళితులు, గిరిజనులు మరియు అన్ని వర్గాల పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప" అన్న కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని, కార్మిక వర్గం మరో భారీ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, సిఐటియు కార్యకర్తలు మరియు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భవిష్యత్తులో జరగబోయే పోరాటాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని నాయకులు కోరారు.
    1
    లేబర్ కోడ్లను రద్దు చేయాలని కొమరాడలో 'బ్లాక్ డే' నిరసన
కొమరాడ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొమరాడ మండల కేంద్రంలో కార్మికులు మరియు ఉపాధి హామీ కూలీలు కలిసి ఈరోజు 'బ్లాక్ డే' నిర్వహించారు. సిఐటియు  ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 36 కోట్ల మంది కార్మిక వర్గం ఫిబ్రవరి 12న సమ్మె చేపట్టి వ్యతిరేకించినప్పటికీ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మొండిగా ఏప్రిల్ 1 నుండి లేబర్ కోడ్లను అమలు చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి, కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చే విధంగా ఈ నాలుగు కోడ్లను తీసుకువచ్చారని ఆయన విమర్శించారు.
ఈ కొత్త చట్టాల వల్ల కార్మికులతో పాటు దళితులు, గిరిజనులు మరియు అన్ని వర్గాల పేద ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప" అన్న కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని స్ఫూర్తిగా తీసుకుని, కార్మిక వర్గం మరో భారీ ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు, సిఐటియు కార్యకర్తలు మరియు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. భవిష్యత్తులో జరగబోయే పోరాటాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని నాయకులు కోరారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది.
గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది.
ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది.
గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.
ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    21 hrs ago
  • ములకలకాలువ గ్రామ సభ
    1
    ములకలకాలువ గ్రామ సభ
    user_Hannu Shaik
    Hannu Shaik
    Local Politician మిర్యాలగూడ, నల్గొండ, తెలంగాణ•
    19 hrs ago
  • హన్మకొండ జిల్లా:హనుమకొండ వడ్డేపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక సోదాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించగా, ఏడాదిలో రూ.42 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎస్ఆర్ఆలు రామనర్సింహారావు, ఆనంద్ అక్రమాలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సాక్ష్యాలుగా లభించాయి. వారి ఇళ్లలో సోదాల్లో నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడగా, కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
    1
    హన్మకొండ జిల్లా:హనుమకొండ వడ్డేపల్లి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక సోదాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించగా, ఏడాదిలో రూ.42 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు తేలింది.
ఎస్ఆర్ఆలు రామనర్సింహారావు, ఆనంద్ అక్రమాలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సాక్ష్యాలుగా లభించాయి. వారి ఇళ్లలో సోదాల్లో నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడగా, కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    31 min ago
  • పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 11,463 మందికి గాను 11,377మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.25 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. అల్లూరి జిల్లాలో 44,పోలవరం జిల్లాలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు కేంద్రాలను ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు తనిఖీ చేశారు.
    1
    పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 11,463 మందికి గాను 11,377మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.25 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. అల్లూరి జిల్లాలో 44,పోలవరం జిల్లాలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు కేంద్రాలను ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు తనిఖీ చేశారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • శ్రీకాకుళం, ఏప్రిల్ 3 : పాతపట్నం ప్రజలకు, శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్తను తెలియజేశారు. నరసన్నపేట నుండి పాతపట్నం మీదుగా ఒరిస్సాను కలిపే జాతీయ రహదారి 326Aలో పాతపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న రెండు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కోసం అదనంగా జాతీయ రహదారుల సంస్థ నుండి 15 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం నాడు జాతీయ రహదారుల సంస్థ నుండి విడుదల కావడంతో ఇకపై ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుగుతామని స్పష్టం చేశారు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం ఎదురుగా నిర్మాణం అవుతున్న ROB ప్రాజెక్టు విషయంలో ముందుగా ప్రతిపాదించిన దశలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆలయ ప్రాంతంలో రాకపోకలు, భక్తులకు దూరం నుండే ఆలయ దర్శనం, అయిదేళ్ళకు ఒకసారి జరిగే మహా జాతర ఉత్సవాల్లో కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని గతంలోనే కేంద్ర మంత్రి చెంతకు సమస్య చేరింది ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవించి, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో వయాడక్ట్ నిర్మాణం చేపట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని జాతీయ రహదారుల సంస్థకు, కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కారి దృష్టిలో ఉంచి నేడు పరిష్కార దిశగా మళ్ళించామని అన్నారు. డిజైన్ మార్పునకు అంగీకారం తెలపడంతో పాటు, అదనపు నిధులు మంజూరుకు సంబంధించి కూడా ఉత్తర్వులు గురువారం నాడు విడుదల అయ్యాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మార్పు కేవలం ప్రాజెక్టు నిర్మాణశైలిలో జరిగిన మార్పు మాత్రమే కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసానికి కూటమి సర్కారు ఇస్తున్న గౌరవం అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ అభివృద్ధి చేయడం మా సంకల్పమని అన్నారు. అన్ని అనుమానాలు తొలగి అదనపు నిధులు మంజూరు అయిన నేపధ్యంలో అతి త్వరలోనే ఆర్వోబిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
    1
    శ్రీకాకుళం, ఏప్రిల్ 3 : పాతపట్నం ప్రజలకు, శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్తను తెలియజేశారు.  నరసన్నపేట నుండి పాతపట్నం మీదుగా ఒరిస్సాను కలిపే జాతీయ రహదారి 326Aలో పాతపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న రెండు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కోసం అదనంగా జాతీయ రహదారుల సంస్థ నుండి 15 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం నాడు జాతీయ రహదారుల సంస్థ నుండి విడుదల కావడంతో ఇకపై ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుగుతామని స్పష్టం చేశారు. 
నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం ఎదురుగా నిర్మాణం అవుతున్న ROB ప్రాజెక్టు విషయంలో ముందుగా ప్రతిపాదించిన దశలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు.  ఆలయ ప్రాంతంలో రాకపోకలు, భక్తులకు దూరం నుండే ఆలయ దర్శనం, అయిదేళ్ళకు ఒకసారి జరిగే మహా జాతర ఉత్సవాల్లో  కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని  గతంలోనే కేంద్ర మంత్రి చెంతకు సమస్య చేరింది 
ఈ నేపథ్యంలో  స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవించి, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో వయాడక్ట్ నిర్మాణం చేపట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని జాతీయ రహదారుల సంస్థకు, కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కారి దృష్టిలో ఉంచి నేడు పరిష్కార దిశగా మళ్ళించామని అన్నారు. డిజైన్ మార్పునకు అంగీకారం తెలపడంతో పాటు, అదనపు నిధులు మంజూరుకు సంబంధించి కూడా ఉత్తర్వులు గురువారం నాడు విడుదల అయ్యాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ  మార్పు కేవలం ప్రాజెక్టు నిర్మాణశైలిలో జరిగిన మార్పు మాత్రమే కాదని,  మన సంస్కృతి, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసానికి  కూటమి సర్కారు ఇస్తున్న గౌరవం అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.   ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ అభివృద్ధి చేయడం మా సంకల్పమని అన్నారు. అన్ని అనుమానాలు తొలగి అదనపు నిధులు మంజూరు అయిన నేపధ్యంలో అతి త్వరలోనే ఆర్వోబిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • జనగామ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు పాల్గొని అమరుడి సేవలను స్మరించుకున్నారు.
    1
    జనగామ జిల్లాలో  తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు పాల్గొని అమరుడి సేవలను స్మరించుకున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.