logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాతపట్నం వద్ద కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జికి అదనంగా 15 కోట్ల మంజూరు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం, ఏప్రిల్ 3 : పాతపట్నం ప్రజలకు, శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్తను తెలియజేశారు. నరసన్నపేట నుండి పాతపట్నం మీదుగా ఒరిస్సాను కలిపే జాతీయ రహదారి 326Aలో పాతపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న రెండు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కోసం అదనంగా జాతీయ రహదారుల సంస్థ నుండి 15 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం నాడు జాతీయ రహదారుల సంస్థ నుండి విడుదల కావడంతో ఇకపై ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుగుతామని స్పష్టం చేశారు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం ఎదురుగా నిర్మాణం అవుతున్న ROB ప్రాజెక్టు విషయంలో ముందుగా ప్రతిపాదించిన దశలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆలయ ప్రాంతంలో రాకపోకలు, భక్తులకు దూరం నుండే ఆలయ దర్శనం, అయిదేళ్ళకు ఒకసారి జరిగే మహా జాతర ఉత్సవాల్లో కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని గతంలోనే కేంద్ర మంత్రి చెంతకు సమస్య చేరింది ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవించి, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో వయాడక్ట్ నిర్మాణం చేపట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని జాతీయ రహదారుల సంస్థకు, కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కారి దృష్టిలో ఉంచి నేడు పరిష్కార దిశగా మళ్ళించామని అన్నారు. డిజైన్ మార్పునకు అంగీకారం తెలపడంతో పాటు, అదనపు నిధులు మంజూరుకు సంబంధించి కూడా ఉత్తర్వులు గురువారం నాడు విడుదల అయ్యాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మార్పు కేవలం ప్రాజెక్టు నిర్మాణశైలిలో జరిగిన మార్పు మాత్రమే కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసానికి కూటమి సర్కారు ఇస్తున్న గౌరవం అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ అభివృద్ధి చేయడం మా సంకల్పమని అన్నారు. అన్ని అనుమానాలు తొలగి అదనపు నిధులు మంజూరు అయిన నేపధ్యంలో అతి త్వరలోనే ఆర్వోబిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

3 hrs ago
user_Dr.Gangu Manmadharao
Dr.Gangu Manmadharao
జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

పాతపట్నం వద్ద కొత్త రోడ్ ఓవర్ బ్రిడ్జికి అదనంగా 15 కోట్ల మంజూరు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం, ఏప్రిల్ 3 : పాతపట్నం ప్రజలకు, శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్తను తెలియజేశారు. నరసన్నపేట నుండి పాతపట్నం మీదుగా ఒరిస్సాను కలిపే జాతీయ రహదారి 326Aలో పాతపట్నం వద్ద నిర్మాణంలో ఉన్న రెండు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కోసం అదనంగా జాతీయ రహదారుల సంస్థ నుండి 15 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు గురువారం నాడు జాతీయ రహదారుల సంస్థ నుండి విడుదల కావడంతో ఇకపై ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగలుగుతామని స్పష్టం చేశారు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం ఎదురుగా నిర్మాణం అవుతున్న ROB ప్రాజెక్టు విషయంలో ముందుగా ప్రతిపాదించిన దశలో కొన్ని ఇబ్బందులు ఉన్నట్టు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చినట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆలయ ప్రాంతంలో రాకపోకలు, భక్తులకు దూరం నుండే ఆలయ దర్శనం, అయిదేళ్ళకు ఒకసారి జరిగే మహా జాతర ఉత్సవాల్లో కొన్ని అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందని గతంలోనే కేంద్ర మంత్రి చెంతకు సమస్య చేరింది ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల అభిప్రాయాలను గౌరవించి, ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ముందుగా ప్రతిపాదించిన రిటైనింగ్ వాల్ స్థానంలో వయాడక్ట్ నిర్మాణం చేపట్టాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విషయాన్ని జాతీయ రహదారుల సంస్థకు, కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కారి దృష్టిలో ఉంచి నేడు పరిష్కార దిశగా మళ్ళించామని అన్నారు. డిజైన్ మార్పునకు అంగీకారం తెలపడంతో పాటు, అదనపు నిధులు మంజూరుకు సంబంధించి కూడా ఉత్తర్వులు గురువారం నాడు విడుదల అయ్యాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ మార్పు కేవలం ప్రాజెక్టు నిర్మాణశైలిలో జరిగిన మార్పు మాత్రమే కాదని, మన సంస్కృతి, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసానికి కూటమి సర్కారు ఇస్తున్న గౌరవం అని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ప్రజల భావోద్వేగాలను గౌరవిస్తూ అభివృద్ధి చేయడం మా సంకల్పమని అన్నారు. అన్ని అనుమానాలు తొలగి అదనపు నిధులు మంజూరు అయిన నేపధ్యంలో అతి త్వరలోనే ఆర్వోబిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 11,463 మందికి గాను 11,377మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.25 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. అల్లూరి జిల్లాలో 44,పోలవరం జిల్లాలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు కేంద్రాలను ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు తనిఖీ చేశారు.
    1
    పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. 11,463 మందికి గాను 11,377మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 99.25 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. అల్లూరి జిల్లాలో 44,పోలవరం జిల్లాలో 28 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయన్నారు. అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో పలు కేంద్రాలను ఏజెన్సీ DEO. మల్లేశ్వరావు తనిఖీ చేశారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by V Ramarao
    3
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 day ago
  • అంజన్న మాలధారణ స్వాములకు నిలువ నీడ లేక ఇబ్బందులు ఆలయ కమిటీపై భక్తుల ఆగ్రహం ఏటూర్ నాగారం శ్రీ రామ నవమి అనంతరం మండల దీక్షలో ఉన్న స్వాములకు తగిన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి స్థానిక రామాలయం గుడి కళ్యాణ మండపం వద్ద శ్రీ రామ నవమి సందర్భంగా దాతల సహకారంతో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పండుగ సమయంలో భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించినప్పటికీ, అనంతరం పరిస్థితులు మారడం గమనార్హం. శ్రీ రామ నవమి ముగిసిన తరువాత హనుమాన్ స్వాములు, అంజన్న స్వాములు 41 రోజుల మండల దీక్షలో భాగంగా మాలధారణ చేపట్టారు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో రామాలయం వద్ద స్వాముల కోసం ప్రత్యేకంగా కుటీరాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం ఆలయ కమిటీ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించకపోవడంతో మాలధారణలో ఉన్న స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిలువ నీడ లేక భక్తులు, స్వాములు బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే స్థానిక గ్రామ పెద్దలు. స్పందించి స్వాములకు తగిన నీడ, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని,
    1
    అంజన్న మాలధారణ స్వాములకు నిలువ నీడ లేక ఇబ్బందులు 
ఆలయ కమిటీపై భక్తుల ఆగ్రహం 
ఏటూర్ నాగారం 
శ్రీ రామ నవమి అనంతరం మండల దీక్షలో ఉన్న స్వాములకు తగిన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి
స్థానిక రామాలయం గుడి కళ్యాణ మండపం వద్ద శ్రీ రామ నవమి సందర్భంగా దాతల సహకారంతో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పండుగ సమయంలో భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించినప్పటికీ, అనంతరం పరిస్థితులు మారడం గమనార్హం.
శ్రీ రామ నవమి ముగిసిన తరువాత హనుమాన్ స్వాములు, అంజన్న స్వాములు 41 రోజుల మండల దీక్షలో భాగంగా మాలధారణ చేపట్టారు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో రామాలయం వద్ద స్వాముల కోసం ప్రత్యేకంగా కుటీరాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే ఈ ఏడాది మాత్రం ఆలయ కమిటీ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించకపోవడంతో మాలధారణలో ఉన్న స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిలువ నీడ లేక భక్తులు, స్వాములు బాధపడుతున్నారు.
ఈ పరిస్థితిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే స్థానిక గ్రామ పెద్దలు.
స్పందించి స్వాములకు తగిన నీడ, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని,
    user_జై భీమ్ అందుబాటులో ఉన్నాను
    జై భీమ్ అందుబాటులో ఉన్నాను
    ఏటూరునాగారం, ములుగు, తెలంగాణ•
    1 hr ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    2 hrs ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • సాధారణంగా బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా మందికి అదొక పెద్ద బరువని ‘పోలీసుల కోసమే కదా’ అని నామమాత్రంగా తగిలించుకునే వారు కొందరైతే.. ఇంట్లో మరిచిపోయామని సాకులు చెప్పేవారు మరికొందరు. కానీ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ గీత కార్మికుడు మాత్రం అందరికీ భిన్నం. ప్రాణం విలువ తెలిసిన వాడు కాబట్టే.. గాల్లో ఊగే తాటి చెట్టు మీద కూడా ‘హెల్మెట్’తోనే తన కులవృత్తి చేస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గండి కమలాకర్ ఒక సాధారణ గీత కార్మికుడు. కులవృత్తిలో భాగంగా రోజుకు వందల అడుగుల ఎత్తు ఉన్న తాటి చెట్లను ఎక్కడం ఆయనకు దినచర్య. అయితే, కమలాకర్ మిగతా వారికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఆయన నడుముకు కల్లు గీసే ముత్తాడు ఉంటే.. తల మీద మాత్రం ధృడమైన హెల్మెట్ ఉంటుంది. ​ గీత కార్మికులు చెట్టు ఎక్కే క్రమంలో ఒక్కోసారి ప్రమాదవశాత్తు జారిపడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు తలకు గాయాలైతే ప్రాణాలకే ముప్పు. అందుకే తన భద్రతను తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు కమలాకర్. బైక్ మీద వెళ్లేటప్పుడే కాదు.. తాను నిత్యం శ్రమించే తాటి చెట్టు మీద కూడా హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నాడు. ​రోడ్డు మీద వెళ్లే వాహనదారులు హెల్మెట్ బరువుగా ఉందని, చెమట పడుతుందని సాకులు చెబుతుంటే.. మండుటెండలో తాటి చెట్టు ఎక్కుతూ కూడా కమలాకర్ హెల్మెట్ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నా ప్రాణం నా కుటుంబానికి ముఖ్యం.. అందుకే ఈ జాగ్రత్త" అని ఆయన చెబుతున్న మాటలు వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నాయి. ​
    1
    సాధారణంగా బైక్ మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా మందికి అదొక పెద్ద బరువని ‘పోలీసుల కోసమే కదా’ అని నామమాత్రంగా తగిలించుకునే వారు కొందరైతే.. ఇంట్లో మరిచిపోయామని సాకులు చెప్పేవారు మరికొందరు. కానీ, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈ గీత కార్మికుడు మాత్రం అందరికీ భిన్నం. ప్రాణం విలువ తెలిసిన వాడు కాబట్టే.. గాల్లో ఊగే తాటి చెట్టు మీద కూడా ‘హెల్మెట్’తోనే తన కులవృత్తి చేస్తున్నాడు. 
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామానికి చెందిన గండి కమలాకర్ ఒక సాధారణ గీత కార్మికుడు. కులవృత్తిలో భాగంగా రోజుకు వందల అడుగుల ఎత్తు ఉన్న తాటి చెట్లను ఎక్కడం ఆయనకు దినచర్య. అయితే, కమలాకర్ మిగతా వారికంటే భిన్నంగా కనిపిస్తాడు. ఆయన నడుముకు కల్లు గీసే ముత్తాడు ఉంటే.. తల మీద మాత్రం ధృడమైన హెల్మెట్ ఉంటుంది.
​
గీత కార్మికులు చెట్టు ఎక్కే క్రమంలో ఒక్కోసారి ప్రమాదవశాత్తు జారిపడే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు తలకు గాయాలైతే ప్రాణాలకే ముప్పు. అందుకే తన భద్రతను తానే చూసుకోవాలని నిర్ణయించుకున్నాడు కమలాకర్. బైక్ మీద వెళ్లేటప్పుడే కాదు.. తాను నిత్యం శ్రమించే తాటి చెట్టు మీద కూడా హెల్మెట్ రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన నమ్ముతున్నాడు.
​రోడ్డు మీద వెళ్లే వాహనదారులు హెల్మెట్ బరువుగా ఉందని, చెమట పడుతుందని సాకులు చెబుతుంటే.. మండుటెండలో తాటి చెట్టు ఎక్కుతూ కూడా కమలాకర్ హెల్మెట్ ధరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "నా ప్రాణం నా కుటుంబానికి ముఖ్యం.. అందుకే ఈ జాగ్రత్త" అని ఆయన చెబుతున్న మాటలు వాహనదారుల చెంప చెళ్లుమనిపిస్తున్నాయి.
​
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    34 min ago
  • మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
    1
    మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది.
గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది.
ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది.
గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు.
ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.