ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఈరోజు సీఎల్పీ మీడియా సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్, ఏప్రిల్ 17 ఆయన మాట్లాడుతూ, తేజస్వీ సూర్య లోక్‌సభలో తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ “కాలకూట విషం చిమ్మారని” ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో బీజేపీ ఎప్పటికప్పుడు వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. 2014 నుంచి 2023 వరకు ప్రధాని నరేంద్ర మోదీ పలుమార్లు తెలంగాణ ఏర్పాటు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, “తల్లిని చంపి బిడ్డను బతికించారు” అన్న వ్యాఖ్యలను గుర్తుచేశారు. లోక్‌సభలో తెలంగాణను అవమానించే వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు బీజేపీకి చెందిన మంత్రులు, ఎంపీలు మౌనంగా ఉండటంపై ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు బీజేపీకి ఇష్టం లేదని స్పష్టం చేశారు. ఇక కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పై కూడా విమర్శలు గుప్పిస్తూ, తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా తప్పించుకున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే వారు రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు మీద విమర్శలు చేయడం అంటే ఉద్యమాలు, అమరుల త్యాగాలను అవమానించడం అని ఆయన అన్నారు. తెలంగాణను అవమానిస్తున్న బీజేపీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో, తెలంగాణ ఏర్పాటు కోసం అప్పట్లో లోక్‌సభలో సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగాన్ని ఆయన గుర్తుచేసి, ఆమె పాత్రను ప్రశంసించారు. (న్యూస్ రిపోర్ట్)

- మునగాల, సూర్యాపేట జిల్లా: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ జోక్యం ఓ నిరుపేద మహిళను ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ సమక్షంలోనే బాధితురాలు పురుగుల మందు తాగడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అసలేం జరిగింది? మునగాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ మరియు ఇతర మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. సభ జరుగుతుండగా, తాడ్వాయి గ్రామానికి చెందిన సునీత అనే మహిళ ఒక్కసారిగా అధికారుల ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగింది. దీన్ని గమనించిన పోలీసులు, సిబ్బంది వెంటనే ఆమెను అడ్డుకుని చికిత్స నిమిత్తం హుటాహుటిన కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆవేదన: తాడ్వాయి గ్రామాన్ని ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్ట్' కింద ఎంపిక చేసింది. బాధిత మహిళ సునీత తెలిపిన వివరాల ప్రకారం: తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరైనప్పటికీ, అధికారులు కావాలని దాన్ని వేరొకరికి కేటాయించారు. కాంగ్రెస్ నాయకులు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, అర్హులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో, కలెక్టర్ ముందే తనువు చాలించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధికారుల స్పందన: ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇళ్ల కేటాయింపులో ఏవైనా అక్రమలు జరిగాయా అనే కోణంలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజకీయ కారణాలతో అర్హులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది1
- జనగాం జిల్లా అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్టేషన్ ఘన్పూర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫైర్ ఆఫీసర్ నరేందర్ ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు. ఆసుపత్రి సిబ్బంది, రోగులకు అగ్నిప్రమాదాల నివారణ చర్యలు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఎస్టింగిషర్ వినియోగ విధానాన్ని ప్రాక్టికల్‌గా చూపించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.1
- జీవితమరణ సరిహద్దుల్లో నిలిచిన వేళ 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అప్రమత్తత, మానవత్వం ఓ తల్లి, శిశువుకు కొత్త జీవితం అందించింది. బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన ఒడిశా కార్మికురాలు రశ్మిత (20)కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 సేవలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మెరుపువేగంతో చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగానే నొప్పులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితి అత్యంత కీలకంగా మారిన వేళ మెడికల్ టెక్నీషియన్ శ్రీను, పైలట్ ఉపేందర్ అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపారు. క్షణక్షణం కీలకమవుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసి, అంబులెన్స్‌లోని డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. వారి సమయస్ఫూర్తి ఫలితంగా రశ్మిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ కాసిరెడ్డి ఫోన్ ద్వారా నిరంతరం సూచనలు అందిస్తూ కీలక పాత్ర పోషించారు. అనంతరం తల్లికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించి, శిశువుకు ఆక్సిజన్ ఇచ్చి, ఇద్దరినీ సురక్షితంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాల విలువను కాపాడుతూ అద్భుత సేవ అందించిన EMT శ్రీను, పైలట్ ఉపేందర్‌లపై స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.1
- వర్దన్నపేట (వరంగల్ జిల్లా): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వర్దన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డులోని జాతీయ రహదారి (NH-563) పై వర్దన్నపేట పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు డెమో ప్రమాదాన్ని సృష్టించి, ప్రమాదం జరిగిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధితులకు అందించాల్సిన ప్రాథమిక సహాయంపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ACP, CI, SIలతో పాటు హైవే, R&B మరియు MVI అధికారులు పాల్గొని యువతకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.1
- Hyderabad Traffic Police Ka Insaniyat Bhara Kadam: Auto Drivers Ke Liye Free Eye Test Camp Ne Jeeta Sabka Dil #HyderabadTrafficPolice #ChikkadpallyPolice #Insaniyat #EyeTestCamp #AutoDrivers #RoadSafety #PublicSafety #HealthAwareness #PoliceInitiative #InspiringStep #SafetyFirst #HyderabadNews #24NewsHaqKiAwaaz1
- Post by Shyam sunder Yadav Pulapally1
- వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డు జాతీయ రహదారిపై పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో వివరిస్తూ ‘డెమో యాక్సిడెంట్’ చేసి ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అంబటి నరసయ్య, సీఐ , ఎంవీఐ అధికారులు పాల్గొని వాహనదారులకు రహదారి భద్రతా సూచనలు అందించారు. యువత ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, అజాగ్రత్త వల్ల జరిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా కోరారు.1