భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఎస్పీ అధ్యక్షుడిగా కోళ్లపూడి ప్రవీణ్ l కాంగ్రెస్ వైఫల్యాలపై నిప్పులు చెరిగిన బీఎస్పీ పాల్వంచ ఏప్రిల్ 01/2026బుధవారం న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ముఖ్య కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా సాగింది. మై బాబు పార్లమెంటు ఇన్చార్జి తాండ్ర వెంకటేశ్వర్లు రాష్ట్ర కోఆర్డినేటర్ దాగిల్ల దయానంద రావు సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు ఇబ్రo శేఖర్ పాల్వంచ పట్టణానికి చెందిన కోళ్లపూడి ప్రవీణ్ కి జిల్లా అధ్యక్షుని బాధ్యతల్లో నియమించారని, జిల్లా అధ్యక్షుడిగా నియమితులైనందుకు ఎంతో సంతోషంగా ఉందని అంతే బాధ్యతతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం బహుజన రాజ్యాధికారం కోసం పనిచేస్తానని కోళ్లపూడి ప్రవీణ్ అన్నారు కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన కోళ్లపూడి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక అబద్ధపు హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. "ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు ఆ హామీలను తుంగలో తొక్కింది. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తోంది" అని ఆయన తీవ్రంగా విమర్శించారు. తన నియామకానికి సహకరించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ, జిల్లాలో బీఎస్పీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతానని ప్రవీణ్ శపథం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను ఏకం చేసి, బహుజన గళాన్ని వినిపిస్తామని చెప్పారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో బీఎస్పీ ఎప్పుడూ ముందుంటుందని, బహుజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం తన ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతానని ఆయన వాగ్దానం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, ప్రజలందరూ బీఎస్పీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Post by Sode Prasad1
- Post by V Ramarao3
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల వలన దేశంలో రాష్ట్రంలో రైతాంగాన్ని కాపాడటానికి వ్యవసాయాన్ని రక్షించడానికి ఉద్యమాలను రూపకల్పన చేయటానికి కొత్తగూడెం కేంద్రంలో ఏప్రిల్ 23 24 25 తేదీలలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన పిలుపునిచ్చారు. గురువారం స్థానిక మంచిగంటి భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో పోతినేని సుదర్శన్ రావు పాల్గొని మాట్లాడుతూ దేశంలో 50 శాతం మందికి పైగా వ్యవసాయం పైన ఆధారపడుతున్నారని అటువంటి ప్రజానీకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు ఇటీవల బడ్జెట్ లో 53 లక్షల కోట్లతో ప్రవేశపెడితే 50 శాతం మంది గా ఉన్న వ్యవసాయానికి కేవలం లక్ష అరవై వేల కోట్లు కేటాయించడం వ్యవసాయాన్ని దెబ్బ తీయడం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు వ్యవసాయాన్ని కార్పొరేట్ చేయటం కోసం విద్యుత్ సవర్ణ చట్టం ఎరువులపై సబ్సిడీని ఎత్తివేయడం యూరియాని రైతులుకి అందుబాటులో లేకుండా చేయడం రైతులు బీమా సౌకర్యం లేకుండా చేయటం వంటివి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని దానివల్ల రైతాంగం దివాలా దేశ పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రైతులకి అర్థం కాని అందుబాటులో లేని యాప్లు తీసుకొచ్చి వాటి ద్వారా ఎరువులు కి కొనుగోలు అమ్మకాలు జరిగేటట్లు తీసుకురావడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ నామాకరణ పేరుతో మా ప్రభుత్వం పని చేస్తుందని చెప్తున్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం అరకొరగా కేటాయింపులు జరపటం రైతులు మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఆయన చెప్పారు సంవత్సరానికి రెండు విడతల్లో రైతు భరోసా ఆరు దఫాలుగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం రెండు దఫాలు ఇచ్చి చేతులు దొరుకుతుందని రైతు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 50% మాత్రమే అమలు చేసి పూర్తిగా అమలు చేసిన అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేయడం రైతాంగాన్ని దెబ్బతీయటం తప్ప ఇంకోటి కాదని ఆయన పేర్కొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్ పంటకి తగ్గట్లు పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణం జరగాలని అందుకు అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ 30 టన్నుల నుంచి 60 టన్నుల సామర్థ్యానికి పెంచాలని అప్పారావుపేట ఫ్యాక్టరీ 60 టన్నుల నుంచి ఆధునిక టెక్నాలజీతో ఆధునికరించాలని ఆయన డిమాండ్ చేశారు ఇక్కడ శుద్ధి చేసిన ముడి ఆయిల్ని సిద్దిపేటకు తీసుకుపోకుండా ఇక్కడే రిఫైనరీ సెంటర్ ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు పట్టా అక్కులేని వాడు సాగుదారులకి రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు జిల్లాలో ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లా వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలని అందుకు ఒకే దఫాలో నిర్మాణం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు లింకు కెనాల్సు బ్రాంచ్ కెనాల్సు, కొరకు పూసేకరణ చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు దేశవ్యాప్తంగా వ్యవసాయానికి ఎదురవుతున్న సవాళ్లపైన మూడవ రాష్ట్ర మహాసభల్లో కూలంకషంగా చర్చించి రైతాంగ ఉద్యమాల్ని బలోపేతం చేయడానికి కార్యచరణ రూపొందించడానికి అందుకు కావలసిన తీర్మానాలు రూపకల్పనకు ఈ మహాసభలను వేదిక ఏర్పాటు చేసుకుంటున్నామని ఆయన తెలిపారు అటువంటి ముఖ్యమైన మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్న రైతాంగం సహకరించి జయప్రదం చేయాలని ఆయన రైతు సోదరులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జలసూత్రం శివరాం ప్రసాద్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నవరపు కనకయ్య తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎలమంచి వంశీకృష్ణ అన్నవరపు సత్యనారాయణ రాష్ట్ర నాయకులు కున్సోత్ ధర్మ కొండ బోయిన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు1
- Post by Motam Rajesh2
- కాకినాడ జిల్లా.. కాకినాడ రూరల్.. *కాకినాడ రూరల్* పరిధిలోని *సర్పవరంలో* *మేక మాంసం* పేరిట *బీఫ్* కలిపి విక్రయిస్తున్న దుకాణదారుడిని మేక మాంసం వర్తక సంఘం సభ్యులు పట్టుకున్నారు. పూల మార్కెట్ సమీపంలో ఉన్న దుకాణాన్ని తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. వెంటనే దుకాణ నిర్వాహకుడిని పట్టుకుని గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా మేక మాంసం వర్తక సంఘం సభ్యులు మాట్లాడుతూ… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరలకు మేక మాంసం అందిస్తామనే పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. 500 నుంచి 600 రూపాయలకే మేక మాంసం అమ్ముతున్నారని నమ్మి కొనుగోలు చేస్తే, అందులో బీఫ్ కలపడం, చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న మేకలను కోసి విక్రయించడం జరుగుతోందని ఆరోపించారు. గత రెండు రోజులుగా సంఘం ఆధ్వర్యంలో అన్ని మేక మాంసం దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామని, అసలు తక్కువ ధరలకు మాంసం ఎలా అమ్ముతున్నారో తెలుసుకునేందుకే ఈ చర్యలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేస్తున్న వారికి ఇలాంటి అక్రమాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయని, రోడ్డు పక్కన అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఇకపై కూడా ఇలాంటి దుకాణాలను గుర్తించి ఫిర్యాదులు చేస్తామని స్పష్టం చేశారు.1
- కాకినాడ జిల్లా తుని పట్టణంలో గురువారం నాడు ఉదయం జైశ్రీరామ్ "హిందూ బంధువులారా"ఏకం కండి అని నినాదంతో పట్టణంలో హిందూ సంఘాలు ఆధ్వర్యంలో పురవీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని ప్రధాన పురవీధుల్లో గుండా జరిగిన ఈ భారీ ర్యాలీలో హిందూ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ పై జరిగిన దాడికి నిరసనగా మేము ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ఈ ర్యాలీలో జైశ్రీరామ్ అనే నినాదం పట్టణమంతా దద్దరిల్లిపోయింది.1
- మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వేన్నారం గ్రామ పరిధిలోని రామకుంట తండాలో సంచలన దొంగతనం చోటుచేసుకుంది. తేజావత్ హర్యా ఇంటిని లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు, బీరువాలు పగులగొట్టి సుమారు రూ.2 లక్షల 20 వేల నగదును అపహరించారు. ఈ ఘటన తండా ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు సృష్టించింది. బుధవారం రోజు హర్యా కుటుంబ సభ్యులు తమ కుమారుడి నిశ్చితార్థ కార్యక్రమం నిమిత్తం సమీప గ్రామానికి వెళ్లారు. ఇంటిని ఖాళీగా ఉంచిన అవకాశాన్ని దొంగలు వినియోగించుకుని రాత్రి సమయంలో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి చేరుకున్నప్పుడు తాళాలు పగులగొట్టబడి ఉండటం, బీరువాలు చెల్లాచెదురుగా ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. డోర్నకల్ సీఐ చంద్రమౌళి స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ వంశీధర్ ఆధ్వర్యంలో పోలీసులు వివరాలు సేకరిస్తూ, క్లూస్ టీం సహాయంతో నిందితుల వేలిముద్రలను సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై విచారణ కొనసాగుతోంది. ఈ దొంగతనం ఘటనతో రామకుంట తండా సహా పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.1
- మ99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలలో భాగంగా అనంతరం గ్రామసభ కార్యక్రమంలో ఎమ్మెల్యే మలోత్ రాందాస్ నాయక్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు, అనంతరం గ్రామంలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు చాలా మంది చనిపోవటం కూడా జరిగిందని గ్రామస్తులు గ్రామసభలో ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగ ఏమిటి ఈ సమస్య అని జూలూరుపాడు వైద్యాధికారిని అడగగా అనంతరం హెల్త్ క్యాంపు పెట్టి అన్ని టెస్టులు చేసాము అంత పాజిటివ్ గానే రిపోట్స్ వచ్చాయని అన్నారు. చుట్టుపక్కల మండలలల్లో ఎక్కడ లేని విదంగా ముఖ్యంగా జూలూరుపాడు లో ఆర్ఎంపీలు విచ్చలవిడిగా యాంటీబయటీక్ ,స్టీరైడ్స్ ఎక్కువుగా వాడటం వల్లన అనంతరంలో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయని ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తున్నారని ఎమ్మెల్యే రామదాసు నాయక్ కు తెలిపారు, ఫోన్ లో స్వయంగా ఎమ్మెల్యే డి ఎం హెచ్ ఓ తో మాట్లాడిన్నారు సమస్య వివరించారు అదేవిధంగా స్పెషల్ డాక్టర్లుతో అనంతరం గ్రామంలో హెల్త్ క్యాంపు పెట్టి సమస్యకు పరిష్కారం చూపాలని అన్నారు...2