logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు జిల్లాలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదు: కలెక్టర్ దివాకర ములుగు జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్ కొరత లేదని కలెక్టర్ దివాకర తెలిపారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సరఫరాను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సివిల్ సప్లై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, తప్పుడు ప్రచారం చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

on 26 March
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
on 26 March

ములుగు జిల్లాలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదు: కలెక్టర్ దివాకర ములుగు జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్ కొరత లేదని కలెక్టర్ దివాకర తెలిపారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సరఫరాను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సివిల్ సప్లై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, తప్పుడు ప్రచారం చేసినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • హనుమకొండ జిల్లాలో కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా ప్రకటించాలని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించాలని రైల్వే అధికారులకు వినతిపత్రం అందించినట్లు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ అంశంపై రైల్వే జీఎం లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కాజీపేట స్టేషన్ దేశంలో కీలక ఆదాయ కేంద్రాల్లో ఒకటని పేర్కొంటూ, డివిజన్ ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. డివిజన్ ప్రకటన లేకపోతే ఆందోళనలు చేపడతామని, అవసరమైతే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
    1
    హనుమకొండ జిల్లాలో కాజీపేట రైల్వే జంక్షన్‌ను డివిజన్‌గా ప్రకటించాలని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించాలని రైల్వే అధికారులకు వినతిపత్రం అందించినట్లు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. ఈ అంశంపై రైల్వే జీఎం లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ స్థానికులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కాజీపేట స్టేషన్ దేశంలో కీలక ఆదాయ కేంద్రాల్లో ఒకటని పేర్కొంటూ, డివిజన్ ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. డివిజన్ ప్రకటన లేకపోతే ఆందోళనలు చేపడతామని, అవసరమైతే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ రాజకీయ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. యువ నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన 500 మంది అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ జాగృతి నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్, సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. యువత, మహిళలు, బలహీన వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నర్సంపేట పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
    4
    వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ రాజకీయ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. యువ నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన 500 మంది అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు.
పార్టీలో చేరిన అనంతరం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ జాగృతి నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు.
అనంతరం అంబేద్కర్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్, సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
యువత, మహిళలు, బలహీన వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నర్సంపేట పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    22 min ago
  • *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…
    2
    *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం 
ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…
    user_Srinivas goud Reporter
    Srinivas goud Reporter
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    19 hrs ago
  • నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    1
    నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది.
ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    21 hrs ago
  • పెళ్లికి వచ్చి అనంతలోకానికి.. విషాదంలో మహాదేవుని గూడెం గ్రామం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమాట్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మహాదేవుని గూడెం గ్రామానికి చెందిన బోల్లేపల్లి సారయ్య (50) అనే వ్యక్తి కోమాట్లగూడెం గ్రామంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. ​పెళ్లి వేడుక అనంతరం బహిర్భూమికి వెళ్లిన సారయ్య, ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న పెద్ద చెరువులో కాలుజారి పడిపోయారు. గమనించే లోపే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడపాల్సిన పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా మరణ వార్త వినడంతో విషాదం నెలకొంది.
    1
    పెళ్లికి వచ్చి అనంతలోకానికి.. విషాదంలో మహాదేవుని గూడెం గ్రామం.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమాట్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మహాదేవుని గూడెం గ్రామానికి చెందిన బోల్లేపల్లి సారయ్య (50) అనే వ్యక్తి కోమాట్లగూడెం గ్రామంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు.
​పెళ్లి వేడుక అనంతరం బహిర్భూమికి వెళ్లిన సారయ్య, ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న పెద్ద చెరువులో కాలుజారి పడిపోయారు. గమనించే లోపే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడపాల్సిన పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా మరణ వార్త వినడంతో విషాదం నెలకొంది.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.‌ వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వడగళ్ళతో రైతన్నకు అఫారనష్టం వాటిల్లింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో కుండపోతగా వడగళ్ళవాన కురియడంతో చేతికందే దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోయింది. వరి గొలుసుకు గింజలు లేకుండా రాలిపోవడంతో రైతన్నలు బోరున వినిపిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ తోపాటు పలు గ్రామాల్లో వరిపంటతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పంటనష్టాన్ని చూసి రైతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాలివానతో వీర్నపల్లిలో పలు ఇళ్ళపై కప్పులు లేచిపోయాయి. గోడ కూలి కారు,ఆటో ద్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్లు కుప్పకూలడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. వెంటనే అధికారులు స్థానికులు చెట్లను తొలగించి రూట్ క్లియర్ చేశారు. అకాల వర్షం, వడగళ్ళ వాన సృష్టించిన బీభత్సంతో జరిగిన నష్టాన్ని చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యతమై వేడుకుంటున్నారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.‌ వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో వడగళ్ళతో రైతన్నకు అఫారనష్టం వాటిల్లింది. కోనరావుపేట మండలం మరిమడ్లలో కుండపోతగా వడగళ్ళవాన కురియడంతో చేతికందే దశలో ఉన్న వరి ధాన్యం రాలిపోయింది.  వరి గొలుసుకు గింజలు లేకుండా రాలిపోవడంతో రైతన్నలు బోరున వినిపిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యోరుపల్లిలో పిడుగుపాటుకు రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ తోపాటు పలు గ్రామాల్లో వరిపంటతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయి. పంటనష్టాన్ని చూసి రైతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గాలివానతో వీర్నపల్లిలో పలు ఇళ్ళపై కప్పులు లేచిపోయాయి. గోడ కూలి కారు,ఆటో ద్వంసమయ్యాయి. రోడ్డుపై చెట్లు కుప్పకూలడంతో రాకపోకలకు స్వల్ప అంతరాయం  ఏర్పడింది. వెంటనే అధికారులు స్థానికులు చెట్లను తొలగించి రూట్ క్లియర్ చేశారు. అకాల వర్షం, వడగళ్ళ వాన సృష్టించిన బీభత్సంతో జరిగిన నష్టాన్ని చూసి అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. చేతికందే దశలో ఉన్న పంటలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటిపర్యతమై వేడుకుంటున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    15 hrs ago
  • జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. సర్వే నంబర్లు 542, 543లో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేసి, ఇప్పటికే నిర్మించిన భాగాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే దేవదాయ చట్టం 30/1987 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. సర్వే నంబర్లు 542, 543లో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేసి, ఇప్పటికే నిర్మించిన భాగాలను కూల్చివేశారు.
ఈ సందర్భంగా ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే దేవదాయ చట్టం 30/1987 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.