Shuru
Apke Nagar Ki App…
శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న అధికారులు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. సర్వే నంబర్లు 542, 543లో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేసి, ఇప్పటికే నిర్మించిన భాగాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే దేవదాయ చట్టం 30/1987 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
M D Azizuddin
శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న అధికారులు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. సర్వే నంబర్లు 542, 543లో జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేసి, ఇప్పటికే నిర్మించిన భాగాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే దేవదాయ చట్టం 30/1987 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ జిల్లా గోపాల్పూర్ ప్రాంతంలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వ్యక్తిగత వివాదం నేపథ్యంలో కార్తీక్ తన స్నేహితుడు రామ్ చరణ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన రామ్ చరణ్‌ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- భారతీయ భాషా దినోత్సవం వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న. మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ గారు,అదనపు కలెక్టర్ వై వి గణేష్ గారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా. నేడు నర్సంపేట పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహించిన భాషా దినోత్సవ వేడుకల్లో ప్రధానోపాధ్యాయుల,సభాధ్యక్షులు సారయ్య గారి పిలుపుమేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మి రామానంద్ గారు,డిప్యూటీ కలెక్టర్ వై వి గణేష్ గారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ..* మన సంస్కృతి,సంప్రదాయాలకు మరియు అస్థిత్వానికి మాతృభాష పునాది అని,దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. విద్యార్థులు మరియు యువత మాతృభాషలో పట్టు సాధించడం ద్వారానే సృజనాత్మకత మెరుగుపడుతుందని.. ఇంగ్లీష్ భాష ఉపాధి కోసం నేర్చుకోవచ్చు,కానీ తెలుగు భాష మన జీవితం,సంస్కృతి కోసం నేర్చుకోవాలని,తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని తెలుపుతూ..తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు చైర్పర్సన్,అదనపు కలెక్టర్ గార్ల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు,డిగ్రీ కాలేజీ ప్రధాన ఉపాధ్యాయులు,బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు,విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.2
- వరంగల్ జిల్లా నర్సంపేటలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ రాజకీయ చేరిక కార్యక్రమం ఘనంగా జరిగింది. యువ నాయకుడు డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన 500 మంది అనుచరులతో కలిసి కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు. పార్టీలో చేరిన అనంతరం నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్ చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ జాగృతి నినాదాలతో పట్టణాన్ని మార్మోగించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్, సామాజిక తెలంగాణ సాధనే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. నర్సంపేట ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి తెలంగాణ జాగృతి వేదికగా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. యువత, మహిళలు, బలహీన వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మకంగా ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నర్సంపేట పట్టణంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.4
- పెళ్లికి వచ్చి అనంతలోకానికి.. విషాదంలో మహాదేవుని గూడెం గ్రామం. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమాట్లగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మహాదేవుని గూడెం గ్రామానికి చెందిన బోల్లేపల్లి సారయ్య (50) అనే వ్యక్తి కోమాట్లగూడెం గ్రామంలో జరుగుతున్న ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి వేడుక అనంతరం బహిర్భూమికి వెళ్లిన సారయ్య, ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న పెద్ద చెరువులో కాలుజారి పడిపోయారు. గమనించే లోపే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సరదాగా గడపాల్సిన పెళ్లి ఇంట్లో ఒక్కసారిగా మరణ వార్త వినడంతో విషాదం నెలకొంది.1
- హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. 317 జీవో బాధితులకు న్యాయం చేసి, వెంటనే 190 జీవో ద్వారా డిప్యూటేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగున్నర సంవత్సరాలుగా 317 జీవో తో ఇతర జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వడం వల్ల నాన ఇబ్బందులకు గురవుతున్నామని ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 3 గంటలకే లేచి ఇతర జిల్లాల్లోని దూరప్రాంతాలకు విధులకు వెళ్లి సాయంత్రం 10 గంటల వరకు ఇంటికి రావాల్సి వస్తుందన్నారు. నాలుగున్నర ఏళ్లుగా బంధువుల వివాహాది శుభకార్యాలకు కూడా వెళ్లడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమకు న్యాయం జరుగుతుందని గెలిపించుకున్నామని, కానీ ఇప్పటివరకు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసిన తమ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.1
- బడుగు బలహీన వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శించారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి స్వగృహంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీనవర్గాల హక్కుల రక్షకుడు బాబు జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రజాస్వామ్య వాది, బాబు జగ్జీవన్ రామ్, ఇందిరాగాంధీ మంత్రి మండలిలో అత్యవరస పరిస్థితిని ఎదిరించి రాజీనమా చేశారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ స్పూర్తితో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్ పథకం ప్రవేశ పెట్టారని, ఫీజు రీయింబర్స్ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో తల్లిదండ్రుల పై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ కింద ఎస్సీ,ఎస్టీ లకు కేంద్రం 276 కోట్లు విడుదల చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా చెల్లించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం విచారకరమన్నారు. రాజీవ్ యువ శక్తి పథకం కార్యరూపం దాల్చితే నిరుద్యోగులకు ఉపాధి లభించేదని జీవన్ రెడ్డి తెలిపారు.2
- Post by Tagore1
- ములుగు జిల్లా కలెక్టరేట్ లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ దివాకర టిఎస్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను పాటించాలని, కార్మిక సంక్షేమానికి చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ చంద్రకళ పాల్గొన్నారు.1