సంగారెడ్డి : ప్రజావాణిలో సిగాచి బాధితుల గళం బాధితుల వద్దకే వచ్చి విన్నపాలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్. *ప్రజావాణిలో సిగాచి బాధితుల గళం:* *బాధితుల వద్దకే వచ్చి విన్నపాలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ – చికిత్స, వేతనాలపై హామీ* పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు పూర్తిస్థాయి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్వహించిన 'మహా ధర్నా' కొనసాగింపుగా, నేడు తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) ఆధ్వర్యంలో బాధితులు 'ప్రజావాణి'లో జిల్లా అదనపు కలెక్టర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా బాధితుల దీనస్థితిని చూసి జిల్లా అదనపు కలెక్టర్ గారు స్వయంగా బయటకు వచ్చి వారి సమస్యలను విన్నారు. ప్రధాన అంశాలు: *1. క్షతగాత్రుల చికిత్స మరియు వేతనాలపై హామీ:* ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దీర్ఘకాలికంగా వైద్యం పొందుతున్న రాజేష్ కుమార్ చౌదరి, సుష్మ, మరియు దివ్యల పరిస్థితిని అదనపు కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ ఎస్ ఐ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో వైద్యాన్ని తప్పనిసరిగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని, దీనిపై కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి చికిత్సకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే వీరికి రావాల్సిన పెండింగ్ వేతనాలను కూడా కంపెనీ ద్వారా ఇప్పించడం జరుగుతుందని బాధితులకు భరోసా ఇచ్చారు. *2. రూ.1 కోటి పరిహారంపై ప్రతిష్టంభన:* మరణించిన 54 మంది కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఒక కోటి రూపాయల పరిహారం గురించి అదనపు కలెక్టర్ గారు స్పందిస్తూ.. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో ఉన్నందున, కోర్టు తీర్పు ప్రకారమే పరిహారం చెల్లింపు ఉంటుందని తెలిపారు. *3. ముఖ్యమంత్రి మాటను అవమానించడమే - TPJAC తీవ్ర అభ్యంతరం:* కలెక్టర్ గారి సమాధానంపై TPJAC జిల్లా కన్వీనర్ వై. అశోక్ కుమార్ మరియు బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభు గౌడ్ తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధితుల వద్దకు వచ్చి, ఒక్కొక్కరికి ఒక కోటి పరిహారం చెల్లిస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. "ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన తర్వాత, మళ్ళీ కోర్టు తీర్పుల కోసం బాధితులు వేచి చూడమనడం అంటే అది ముఖ్యమంత్రి గారి మాటను అవమానపరచడమే అవుతుంది" అని అశోక్ కుమార్, ప్రభు గౌడ్ మండిపడ్డారు. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా, ముఖ్యమంత్రి గారి హామీ మేరకు ప్రతి బాధిత కుటుంబానికి ఒక కోటి రూపాయల నికర పరిహారం అందేలా ప్రభుత్వం కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలని లేదంటే ప్రభుత్వమే చెల్లించాలని TPJAC, బి సి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కార్మికుల హక్కులైన పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI)లను పరిహారంలో కలిపి చూపించే కంపెనీ కుట్రలను అడ్డుకోవాలని కోరింది. ఈ కార్యక్రమంలో TPJAC జిల్లా ప్రతినిధులు శ్రీధర్ మహేంద్ర (కోఆర్డినేటర్), ఆర్. లక్ష్మి (కో-కన్వీనర్), ఎ. మానస (కో-కన్వీనర్), బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్, బిసి కార్యదర్శి సుధాకర్, ప్రధాన కార్యదర్శి కోటి వీరమని, కార్యదర్శి ముత్యాని శ్రీనివాసులు మరియు శిగాచి బాధితులు ప్రీతి కుమారి, ఇందు, సోనియా కుమారి, జుంరుమియా, మున్మున్ సింగ్, అనిరుద్ రాజేష్, చార్మినాదేవి తదితరులు 22 మంది బాధితులు పాల్గొన్నారు. వై. అశోక్ కుమార్, కన్వీనర్ TPJAC సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి : ప్రజావాణిలో సిగాచి బాధితుల గళం బాధితుల వద్దకే వచ్చి విన్నపాలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్. *ప్రజావాణిలో సిగాచి బాధితుల గళం:* *బాధితుల వద్దకే వచ్చి విన్నపాలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్ – చికిత్స, వేతనాలపై హామీ* పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులకు పూర్తిస్థాయి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్వహించిన 'మహా ధర్నా' కొనసాగింపుగా, నేడు తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ (TPJAC) ఆధ్వర్యంలో బాధితులు 'ప్రజావాణి'లో జిల్లా అదనపు కలెక్టర్ గారిని కలిశారు. ఈ సందర్భంగా బాధితుల దీనస్థితిని చూసి జిల్లా అదనపు కలెక్టర్ గారు స్వయంగా బయటకు వచ్చి వారి సమస్యలను విన్నారు. ప్రధాన అంశాలు: *1. క్షతగాత్రుల చికిత్స మరియు వేతనాలపై హామీ:* ప్రమాదంలో తీవ్రంగా గాయపడి దీర్ఘకాలికంగా వైద్యం పొందుతున్న రాజేష్ కుమార్ చౌదరి, సుష్మ, మరియు దివ్యల పరిస్థితిని అదనపు కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ ఎస్ ఐ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో వైద్యాన్ని తప్పనిసరిగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని, దీనిపై కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి చికిత్సకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే వీరికి రావాల్సిన పెండింగ్ వేతనాలను కూడా కంపెనీ ద్వారా ఇప్పించడం జరుగుతుందని బాధితులకు భరోసా ఇచ్చారు. *2. రూ.1 కోటి పరిహారంపై ప్రతిష్టంభన:* మరణించిన 54 మంది కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఒక కోటి రూపాయల పరిహారం గురించి అదనపు కలెక్టర్ గారు స్పందిస్తూ.. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో ఉన్నందున, కోర్టు తీర్పు ప్రకారమే పరిహారం చెల్లింపు ఉంటుందని తెలిపారు. *3. ముఖ్యమంత్రి మాటను అవమానించడమే - TPJAC తీవ్ర అభ్యంతరం:* కలెక్టర్ గారి సమాధానంపై
TPJAC జిల్లా కన్వీనర్ వై. అశోక్ కుమార్ మరియు బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభు గౌడ్ తీవ్రమైన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బాధితుల వద్దకు వచ్చి, ఒక్కొక్కరికి ఒక కోటి పరిహారం చెల్లిస్తామని బహిరంగంగా హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. "ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన తర్వాత, మళ్ళీ కోర్టు తీర్పుల కోసం బాధితులు వేచి చూడమనడం అంటే అది ముఖ్యమంత్రి గారి మాటను అవమానపరచడమే అవుతుంది" అని అశోక్ కుమార్, ప్రభు గౌడ్ మండిపడ్డారు. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా, ముఖ్యమంత్రి గారి హామీ మేరకు ప్రతి బాధిత కుటుంబానికి ఒక కోటి రూపాయల నికర పరిహారం అందేలా ప్రభుత్వం కంపెనీపై ఒత్తిడి తీసుకురావాలని లేదంటే ప్రభుత్వమే చెల్లించాలని TPJAC, బి సి సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కార్మికుల హక్కులైన పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI)లను పరిహారంలో కలిపి చూపించే కంపెనీ కుట్రలను అడ్డుకోవాలని కోరింది. ఈ కార్యక్రమంలో TPJAC జిల్లా ప్రతినిధులు శ్రీధర్ మహేంద్ర (కోఆర్డినేటర్), ఆర్. లక్ష్మి (కో-కన్వీనర్), ఎ. మానస (కో-కన్వీనర్), బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్, బిసి కార్యదర్శి సుధాకర్, ప్రధాన కార్యదర్శి కోటి వీరమని, కార్యదర్శి ముత్యాని శ్రీనివాసులు మరియు శిగాచి బాధితులు ప్రీతి కుమారి, ఇందు, సోనియా కుమారి, జుంరుమియా, మున్మున్ సింగ్, అనిరుద్ రాజేష్, చార్మినాదేవి తదితరులు 22 మంది బాధితులు పాల్గొన్నారు. వై. అశోక్ కుమార్, కన్వీనర్ TPJAC సంగారెడ్డి జిల్లా
- మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.1
- the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video1
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లిమోమిన్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా భారీ వడగండ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మురుగపల్లి గ్రామంలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన మంగలి రాముకు చెందిన ఓ ఎద్దు పొలం వద్ద కులంలో కట్టివేసిన వద్దే మృతి చెందింది. దీనికి సుమారు 75,000 విలువ చేస్తుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని యజమాని రాములు విజ్ఞప్తి చేశాడు.1
- .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు1
- హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు రాగ సుధ జొన్నాడ (MSc, BEd, MBA) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని “ఉద్యోగాలు/ప్లేస్‌మెంట్‌లకు అవసరమైన నైపుణ్యాలు” అనే అంశంపై సమగ్రంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సాధించడానికి అభ్యాస నైపుణ్యాలు (Aptitude), రీజనింగ్, లాజికల్ థింకింగ్‌తో పాటు బలమైన సాంకేతిక పరిజ్ఞానం (Technical Knowledge) చాలా అవసరమని తెలిపారు. సానుకూల ఆలోచనలు (Positive Thinking) వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కెరీర్ పురోగతికి కూడా ఎంతో సహాయపడతాయని వివరించారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన ఇమెయిల్ ఎటికెట్, డ్రెస్ ఎటికెట్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె సూచించారు. పరీక్షలకు క్రమబద్ధంగా సిద్ధమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఉండే వివిధ రౌండ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో AI టూల్స్ ప్రాముఖ్యతను కూడా వివరించి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చివరగా, లక్ష్య సాధనలో భాగంగా ప్రాధాన్యతల జాబితా (Priority List) రూపొందించుకోవడం మరియు సమయ నిర్వహణ (Time Management) పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.4
- Post by Ali ammu1
- బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- *ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి* *జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని *జిల్లా కలెక్టర్ ప్రతిమా అధికారులను ఆదేశించారు. సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో *అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య తో కలిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సందర్భంగా *(74)* అర్జీలను *కలెక్టర్* స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజావాణి నిర్వహించినట్లు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు1