రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయ వివరాలను ఆలయ అధికారులు తాజాగా వెల్లడించారు. గత 28 రోజుల కాలానికి గాను, హుండీల ద్వారా ఆలయానికి నగదు రూపంలో ₹1,70,65,200/- (కోటి డెబ్బై లక్షల అరవై ఐదు వేల రెండు వందల రూపాయలు) ఆదాయం లభించింది. నగదుతో పాటు, భక్తులు 080 గ్రాములు 500 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, అలాగే 07 కిలోల 400 గ్రాముల మిశ్రమ వెండిని కూడా సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు, కరీంనగర్ ఏసీ ఆఫీస్ పరిశీలకులు రాజమౌళి గారు, మరియు డీఈవో భాస్కర శర్మ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు కూడా పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయ వివరాలను ఆలయ అధికారులు తాజాగా వెల్లడించారు. గత 28 రోజుల కాలానికి గాను, హుండీల ద్వారా ఆలయానికి నగదు రూపంలో ₹1,70,65,200/- (కోటి డెబ్బై లక్షల అరవై ఐదు వేల రెండు వందల రూపాయలు) ఆదాయం లభించింది. నగదుతో పాటు, భక్తులు 080 గ్రాములు 500 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, అలాగే 07 కిలోల 400 గ్రాముల మిశ్రమ వెండిని కూడా సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు, కరీంనగర్ ఏసీ ఆఫీస్ పరిశీలకులు రాజమౌళి గారు, మరియు డీఈవో భాస్కర శర్మ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు కూడా పాల్గొన్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయ వివరాలను ఆలయ అధికారులు తాజాగా వెల్లడించారు. గత 28 రోజుల కాలానికి గాను, హుండీల ద్వారా ఆలయానికి నగదు రూపంలో ₹1,70,65,200/- (కోటి డెబ్బై లక్షల అరవై ఐదు వేల రెండు వందల రూపాయలు) ఆదాయం లభించింది. నగదుతో పాటు, భక్తులు 080 గ్రాములు 500 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, అలాగే 07 కిలోల 400 గ్రాముల మిశ్రమ వెండిని కూడా సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు, కరీంనగర్ ఏసీ ఆఫీస్ పరిశీలకులు రాజమౌళి గారు, మరియు డీఈవో భాస్కర శర్మ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు కూడా పాల్గొన్నారు.1
- ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం అభయ యాప్ (MY AUTO IS SAFE) ఫేజ్-3 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే 100 ఆటోలకు అభయ క్యూఆర్ కోడ్‌లను అనుసంధానం చేసి, ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంపై మరింత నమ్మకం కల్పించడంతో పాటు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఆటోలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తాము సురక్షితంగా ప్రయాణిస్తున్నామనే నమ్మకం కలిగేలా డ్రైవర్లు వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. అభయ యాప్ ద్వారా ఆటోలకు అనుసంధానించిన ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేస్తే డ్రైవర్ ఫోటో, ఫోన్ నంబర్, వాహన వివరాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాల్ లేదా ఫిర్యాదు చేస్తే వాహనం లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుందని, తక్షణమే సమీప పోలీసులు స్పందించి రక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. మహిళలు, ఇతర ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు తప్పనిసరిగా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవాలని ఎస్పీ కోరారు. ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అసభ్య ప్రవర్తన, హిట్ అండ్ రన్ ఘటనలు లేదా ఆటోలో మరిచిపోయిన వస్తువులపై కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ఎస్పీ సూచించారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభయ యాప్‌తో అనుసంధానం చేసి, డ్రైవర్లకు ₹50తో యాక్సిడెంటల్ డెత్ కు లక్ష రూపాయల ఇన్సూరెన్స్ వచ్చేలా ఒక సంస్థతో ఏర్పాట్లు చేసి ప్రమాద బీమా పత్రాలు అందించడం జరిగిందని తెలిపారు. ఈ బీమాను ప్రతి సంవత్సరం ₹50తో పునరుద్ధరించుకోవాలని, దీని ద్వారా ఆటో డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు భద్రత కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఆర్.ఐ సురేష్, ఆర్.ఎస్.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ శ్రీనివాస్, అభిచరణ్ మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో, జిల్లా పోలీసు శాఖ అభయ యాప్ (MY AUTO IS SAFE) ఫేజ్-3 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో 100 ఆటోలకు అభయ QR కోడ్‌లను అనుసంధానించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంపై నమ్మకం కల్పించడంతో పాటు, ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఆటోలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు సురక్షితంగా ప్రయాణిస్తున్నామనే నమ్మకం కలిగేలా ఆటో డ్రైవర్లు వ్యవహరించాలని సూచించారు. అభయ యాప్ ద్వారా ఆటోలకు ప్రత్యేక QR కోడ్‌లు అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులు ఆటో వివరాలను సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ఆటోలో ముద్రించిన QR కోడ్‌ను స్కాన్ చేస్తే డ్రైవర్ ఫోటో, ఫోన్ నంబర్, వాహన వివరాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాల్ లేదా ఫిర్యాదు చేస్తే వాహనం లైవ్ లొకేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరి, సమీప పోలీసులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపడతారన్నారు. మహిళలు, ఇతర ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు తప్పనిసరిగా QR కోడ్ స్కాన్ చేసుకోవాలని ఎస్పీ సూచించారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అసభ్య ప్రవర్తన, హిట్ అండ్ రన్ ఘటనలు లేదా ఆటోలో మరిచిపోయిన వస్తువులపై కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని కోరారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, అభయ యాప్‌తో అనుసంధానం చేసి ఒక సంస్థ ద్వారా వాహనాల డ్రైవర్లకు ₹50తో లక్ష రూపాయల యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ వచ్చేలా ప్రమాద బీమా పత్రాలను అందించినట్లు ఎస్పీ తెలిపారు. దీనిని ప్రతి సంవత్సరం ₹50తో పునరుద్ధరించుకోవాలని సూచించారు. ప్రమాద బీమా ద్వారా ఆటో డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు భద్రత కల్పించడమే ఈ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ సురేష్, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్, ఎస్‌ఐ శ్రీనివాస్, అభిచరణ్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం కట్ట లింగాపూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘం సభ్యుడు యెల్ల శ్రీనివాస్ గంగపుత్ర రోడ్డు ప్రమాదంలో అకస్మాత్తుగా మరణించడంతో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపానాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల దుబాయ్ నుండి సెలవుపై ఇండియాకు వచ్చిన శ్రీనివాస్ ప్రమాదవశాత్తు మరణించడంతో వారి కుటుంబంలోనే కాకుండా, గల్ఫ్‌లోని తోటి కార్మికుల్లో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీనివాస్ ఆకస్మిక మరణం నేపథ్యంలో, దుబాయ్‌లో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షిస్తూ సభ్యులందరూ 5 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, గల్ఫ్ దేశాల్లో కష్టపడి పనిచేస్తూ స్వదేశానికి సెలవుపై వచ్చిన కొద్దిరోజుల్లోనే శ్రీనివాస్ ప్రమాదానికి గురై మరణించడం అత్యంత బాధాకరమన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ మరణంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధి నుండి యెల్ల శ్రీనివాస్ కుటుంబానికి తక్షణమే ₹5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సాయం) వర్తింపజేసి, వారి కుటుంబానికి ఆసరాగా నిలవాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని మరియు స్థానిక ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేశారు. ఈ నివాళుల కార్యక్రమంలో గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షులు తోకల శంకర్ గంగపుత్ర, ఉపాధ్యక్షులు బింగి రాజు, ప్రధాన కార్యదర్శి పల్లికొండ గంగా నర్సన్నతో పాటు పెద్ద సంఖ్యలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. మృతుని కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ అశ్రునయనాలతో నివాళులర్పించారు.1
- జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మరియు కలెక్టర్ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. వన మహోత్సవం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని వారు తెలిపారు. అనంతరం, నాటిన మొక్కలను పరిశీలించిన మంత్రులు, వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ రవి ప్రసాద్, డీఆర్‌డీఓ రఘువరన్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దినేష్ సహా పలు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.1
- మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ గురువారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేటలో వన యోజన పార్కును ఘనంగా ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా వారు డీఎఫ్ఓ జోజి, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ రజినిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, అక్కన్నపేట పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు, రాష్ట్రంలోని మొత్తం 11 పార్కులకు రూ. 22 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. జూలైలో 765 డీజీ రోడ్డులో మొదటి దశ కింద 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ, భావితరాల కోసం జిల్లాకు కేటాయించిన 31 లక్షల మొక్కల నాటే లక్ష్యాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని, మైనింగ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో చెట్లను నాటాలని సూచించారు. అంతకుముందు, వారు అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.1
- తెలంగాణ రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు దొర గారి మెప్పు పొందడం కోసమే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు అవమానించినప్పుడు కొప్పుల ఈశ్వర్‌కు తాను సాటి దళితుడిగా అండగా నిలిచానని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ హక్కు అని ఆయన స్పష్టం చేశారు, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమీషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను ఏడాది క్రితం బాధ్యతలు స్వీకరించానని మంత్రి అడ్లూరి తెలిపారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల ఈశ్వర్, గురుకుల పాఠశాలల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పని చేశారని గుర్తు చేస్తూ, ఏడాది కాలంగా ఎందుకు ఆయా శాఖలపై మాట్లాడలేదని ప్రశ్నించారు. సంక్షేమ శాఖలో రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపించగా, ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని అడ్లూరి అన్నారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు రూ. 683 కోట్లతో టెండర్లు పిలిచామని, అలాగే రూ. 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లను ఖరారు చేశాయని వివరించారు. మొత్తం రూ. 1,183 కోట్లకు టెండర్లు పిలిస్తే, మాజీ మంత్రి హరీష్ రావు రూ. 2,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడంపై తాను సమాధానం చెప్పగా, దొరగారి మెప్పు కోసం కొప్పుల ఈశ్వర్ ఇప్పుడు 'ఖాబ్దార్' అని మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి విమర్శించారు. కొప్పుల ఈశ్వర్ గత ఎన్నికల్లో ఎలా గెలిచారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని మంత్రి అడ్లూరి అన్నారు. కొప్పుల మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం తాళం పోతే ఎక్కడ పోయిందని అడిగితే ఆయన సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. కొప్పులపై తాను 2009లో పోటీ చేసి కేవలం 1,165 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2014లో 16,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన సమయంలో రాష్ట్రంలో ఎవరికీ డిపాజిట్ రాలేదని, తనకు మాత్రమే డిపాజిట్ వచ్చిందని అడ్లూరి అన్నారు. ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్, ఆర్టీసీ బస్సు డిపో వంటివి ఏమీ తీసుకురాకపోవడంతోనే 2023 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ధర్మపురి నియోజకవర్గ ఓటర్లు కొప్పులకు ఓట్లే వేయలేదని మంత్రి అడ్లూరి తెలిపారు. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా కొప్పుల, గురుకుల కార్యదర్శిగా ప్రవీణ్ కుమార్ కలిసి దోచుకున్నారు కాబట్టే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ పునరుద్ఘాటించారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని స్పష్టం చేశారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరు అప్పారెల్ పార్కు గోదాంల నుండి ధాన్యం మాయమైన ఘటన కలకలం రేపింది. గోదాంల నుండి వరి ధాన్యం బస్తాలను తరలిస్తున్న TS 05 UA 5999 నంబరు గల లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ లారీలో సుమారు 200 వరి ధాన్యం బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి లారీని, లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్‌ను విచారిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ధాన్యం దొంగతనంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.2