మహమ్మదాబాద్ :విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ మహమ్మదాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మహమ్మదాబాద్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గురువారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. దేశాయిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న మహమ్మదాబాద్ మండల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ విమోచన పోరాట యోధులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మూస నరసింహ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించడంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి జరిగిన చారిత్రక పరిణామాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ చరిత్రను మరచిపోకుండా భావితరాలకు అందించాలని సూచించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహమ్మదాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, వైద్య సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. అలాగే దేశాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి ప్రధాని జన్మదిన వేడుకలను నిర్వహించారు. దేశ ఔన్నత్యం, సంస్కృతి, గౌరవాన్ని ప్రపంచానికి చాటుతూ భారతదేశాన్ని ఆర్థిక, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని నరసింహ పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కురవ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కాశీనాథ్, మండల నాయకులు తిరుపతిరెడ్డి, జయవర్ధన్‌రెడ్డి, కృష్ణయ్య, రాహుల్, సర్పంచ్ రామకృష్ణ, రాములు, బూత్ అధ్యక్షులు సతీష్ నాయక్, నరేష్, సతీష్, రామస్వామి, అనిల్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
మహమ్మదాబాద్ :విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ మహమ్మదాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మహమ్మదాబాద్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గురువారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. దేశాయిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న మహమ్మదాబాద్ మండల గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ విమోచన పోరాట యోధులను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మూస నరసింహ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించడంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానం
భారతదేశంలో విలీనం కావడానికి జరిగిన చారిత్రక పరిణామాలను నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ చరిత్రను మరచిపోకుండా భావితరాలకు అందించాలని సూచించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టారు. మహమ్మదాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు, వైద్య సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. అలాగే దేశాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి ప్రధాని జన్మదిన వేడుకలను నిర్వహించారు. దేశ ఔన్నత్యం, సంస్కృతి, గౌరవాన్ని ప్రపంచానికి చాటుతూ భారతదేశాన్ని ఆర్థిక, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ
కృషి చేస్తున్నారని నరసింహ పేర్కొన్నారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోదీ జన్మదినం సెప్టెంబర్ 17న జరుపుకుంటారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు కురవ కృష్ణ, ప్రధాన కార్యదర్శి కాశీనాథ్, మండల నాయకులు తిరుపతిరెడ్డి, జయవర్ధన్‌రెడ్డి, కృష్ణయ్య, రాహుల్, సర్పంచ్ రామకృష్ణ, రాములు, బూత్ అధ్యక్షులు సతీష్ నాయక్, నరేష్, సతీష్, రామస్వామి, అనిల్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
- జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.1
- తెలంగాణ అమరవీరుల ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలి. స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ సాధన కోసం ఎంతోమంది ప్రాణాలకు తరలించి తెలంగాణను సాధించుకున్నారని వారి ఆశయాలు ఆదర్శంగా తీసుకోవాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందన్నారు.1
- తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నారాయణపేట: నియోజకవర్గంలో గవినర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొని పాంచజన్య సంకల్ప సభ పోస్టర్లను విడుదల చేసిన కొడంగల్ పాంచజన్య సంకల్ప సభ ఇంచార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ ఈ సందర్భంగా గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో సెప్టెంబర్ 20న ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొనే పాంచజన్య సంకల్ప సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం అనే ఐదు ప్రధాన అంశాలను ఎజెండాగా తీసుకొని ప్రజల కోసం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే పాంచజన్య సంకల్ప సభ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సభను విజయవంతం చేసేందుకు నారాయణపేట నియోజకవర్గం నుంచి ప్రజలు, రైతులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని గొంగళ్ల రంజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.1
- సదాశివపేట: సదాశివపేట సామాజిక ఆసుపత్రిలో మూడు 108 అంబులెన్స్ ల ఏర్పాటు..! సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జరిగిన ఫుడ్ పాయిజన్ లో దాదాపు 31 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని సదాశివపేట, సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.వారిని సంగారెడ్డి జిల్లా డిఎం & హెచ్ఓ లలితాదేవి పర్యవేక్షించి విద్యార్థులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందికి ఆదేశించారు.అదేవిధంగా డిఎం & హెచ్ఓ ఆదేశాల మేరకు సదాశివపేట సామాజిక ఆసుపత్రి నందు ముందస్తు చర్యగా మూడు 108 అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు 108 ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్ తెలిపారు.1
- బిఆర్ఎస్ నూతన పంచాయతీలు గిరిజనులకు అభివృద్ధి తండాలను గ్రామపంచాయతీ చేసిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనుల అభివృద్ధి.తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దే.గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి గిరిజనలతో కలిసి,పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు గురువారం గద్వాల నియోజకవర్గం కె.టీ.దొడ్డి మండలం మల్లాపురం తండా మరియు గట్టు మండలం వాయిలకుంట తండా గ్రామాలలో గిరిజనులకు జనాభా ప్రకారం *6% శాతం ఉన్న రిజర్వేశాన్ని 10% శాతానికి పెంచి, నేటికీ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గిరిజన బంధువు కేసీఆర్ చిత్రపటానికి తండాల గిరిజన మహిళలతో కలిసి,బాసు హనుమంతు నాయుడు గారు పాలాభిషేకం చేసి, సంబురాలు జరుపుకున్నారు. అంతక ముందు.బాసు హనుమంతు నాయుడు గారిని గిరిజన మహిళలు కేసీఆర్ గారి పాటలకు నృత్యం చేస్తూ,పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తండాల్లో గిరిజనులు అసౌకర్యాల మధ్య జీవనం కొనసాగించారని గుర్తుచేశారు.బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చివేసి వాటికి మహర్దశ వచ్చేలా చేసిన ఘనత అప్పటి సీఎం కేసీఆరదేనన్నారు. ఎస్టీల రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచారని, గిరిజన విద్యార్థులకు 71 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు.దాదాపు అన్ని గిరిజనతండాలకు తారు రోడ్ల నిర్మాణం చేశారన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను కేటాయించి, చట్టబద్ధత కల్పించిన ఘనత కూడా కెసిఆర్ దేనని అన్నారు.గిరిజన మహిళల సంక్షేమానికి గత కెసిఆర్ గారి ప్రభుత్వంలో అనేక పథకాలను అమలు చేశామని, ప్రభుత్వ పథకాలన్నింటినీ విధిగా వర్తింపజేశామని చెప్పారు.గిరిజన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. గత కెసిఆర్ గారి హయంలో గిరిజన జీపీల్లో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకుండా మోసం చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేండ్లు గడుస్తున్నా గిరిజనుల కోసం చేసిందేమీ లేదన్నారు.గిరిజనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.గిరిజన విద్యార్థుల చదువు కోసం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రోత్సాహకం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు..గిరిజనుల హక్కులను కాపాడుతూ వారి ఆత్మగౌరవం,సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పాటుపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.గిరిజనులు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు.కెసిఆర్ గారు గిరిజనతండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, గిరిజనులను ప్రజా ప్రతినిధులుగా ఎదిగే అవకాశం కల్పించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జి.రాఘవేంద్ర రెడ్డి,సర్పంచులు సాకి డేవిడ్, తిమ్మప్ప,మాజీ సర్పంచులు కృష్ణవేణి నరేందర్ నాయక్,లక్ష్మీకాంత్ రెడ్డి, అంగడి బసవరాజ్,పటేల్ జనార్దన్ రెడ్డి,ప్రతాప్,రంగ నాయక్,బీచుపల్లి,చక్రీధర్ రెడ్డి,వెంకటేష్ నాయుడు,బాసు గోపాల్,ఎస్.రాము నాయుడు,టీ.రవి,రాజు నాయుడు,బోయలగూడెం నాగరాజు,జాంపల్లి భరత్ సింహారెడ్డి,సోమశేఖర్ రెడ్డి,కిష్టప్ప,బాసు బొజ్జయ్య నాయుడు, వీరేష్ నాయక్, పూడూరు రఘు నాయుడు,ఒదే నాయక్,లక్ష్మారెడ్డి,రాము,పాగుంటప్ప,కరెప్ప, స్వామి,రామకృష్ణ,ఆంజనేయులు,అరవిందు,గోవిందు, రజినీబాబు,నరసింహులు నాయక్,కృష్ణ,మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు....4
- తెలంగాణ గడ్డపై ఆత్మగౌరవ శంఖారావం... తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఆవిర్భావం... బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా... ఉదయించింది 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ'!* తెలంగాణ గడ్డ ఎప్పుడూ పోరాటాలకి పెట్టింది పేరు. అన్యాయం జరిగిన ప్రతిసారీ ఈ నేల తిరగబడింది... దోపిడీపై ధిక్కార స్వరం వినిపించింది. ఆ పోరాటాల స్ఫూర్తితో, అణగారిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకగా, ఈ గడ్డపై పురుడుపోసుకున్న సరికొత్త ఆశల కిరణమే 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ.. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు... తరతరాలుగా అధికారానికి, హక్కులకు దూరంగా ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఆక్రందనల నుండి పుట్టిన ప్రజా చైతన్య ఉప్పెన.! ప్రశ్నించే గొంతుక... తీన్మార్ మల్లన్న పోరాటంవ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పాలకుల అహంకారంపై ఒంటరి పోరాటం మొదలుపెట్టిన ధీరుడు తీన్మార్ మల్లన్న... బెదిరింపులకు లొంగలేదు, అక్రమ కేసులకు భయపడలేదు. జైలు గోడలు ఆయన ప్రవాహాన్ని ఆపలేకపోయాయి. ప్రజా సమస్యలే అజెండాగా, ప్రజల గొంతుకై గర్జించిన మల్లన్న,.. నేడు తెలంగాణలో శతాబ్దాలుగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ సైన్యాన్ని నడిపిస్తున్నారు.ఆయన నడిపిన ప్రతి ఉద్యమం, చేసిన ప్రతి పోరాటం... వ్యవస్థను ప్రశ్నించే ధైర్యాన్ని సామాన్యుడికి నేర్పింది.. మా ఓట్లతో మీరు గద్దెనెక్కడం కాదు... మా ఓట్లతో మేమే పాలకులమవుతాం" అనే నిఖార్సైన సత్యాన్ని చాటిచెప్పింది.! సామాన్యుడి ఆయుధం ఓటు అయితే, ఆ ఓటుకు అసలైన విలువను ఇచ్చేందుకు సిద్ధమైంది రాజ్యాధికార పార్టీ. సమాజంలో పేరుకుపోయిన అసమానతలను, దోపిడీ వ్యవస్థలను కత్తిరించడమే ధ్యేయంగా 'కత్తెర' గుర్తుతో ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతోంది..!1
- దేశానికి అన్నం పెట్టే రైతన్న లో ఓ ల్టేజీ కరెంటు మోటర్ కాలిపోతుంది అన్న భయం పంటకు నీళ్లు రాక రోడ్ ఎక్కిన రైతులు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే విజయుడు గారు మన కలెక్టర్ గారు విద్యుత్ ఎస్సీ గారు అధికారులు స్పందించి మీకు వచ్చేటట్టు చూస్తాం అని హామీ ఇచ్చారు విషయం మధ్యలోనే నీళ్లు ఆపేస్తే మీకు అన్నం రైతులు ఎలా పెడతారు ఏ స్వార్థం లేని రైతు మమ్మల్ని కష్ట పెట్ట కండి మీకు అన్నం దొరకదు మీకు అన్నం పెట్టడానికి మాకు నీళ్లు ఉండని అడుగుతున్నాం పంట ఎండిపోతుంటే మా కడుపులో మంట పుడుతుంది దానిమీద తెచ్చిన అప్పుల ఆగి పోతావా ఎవరైనా అన్నం తినకుండా మానేస్తా రా రైతుల పంట పండి య కుంటే మీకు అన్నం ఎక్కడినుంచి వస్తుంది ఏడుపుతో ఆవేదనతో రైతులు తెలియ పరుస్తున్నారు తెలుగు వీరన్న బీచు పల్లి బిసన్న ఇతర రైతులు ఉన్నారు4
- పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసేలా జీఓ తెస్తా తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు బంగారం దుకాణాల్లో అమ్మడానికి వీల్లేకుండా స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి అమ్మేలా జీవో తీసుకొస్తాం అని టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత అన్నారు.1