Shuru
Apke Nagar Ki App…
*ఇబ్రహీంపట్నం ఆధార్ అప్డేట్ కోసం తప్పని తిప్పలు* *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 20,* *ఇబ్రహీంపట్నం ఏ కాలనీ సమీపంలోని విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ అప్డేట్ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో తిప్పలు తప్పడంలేదని ప్రజలు వాపోతున్నారు. చిన్న పిల్లలను చేత పట్టుకుని గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.*
వేముల నాగరాజు
*ఇబ్రహీంపట్నం ఆధార్ అప్డేట్ కోసం తప్పని తిప్పలు* *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 20,* *ఇబ్రహీంపట్నం ఏ కాలనీ సమీపంలోని విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ పోస్ట్ ఆఫీస్లో ఆధార్ అప్డేట్ కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో తిప్పలు తప్పడంలేదని ప్రజలు వాపోతున్నారు. చిన్న పిల్లలను చేత పట్టుకుని గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.*
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పొన్నూరులో జరిగింది గ్యాంగ్ వార్ కాదు - సీఐ.. గుంటూరు జిల్లా,పొన్నూరు పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణను సోషల్ మీడియాలో గ్యాంగ్ వార్ గా చిత్రీకరించడాన్ని పొన్నూరు అర్బన్ సీఐ వీరా నాయక్ ఖండించారు.. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, వెంకటేష్, ప్రతాపరెడ్డి మినీ లారీలో బాపట్లకు వెళ్తుండగా, పొన్నూరు అంబేద్కర్ సెంటర్ వద్ద ఉదయ్ భాస్కర్, అజయ్స్కూటీని ఢీకొట్టడంతో ఈ ఘర్షణ జరిగిందని, ఇది గ్యాంగ్ వార్ కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు...,1
- గుంటూరు నగరం: గుంటూరు నగరంపాలెం వద్ద గురువారం ట్రాఫిక్ పోలీసులు భారీగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ ట్రాఫిక్ ఎస్ఐ నజీర్ భాషా మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.1
- రాజమండ్రి మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభించి ఏడాది దాటినా.. నేటికీ అక్కడ సర్వీస్ రోడ్లు నోచుకోలేదు. వీటి నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయంటూ ప్రజా ప్రతినిధులు ప్రకటించినా.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోడ్లు అద్వానంగా ఉండడంతో ప్రయాణికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వీస్ రోడ్లు వేయాలని ప్రజల కోరుతున్నారు.1
- అశ్వారావుపేట మండల కేంద్రంలో రింగ్ రోడ్ సెంటర్ వద్ద గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు రూ. 90 లక్షల వ్యయంతో నిర్మించబడనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రింగ్ రోడ్ సెంటర్‌లో తరచుగా ఎదురవుతున్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశమని తెలిపారు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత వాహనదారులు వ్యాపారులు స్థానిక ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కలుగుతుందని పేర్కొన్నారు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను నాన్యతగా చేపడుతున్నామని మండల కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు4
- Post by ఉంగరాల కార్తీక్1
- మహబూబాబాద్ జిల్లా:కొత్తగూడ మండలంలోని మొండ్రాయిగూడెం గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ బంగారి నరేష్, తన కుమారుడు లక్కీతో కలిసి గుండం రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో తండ్రీకొడుకులిద్దరూ కలిసి లయబద్ధంగా డ్యాన్స్ చేశారు. తండ్రీకొడుకులు ఇలా కలిసి డ్యాన్స్ చేయడం చూడటానికి ఎంతో కనువిందుగా ఉందని స్థానికులు ప్రశంసించారు. చిన్న వయసులోనే లక్కీ ప్రదర్శించిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- *గుంటుపల్లి రోడ్డు మీద వెళ్తే ముక్కు మూసుకోవాల్సిందే..!* *ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19,* గుంటుపల్లి రమేష్ నగర్ వద్ద సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్లు ఎక్కడపడితే అక్కడ డ్రైనేజీని రోడ్డు పక్కన వదిలేస్తున్నారు. దీని వల్ల రోడ్డుపై చెడు వాసన వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. ఎక్కడెక్కడ నుంచో డ్రైనేజీని తీసుకొచ్చి నిత్యము ఈ రోడ్డుపై వదిలుతున్నారని, ముక్కు మూసుకోక తప్పడం లేదంటున్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- పల్నాడు జిల్లా మెప్మా శాఖలో జరిగిన కుంభకోణంపై కేసులు నమోదు నకిలీ గ్రూపులు సృష్టించి సుమారు 9 కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ నిధులు పక్కదారికి మెప్మా శాఖలో ఎనిమిది మంది అధికారులు సహకరించినట్లు గుర్తింపు అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు అఖిల ఫిర్యాదు నరసరావుపేట వన్ టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేసిన అఖిల నరసరావుపేట వన్ టౌన్ లో ఎనిమిది మంది అధికారులపై కేసు నమోదు. ప్రణతి,దీప,భూదేవి, మల్లిఖార్జునలతో పాటూ మరికొందరుపై కేసు నమోదు.1
- విద్యార్థులు ప్రాథమిక దశలోనే చదువులో పటిష్టమైన పునాది ఏర్పరుచుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాజమండ్రిలోని చున్నీలాల్ జాజూ మునిసిపల్ పాఠశాలను సందర్శించిన ఆమె, 'గ్యారెంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ' కార్యక్రమ అమలును పరిశీలించారు. పిల్లలకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతో పాటు ప్రాథమిక గణితంపై పట్టు ఉండాలన్నారు. అభ్యసన సామర్థ్యాలు పెంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.1