Shuru
Apke Nagar Ki App…
గుంటూరులో ట్రాఫిక్ పోలీసుల ముమ్మర తనిఖీలు గుంటూరు నగరం: గుంటూరు నగరంపాలెం వద్ద గురువారం ట్రాఫిక్ పోలీసులు భారీగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ ట్రాఫిక్ ఎస్ఐ నజీర్ భాషా మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
SIVA
గుంటూరులో ట్రాఫిక్ పోలీసుల ముమ్మర తనిఖీలు గుంటూరు నగరం: గుంటూరు నగరంపాలెం వద్ద గురువారం ట్రాఫిక్ పోలీసులు భారీగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ ట్రాఫిక్ ఎస్ఐ నజీర్ భాషా మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు మెడికల్ కాలేజీలో 30 సంవత్సరాల విరామం తర్వాత జరిగిన మెడికల్ ఎగ్జిబిషన్‌కు 42,951 మంది హాజరైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ తెలిపారు. సుందరాచారి అన్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 22న ముగుస్తుంది.1
- 📍 విశాఖపట్నం తీరంలో ఈరోజు ఘనంగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత సుప్రీం కమాండర్ అయిన ద్రౌపది ముర్ము యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 71 స్వదేశీ మరియు విదేశీ యుద్ధ నౌకలు పాల్గొని రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించనున్నాయి. ⚓ ప్రత్యేక ఆకర్షణగా దేశ గర్వకారణమైన స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ INS Vikrant నిలుస్తోంది. 🇮🇳 భారత నౌకాదళ శక్తి, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి వెంట ఆంధ్రప్రదేశ్ గవర్నర్, నారా చంద్రబాబు నాయుడు (ముఖ్యమంత్రి), మరియు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొననున్నారు. 🌊 విశాఖ తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేయబడింది. భారీగా నౌకాదళ సిబ్బంది, పోలీసు బలగాలు మోహరించారు. 👉 భారత నౌకాదళ శక్తి వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం ఇది.1
- గుంటూరు నగరం: గుంటూరు నగరంపాలెం వద్ద గురువారం ట్రాఫిక్ పోలీసులు భారీగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెస్ట్ ట్రాఫిక్ ఎస్ఐ నజీర్ భాషా మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, తల్లిదండ్రులు వారిపై నిఘా ఉంచాలని సూచించారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.1
- *ఉపవాస దీక్షల సమయంలో హలీం శక్తినిస్తుంది* *అఫ్సర్ భాయ్ హలీం స్టాల్ ను ప్రారంభించిన జంపాల సీతారామయ్య* ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19, పవిత్ర రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్నవారికి హలీం శక్తినిస్తుందని తెలిపారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య. గురువారం నాడు కొండపల్లిలో రంజాన్ స్పెషల్ అప్సర్ భాయ్ హలీమ్ సెంటర్ ను కొండపల్లి మున్సిపల్ చైర్మన్ మరియు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు ప్రారంభించారు. సలీం సెంటర్ ప్రజాదరణ పొందాలని, అప్సర్ వ్యాపారం మంచిగా జరగాలని మిఠాయి తినిపించి ఆకాంక్షించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి హలీం రుచి చూశారు. అప్సర్ జంపాల సీతారామయ్య గారిని, చిట్టిబాబును శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- మచిలీపట్నంలో ఆర్టీసీ విలీనంపై గళమెత్తిన కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కార్మిక పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. విలీనంపై సమగ్ర చర్చ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మచిలీపట్నంలో జరిగిన కృష్ణా రివిజన్ మహాసభ సమావేశం సందర్భంగా కార్మికులు భారీగా తరలివచ్చి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత కూడా ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం వెంటనే కల్పించాలని గతంలో ఉన్న వైద్య సౌకర్యాలను పునరుద్ధరించాలని లాంటి పలు సమస్యలు కార్మికులకు భరోసా కలిగించే విధంగా స్పష్టమైన విధానాలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- రాయవరం మండలం కూర్మాపురంలో పట్టుబడిన పెద్దపులిని పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. పట్టుకున్న అనంతరం తొలుత విశాఖ జూకు తరలించి, ఆరోగ్యం కుదుటపడ్డాక దాని సహజసిద్ధ నివాసమైన అడవిలోకి విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన అప్పటి డ్రోన్ వీడియోను అధికారులు తాజాగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చర్కర్లు కొడుతుంది.1
- పొన్నూరులో జరిగింది గ్యాంగ్ వార్ కాదు - సీఐ.. గుంటూరు జిల్లా,పొన్నూరు పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణను సోషల్ మీడియాలో గ్యాంగ్ వార్ గా చిత్రీకరించడాన్ని పొన్నూరు అర్బన్ సీఐ వీరా నాయక్ ఖండించారు.. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, వెంకటేష్, ప్రతాపరెడ్డి మినీ లారీలో బాపట్లకు వెళ్తుండగా, పొన్నూరు అంబేద్కర్ సెంటర్ వద్ద ఉదయ్ భాస్కర్, అజయ్స్కూటీని ఢీకొట్టడంతో ఈ ఘర్షణ జరిగిందని, ఇది గ్యాంగ్ వార్ కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు...,1