logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కల్లూరు ప్రజా దర్బార్ లో బాలుని విజ్ఞప్తికి అవాక్కైన మంత్రివర్యులు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసిన బాలుడి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి, ఎర్రబోయినపల్లికి తక్షణమే బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశిస్తూ బాలుడికి హామీ ఇచ్చారు.

21 hrs ago
user_Chalamala narasimharao
Chalamala narasimharao
Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
21 hrs ago

కల్లూరు ప్రజా దర్బార్ లో బాలుని విజ్ఞప్తికి అవాక్కైన మంత్రివర్యులు సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసిన బాలుడి విజ్ఞప్తికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి, ఎర్రబోయినపల్లికి తక్షణమే బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశిస్తూ బాలుడికి హామీ ఇచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • మారుతున్న భద్రాచలం రామాలయ రూపురేఖలు.. వేగంగా పనులు.... భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పలు నిర్మాణాలను తొలగిస్తూ కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. భక్తుల రాకపోకలకు ప్రస్తుతం తూర్పు వైపు మార్గాన్ని అందుబాటులో ఉంచారు. రూ.200.89 కోట్లతో చేపట్టే పనులను విడతల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
    1
    మారుతున్న భద్రాచలం రామాలయ రూపురేఖలు.. వేగంగా పనులు....
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పలు నిర్మాణాలను తొలగిస్తూ కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. భక్తుల రాకపోకలకు ప్రస్తుతం తూర్పు వైపు మార్గాన్ని అందుబాటులో ఉంచారు. రూ.200.89 కోట్లతో చేపట్టే పనులను విడతల వారీగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    51 min ago
  • వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి... వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాకతీయ నగర్ లో నివసిస్తున్న వృధా దంపతుల ఇంట్లో పనిమనిషిగా చేరింది వేమూరి శిబారాణి ఆలియాస్ సీత.. ఈమె స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెం స్వగ్రామం.. ఇంట్లో పని చేస్తూనే వృద్ధ దంపతులకు చెందిన బంగారు ఆభరణాలపై ఈమె కన్ను పడింది.. జూన్ 7వ తేదీన ఇంటి యజమాని నిద్రిస్తున్న సమయంలో చాకచక్యంగా బీరువా తాళాలు తెరిచింది అందులో ఉన్న ఆభరణాలు తన స్వగ్రామానికి తీసుకువెళ్లి భర్తకు అప్పగించింది. అనంతరం అందులో ఉన్న ఒక బంగారు చైను ఇల్లందులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తనకా పెట్టి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకున్నారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె కదలికలపై నిఘా ఉంచారు . మిగిలిన బంగారాన్ని ఖమ్మంలో విక్రయించాలని పథకం వేశారు ఇల్లందు పట్టణం నుంచి ఖమ్మం వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చి విచారించగా వీరి వద్ద ఉన్న బంగారం విషయం బయటపడింది.. అనంతరం 10 రకాల బంగారు ఆభరణాలు మొత్తం 90 గ్రాములవి స్వాధీనం చేసుకుని నిందితురాలని అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు
    1
    వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి...

వృద్ధ దంపతుల ఇంట్లో పనిమనిషిగా పని చేస్తు 90 గ్రాముల బంగారం కొట్టేసిన కిలాడి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కాకతీయ నగర్ లో నివసిస్తున్న వృధా దంపతుల ఇంట్లో పనిమనిషిగా చేరింది వేమూరి శిబారాణి ఆలియాస్ సీత.. ఈమె స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం టేకులగూడెం స్వగ్రామం..
ఇంట్లో పని చేస్తూనే వృద్ధ దంపతులకు చెందిన బంగారు ఆభరణాలపై ఈమె కన్ను పడింది.. జూన్ 7వ తేదీన ఇంటి యజమాని నిద్రిస్తున్న సమయంలో చాకచక్యంగా బీరువా తాళాలు తెరిచింది అందులో ఉన్న ఆభరణాలు తన స్వగ్రామానికి తీసుకువెళ్లి భర్తకు అప్పగించింది. అనంతరం అందులో ఉన్న ఒక బంగారు చైను ఇల్లందులోని ఒక ప్రైవేట్ బ్యాంకులో తనకా పెట్టి వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చుకున్నారు. వృద్ధ దంపతుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆమె కదలికలపై నిఘా ఉంచారు .  మిగిలిన బంగారాన్ని ఖమ్మంలో విక్రయించాలని పథకం వేశారు ఇల్లందు పట్టణం నుంచి ఖమ్మం వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వీరి ప్రవర్తన పై అనుమానం వచ్చి విచారించగా వీరి వద్ద ఉన్న బంగారం విషయం బయటపడింది.. అనంతరం 10 రకాల బంగారు ఆభరణాలు మొత్తం 90 గ్రాములవి స్వాధీనం చేసుకుని నిందితురాలని అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    2
    ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
ర్యాంకుల పేరుతో పత్రికల్లో Ads వేసి తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య కాలేజీకి నేరుగా వెళ్ళి యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • *భద్రాచలం కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి – బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు డిమాండ్ భద్రాచలం: కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనాలన్నీ పాత బ్రిడ్జిపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా, తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. పాత బ్రిడ్జిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకూ ట్రాఫిక్ భారం పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కొత్త బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
    1
    *భద్రాచలం కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి – బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు డిమాండ్
భద్రాచలం: కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనాలన్నీ పాత బ్రిడ్జిపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో ప్రతిరోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటమే కాకుండా, తరచూ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఇమంది నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
పాత బ్రిడ్జిపై భారీ గుంతలు ఏర్పడటంతో  వాహనదారులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రోజురోజుకూ ట్రాఫిక్ భారం పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్త బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, కొత్త బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    17 hrs ago
  • నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేలకొండపల్లి సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి వచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో DAP కోసం రైతులు ఇబ్బందులు పడకుండా సొసైటీలో ఎరువును అందుబాటులో ఉంచినట్లు సొసైటీ చైర్మన్ తీగ రమణయ్య తెలిపారు. అవసరమైన రైతులు సొసైటీని సంప్రదించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం DAP ఎరువును పొందాలని సూచించారు. సకాలంలో ఎరువు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతులకు అవసరమైన మేరకు ఎరువుల సరఫరాను కొనసాగించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    1
    నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి
నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి
నేలకొండపల్లి మండల కేంద్రంలోని సొసైటీలో రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నేలకొండపల్లి సొసైటీలో DAP ఎరువు అందుబాటులోకి వచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో DAP కోసం రైతులు ఇబ్బందులు పడకుండా సొసైటీలో ఎరువును అందుబాటులో ఉంచినట్లు సొసైటీ చైర్మన్ తీగ రమణయ్య తెలిపారు.
అవసరమైన రైతులు సొసైటీని సంప్రదించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం DAP ఎరువును పొందాలని సూచించారు. సకాలంలో ఎరువు అందుబాటులోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రైతులకు అవసరమైన మేరకు ఎరువుల సరఫరాను కొనసాగించాలని, కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    19 hrs ago
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అభివృద్ధిపై మంత్రి సమీక్ష దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోడు భూములపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే చేసి అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రహదారుల వెంట ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని, అటవీ ప్రాంతాల్లో ఫలవృక్షాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పామ్ ఆయిల్ సాగు విస్తరణతో పాటు చెరువుల గండ్లు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అశ్వరావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు.
    1
    మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం
భద్రాద్రికొత్తగూడెం జిల్లా 
అశ్వారావుపేట అభివృద్ధిపై మంత్రి సమీక్ష
దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో అశ్వరావుపేట నియోజకవర్గ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు.
పోడు భూములపై ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్త సర్వే చేసి అర్హులైన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. రహదారుల వెంట ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటాలని, అటవీ ప్రాంతాల్లో ఫలవృక్షాలను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పామ్ ఆయిల్ సాగు విస్తరణతో పాటు చెరువుల గండ్లు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అశ్వరావుపేట నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని మంత్రి పిలుపునిచ్చారు.
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి *సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ గడప గడప కు పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి 🇧🇾*
    1
    పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి
*సెప్టెంబర్ 17వ తేదీ నుండి తెలంగాణ గడప గడప కు పాదయాత్ర ప్రారంభం కాంగ్రెస్, బిఆర్ ఎస్,బిజెపి, పార్టీలలో ఉన్న బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కుటుంబ సభ్యులా రా సిద్ధం కండి 🇧🇾*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    20 hrs ago
  • ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవిష్యవాణి (సవరించిన రూపం) రంగం భవిష్యవాణిలో స్వర్ణలత. "ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు? నేను ఎందుకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి? నేను మీ మాటలను గౌరవిస్తున్నాను. కానీ మీరు నా మాటను ఆచరిస్తున్నారా? నేను కోరింది మీరు చేస్తున్నారా? మీ ఆపదల్లో నేను అండగా నిలిచాను. మీకు వచ్చిన కష్టాలను తొలగించాను. నా పిల్లలను ఎప్పుడూ కాపాడుతున్నాను. ఏ ప్రమాదం వచ్చినా వారికి రక్షణగా ఉంటాను. కానీ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదు. ఈ సంవత్సరం నేను మీకు హెచ్చరిస్తున్నాను. భారీ వర్షాలు కురుస్తాయి. వరదల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రాణనష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. అగ్నిప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రకృతి విపత్తులు తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నా భక్తులను నేను ఎల్లప్పుడూ కాపాడుతాను. అయితే నా మాటలను గౌరవించి, ధర్మాన్ని పాటిస్తూ, భక్తితో నడుచుకోవాలి. అప్పుడు నా అనుగ్రహం మీ అందరిపై ఉంటుంది."
    1
    ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భవిష్యవాణి (సవరించిన రూపం)
రంగం భవిష్యవాణిలో స్వర్ణలత.
"ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు? నేను ఎందుకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి? నేను మీ మాటలను గౌరవిస్తున్నాను. కానీ మీరు నా మాటను ఆచరిస్తున్నారా? నేను కోరింది మీరు చేస్తున్నారా?
మీ ఆపదల్లో నేను అండగా నిలిచాను. మీకు వచ్చిన కష్టాలను తొలగించాను. నా పిల్లలను ఎప్పుడూ కాపాడుతున్నాను. ఏ ప్రమాదం వచ్చినా వారికి రక్షణగా ఉంటాను. కానీ మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదు.
ఈ సంవత్సరం నేను మీకు హెచ్చరిస్తున్నాను. భారీ వర్షాలు కురుస్తాయి. వరదల కారణంగా అనేక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రాణనష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది.
అగ్నిప్రమాదాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది ప్రకృతి విపత్తులు తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
నా భక్తులను నేను ఎల్లప్పుడూ కాపాడుతాను. అయితే నా మాటలను గౌరవించి, ధర్మాన్ని పాటిస్తూ, భక్తితో నడుచుకోవాలి. అప్పుడు నా అనుగ్రహం మీ అందరిపై ఉంటుంది."
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    21 hrs ago
  • కోయంబత్తూర్‌లో లారీని ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం పొల్లాచి-ఉడుమలై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.....
    1
    కోయంబత్తూర్‌లో లారీని ఢీకొన్న కారు.. ఐదుగురి మృతి
తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం పొల్లాచి-ఉడుమలై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
. 
అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.....
    user_Prabhakarrao s
    Prabhakarrao s
    Farmer బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.