కౌటాలలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ నిర్వహణ............. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో జన భవిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ప్రోత్సాహంతో కౌటాల ఎంఈఓ నానాజీ, చింతలమానేపల్లి ఎంఈఓ జయరాజ్ పర్యవేక్షణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు 30 మంది విద్యార్థులకు శిక్షణ అందించారు. ట్రస్ట్ అధ్యక్షుడు డోంగ్రే సురేష్ మాట్లాడుతూ అనకోడ గ్రామానికి చెందిన జాడే చంద్రశేఖర్ బాలాజీ అమెరికాలో ఉద్యోగం చేస్తూనే స్వగ్రామ అభివృద్ధి కోసం ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, సాధికారత రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షకు కోచింగ్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలతో సన్మానించారు.
కౌటాలలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ నిర్వహణ............. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో జన భవిత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ ప్రోత్సాహంతో కౌటాల ఎంఈఓ నానాజీ, చింతలమానేపల్లి ఎంఈఓ జయరాజ్ పర్యవేక్షణలో ప్రభుత్వ ఉపాధ్యాయులు 30 మంది విద్యార్థులకు శిక్షణ అందించారు. ట్రస్ట్ అధ్యక్షుడు డోంగ్రే సురేష్ మాట్లాడుతూ అనకోడ గ్రామానికి చెందిన జాడే చంద్రశేఖర్ బాలాజీ అమెరికాలో ఉద్యోగం చేస్తూనే స్వగ్రామ అభివృద్ధి కోసం ట్రస్ట్ ద్వారా విద్య, ఆరోగ్యం, సాధికారత రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షకు కోచింగ్ అందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ట్రస్ట్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలతో సన్మానించారు.
- మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగకున్నా అధిక రీడింగ్ రావడంతో విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.1
- జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ... జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి క్షేత్రంలో పెద్ద జయంతి (హనుమాన్ జన్మదినం) అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ ఈ రోజు. - సిరిసిల్ల శ్రీనివాస్ కొండగట్టు అంజన్న శంఖు చక్ర గదాధరుడై, నృసింహ ముఖంతో (వెనుక భాగంలో) దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. "కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న"గా భక్తుల నమ్మకం. సాధారణంగా చైత్ర పూర్ణిమ నాడు జరిగేది హనుమాన్ జయంతి అయితే, దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణలో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ పెద్ద జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. కొండగట్టు అంజన్నకు ఈ సమయం చాలా ప్రీతిపాత్రమైనదిగా భక్తులు భావిస్తారు. కొండగట్టు అంజన్నా, కోటి కోటి దండాలన్నా.... అంటూ, జై శ్రీరామ్ జై శ్రీరామ్ నినాదాలతో అంజన్న గుట్ట ప్రాంతమంతా మార్మోగిపోతుంది. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవ విశేషాలలో ప్రధానంగా.... * తనకు అత్యంత ప్రీతీపాత్రుడైన భక్తుడు హనుమంతుడి జన్మదినానికి కానుకగా శ్రీ సీతారామచంద్రులవారు భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి శేష వస్త్రాలు, అక్షింతలు కొండగట్టుకు పంపించడం ఒక గొప్ప సాంప్రదాయం మనకు ఇక్కడ కనిపిస్తుంది. • హనుమాన్ దీక్ష విరమణ: 11, 21, లేదా 41 రోజుల పాటు హనుమాన్ దీక్ష చేపట్టిన వేలాది మంది భక్తులు ఈ పెద్ద జయంతి రోజున కొండగట్టుకు చేరుకుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ దీక్షలను విరమిస్తారు. • ఈ పర్వదినం సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు, తమలపాకులతో పూజలు మరియు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. • కేవలం తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుండి కూడా లక్షలాది మంది భక్తులు ఈ సమయంలో కొండగట్టుకు తరలివస్తారు. • ఉత్సవాల్లో భాగంగా అంజన్న విగ్రహాన్ని రథంపై మేళతాళాలతో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఈ శోభాయాత్ర చూస్తుంటే, సాక్షాత్తు గధతో తరలివస్తున్న ప్రశాంతవదనుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు కొండగట్టు గుట్ట ప్రాంతమంతా కలియ తిరుగుతూ, భక్తులకు దర్శనమిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సమయంలో హనుమాన్ దీక్షపరులు భక్తిభావంతో చేస్తున్న జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతాయి. కొండపైన ఉండే "ధర్మగుండం"లో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక కొండగట్టు అంజన్న ఆలయంలో ఏడాదిలో చిన్న జయంతి, పెద్ద జయంతి, ఈ రెండు ఉత్సవాలు జగిత్యాల జిల్లాలో ఒక వైపు ఆధ్యాత్మికతను పదిలపరుస్తుండగా, మరో వైపు ఎన్నో చిరు వ్యాపారుల కుటుంబాలకు జీవనోపాధినందిస్తుంది. ఈ రెండు ఉత్సవాలకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మరియు దేవాలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, మరియు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది.1
- కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను పదవి నుండి తొలగించాలని కోరుట్ల పట్టణంలో భారీ ధర్నా నిర్వహించారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని, బండి సంజయ్ కుమారుడిని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.1
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు అంజన్న ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా, ఆయన భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఆరా తీశారు. ఉత్సవ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు.1
- ఆదిలాబాద్ జిల్లాలో వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా జనగణన-2027 ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజర్షి షా 'సెన్సస్ వాక్'తో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొదటి దశ కీలకమైన హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో ప్రజలు భయం లేకుండా వివరాలు అందించి, జాతీయ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సేకరించిన సమాచారం డేటా ప్రైవసీ చట్టాల ప్రకారం గోప్యంగా ఉంటుందని, ప్రభుత్వ అభివృద్ధి పథకాల కోసమే ఉపయోగపడుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.3
- ధాన్యం కొనుగోళ్లలో 43 కిలోల తూకాన్ని అంగీకరించం డిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్యం వార్నింగ్* *రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే రైతులతో కలిసి ధర్నాకు సిద్ధం* *కేంద్ర జీపీఎస్ విధానంతో లారీల కొరత: ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి* *రైతు సమస్యలపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ - ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రత్యేక అధికారి నియామకానికి డిమాండ్* *రూ.1.6 లక్షల కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు: రేవంత్ సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనం* - *మేడిపల్లి సత్యం* *రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా చర్యలు - ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం* ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ ని కలిసి రైతాంగ సమస్యలపై చర్చించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. "గతంలో బిఆర్ఎస్ పాలనలో రైతు వ్యతిరేక విధానాలతో రైతులు విసిగిపోయారు. ఒక సంచికి నాలుగు కిలోలు అదనంగా తూకం వేసి రైతులను నట్టేట ముంచిన ఉదంతాలు అనేకం చూశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తప్ప-తాలుతో సంబంధం లేకుండా, కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి రైతన్నకు తెలుసు" అని అన్నారు. దురదృష్టవశాత్తు ఈసారి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన *జిపిఎస్ విధానం* వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాలేకపోవడంతో క్షేత్రస్థాయిలో రైతుల నుండి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తప్ప-తాలుతో సంబంధం లేకుండా కోత లేకుండా ధాన్యాన్ని కొనాలని కలెక్టర్ని కోరడం జరిగిందన్నారు. *ధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు లారీల సంఖ్య పెంచాలి. *ప్రతి మండల స్థాయి కొనుగోలు కేంద్రం వద్ద, రైస్ మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. *ప్రతిరోజు సమీక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని, డాష్ బోర్డును ఏర్పాటు చేయాలి. *ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద సీనియర్ అసిస్టెంట్ స్థాయి అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ ని విజ్ఞప్తి చేశారు.* "ఇది రైతు పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వం. గడిచిన రెండు సంవత్సరాలలో *రూ.1,60,000 కోట్ల బడ్జెట్‌ను రైతు సంక్షేమం* కోసం ఖర్చుపెట్టిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇన్‌పుట్ సబ్సిడీ విషయంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమం కోసం రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా సహించేది లేదు" అని స్పష్టం చేశారు. "గతంలో ప్రతిపక్ష హోదాలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు పోరాటాలు, ఉద్యమాలు చేశాం. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ రైతన్న సమస్యల గురించి కలెక్టర్ గారికి వివరించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. కలెక్టర్ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు, నిరంతరం సమీక్షిస్తున్నారు" అని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం బాగా పనిచేసినప్పటికీ *రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని* ఆరోపించారు. "అలా ఇబ్బందులు పెట్టిన చోట నేను స్వయంగా వెళ్లి రైతు సోదరులతో కలిసి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ 43 కిలోల తూకాన్ని అంగీకరించబోం" అని హెచ్చరించారు. మరో గంటలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారని, దాని తర్వాత కూడా వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుండి రైతుల ద్వారా, ప్రచార మాధ్యమాల ద్వారా వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లామని, రేపటి నుండి ఇలాంటి సమస్యలు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు.1
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ? రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ను మంత్రి వర్గం నుండి భర్తరప్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం ఎందుకని, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలి 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తే చర్యలు ఏవీ ? రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా సత్వరమే న్యాయ విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు 17ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు బాధితులు ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసుపై పిర్యాదు చేసిన ఇప్పటికీ ప్రభుత్వం కేసు నమోదు చేయకుండా విచారణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూన్నారని రాష్ట్రంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన హోమ్ శాఖ తన వద్ద పెట్టుకొని రేవంత్ రెడ్డి ఫోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడని, కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ,ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ,కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ ను మంత్రి వర్గం నుండి భర్తరప్ చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసుపై విచారణ జరిపించాలనీ,కుమారుడి లైంగిక వేధింపుల ఫోక్సో కేసుకు బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు AISF అధ్వర్యంలో కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన తెలుపడం జరిగింది ఈ సందర్భంగా మణికంఠ రెడ్డి మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు పెట్టడానికి వెళ్తే కేసు పెట్టకుండా భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని అని బండి సంజయ్ తన కుమారున్నీ రక్షించు కొనే ప్రయత్నం చేస్తూ కేసును నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, బాధిత కుటుంబం కేంద్ర మంత్రి కుమారుడిపై కేసు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ కేంద్రమంత్రి కొడుకు కరీంనగర్ లో వారిపై పిటిషన్ ఇస్తే వెంటనే కేసు పెట్టరని, ప్రభుత్వం సామాన్యులకు ఓతిరుగ బడా రాజకీయవేతల కుటుంబాలతో ఒతీరుగా వ్యవహరిస్తున్నదని,కేంద్ర మంత్రి కుమారునిపై ఫోక్సో కేసు పెడితే ఇంత నిర్లక్ష్యం ఎందుకని, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేయాలని డిమాండ్ చేశారూ. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెంటనే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేస్తేనే కేసును నిష్పక్షపాతంగా నమోదు కావడానికి అవకాశం ఉంటుందని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోని మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నూనావత్ శ్రీనివాస్ నాయక్, నాయకులు సందీప్ రెడ్డి,సాయి కృష్ణ,అజయ్,రాకేష్,అరుణ్, వినయ్,ఈశ్వర్,రిషి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు1
- అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి* *బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలి.* *పోలీస్ స్టేషన్ లో సామాన్యులకు న్యాయం జరగడం లేదు.* . AIFB బండారి శేఖర్ అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, బండి సంజయ్ ని మంత్రి పదవి నుండి తక్షణమే తొలగించాలని ప్లే కార్డులతో మంచిర్యాల చౌరస్థలో నిరసన చేయడం జరిగింది. - బీజేపీ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడడాన్ని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ AIFB కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రంగా ఖండించారు. వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేశారు. సామాన్యులకు ఒక న్యాయం ధనవంతులకు, ప్రజా ప్రతినిధులకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. పోలీస్ వ్వవస్థ పూర్తిగా బ్రష్టు పట్టిందని ఏద్ధవ చేశారు. సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్ళితే న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భగీరథ్‌పై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం కాకుండా హోంశాఖ, డీజీపీ ఈ కేసు విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు., తక్షణమే అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, న్యాయం చేయాలనీ అన్నారు. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితురాలి కుటుంబంపైనే కరీంనగర్‌లో అక్రమంగా కేసులు బాణయించి వేదించడం అన్యాయమని అన్నారు. నిందితుడి వేధింపులు, పోలీసుల వేధింపులు తట్టుకోలేక బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుందని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన రాజకీయ, అధికార బలంతో కేసును ఉపసంహరించుకోవాలంటూ బాధితులను బెదిరించడం జరుగుతుందని, కేసును కూడా పక్కదోవ పట్టించే పరిస్థితి కనపడుతున్నదని అన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబానికి తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తూ, బాలిక కుటుంబంపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.బాలిక కుటుంబనికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బద్రినేత, అరుణ్ , కల, లత, అరుణ, శారదా శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు2