ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జయశంకర్ భూపాలపల్లి: రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందం, చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. జానపద, సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కళాకారుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జయశంకర్ భూపాలపల్లి: రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందం, చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. జానపద, సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కళాకారుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జయశంకర్ భూపాలపల్లి: రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందం, చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. జానపద, సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కళాకారుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.1
- స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: తహసీల్దార్‌కు బీజేపీ వినతి హసన్‌పర్తి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ, రేషన్ కార్డులపై కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను మాత్రమే ముద్రించి, ప్రధాని మోదీ ఫోటోను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని గుర్తిస్తూ ప్రధాని చిత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ చేపడుతున్నందున, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్డులపై ఫోటోలు మారుస్తూ నిధులు వృథా చేయవద్దని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, నాయకులు చల్లగొండ ప్రభాకర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, తాళ్ల శ్యామ్, పెద్దమ్మ నాగరాజు, పెద్దమ్మ శ్రీనివాస్, దాది మధుసూదన్, శీలం బిక్షపతి, దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, కందుకూరి శ్రీకాంత్, మట్టెడ సుమన్, చల్పూరి శంకర్, కోయడ రాజు, ఆర్మీ శ్రీనివాస్, శ్రావణపల్లి రవీంద్ర చారి, కడుపికొండ పట్టాభి, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, సురేష్ గౌడ్, తిప్పన్నా, రవీందర్, కుంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.1
- జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం? ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం? రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు ఎందుకు.. ఏందీ గలీజ్ యవ్వారం? ఎన్నడన్నా చూసామా రేషన్ కార్డుల మీద మంత్రుల ఫోటోలు వేయడం? రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్ల మీద అతని ఫొటోలు వేస్తారా? మొత్తం ఖమ్మం మంత్రుల అందరి ఫోటోలు వెయ్యకపోయారా – నిలదీసిన ఖమ్మం మహిళ1
- రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి.. ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా హనుమకొండ: నగరంలోని బాలసముద్రం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. సమావేశంలో వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, వివిధ కేసుల్లో జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం, భిన్నాభిప్రాయాలను అణచివేసే చర్యలను నిలిపివేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆగస్టు 29న జరిగే మహా ధర్నాలో ప్రజాసంఘాలు, విద్యార్థి, కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజకీయ ఖైదీల విడుదలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐక్య వేదిక నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1