బండి’’ కోసం మండు టెండలో ‘‘సైకిల్ బండి యాత్ర* *బండి సంజయ్ కు మంచి జరగాలని కోరుతూ పెరుగు వెంకటేశ్వర్లు జాతీయవాది సైకిల్ యాత్ర* *తిరుపతి నుండి హైదరాబాద్ దాకా 680 కి.మీల సైకిల్ యాత్ర* *హైదరాబాద్ లో బండి సంజయ్ నివాసానికి చేరుకున్న పెరుగు వెంకటేశ్వర్లు* *వెంకటేశ్వర్లుకు ఆతిథ్యమిచ్చి యాత్ర విశేషాలు తెలుసుకున్న కేంద్ర మంత్రి* *జాతీయ వాది బండి సంజయ్ ఈ దేశానికి అవసరమని చెప్పిన వెంకటేశ్వర్లు* *బండి సంజయ్ బాగుండాలని, కుట్రలను చేధించే శక్తిని ప్రసాదించాలని కోరుతూ సైకిల్ యాత్ర చేపట్టినట్లు వెల్లడి* కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రల నుండి కాపాడటంతోపాటు ఆయనకు మానసిక ప్రశాంతత కల్పించాలని కోరుతూ తిరుపతికి చెందిన 46 ఏళ్ల జాతీయ వాది పెరుగు వెంకటేశ్వర్లు ‘‘సైకిల్ యాత్ర’’ చేపట్టారు. తిరుపతి అలిపిరి వద్ద గంగమ్మకు మొక్కులు చెల్లించుకుని ‘‘శక్తి సంకల్ప యాత్ర’’ పేరుతో గత నెల 25న సైకిల్ యాత్ర ప్రారంభించారు. తిరుపతి మీదుగా మొదలైన సైకిల్ యాత్ర ఒంటిమిట్ట, కడప, నంద్యాల, మైదుకూరు, కర్నూలు మీదుగా తెలంగాణలో అడుగుపెట్టారు. అలంపూర్ మీదుగా పెబ్బేరు, జడ్చర్ల, బాలానగర్, షాద్ నగర్, శంషాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రతిరోజు సగటున 85 కి.మీల చొప్పున సైకిల్ తొక్కుకుంటూ ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. వాస్తవానికి తిరుపతి నుండి కరీంనగర్ వరకు ‘‘శక్తి సంకల్ప యాత్ర’’ చేపట్టిన పెరుగు వెంకటేశ్వర్లు... బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లోనే ఉన్నారని సమాచారం రావడంతో నేరుగా బంజారాహిల్ష్ లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి చేరుకున్నారు. పెరుగు వెంకటేశ్వర్లు సైకిల్ యాత్ర గురించి బీజేపీ కార్యకర్తల నుండి సమాచారం అందుకున్న బండి సంజయ్ పెరుగు వెంకటేశ్వర్లును తన నివాసానికి సాదరంగా ఆహ్వానించారు. తాను జాతీయ వాదినని, జాతీయ వాదులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండాలనే సంకల్పంతో ఈ యాత్ర చేపట్టానని ఈ సందర్భంగా పెరుగు వెంకటేశ్వర్లు సంజయ్ కు తెలిపారు. మండుటెండను లెక్క చేయకుండా జాతీయ వాదులకు అండగా నిలుస్తూ పెరుగు వెంకటేశ్వర్లు చేస్తున్న ‘‘శక్తి సంకల్ప యాత్ర’’ అభినందనీయమన్నారు. అనంతరం పెరుగు వెంకటేశ్వర్లును శాలువాతో సన్మానించడంతోపాటు భోజన ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా పెరుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం జాతీయవాది బండి సంజయ్ చేస్తున్న పోరాటాన్ని చూసి ఆయన అభిమానిగా మారాననన్నారు. ఇటీవల కాలంలో బండి సంజయ్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి తీవ్ర కలత చెందానని వాపోయారు. బండి సంజయ్ లాంటి జాతీయ వాది ఈ దేశానికి ఎంతో అవసరమని, అందుకే బండి సంజయ్ బాగుండాలని ఆయనకు జాతీయ వాదులంతా అండగా నిలవాలని కోరుతూ ‘‘శక్తి సంకల్ప యాత్ర’’ పేరుతో తిరుపతి నుండి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. సైకిల్ యాత్రలో భాగంగా ప్రతిరోజు రాత్రి దేవాలయంలో బస చేసేవాడనని, మరుసటి రోజు ఆలయంలో బండి సంజయ్ బాగుండాలని పూజ చేసిన అనంతరం సైకిల్ యాత్ర చేసేవాడనని చెప్పుకొచ్చారు.
బండి’’ కోసం మండు టెండలో ‘‘సైకిల్ బండి యాత్ర* *బండి సంజయ్ కు మంచి జరగాలని కోరుతూ పెరుగు వెంకటేశ్వర్లు జాతీయవాది సైకిల్ యాత్ర* *తిరుపతి నుండి హైదరాబాద్ దాకా 680 కి.మీల సైకిల్ యాత్ర* *హైదరాబాద్ లో బండి సంజయ్ నివాసానికి చేరుకున్న పెరుగు వెంకటేశ్వర్లు* *వెంకటేశ్వర్లుకు ఆతిథ్యమిచ్చి యాత్ర విశేషాలు తెలుసుకున్న కేంద్ర మంత్రి* *జాతీయ వాది బండి సంజయ్ ఈ దేశానికి అవసరమని చెప్పిన వెంకటేశ్వర్లు* *బండి సంజయ్ బాగుండాలని, కుట్రలను చేధించే శక్తిని ప్రసాదించాలని కోరుతూ సైకిల్ యాత్ర చేపట్టినట్లు వెల్లడి* కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రల నుండి కాపాడటంతోపాటు ఆయనకు మానసిక ప్రశాంతత కల్పించాలని కోరుతూ తిరుపతికి చెందిన 46 ఏళ్ల జాతీయ వాది పెరుగు వెంకటేశ్వర్లు ‘‘సైకిల్ యాత్ర’’ చేపట్టారు. తిరుపతి అలిపిరి వద్ద గంగమ్మకు మొక్కులు చెల్లించుకుని ‘‘శక్తి సంకల్ప యాత్ర’’ పేరుతో గత నెల 25న సైకిల్ యాత్ర ప్రారంభించారు. తిరుపతి మీదుగా మొదలైన సైకిల్ యాత్ర ఒంటిమిట్ట, కడప, నంద్యాల, మైదుకూరు, కర్నూలు మీదుగా తెలంగాణలో అడుగుపెట్టారు. అలంపూర్ మీదుగా పెబ్బేరు, జడ్చర్ల, బాలానగర్, షాద్ నగర్, శంషాబాద్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ప్రతిరోజు సగటున 85 కి.మీల చొప్పున సైకిల్ తొక్కుకుంటూ ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నారు. వాస్తవానికి తిరుపతి నుండి కరీంనగర్ వరకు ‘‘శక్తి సంకల్ప యాత్ర’’ చేపట్టిన పెరుగు వెంకటేశ్వర్లు... బండి సంజయ్ కుమార్ హైదరాబాద్ లోనే ఉన్నారని సమాచారం
రావడంతో నేరుగా బంజారాహిల్ష్ లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి చేరుకున్నారు. పెరుగు వెంకటేశ్వర్లు సైకిల్ యాత్ర గురించి బీజేపీ కార్యకర్తల నుండి సమాచారం అందుకున్న బండి సంజయ్ పెరుగు వెంకటేశ్వర్లును తన నివాసానికి సాదరంగా ఆహ్వానించారు. తాను జాతీయ వాదినని, జాతీయ వాదులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండాలనే సంకల్పంతో ఈ యాత్ర చేపట్టానని ఈ సందర్భంగా పెరుగు వెంకటేశ్వర్లు సంజయ్ కు తెలిపారు. మండుటెండను లెక్క చేయకుండా జాతీయ వాదులకు అండగా నిలుస్తూ పెరుగు వెంకటేశ్వర్లు చేస్తున్న ‘‘శక్తి సంకల్ప యాత్ర’’ అభినందనీయమన్నారు. అనంతరం పెరుగు వెంకటేశ్వర్లును శాలువాతో సన్మానించడంతోపాటు భోజన ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా పెరుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం, హిందుత్వం కోసం జాతీయవాది బండి సంజయ్ చేస్తున్న పోరాటాన్ని చూసి ఆయన అభిమానిగా మారాననన్నారు. ఇటీవల కాలంలో బండి సంజయ్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి తీవ్ర కలత చెందానని వాపోయారు. బండి సంజయ్ లాంటి జాతీయ వాది ఈ దేశానికి ఎంతో అవసరమని, అందుకే బండి సంజయ్ బాగుండాలని ఆయనకు జాతీయ వాదులంతా అండగా నిలవాలని కోరుతూ ‘‘శక్తి సంకల్ప యాత్ర’’ పేరుతో తిరుపతి నుండి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. సైకిల్ యాత్రలో భాగంగా ప్రతిరోజు రాత్రి దేవాలయంలో బస చేసేవాడనని, మరుసటి రోజు ఆలయంలో బండి సంజయ్ బాగుండాలని పూజ చేసిన అనంతరం సైకిల్ యాత్ర చేసేవాడనని చెప్పుకొచ్చారు.
- కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండలంలోని హనుమాజిపల్లి గ్రామ రైతులు స్థానిక డీసీఎంఎస్ కేంద్రంలో వడ్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జంగపల్లిలోని ఐకేపీ కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు ఉన్నప్పటికీ, సిబ్బంది కమీషన్ల కోసం అక్కడ వడ్లు కొనుగోలు చేయవద్దని చెబుతున్నారని రైతులు తీవ్రంగా ఆరోపించారు. ఈ నెల 20న తూకం వేయాల్సిన వడ్లు సైతం ఇప్పటికీ కొలవలేదని, దీనివల్ల వర్షాలు కురిస్తే తమ పంట పూర్తిగా నష్టపోతామని రైతులు వాపోయారు. తమ పంటలకు నష్టం వాటిల్లకముందే వడ్ల కొనుగోళ్లను వెంటనే పూర్తి చేయాలని హనుమాజిపల్లి గ్రామ రైతులు గట్టిగా డిమాండ్ చేశారు.1
- మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ విజిత్ కుమార్ స్వయంగా వెల్లడించారు. కళాశాల ప్రారంభమైన మొదటి రోజే ముగ్గురు విద్యార్థులు ప్రవేశాలు పొందారని ప్రిన్సిపాల్ తెలిపారు. రాబోయే రోజుల్లో అడ్మిషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కళాశాలలో విద్యార్థుల కోసం అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయని, అనుభవజ్ఞులైన స్టాఫ్ ఉన్నారని ప్రిన్సిపాల్ విజిత్ కుమార్ వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తమ పిల్లల భవిష్యత్తు దృష్ట్యా, కళాశాలలోని సౌకర్యాలను గమనించి, తమ పిల్లలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించాలని తల్లిదండ్రులందరికీ ప్రిన్సిపాల్ విజిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.1
- హాజీపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం 6:30 గంటలకు ఆకాశం పూర్తిగా మేఘావృతమై, ఈదురు గాలులు వీచాయి. మండలంలోని ముల్కల, రాపల్లి, గుడిపేట తదితర గ్రామాలలో దంచి కొట్టిన భారీ వర్షం ఒక్కసారిగా కురవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాలలో ఎండబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ముఖ్యంగా, హాజీపూర్ మండలంలోని ముల్కలలో వర్ష బీభత్సం అధికంగా ఉంది.1
- కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆశంశెట్టి పోచయ్య ఆధ్వర్యంలో రేషన్ డీలర్లు సోమవారం ఎమ్మార్వో స్వప్నను కలిశారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో స్వప్న, రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో బిక్షపతి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ మరియు మండల రేషన్ డీలర్లు పాల్గొన్నారు.1
- గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అధికారులు మరియు నాయకులు మొదటగా ఒక డబ్బాను JCBతో తొలగించి, దానిని ఏదో సాధించినట్టుగా చూపించారు. అయితే, ముడుపులు అందకపోవడంతోనే ఆ డబ్బాను తొలగించినట్లు సమాచారం. ఆశ్చర్యకరంగా, తొలగించినప్పుడు స్లాబ్ లేని ఆ డబ్బాకు, తొలగింపు తర్వాత స్లాబులు వేశారు. ముడుపులు అందినట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో, ఆగిపోయిన పనిని తిరిగి ప్రారంభించడం చూస్తుంటే అధికారులు మరియు నాయకులు అమ్ముడుపోయారనే భావన కలుగుతోందని స్పష్టమవుతోంది. ఇదే మున్సిపాలిటీలో, ప్రభుత్వానికి లక్షల్లో D.D.లు కట్టిన తర్వాత కూడా సాధారణ ప్రజలకు మాత్రం ఏదో ఒక సాకులు చెబుతూ ఇప్పటికీ పర్మిషన్లు ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. ఇలా అక్రమంగా కట్టిన వాటికి మున్సిపల్ సిబ్బంది ఇంత తొందరగా అనుమతులు ఎలా ఇస్తున్నారని తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.1
- కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సంబంధిత శాఖల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆమె స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన కలెక్టర్, ఈ సందర్భంగా వచ్చిన మొత్తం 188 దరఖాస్తులలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ (సీఎంఓ) అధికారులు పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. సిబ్బంది విధిగా నిబంధనలను పాటిస్తూ, ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని ఆమె నొక్కి చెప్పారు. లోకాయుక్త, ఎన్.హెచ్.ఆర్.సి.తో పాటు వివిధ కోర్టు కేసులకు సంబంధించిన శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న కేసులను పరిష్కరించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.2
- జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కరీంనగర్ లో జనసేన కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు దిగారు. తెలంగాణ చౌక్ లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చిత్రపటాలను ప్రదర్శించి, చెప్పులతో కొట్టి, అనంతరం దహనం చేశారు. నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరించారు.4
- మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, రైన్లగూడ గ్రామంలో చెరువులు, కుంటలు భూకబ్జాదారుల బారిన పడటంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, గ్రామంలోని అల్లం వారి చెరువు, గొల్ల కుంటలు ఆక్రమణకు గురికాగా, ఊరకుంట పూర్తిగా కనుమరుగైపోయింది. కబ్జాదారులు చెరువుల భూములను పక్కనే ఉన్న సర్వే నంబర్లతో కలిపి, వాటిని ప్లాట్లుగా మార్చి అమాయకులకు అమ్ముకుంటున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు, తహశీల్దారు, ఇరిగేషన్ శాఖాధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్థాయి అధికారులకు కూడా సమాచారం అందించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, సముద్రాల శంకర్ నాయకత్వంలో గ్రామస్తులు పోరాటానికి సిద్ధమయ్యారు. వర్షాకాలం మొదలవడంతో పంటలు వేసుకోవడానికి సిద్ధమవుతున్న రైతులకు, చెరువుల ఆక్రమణ కారణంగా సాగునీరు కరువైంది. దీంతో సుమారు 100 ఎకరాల పంట భూములు ఎండిపోయి, తీవ్ర నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతోనే ఈ కబ్జాలు జరుగుతున్నాయని, తమకు రాజకీయ మద్దతు ఉందని కబ్జాదారులు బెదిరిస్తున్నారని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ కష్టార్జిత భూములకు సాగునీరు అందేలా చెరువులను, కుంటలను కాపాడాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుని, చెరువులను పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానిక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అలాగే ఈ విషయంలో గ్రామస్తుల భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది వేచి చూడాలి.1
- జగిత్యాల జిల్లాలో ఐపీఎల్ మ్యాచ్‌పై ఉన్న అభిమానం, మ్యాచ్ చూస్తూ కారు నడపడం ఒక యువకుడి ప్రాణాన్ని తీసింది. మరో ఇద్దరు యువకులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మోతె గ్రామానికి చెందిన అశ్విన్, బోగ నివేశ్, అరుణ్ అనే యువకులు మోరపల్లిలోని స్నేహితుని ఇంట్లో విందులో పాల్గొని కారులో బయల్దేరారు. తాటిపల్లి సమీపంలోకి రాగానే, సెల్ ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ కారు నడుపుతుండటంతో అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న అరుణ్ సీటు బెల్టు ధరించి ఉండటంతో కారులోంచి బయటపడలేక అందులోనే మృతి చెందాడు. అశ్విన్, నివేశ్‌లు కారు నుంచి బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానిక రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తాడుల సహాయంతో అశ్విన్, నివేశ్‌లను సురక్షితంగా బయటకు లాగారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు దాదాపు మూడు గంటల పాటు సహాయక చర్యలు చేపట్టి, బావిలోంచి కారుతో పాటు అరుణ్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను మొబైల్ ఫోన్‌లో చూస్తూ డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.3