Shuru
Apke Nagar Ki App…
మంత్రి నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో వరిధనం గ్రామంలో శ్రమదానం మంత్రి నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వరిధనం గ్రామంలో.. పోతుల సూరిబాబు సారధ్యంలో.. సుమారు 200 మంది గ్రామ ప్రజలు స్థానిక మంచినీటి చెరువు చుట్టూ శ్రమదానం చేశారు. చుట్టూ ఉన్న తుప్పలు, పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు
Gopi krishna Journalist
మంత్రి నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో వరిధనం గ్రామంలో శ్రమదానం మంత్రి నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం వరిధనం గ్రామంలో.. పోతుల సూరిబాబు సారధ్యంలో.. సుమారు 200 మంది గ్రామ ప్రజలు స్థానిక మంచినీటి చెరువు చుట్టూ శ్రమదానం చేశారు. చుట్టూ ఉన్న తుప్పలు, పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె ఆర్డీవోకి వినతిపత్రం ఇచ్చిన వీఆర్ఏ సంఘాలు తాడేపల్లిగూడెం ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం డివిజన్ లోని ఐదు మండలాల వీఆర్ఏలు సమ్మె నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పతివాడ గోపాలకృష్ణ మాట్లాడుతూ నెలకు రూ.10వేల జీతంతో కుటుంబాన్ని పోషించడం గగనంగా మారుతుందన్నారు. ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా పనిచేస్తున్నామని, అర్హులైన వారికి వీఆర్వోలుగా ప్రమోషన్, నామినీలకు ఉద్యోగావకాశం కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ మాదిరిగా అదే విధంగా మాకు కూడా పే స్కేల్ ఇవ్వాలని కోరారు. ఆర్డిఓ మన్నే సూర్యరావు కి వీఆర్ఏల సంఘం వినతి పత్రాన్ని అందజేశారు. వీఆర్ఏ సంఘ ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులు , మండలాల వారి వీఆర్ఏలు పాల్గొన్నారు.3
- వర్షాలు కరువైతే భూగర్భ జలాలు అడుగంటితే పంటల సంగతి దేవుడెరుగు కనీసం తాగునీటికైనా దిక్కేది కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం పెద్దాపుత్తేడు గ్రామంలో చెరువు నీటిని చేపల వేట కోసం ఖాళీ చేస్తున్నారనే ఆరోపణలు గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఒకవైపు వర్షాలు సక్రమంగా లేకపోతే నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్న వేళ మరోవైపు గ్రామానికి భవిష్యత్‌లో ఉపయోగపడాల్సిన చెరువు నీటిని ఇలా బయటకు వదిలేస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.ఈరోజు చేపల కోసం చెరువు నీటిని వదిలేస్తే.. రేపు తాగునీటి కోసం ఎక్కడికి వెళ్లాలి?*పంటల సాగుకు నీరు అందడం ఒక ఎత్తయితే భూగర్భ జలాలు కూడా తగ్గిపోతే గ్రామాల్లో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల్లో నీరు ఉండటం వల్ల భూగర్భ జలాలపై కూడా కొంత ప్రభావం ఉంటుందని అలాంటి నీటి వనరులను ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఖాళీ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మనిషికి నీరు కావాలి పశువులకు నీరు కావాలి వ్యవసాయానికి నీరు కావాలి మరి ఆ నీటిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? గ్రామంలోని పశువులు, ప్రజలు ఆధారపడే నీటి వనరు ఖాళీ అయితే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.1
- ఒరాకిల్ లేఆఫ్స్ ఉద్యోగాలు కోల్పోయిన వారి ఆవేదన ⚡ వాడుకున్నంత కాలం వాడుకుని ఇష్టమొచ్చినట్లు ఉద్యోగాల్లోంచి తీసేస్తే తమ పరిస్థితి ఏంటని ఒరాకిల్ లేఆఫ్స్‌లో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- శాప్ కార్యాలయానికి వెళుతున్న కోన రఘుపతిను ఆరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేసిన తర్వాత కోన రఘుపతి మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు నేను విజయవాడ శాప్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న నన్ను అమానుషంగా అరెస్టు చేయడం చాలా దారుణంగా ఉంది అని ఆయన అన్నారు ఇకనైనా ప్రభుత్వం డీఎస్సీ పై జరిగిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపించిన పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఆందోళన చేపడతామని ఆయన అన్నారు1
- ఎన్టీఆర్ కాలనీలో అదరగొట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీలు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కేవలం మూడు రోజుల్లో నేర్చుకున్న నృత్యాలను ప్రదర్శించి.. మేమేమీ తక్కువ కాదు అంటూ ఆటపాటలతో అలరించారు. విద్యార్థినీల నృత్యాలను చూసిన స్థానికులు చప్పట్లతో వారిని అభినందిస్తూ ఉత్సాహపరిచారు. విద్యార్థినీల ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు స్థానిక ఉపాధ్యాయుడు నరసింహారావు విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తూ.. విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తున్నారు. చదువుతో పాటు ఆటపాటలు.. ప్రతిభకు ప్రోత్సాహం అనే విధంగా ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్న నరసింహారావు ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.3
- జగన్ ఇంటి వద్ద వెటర్నరీ డాక్టర్ల నిరసన తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. 164 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో ఒక్క వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని నిరసనకారులు తీవ్రంగా విమర్శించారు.1
- గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు గుంటూరు జిల్లా తాడికొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో చీకటి గోపి మృతి కేసుపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయిl పొన్నెకల్లు గ్రామానికి చెందిన నెల్లూరు ప్రసాద్ ఉంగరం చోరీపై నాగేంద్రమ్ ఫిర్యాదు మేరకు ఆగస్టు 25న Cr.No.140/2026 కేసు నమోదు.ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన చీకటి గోపి (30) మృతిపై Cr.No.145/2026గా మరో కేసు నమోదు.చీకటి గోపి మృతికి గల కారణాలపై సమగ్ర విచారణకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు జారీ చేశారు.విచారణ అధికారిగా సౌత్ డివిజన్ ఎస్‌డీపీఓ జి. పూర్ణచంద్రరావు నియామకం. వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి గుంటూరు జిల్లా ఎస్పీకి నివేదిక సమర్పిస్తామని గుంటూరు జిల్లా సౌత్ సబ్ డివిజన్ డీఎస్పీ జి. పూర్ణచంద్రరావు తెలిపారు.1
- వైసీపీ బూతుల బ్రాండ్ అంబాసిడర్.. బెజవాడ 60వ డివిజన్ ప్రెసిడెంట్ గారి లీలలు పేరు: షేక్ ఫాతిమా పదవి: వైసీపీ విజయవాడ 60వ డివిజన్ అధ్యక్షురాలు, పార్టీ స్థాయికి తగ్గ అర్హత ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్: భర్తపై పోలీస్ స్టేషన్లలో కేసులు.. పిల్లల చదువులు, ఉద్యోగాలంటూ పబ్లిక్ లో హైడ్రామా మంచితనానికి, సంస్కారానికి వైసీపీలో తావు లేదనడానికి ఈ మేడమే లేటెస్ట్ ఉదాహరణ. పదవి రావాలంటే మినిమమ్ బూతుల బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే పార్టీ రూల్‌ను అక్షరాలా పాటిస్తూ రోడ్డెక్కిన ఈ లేడీ లీడర్ అసలు చరిత్రేంటో ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేయండి. మరి ఇలాంటి ఘనత వహించిన నాయకులను భుజాన వేసుకుంటున్న ఆ పార్టీ తీరు చూస్తుంటే నవాబుల కాలం నాటి రౌడీ రాజ్యాంలాగే ఉందిగా.1
- యాగర్లపల్లి ఏలూరు కాలువలో 4 ఏళ్ల బాలుడు గల్లంతు - ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయిన బాలుడు కోసం ముమ్మరంగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టుతున్నారు లభ్యం కానీ బాలుడు ఆచూకీ ఈ ఉదయం 6:30 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి గాలింపు చర్యలు చేపట్టడమైనది. బాలుడు సజీవంగా దొరుకుతాడని ఎంతో ఆశతో తల్లిదండ్రులు కన్నీటితో ఎదురుచూస్తున్నారు.1