నేటి సమాజానికి దార్శనికుడు డాక్టర్.బాబు జగ్జీవన్ రామ్. -యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్. బద్వేలు:నేటి సమాజానికి డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్ దార్శనికుడని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్ పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి పురస్కరించుకొని యుటిఎఫ్ ఆధ్వర్యంలో బద్వేలులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాదన విజయ కుమార్ మాట్లాడుతూ డాక్టర్.బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, రాజకీయవేత్తగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా, ఉప ప్రధాని గా దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన జగ్జీవన్ రామ్, అంచెలంచెలుగా ఎదిగి దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించాడన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా సత్యాగ్రహం, క్విట్ ఇండియా, శాసనోల్లంఘన ఉద్యమం వంటి వాటిలో క్రియాశీలకంగా పాల్గొని, ప్రజల చేత బాబూజీ అని పిలిపించుకుంటూ దేశ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడన్నారు. సామాజిక సమానత్వం అమలు కోసం, కుల రహిత సమాజం కోసం ఎంతగానో కృషి చేశాడన్నారు. స్వాతంత్ర్య అనంతరం భారత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పార్లమెంట్ స్పీకర్ గా ఉప ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసే పార్లమెంటు చరిత్రలో మైలురాయిగా నిలిచాడన్నారు. తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపిస్తూ దళిత బంధుగా కీర్తించబడ్డారన్నారు. కార్మిక చట్టాల్లో మార్పుల కోసం, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం అనేక పోరాటాలు చేసి, వాటిని సాధించి పెట్టి పేదల పక్షపాతిగా కీర్తించబడ్డారని తెలిపారు. ఇలాంటి మహనీయుని అడుగుజాడల్లో నేటి యువత నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఆయన తెలిపారు. పాలకులు ఆయన ఆశయాల అమలుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.సుధాకర్, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ టి.శివ ప్రసాద్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.పవన్ కుమార్, బద్వేల్ మండల అధ్యక్షులు ఎస్.దేవానందం, మండల కార్యదర్శి సి.హెచ్.సాగర్, ఉపాధ్యాయులు జాలా గురయ్య, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.
నేటి సమాజానికి దార్శనికుడు డాక్టర్.బాబు జగ్జీవన్ రామ్. -యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్. బద్వేలు:నేటి సమాజానికి డాక్టర్. బాబు జగ్జీవన్ రామ్ దార్శనికుడని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్ పేర్కొన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి పురస్కరించుకొని యుటిఎఫ్ ఆధ్వర్యంలో బద్వేలులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాదన విజయ కుమార్ మాట్లాడుతూ డాక్టర్.బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, రాజకీయవేత్తగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా, ఉప ప్రధాని గా దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన జగ్జీవన్ రామ్, అంచెలంచెలుగా ఎదిగి దేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ
పాత్ర పోషించాడన్నారు. దేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా సత్యాగ్రహం, క్విట్ ఇండియా, శాసనోల్లంఘన ఉద్యమం వంటి వాటిలో క్రియాశీలకంగా పాల్గొని, ప్రజల చేత బాబూజీ అని పిలిపించుకుంటూ దేశ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడన్నారు. సామాజిక సమానత్వం అమలు కోసం, కుల రహిత సమాజం కోసం ఎంతగానో కృషి చేశాడన్నారు. స్వాతంత్ర్య అనంతరం భారత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, పార్లమెంట్ స్పీకర్ గా ఉప ప్రధానిగా సుదీర్ఘకాలం పనిచేసే పార్లమెంటు చరిత్రలో మైలురాయిగా నిలిచాడన్నారు. తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందాడని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపిస్తూ దళిత బంధుగా కీర్తించబడ్డారన్నారు. కార్మిక చట్టాల్లో
మార్పుల కోసం, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం అనేక పోరాటాలు చేసి, వాటిని సాధించి పెట్టి పేదల పక్షపాతిగా కీర్తించబడ్డారని తెలిపారు. ఇలాంటి మహనీయుని అడుగుజాడల్లో నేటి యువత నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. వారి ఆశయ సాధనకు కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఆయన తెలిపారు. పాలకులు ఆయన ఆశయాల అమలుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కె.సుధాకర్, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ టి.శివ ప్రసాద్, సిపిఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.పవన్ కుమార్, బద్వేల్ మండల అధ్యక్షులు ఎస్.దేవానందం, మండల కార్యదర్శి సి.హెచ్.సాగర్, ఉపాధ్యాయులు జాలా గురయ్య, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.
- బద్వేలు:స్వాతంత్ర సమరయోధులు భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాయ్ జయంతి పురస్కరించుకొని కడప జిల్లా బద్వేల్ పట్టణం సిద్ధవటం రోడ్డు లోని స్వర్గీయ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, కొంకుల రాంబాబు, జహంగీర్ భాష, పరిటాల వెంకటసుబ్బయ్య,పాలకొండు రాజశేఖర్ రెడ్డి,పి,ప్రసాద్ రెడ్డి, సిమెంట్ షరీఫ్, మౌలాలి, జయరామిరెడ్డి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- కడప జిల్లా.. వేంపల్లి.. వేంపల్లి మండలం లోని వీరన్నగట్టుపల్లి వద్ద లెవెన్ కె.వి విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం... కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం.. విద్యుత్ వైర్లు బస్సు టాప్ పై తగలడంతో ఆర్టీసీ బస్సు లో చెలరేగిన మంటలు.. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్టీసీ బస్సును ఆపివేసిన డ్రైవర్ ... దీంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.. క్రమేపి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.. ఫైర్ అధికారులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ అధికారులు.. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న బస్సులో ఉన్న ప్రయాణికులు.1
- Post by Bondhu Suresh1
- నెల్లూరు నగరంలో భాస్కర్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభం నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా జేమ్స్ గార్డెన్ థర్డ్ క్రాస్ రోడ్డు వెంకటరమణాపురం ఎస్ఆర్ఎం ట్రావెల్స్ సమీపంలో భాస్కర్ ఆర్థోపెటిక్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరులోని నాయకులు నేతలు పాల్గొన్నారు. అధునాతన ఎక్విప్మెంట్తో నగరాలకు మాత్రమే పరిమితంగా ఉండే ఇటువంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ భాస్కర్ డాక్టర్ నీరజాలను అభినందించారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు డాక్టర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.4
- Post by RAVI KUMAR1
- అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం పరిధిలో గల పినకోటకు వెళ్లే ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుంచి బల్ల గురువు మీదుగా వాజంగి గ్రామానికి వెళ్లే రోడ్డును మరమ్మత్తులు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.15ఏళ్ళ క్రితం గ్రామాలకు రోడ్డు పనులు చేపట్టరన్నారు.అటుగా భారీ వాహనాలు వెళ్లడంతో 10కిలోమీటర్ల తారు రోడ్డు పూర్తిగాపాడైపోయి గోతులు ఏర్పడ్డాయి.తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- Post by Doddagalla Munirathinam1
- బద్వేలు, ఏప్రిల్ 5:బద్వేలు పట్టణం లోగల ఆర్.టి.సి మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో బద్వేలు పట్టణ అభివృద్ది సొసైటి కార్యవర్గ సభ్యుల సమావేశం అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగినది.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ ఏప్రిల్ 11 వ తేదీ మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతి కార్యక్రమం ఆయన విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పెన్షనర్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో బద్వేలు బార్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియచేయుట మరియు బద్వేలు పట్టణ అభివృద్ది గురించి చర్చ జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి,ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు జి.నాగార్జున, సాకె ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు బాలగురన్న, రమణయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.4