logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో సర్పంచ్ కు సన్మానం. పలమనేర్ రూరల్ ఏప్రిల్ 5( ప్రజా ప్రతిభ) పలమనేరు రూరల్ పెద్దపంజాణి మండలం శివాడి గ్రామానికి చెందిన గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం పంచాయతీ సర్పంచ్ లలితమ్మను ఘనంగా సన్మానించినట్లు గ్రామ సేవా సమితి అధ్యక్ష ,కార్యదర్శి రామ్మూర్తి, ధనంజయ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీకి గతంలో ఎంతోమంది సర్పంచులు పనిచేశారని కానీ ప్రస్తుత సర్పంచ్ గా విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న లలితమ్మ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజలు ఏ నమ్మకముతో ఓటు వేసి గెలిపించారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకొని నిరూపించారని కొనియాడారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పంచాయితీలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్మాణం, వీధిలైట్లు, మరియు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఏనాడు నిర్లక్ష్య వైఖరి అవలంబించలేదని పేర్కొన్నారు. ప్రజలు చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజా ప్రతినిధి అంటే లలితమ్మ లాగే ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో శివాడి గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యే సర్పంచ్ లలితమ్మను ఆదర్శంగా తీసుకోని ప్రజలకు సేవ చేయాలని కోరారు. లలితమ్మ ప్రజలకు, పంచాయితీ అభివృద్ధి కోసం చేసిన సేవలను గుర్తించి శివాడి గ్రామ సేవా సమితి ప్రధాన కార్యాలయంలో ఆమెకు పట్టు శాలువ కప్పి ఘనంగా సన్మానించిన అనంతరం అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ సేవా సమితి ట్రెజరర్ కళ్యాణి, సభ్యులు ముని లక్ష్మమ్మ, శివ శంకర్ గ్రామ పెద్దలు ఆనంద్, ప్రభాకర్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

5 hrs ago
user_Doddagalla Munirathinam
Doddagalla Munirathinam
Gangavaram, Chittoor•
5 hrs ago

గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో సర్పంచ్ కు సన్మానం. పలమనేర్ రూరల్ ఏప్రిల్ 5( ప్రజా ప్రతిభ) పలమనేరు రూరల్ పెద్దపంజాణి మండలం శివాడి గ్రామానికి చెందిన గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం పంచాయతీ సర్పంచ్ లలితమ్మను ఘనంగా సన్మానించినట్లు గ్రామ సేవా సమితి అధ్యక్ష ,కార్యదర్శి రామ్మూర్తి, ధనంజయ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీకి గతంలో ఎంతోమంది సర్పంచులు పనిచేశారని కానీ ప్రస్తుత సర్పంచ్ గా విధులు నిర్వహించి పదవి విరమణ చేస్తున్న లలితమ్మ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజలు ఏ నమ్మకముతో ఓటు వేసి గెలిపించారో అదే నమ్మకాన్ని నిలబెట్టుకొని నిరూపించారని కొనియాడారు. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పంచాయితీలో త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్మాణం, వీధిలైట్లు, మరియు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఏనాడు నిర్లక్ష్య వైఖరి అవలంబించలేదని పేర్కొన్నారు. ప్రజలు చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజా ప్రతినిధి అంటే లలితమ్మ లాగే ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో శివాడి గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యే సర్పంచ్ లలితమ్మను ఆదర్శంగా తీసుకోని ప్రజలకు సేవ చేయాలని కోరారు. లలితమ్మ ప్రజలకు, పంచాయితీ అభివృద్ధి కోసం చేసిన సేవలను గుర్తించి శివాడి గ్రామ సేవా సమితి ప్రధాన కార్యాలయంలో ఆమెకు పట్టు శాలువ కప్పి ఘనంగా సన్మానించిన అనంతరం అందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ సేవా సమితి ట్రెజరర్ కళ్యాణి, సభ్యులు ముని లక్ష్మమ్మ, శివ శంకర్ గ్రామ పెద్దలు ఆనంద్, ప్రభాకర్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

More news from Chittoor and nearby areas
  • Post by Doddagalla Munirathinam
    1
    Post by Doddagalla Munirathinam
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    5 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం.. మొదలైన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర.. - కుప్పం కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతర ఆదివారం నాడు. మేల తాళాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది.. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ. ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని. జాతర సందర్భంగా అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి వేద పండితులు పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించి 15 రోజులు పాటు అమ్మవారి ఘనంగా పూజలు నిర్వహించి ప్రతిరోజు హరికథలు మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కుప్పం పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. జాతర ఆఖరి రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆంధ్ర ప్రజలే కాకుండా పక్కరాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పొంగళ్ళు పెట్టి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు..
    2
    చిత్తూరు జిల్లా కుప్పం..
మొదలైన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ జాతర..
- కుప్పం కొత్తపేటలో వెలసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ అమ్మవారి జాతర ఆదివారం నాడు. మేల తాళాల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది..
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్, కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ. ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని. జాతర సందర్భంగా అమ్మవారికి వివిధ పుష్పాలతో అలంకరించి వేద పండితులు పూజలు నిర్వహించి జాతరను ప్రారంభించి 15 రోజులు పాటు అమ్మవారి ఘనంగా పూజలు నిర్వహించి ప్రతిరోజు హరికథలు మరియు అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కుప్పం పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. 
జాతర ఆఖరి రోజు అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆంధ్ర ప్రజలే కాకుండా పక్కరాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పొంగళ్ళు పెట్టి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    9 hrs ago
  • కడప జిల్లా.. వేంపల్లి.. వేంపల్లి మండలం లోని వీరన్నగట్టుపల్లి వద్ద లెవెన్ కె.వి విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం... కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం.. విద్యుత్ వైర్లు బస్సు టాప్ పై తగలడంతో ఆర్టీసీ బస్సు లో చెలరేగిన మంటలు.. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్టీసీ బస్సును ఆపివేసిన డ్రైవర్ ... దీంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.. క్రమేపి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.. ఫైర్ అధికారులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ అధికారులు.. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న బస్సులో ఉన్న ప్రయాణికులు.
    1
    కడప జిల్లా..
వేంపల్లి..
వేంపల్లి మండలం లోని వీరన్నగట్టుపల్లి వద్ద లెవెన్ కె.వి విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం...
కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుంచి కదిరికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం.. 
విద్యుత్ వైర్లు బస్సు టాప్ పై తగలడంతో ఆర్టీసీ బస్సు లో చెలరేగిన మంటలు.. 
బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణికులు కేకలు వేయడంతో ఆర్టీసీ బస్సును ఆపివేసిన డ్రైవర్ ... 
దీంతో సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు.. 
క్రమేపి మంటలు వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.. 
ఫైర్ అధికారులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ అధికారులు.. 
తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న బస్సులో ఉన్న ప్రయాణికులు.
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 5:బద్వేలు పట్టణం లోగల ఆర్.టి.సి మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో బద్వేలు పట్టణ అభివృద్ది సొసైటి కార్యవర్గ సభ్యుల సమావేశం అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగినది.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ ఏప్రిల్ 11 వ తేదీ మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతి కార్యక్రమం ఆయన విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పెన్షనర్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో బద్వేలు బార్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియచేయుట మరియు బద్వేలు పట్టణ అభివృద్ది గురించి చర్చ జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి,ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు జి.నాగార్జున, సాకె ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు బాలగురన్న, రమణయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
    4
    బద్వేలు, ఏప్రిల్ 5:బద్వేలు పట్టణం లోగల ఆర్.టి.సి మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో  బద్వేలు పట్టణ అభివృద్ది సొసైటి కార్యవర్గ సభ్యుల సమావేశం అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు అధ్యక్షత జరిగినది.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ ఏప్రిల్ 11 వ తేదీ మహాత్మ జ్యోతిరావ్ ఫూలే జయంతి కార్యక్రమం ఆయన విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పెన్షనర్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో బద్వేలు బార్ అసోసియేషన్ సభ్యులకు అభినందనలు తెలియచేయుట మరియు బద్వేలు పట్టణ అభివృద్ది గురించి చర్చ జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి పాలేటి శ్రీనివాసులు రెడ్డి,ఉపాధ్యక్షులు కె.వి సుబ్బారావు జి.నాగార్జున, సాకె ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు బాలగురన్న, రమణయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 min ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    2 hrs ago
  • నెల్లూరు నగరంలో భాస్కర్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభం నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా జేమ్స్ గార్డెన్ థర్డ్ క్రాస్ రోడ్డు వెంకటరమణాపురం ఎస్ఆర్ఎం ట్రావెల్స్ సమీపంలో భాస్కర్ ఆర్థోపెటిక్ హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరులోని నాయకులు నేతలు పాల్గొన్నారు. అధునాతన ఎక్విప్మెంట్తో నగరాలకు మాత్రమే పరిమితంగా ఉండే ఇటువంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ భాస్కర్ డాక్టర్ నీరజాలను అభినందించారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు డాక్టర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.
    4
    నెల్లూరు నగరంలో భాస్కర్  హాస్పిటల్ ఘనంగా ప్రారంభం 
నెల్లూరు నగరంలోని నేటి ఉదయం అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా జేమ్స్ గార్డెన్ థర్డ్ క్రాస్ రోడ్డు వెంకటరమణాపురం ఎస్ఆర్ఎం ట్రావెల్స్ సమీపంలో భాస్కర్ ఆర్థోపెటిక్  హాస్పిటల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరులోని నాయకులు నేతలు పాల్గొన్నారు. అధునాతన ఎక్విప్మెంట్తో నగరాలకు మాత్రమే పరిమితంగా ఉండే ఇటువంటి హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు డాక్టర్ భాస్కర్ డాక్టర్ నీరజాలను అభినందించారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు డాక్టర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • మదనపల్లె. న్యూస్.. భార్య మరొకడితో వెళ్లిపోయిందన్న బాధతో భర్త దారుణ చర్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో కొడవలితో తన కాలును రెండుగా నరుక్కున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉంది.
    1
    మదనపల్లె. న్యూస్..
భార్య మరొకడితో వెళ్లిపోయిందన్న బాధతో భర్త దారుణ చర్యకు పాల్పడ్డాడు. మద్యం మత్తులో కొడవలితో తన కాలును రెండుగా నరుక్కున్న ఘటన కలకలం రేపింది. స్థానికులు గుర్తించి జిల్లా ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.