logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాప్రా డీసికి మొరపెట్టుకున్నా స్పందన లేదని ప్రజలు ఆవేదన _యంత్రాలు, సిబ్బంది కొరతతో నిలిచిన దోమల నివారణ చర్యలు _డిప్యూటీ కమిషనర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించిన కాలనీవాసులు _ఫాగింగ్, పారిశుధ్య చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ కాప్రా, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ జోనల్ కమిషనర్ కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ, చర్లపల్లి డివిజన్లలో దోమల బెడద తీవ్రంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాలనీవాసులు కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించారు.గతంలో ఫాగింగ్ యంత్రాల ద్వారా ప్రతి వీధిలో దోమల నివారణ చర్యలు చేపట్టడంతో సమస్య కొంతవరకు నియంత్రణలో ఉండేదని ప్రజలు తెలిపారు.అయితే ఇటీవల కాలంలో ఫాగింగ్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో దోమల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన లభించలేదని ఆరోపించారు.కాప్రా సర్కిల్ అధికారులను ప్రశ్నిస్తే దోమల నివారణకు సరిపడ యంత్రాలు లేవని, కార్మికులు కొరత ఉందని సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే అవసరమైన సిబ్బంది, పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.దోమల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు జ్వరాలు, వైరల్ వ్యాధులతో బాధపడుతున్నారని, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. కుషాయిగూడ డివిజన్ పరిధిలో వెంటనే ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరారు.అదేవిధంగా కాలువలు, చెత్త నిల్వలు, నిల్వ నీటి ప్రాంతాలను శుభ్రపరిచి దోమల పెరుగుదలను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

on 19 March
user_Suresh Sagar
Suresh Sagar
కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
on 19 March
80aaecd7-a347-45a7-b28a-8d2da18a7629

కాప్రా డీసికి మొరపెట్టుకున్నా స్పందన లేదని ప్రజలు ఆవేదన _యంత్రాలు, సిబ్బంది కొరతతో నిలిచిన దోమల నివారణ చర్యలు _డిప్యూటీ కమిషనర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించిన కాలనీవాసులు _ఫాగింగ్, పారిశుధ్య చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ కాప్రా, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ జోనల్ కమిషనర్ కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ, చర్లపల్లి డివిజన్లలో దోమల బెడద తీవ్రంగా పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కాలనీవాసులు కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీహరికి వినతిపత్రం సమర్పించారు.గతంలో ఫాగింగ్ యంత్రాల ద్వారా ప్రతి వీధిలో దోమల నివారణ చర్యలు చేపట్టడంతో సమస్య కొంతవరకు నియంత్రణలో ఉండేదని ప్రజలు తెలిపారు.అయితే ఇటీవల కాలంలో ఫాగింగ్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో దోమల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా సరైన స్పందన లభించలేదని ఆరోపించారు.కాప్రా సర్కిల్ అధికారులను ప్రశ్నిస్తే దోమల నివారణకు సరిపడ యంత్రాలు లేవని, కార్మికులు కొరత ఉందని సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే అవసరమైన సిబ్బంది, పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చి ఫాగింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.దోమల కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు జ్వరాలు, వైరల్ వ్యాధులతో బాధపడుతున్నారని, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. కుషాయిగూడ డివిజన్ పరిధిలో వెంటనే ఫాగింగ్ కార్యక్రమాలు చేపట్టి దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరారు.అదేవిధంగా కాలువలు, చెత్త నిల్వలు, నిల్వ నీటి ప్రాంతాలను శుభ్రపరిచి దోమల పెరుగుదలను నియంత్రించేందుకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • Anwarul Uloom College, Mallepally Hyderabad Ki Yaadgaar Shaam | Nawab Shah Alam Khan Memorial 9th All India Mushaira 2026 | Dil Ko Chhoo Lene Wali Shayari #HyderabadMushaira #NawabShahAlamKhan #AllIndiaMushaira #Mushaira2026 #Hyderabad #MushairaLive #UrduShayari #ShayariLovers #AdabiMehfil #HyderabadCulture #PoetryEvent #LiveMushaira #IndianPoets #EmotionalShayari #TrendingMushaira #ViralVideo #YouTubeIndia #ShortsViral #ReelsIndia #Hindustan
    1
    Anwarul Uloom College, Mallepally
Hyderabad Ki Yaadgaar Shaam | Nawab Shah Alam Khan Memorial 9th All India Mushaira 2026 | Dil Ko Chhoo Lene Wali Shayari
#HyderabadMushaira
#NawabShahAlamKhan
#AllIndiaMushaira
#Mushaira2026
#Hyderabad
#MushairaLive
#UrduShayari
#ShayariLovers
#AdabiMehfil
#HyderabadCulture
#PoetryEvent
#LiveMushaira
#IndianPoets
#EmotionalShayari
#TrendingMushaira
#ViralVideo
#YouTubeIndia
#ShortsViral
#ReelsIndia
#Hindustan
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    8 hrs ago
  • ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు
    1
    ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    10 hrs ago
  • కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.
    2
    కౌడిపల్లి నివాసిస్తుడు  రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.
    user_Vishwanath Goud
    Vishwanath Goud
    Grocer కౌడిపల్లి, మెదక్, తెలంగాణ•
    16 hrs ago
  • ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేత పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట రైతు వేదికలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.*సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు* ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు గాను ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందనిమెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం చిన్న శంకరంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 88 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రోహిత్ రావు అందజేశారు. అలాగే నార్సింగ్ మండలం కళ్యాణ లక్ష్మి చెక్కులు20, చిన్నశంకరంపేట మండలంకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు 50 మందికి, నార్సింగి మండలంకు చెందిన 20 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేస్తుందని అన్నారు. అర్హత కలిగిన వారికి ఎవరికైనా ఇల్లు రానిక రాలేక పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడుతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలకు సొంతింటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    1
    ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేత
పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట రైతు వేదికలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.*సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు* 
ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు గాను ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందనిమెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం చిన్న శంకరంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 88 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రోహిత్ రావు అందజేశారు. అలాగే నార్సింగ్ మండలం కళ్యాణ లక్ష్మి చెక్కులు20,  చిన్నశంకరంపేట మండలంకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు 50 మందికి, నార్సింగి మండలంకు చెందిన 20 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేస్తుందని అన్నారు. అర్హత కలిగిన వారికి ఎవరికైనా ఇల్లు రానిక రాలేక పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడుతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలకు సొంతింటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    9 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    10 hrs ago
  • లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.
    1
    లోక రక్షకుడు యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని చాటి చెబుతూ మెదక్ లో 'రన్ ఫర్ జీసస్' 2026 ర్యాలీ ని సిఎస్ఐ సంఘం ఆద్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ప్రార్థన చేసి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ చర్చ్ నుంచి పట్టణ పుర వీధుల గుండా సాగింది. ర్యాలీ లో యువతి, యువకులు, చిన్నారులు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం నినాదాలు చేస్తూ యేసు క్రీస్తు పాటలకు నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య మాట్లాడుతూ ఈస్టర్ పండుగకు ముందు వచ్చే మహా శనివారం రోజు యేసు క్రీస్తు పునరుద్ధన కోసం రన్ ఫర్ జీసస్ ర్యాలీ జరుపుతారని అన్నారు. ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం సీఎస్ఐ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న, పెద్ద తేడా లేకుండా లోక రక్షకుడి తిరిగి రాకడ కోసం చేసుకోనున్న ర్యాలీ గా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంట సంపత్, చర్చ్ కమిటీ సభ్యులు, గురువులు పాల్గొన్నారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    16 hrs ago
  • Post by Tagore
    3
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.