Shuru
Apke Nagar Ki App…
తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల, గంగవరం అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం BE CAREFUL తూర్పు గోదావరి జిల్లాకి సరిహద్దులో ఉన్న అడ్డతీగల, గంగవరం అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులికొండ పరిసరాల్లో మకాం వేసిన పులి.. అధికారుల కళ్లుగప్పి తిరుగుతోంది. డ్రోన్లు, ట్రాప్ కెమెరాలతో గాలిస్తున్నా ఆచూకీ చిక్కకపోవడంతో గిరిజన గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. పులి కదలికల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ నిఘా ముమ్మరం చేశారు
Alluri DurgaPrasad
తూర్పు గోదావరి జిల్లా అడ్డతీగల, గంగవరం అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం BE CAREFUL తూర్పు గోదావరి జిల్లాకి సరిహద్దులో ఉన్న అడ్డతీగల, గంగవరం అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులికొండ పరిసరాల్లో మకాం వేసిన పులి.. అధికారుల కళ్లుగప్పి తిరుగుతోంది. డ్రోన్లు, ట్రాప్ కెమెరాలతో గాలిస్తున్నా ఆచూకీ చిక్కకపోవడంతో గిరిజన గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. పులి కదలికల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ నిఘా ముమ్మరం చేశారు
More news from తెలంగాణ and nearby areas
- *రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..* **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..** పాల్వంచ మండలం నాగారం కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న లారీ.. మృతుడు వెంగళరావు కాలనీకి చెందిన దుర్గారావు గా గుర్తింపు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు1
- నందిగామలో కేంద్రీయ విద్యాలయాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. పాఠశాలలో సదుపాయాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.1
- నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఉదయం నుండి చర్చల్లో ప్రార్థనలు నిర్వహించి గుడ్ ఫ్రైడే యొక్క విశిష్టతను పాస్టర్లు తెలిపారు. గుడ్ ఫ్రైడే అంటే యేసు శిలువను వేసిన రోజు అని స్మరించుకుంటూ ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని ప్రత్యేక ప్రార్థనలను చేశారు. మత పెద్దలు ఈ గుడ్ ఫ్రైడే విశిష్టతను తెలిపారు. తుని పట్టణంలో ఎస్ఎంబి చర్చిలో ప్రార్థనలు చేశారు.1
- Post by Shyam1
- *వరంగల్ జిల్లా ,నర్సంపేట పట్టణంలో గల ప్రభుత్వ గ్రంథాలయంలో నిరుపేద కుటుంబాలకి చెందిన విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగ పరీక్షలకు చదువుకోవడానికి కనీస వసతులు లేకపోవడంతో వారు జనతా ట్రస్ట్ సభ్యులకు తెలియజేయగా,ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి ,వారి కోరిక మేరకు వారికి అవసరమైన సదుపాయాలను టేబుల్స్,ఛైర్స్ మరియు వాటర్ డిస్పెన్సర్ లను అందించిన జనతా ట్రస్ట్ చైర్మన్ డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ,మరియు ట్రస్ట్ సభ్యులు దొడ్డ రవీందర్ ,నకిరెడ్డి మహేందర్ ,ఐనవోలు శివరాం ఈ సందర్భంగా *రాణా ప్రతాప్ రెడ్డి * మాట్లాడుతూ…నర్సంపేట నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎలాంటి సదుపాయాలు కావాలన్నా జనతా ట్రస్ట్ తప్పకుండా ఆ విద్యార్థులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు…2
- నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నర్సంపేట మండలానికి చెందిన యువ నాయకుడు, మహబూబాబాద్ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ బోడ అనిల్ కుమార్ నాయక్ తన సుమారు 500 మంది అనుచరులతో కలిసి తెలంగాణ జాగృతిలో ఘనంగా చేరారు. ఈ కార్యక్రమం నర్సంపేట సెగ్మెంట్ పరిధిలోని ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా యువత, మహిళలు సమిష్టిగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగా కవిత గారిని నిలబెట్టాలని ఆకాంక్షించారు. యువత ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులను మెరుగుపరచడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నర్సంపేట సెగ్మెంట్‌లో ఉన్న సమస్యలపై తెలంగాణ జాగృతి ద్వారా నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉమ్మడి ఆరు జిల్లాల నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, అధికార ప్రతినిధి శ్రీకాంత్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మాధవి, అనిల్ నాయక్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- పక్షవాతంతో యూత్ కాలు కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- జూలూరుపాడు మండలం, సుజాతనగర్ మండలంలో మట్టిమాఫియా రెచ్చిపోతుంది. ఏకంగా సీతారామ ప్రాజెక్టు కాలువ మట్టిని పట్టపగలు జేసీబీ ల సాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తోలకాలు సాగిస్తున్నారు. సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామంలో ఉన్న పల్లెప్రకృతి వనం ఉన్న గుట్టల మట్టిని కూడా యథేచ్ఛగా తోలకాలు సాగిస్తున్నారు. సుజాతనగర్ లోని వెంచర్లు, జూలూరుపాడు లోని నిర్మాణాలు పలు వాటికి తోలకాలు సాగిస్తున్నారు. అతివేగంగా వెళ్తూ స్థానికులతో గొడవలకు సైతం దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు, రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు కనీసం పట్టించుకునే పాపాన పోవట్లేదు. ఎవరికి వారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టజెప్తున్నామని తోలకాలు జరిపే వారే బహిరంగంగా చెప్పడం విశేషం.1
- ఈ ఎస్ఐ రాకపోతే నాలుగు ప్రాణాలు బలైపోయాయి. అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం చేసిన సంఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది. మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన అమర్నాథ్ అప్పుల పాలయ్యాడు. అప్పు ఇచ్చినవాళ్లు ఒత్తిడి తేవడంతో కుటుంబంతో సహా చనిపోవాలి అనుకున్నాడు. భార్య, కుమారుడు కుమార్తెను కారులో ఎక్కించుకోని బయలు దేరాడు. ఈ విషయం భార్య తన పుట్టిండి వారికి మెసేజ్ పంపించింది. వారు పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్సై కిషోర్ చాకచక్యంగా పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. చూశారుగా అప్పు ఎంత ముప్పుకు దారితీస్తుందో. తస్మాత్ జాగ్రత్త..1