Shuru
Apke Nagar Ki App…
చేతులు కడుక్కోవడం లేదా?వెనుక ఎంతో ఆరోగ్య రహస్యం దాగి ఉంది నిత్య జీవితంలో చిన్న అలవాటుగా కనిపించే చేతులు కడుక్కోవడం వెనుక ఎంతో ఆరోగ్య రహస్యం దాగి ఉంది. మొబైల్ ఫోన్లు, డబ్బు, డోర్ హ్యాండిల్స్, వస్తువులు తాకడం వల్ల చేతులకు చేరే బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి ప్రవేశించి జలుబు, ఫ్లూ, విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. సబ్బుతో కనీసం 20 సెకన్లు గోళ్ల కింద, వేళ్ల మధ్య బాగా రుద్ది కడగడం వల్ల ఇన్ఫెక్షన్లను అడ్డుకోవచ్చు. పిల్లలకు చిన్నతనం నుంచే చేతులు కడుక్కోవడం నేర్పితే చాలా వ్యాధులు నివారించవచ్చు.
Duppada Anandarao
చేతులు కడుక్కోవడం లేదా?వెనుక ఎంతో ఆరోగ్య రహస్యం దాగి ఉంది నిత్య జీవితంలో చిన్న అలవాటుగా కనిపించే చేతులు కడుక్కోవడం వెనుక ఎంతో ఆరోగ్య రహస్యం దాగి ఉంది. మొబైల్ ఫోన్లు, డబ్బు, డోర్ హ్యాండిల్స్, వస్తువులు తాకడం వల్ల చేతులకు చేరే బ్యాక్టీరియా, వైరస్లు శరీరంలోకి ప్రవేశించి జలుబు, ఫ్లూ, విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. సబ్బుతో కనీసం 20 సెకన్లు గోళ్ల కింద, వేళ్ల మధ్య బాగా రుద్ది కడగడం వల్ల ఇన్ఫెక్షన్లను అడ్డుకోవచ్చు. పిల్లలకు చిన్నతనం నుంచే చేతులు కడుక్కోవడం నేర్పితే చాలా వ్యాధులు నివారించవచ్చు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ..* VSP..భోగాపురం ఎయిర్ పోర్ట్ పాల్గొన్న సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామ్మోహన్ నాయుడు.. 15 నిమిషాల పాటు ఎయిర్‌పోర్ట్ ను పరిశీలించిన మోడీ.. ఓపెన్ టాప్ కారులో థింసా నృత్యాన్ని తిలకించిన మోడీ.. రికార్డుస్థాయిలో 13,500 మందితో థింసా నృత్యం.. మోడీకి బొబ్బిలి వీణను బహూకరించిన సీఎం చంద్రబాబు...1
- ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తీరుస్తాం: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. మడగడ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.50 లక్షలతో నిర్మించనున్న చేతిపంపు బోరుకు ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో తాగునీటి కష్టాలను దశలవారీగా తీరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.1
- ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటింటికి ప్రచారంలో భాగంగా కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో శనివారం నాడు తుని నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు వారి యొక్క సమస్యలను చెప్పిన వెంటనే ఎమ్మెల్యే స్థానిక అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.1
- సాగునీటి సద్వినియోగం,సైబర్ మోసాలు, యువత భద్రతపై పోలీసుల ప్రత్యేక దిశానిర్దేశం పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామంలోని రామాలయం సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో ఒక ప్రత్యేక ప్రజా అవగాహన సదస్సు నిర్వహించారు. గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమానికి పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (సీఐ)జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సుకు స్థానిక రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ విశేష చొరవతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గొల్లప్రోలు ప్రాంత రైతులకు పుష్కర కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేసిన విషయాన్ని సీఐ ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులు ఎటువంటి పరస్పర విభేదాలకు తావు ఇవ్వకుండా అందరూ సఖ్యతతో మెలుకువలు పాటిస్తూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని,పంటల సాగును విజయవంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అమ్మ ఒడి పథకం నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న తరుణంలో ప్రజలు సైబర్ నేరగాళ్ళు పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా నకిలీ లింకులు పంపి ఓటిపిలు లేదా బ్యాంకు ఖాతా వివరాలు అడిగే మోసాల బారిన పడకుండా ఉండాలని,ఎవరికీ వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. నేటి యువత మొబైల్ ఫోన్లకు బానిస కావడం,వ్యసనాలకు లోనవుతుండటం తీవ్ర ఆందోళనకరమని సీఐ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచాలని వారి స్నేహితులు మరియు దైనందిన కార్యకలాపాలను గమనిస్తూ వారి ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. అక్రమ కార్యకలాపాల నిర్మూలనలో పోలీసులకు సహకారం అందించి గ్రామాల్లో గంజాయి విక్రయాలు,నాటు సారా తయారీ లేదా అమ్మకాలు, మరియు పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచబడతాయని భరోసా కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను విధిగా పాటించాలని సీఐ సూచించారు. వాహనాలను రోడ్లపై ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.1
- 🙏🙏1
- Post by Adimlamganash1
- *ఇంస్టాగ్రామ్ లొ ఫేక్ ఐడి తో ఇబ్బంది పెడుతున్న యువకులు. తగరపువలసకు చెందిన సీశెట్టి రాజేశ్వరి అను ఆమె చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య చేసిన ఒక వీడియో కింద ఎవరో ఒక వ్యక్తి ఫేక్ ఐడి క్రియేట్ చేసి అసభ్య కామెంట్లు పెడుతుండడంతో ఆమె మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పద్దానికి ప్రయత్నించింది, ఇంతలో వాళ్ళ అక్క వద్దని చెప్పడం తో వొద్దు అనుకున్నది, అందువల్ల ఏ హాస్పిటల్ లో జాయిన్ అవ్వలేదు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళ లేదు. ఈరోజు ఈ విషయం గురించి పేపర్లో వార్త రావడంతో విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ గారు స్పందించి భీమిలి సీఐ దివాకర్ గారికి చెప్పగా, భీమిలి సి. ఐ దివాకర్ గారు వారి సిబ్బంది మహిళా హెడ్ కానిస్టేబుల్ తో కలిసి సదరు సీశెట్టి రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలుసుకుని ఎందు కైనా మంచిది అని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి, చికిత్స చేయించి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ధైర్యం చెప్పినారు మరియు ఫేక్ ఐడి తో బ్యాడ్ కామెంట్స్ పెడుతున్న ఆ వ్యక్తి గురించి సైబర్ క్రైమ్ పోలీసు వారికి కూడా తెలియపరచడం అయినది. భవిష్యత్తులో బీమిలి పోలీస్ లు అండగా ఉంటారు అనే నమ్మకం తో గౌరవ సీపీ గారికి కృతఙ్ఞతలు తెలియ చేయడమైనది.1
- 🙏🙏1
- Post by Adimlamganash1