Shuru
Apke Nagar Ki App…
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం *వికారాబాద్: ఘోర ప్రమాదం.* *కారు, ఆటో ఢీ!* వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ కారు, ఆటో బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనం ద్వారా క్షతగాత్రులను పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ALL INDIA WORKING JOURNALIST ASSOCIATION
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం *వికారాబాద్: ఘోర ప్రమాదం.* *కారు, ఆటో ఢీ!* వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ కారు, ఆటో బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనం ద్వారా క్షతగాత్రులను పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from తెలంగాణ and nearby areas
- *వికారాబాద్: ఘోర ప్రమాదం.* *కారు, ఆటో ఢీ!* వికారాబాద్ జిల్లా పూడూరు మండలం రాకంచెర్ల సమీపంలో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ కారు, ఆటో బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 వాహనం ద్వారా క్షతగాత్రులను పరిగి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- వికారాబాద్ :పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆలంపల్లి ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో ఆలింగనం చేసుకొని పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం శాంతి, సహనం, త్యాగం,సేవా,భావానికి ప్రతిక అనీ, రంజాన్ నెలలో ఉపవాస దీక్షలు ప్రార్థనలో మనసును పవిత్రం చేసుకోవడానికి సత్యనిష్టతో జీవించడానికి మనకు మార్గం చూపిస్తాయని అన్నారు.1
- కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పెంజర్ల శివారులో టపాసులతో వెళ్తున్న లారీ ఆకస్మికంగా మంటలకు ఆహుతైంది. సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- సంగారెడ్డి వైకుంటపురంలో శ్రీరామ వసంత నవరాత్రోత్సవాలు1
- This Eid the world feels more like a mourning than a celebration A celebration shadowed by the world's tears Heart heavy world hurting This Eid feels different1
- గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ _వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ పట్టణంలోని ఈద్గా వద్ద మరియు ప్రజ్ఞాపూర్ లోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఈద్-ఉల్-ఫితుర్ ఈద్ ముబారక్ తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి మీకు మీ కుటుంబ సభ్యులకు ఈదుల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ పై ఉండాలని కోరుకుంటున్నాను క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఈ రంజాన్ పండుగ మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని, ప్రేమ శాంతి సంపదలతో మీ ఇంట్లో సంతోషాలను నింపాలని, రంజాన్ నింపే స్ఫూర్తి నిరంతరం ఉండాలని, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మరొక్కసారి ఈద్ ముబారక్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.4
- తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించకుండ, జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావించకుండా,యూత్ డిక్లరేషన్, విద్యా భరోసను నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి వేదికగా బడ్జెట్ ప్రతులను చించివేసి విలేకరుల సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య మాట్లాడుతూ... అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి 26,674 కోట్లు కేటాయించి మొత్తం బడ్జెట్లో కేవలం (8.22%)ప్రకటించిడాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ విద్యాశాఖపై ఉన్న చిత్తశుద్ధితో స్పష్టమైంది. కోఠారి కమిషన్ విద్యారంగానికి 30% నిధులు కేటాయింపులు చేయాలని సూచించినప్పటికి విద్యా కమిషన్ 18% నిధులు కేటాయించాలని చెప్పినప్పటికి ఏ మాత్రం పట్టించుకోకుండా 8.22% నిధులనే కేటాయించింది రేవంత్ రెడ్డి సర్కార్ అని అన్నారు. పేద మధ్య తరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తూ ఉంటే బడ్జెట్లో కనీసం ఊసేత్తకపోవడం సిగ్గుచేటు ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ జాడలేదు నిరుద్యోగ భృతి అంశం మచ్చుకకైనా బడ్జెట్లో కనిపించకపోవడం చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగులపై ఏపాటి ప్రేముందో తేటతెల్లమైంది. యూత్ డిక్లరేషన్ కింద యువతకు వడ్డిలేని 10 లక్షలు రుణాలు, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ప్రస్తావన లేదు,విద్యా భరోసా పత్తా లేకుండా పోయింది. బడ్జెట్లో గురుకుల విద్యాలయాల గురించి ఏమి పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరించడం సరైంది కాదు. ఈ బడ్జెట్ విద్యార్థి, యువత, నిరుద్యోగ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రతిపాదించిన బడ్జెట్ కేవలం జీతాలు వేతనాలు పెన్షన్ల చెల్లింపులకే సరిపోతుందే తప్ప విద్యారంగ సంస్కరణలకు చిల్లి గవ్వ కూడా మిగలదు. రాజీవ్ యువ వికాసం అని పేరు పెట్టి ఈ హామీ ప్రకారం ఎస్సీ , ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు 10వ తరగతి పాసయితే రూ.10,000, ఇంటర్ పాసయితే రూ.15,000, గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తే రూ.25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేస్తే రూ.5 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చి నిన్నటి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణం. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకు రూ.10 వేల ఫెలోషిప్ ఇస్తామన్నారు.కానీ నిధుల కేటాయింపు మాత్రం శూన్యం. విద్యార్థులు అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం ఉద్యోగల కల్పన కోసం బిఆర్ఎస్వి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చేవరకు పోరాడుతూనే ఉంటాయి కాంగ్రెస్ పార్టీని దించే వరకు పోరాడుతది ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి విద్యార్థి నాయకులు కాటం శివ, నాగారం ప్రశాంత్, బొల్లు నాగరాజ్, రమేష్ గౌడ్, శీను నాయక్, రామకృష్ణ, శ్రీకాంత్ ముదిరాజ్, అవినాష్, పవన్, కొండ గణేష్, రాకేష్, వినోద్ కార్తీక్ తదితరులు పాల్గొనారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 21 ప్రజా తెలంగాణ న్యూస్/ శుక్రవారం నంగునూరు మండలంలోని నర్మెట్టలో ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఫ్యాక్టరీ లో అడిషనల్ DGP మహేష్ భగవత్, ఐజి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కే. హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాళ్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పలువురు అధికారులు పర్యటించి కార్యక్రమం నిర్వహించనున్న సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ మేరకు ప్రజా పాలనలో రైతు మహోత్సవం నిర్వహిస్తున్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. పెద్ద సంఖ్యలో రైతులు మరియు ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్, రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ యాజమాన్యం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిద్ధిపేట రూరల్ సీఐ శ్రీను, రాజగోపాల్‌పేట ఎస్ఐ వివేక్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ 22వ తేదీ నాడు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారిక పాసులను జారీ చేయడం జరుగుతుందని, హెలిప్యాడ్, ముఖ్యమంత్రి కాన్వాయ్, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, స్టాళ్ల సందర్శన, ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరణ, వివిధ నిర్మాణాల ప్రారంభోత్సవ శిలాఫలకాలను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని అన్నారు. ముఖ్యమంత్రి పర్యట పర్యటన వివిధ స్థాయిలలో విధులను కేటాయించిన అధికారులు మాత్రమే ఉండి ఆయా శాఖలకు కేటాయించిన విధులను తూచా తప్పకుండా పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రజలకు సరిపడు మరుగుదొడ్లు, త్రాగునీరు వసతి కల్పించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యుత్ సౌకర్యం, సౌండ్ సిస్టం, అంబులెన్స్ లు, ఫైర్ ఇంజన్, వైద్య శిబిరం, పార్కింగ్, విద్యుత్ సరఫరా ఏర్పాట్లు ప్రాపర్ గా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, రామ్మూర్తి, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ మేనేజర్ శ్రీకాంత్, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిపిఓ రవీందర్, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ధనరాజ్, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, ఫుడ్ సేఫ్టీ, వ్యవసాయ, ఉద్యానవన, ఐ అండ్ పిఆర్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.1