logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: MLA భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన “విద్యా వారం” కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు.

2 hrs ago
user_BOMMAKANTI NAVATH
BOMMAKANTI NAVATH
Local News Reporter మల్హర్‌రావు, జయశంకర్ భూపాలపల్లి, తెలంగాణ•
2 hrs ago
2c53d0de-c0fc-4b5f-9c1e-b6bc16810239

తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలి: MLA భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో నిర్వహించిన “విద్యా వారం” కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • గోదావరి బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పరామర్శ MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పరామర్శించారు. రోయ్యూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    గోదావరి బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పరామర్శ
MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పరామర్శించారు. రోయ్యూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    42 min ago
  • మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగకున్నా అధిక రీడింగ్ రావడంతో విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
    1
    మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద డ్రైవర్లు నిరసనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షల్లో మద్యం తాగకున్నా అధిక రీడింగ్ రావడంతో విధుల్లోకి తీసుకోలేదని ఆరోపించారు. ఈ యంత్రాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు. ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు. కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు. అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్, గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    3
    మహాశక్తి ఆలయం లోని అమ్మవార్ల సాక్షిగా మైనర్ బాలికకు నా కొడుక్కి ఎలాంటి సంభంధం లేదని ప్రమాణం చేయగలవా బండి సంజయ్ 
అని సవాల్ విసిరారు కరీంనగర్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోనీ తెలంగాణ చౌక్ లో.. బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్ ను పొక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బారాసా శ్రేణులతో కలసి వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సంజయ్ డౌన్ డౌన్ అంటూ..నినదించారు. కళ్ళు మూసుకొని ఉన్న మోడీ, నోటికి వేలు అడ్డం ఉంచి మౌనంగా ఉన్న రాహుల్ గాంధీ, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లు ఉన్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు.
ఈ సందర్బంగా అనిల్ మాట్లాడుతూ... మైనర్ బాలిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సహాయం చేస్తున్నట్లు అనిపిస్తుందనీ వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అన్నారు.
కేంద్ర మంత్రి పదవికి, ఇటు ఎంపీ కి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని బండి సంజయ్ కి సవాల్ విసిరారు.
అదేవిధంగా బండి సాయి భగీరత్ ను వెంటనే పొక్సో కేసులో అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో.. మైనర్ బాలికకు న్యాయం జరిగేంతవరకు బారసా పార్టీ పోరాడుతుందని స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమంలో పొన్నం అనిల్ తో పాటు..మీర్ షౌకత్ అలీ , నారదాసు వసంత రావు , బొంకూరి మోహన్ , అన్వేష్ , రవి నాయక్ , సైఫ్ , నయీం , సతీష్ , దినేష్ , రవి గౌడ్,
గోడిషాల పావని గౌడ్, బత్తిని కీర్తి లతా గౌడ్ , రుద్ర రాధ , అజంతా , హిమబిందు, శ్రీలత , రాజమణి , రేణుక , అరుణ పలువురు బారసా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
    1
    మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటనతో ఖానాపూర్‌లో ఉద్రిక్తత.. టెంట్లు తొలగించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ నేతల ఆందోళన
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అశోక్‌నగర్ గ్రామంలోని చారిత్రక మట్టి కోట శివాలయం విధ్వంసం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు ఏర్పాట్లు చేపట్టారు. పర్యటన కోసం ఏర్పాటు చేసిన టెంటులను పోలీసులు తొలగించగా, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • రైతుల ఇబ్బందులపై కరీంనగర్ ప్రజావాణి లో కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం....రైతులను ఇబ్బంది పెడితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరిక ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడడానికి ప్రధాన కారణం రైస్ మిల్లర్లేనని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. రైతు సమస్యలపై కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో కలెక్టర్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిర్యాదు చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాగ్ లో 43 కేజీల ధాన్యం తూకం వేయడాన్ని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్ నిర్లక్ష్యం వల్ల రైతులకు సమస్యలు తప్పడం లేదని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను పెట్టి నిరంతరం ధాన్యం కొనుగోలను పర్యవేక్షించాలని, టోల్ ఫ్రీ ఏర్పాటు చేసి రైతులకు సమస్యలు లేకుండా చూడాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలపై చర్యలు చేపడుతామని కలెక్టర్ చిత్రమిశ్రా ప్రకటించారు.
    2
    రైతుల ఇబ్బందులపై కరీంనగర్ ప్రజావాణి లో కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం....రైతులను ఇబ్బంది పెడితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరిక
ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడడానికి ప్రధాన కారణం రైస్ మిల్లర్లేనని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. రైతు సమస్యలపై కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో కలెక్టర్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిర్యాదు చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాగ్ లో 43 కేజీల ధాన్యం తూకం వేయడాన్ని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్ నిర్లక్ష్యం వల్ల రైతులకు సమస్యలు తప్పడం లేదని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను పెట్టి నిరంతరం ధాన్యం కొనుగోలను పర్యవేక్షించాలని, టోల్ ఫ్రీ ఏర్పాటు చేసి రైతులకు సమస్యలు లేకుండా చూడాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలపై చర్యలు చేపడుతామని కలెక్టర్ చిత్రమిశ్రా ప్రకటించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
    5
    విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం
మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    18 min ago
  • వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    2
    వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    user_Karam jeevan
    Karam jeevan
    Photographer మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.
    1
    ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు
MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.
    user_MAHI
    MAHI
    ములుగు, ములుగు, తెలంగాణ•
    46 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.