logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కిచెరువు, హరిజనవాడ, సంగమేశ్వరం కాలనీ తదితర ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పరిశీలించారు. *మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ గారి* ఆదేశాల మేరకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, కౌన్సిలర్ దొనకంటి వెంకట్,భాస్కర్ రెడ్డి, మొహమ్మద్ ఖలీల్, శ్యామల శ్రీకాంత్, ఆత్మ కమిటీ చైర్మన్ మాసాని రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

1 day ago
user_Banswada news
Banswada news
ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
1 day ago

*బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్ల పరిశీలన* తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని కల్కిచెరువు, హరిజనవాడ, సంగమేశ్వరం కాలనీ తదితర ప్రాంతాల్లో చేపడుతున్న ఏర్పాట్లను మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పరిశీలించారు. *మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ గారి* ఆదేశాల మేరకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు కాసుల రోహిత్, కౌన్సిలర్ దొనకంటి వెంకట్,భాస్కర్ రెడ్డి, మొహమ్మద్ ఖలీల్, శ్యామల శ్రీకాంత్, ఆత్మ కమిటీ చైర్మన్ మాసాని రవీందర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • దసరా పండుగ నేపథ్యంలో ఇంటి ముఖం పట్టిన విద్యార్థులు.... తాంసి మండలంలోని బండాల నాగపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో దసరా పండుగ సెలవుల సందడి నెలకొంది. పండుగ సెలవులు కావడంతో విద్యార్థినిలు తమ తల్లిదండ్రులతో కలిసి ఊళ్లకు వెళ్లేందుకు వాహనాల్లో బయలుదేరడానికి సిద్ధమయ్యారు. దీంతో పాఠశాల పరిసర ప్రాంతాలన్నీ విద్యార్థినుల కోలాహలంతో ఉత్సాహంగా, సందడిగా మారాయి.
    1
    దసరా పండుగ నేపథ్యంలో ఇంటి ముఖం పట్టిన విద్యార్థులు....
తాంసి మండలంలోని బండాల నాగపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో దసరా పండుగ సెలవుల సందడి నెలకొంది. పండుగ సెలవులు కావడంతో విద్యార్థినిలు తమ తల్లిదండ్రులతో కలిసి ఊళ్లకు వెళ్లేందుకు వాహనాల్లో బయలుదేరడానికి సిద్ధమయ్యారు. దీంతో పాఠశాల పరిసర ప్రాంతాలన్నీ విద్యార్థినుల కోలాహలంతో ఉత్సాహంగా, సందడిగా మారాయి.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • అర్హులైన ఆదివాసీలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి ఎల్లుల సంతోష్‌ కుమార్‌ ఆదిలాబాద్‌: జిల్లాలో అర్హులైన ఆదివాసీ కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సంవిధాన్‌ బచావో దేశ్‌ బచావో అధ్యక్షుడు ఎల్లుల సంతోష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆదివాసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఇంద్రవెల్లి సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 జాబితాల నిబంధనల కారణంగా అర్హులైన ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని అనేక గ్రామాల్లో ఆదివాసీ కుటుంబాలకు సొంత పక్కా ఇళ్లు లేనప్పటికీ, వారి పేర్లు ఎల్‌3 జాబితాలో ఉండటంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. దీంతో అర్హులైన పేద ఆదివాసీ కుటుంబాలు నిరాశకు గురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 జాబితాల నిబంధనలను తొలగించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి నిజమైన అర్హులైన ప్రతి ఆదివాసీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిర్సా క్రాంతిదళ్‌ అధ్యక్షుడు కినక సురేష్‌, నాయకులు కుడిమేత నరేష్‌, కనకే వామన్‌, మాదవి మోహన్‌, కుమ్రా గులాబ్‌, పెందోర్‌ విజయ్‌, టార్పె తులసి తదితరులు పాల్గొన్నారు.
    1
    అర్హులైన ఆదివాసీలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి ఎల్లుల సంతోష్‌ కుమార్‌
ఆదిలాబాద్‌: జిల్లాలో అర్హులైన ఆదివాసీ కుటుంబాలందరికీ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సంవిధాన్‌ బచావో దేశ్‌ బచావో అధ్యక్షుడు ఎల్లుల సంతోష్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఆదివాసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఇంద్రవెల్లి సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 జాబితాల నిబంధనల కారణంగా అర్హులైన ఆదివాసీలకు ఇందిరమ్మ ఇళ్లు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని అనేక గ్రామాల్లో ఆదివాసీ కుటుంబాలకు సొంత పక్కా ఇళ్లు లేనప్పటికీ, వారి పేర్లు ఎల్‌3 జాబితాలో ఉండటంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. దీంతో అర్హులైన పేద ఆదివాసీ కుటుంబాలు నిరాశకు గురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 జాబితాల నిబంధనలను తొలగించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి నిజమైన అర్హులైన ప్రతి ఆదివాసీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిర్సా క్రాంతిదళ్‌ అధ్యక్షుడు కినక సురేష్‌, నాయకులు కుడిమేత నరేష్‌, కనకే వామన్‌, మాదవి మోహన్‌, కుమ్రా గులాబ్‌, పెందోర్‌ విజయ్‌, టార్పె తులసి తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ప్రైవేట్ వాహనాలపై అదిలాబాద్ ఆర్టిసికి నియంత్రణ కరువు ? దసరా సెలవులతో అదిలాబాద్ ఆర్టీసీ జనసంద్రమయం తేదీ 9/10/2026 శుక్రవారం. మీ *ఆదిలాబాద్ జిల్లా ఆర్. టి . సి బస్టాండు దృశ్యాలు *దసరా సెలవుల కావడంతో అదిలాబాద్ ఆర్టీసీ ప్రాంగణం విద్యార్థులతో నిండిపోయింది విద్యార్థులు తమ ఊర్లకు వెళ్లడానికి తమ తల్లిదండ్రులకు అదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ రావడంతో అదిలాబాద్ ఆర్టీసీ ప్రాంగణం విద్యార్థులతో జన సంద్రమై నిలిచింది కానీ కానీ ప్రైవేటు వాహనాలు ఆర్టీసీ బస్టాండ్ లోపల రావడంతో కొంతమేరకు బస్సు ప్రయాణికులకు మరియు ఆర్టీసీ బస్సులకు ఇబ్బంది కలుగుతుంది కానీ అదిలాబాద్ ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ వాహనాలు బస్టాండ్ లోనికి అనుమతించడంలో నియంత్రణ కరువు అన్నట్టు ఉంది కావున దసరా సెలవులు దృశ్య అదిలాబాద్ బస్టాండ్ ఎంట్రీ గేట్ మరియు అవుట్ ప్రవేశద్వారం పై త్రీ వీలర్స్ వాహనదారులు బస్టాండ్ లోనికి రావడంతో ఇటు ఆర్టీసీ డ్రైవర్లు మరియు ప్రయాణికులు ఇబ్బంది గురి అవుతున్నారు కావున ప్రైవేట్ వాహనాలపై అదిలాబాద్ ఆర్టీసీ యాజమాన్యం నియంత్రణ చేపట్టాలని బస్సు ప్రయాణికులు కోరుతున్నారు
    4
    ప్రైవేట్ వాహనాలపై అదిలాబాద్   ఆర్టిసికి  నియంత్రణ కరువు ? దసరా సెలవులతో అదిలాబాద్ ఆర్టీసీ జనసంద్రమయం
తేదీ 9/10/2026 శుక్రవారం.  మీ
*ఆదిలాబాద్ జిల్లా ఆర్. టి . సి  బస్టాండు దృశ్యాలు *దసరా సెలవుల కావడంతో అదిలాబాద్ ఆర్టీసీ ప్రాంగణం విద్యార్థులతో    నిండిపోయింది  విద్యార్థులు తమ ఊర్లకు వెళ్లడానికి తమ తల్లిదండ్రులకు అదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ రావడంతో   అదిలాబాద్ ఆర్టీసీ ప్రాంగణం విద్యార్థులతో జన సంద్రమై నిలిచింది కానీ కానీ ప్రైవేటు వాహనాలు ఆర్టీసీ బస్టాండ్ లోపల రావడంతో కొంతమేరకు బస్సు ప్రయాణికులకు మరియు ఆర్టీసీ బస్సులకు ఇబ్బంది కలుగుతుంది కానీ అదిలాబాద్ ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ వాహనాలు బస్టాండ్  లోనికి అనుమతించడంలో నియంత్రణ కరువు అన్నట్టు ఉంది కావున దసరా సెలవులు దృశ్య అదిలాబాద్ బస్టాండ్ ఎంట్రీ గేట్ మరియు అవుట్ ప్రవేశద్వారం పై త్రీ వీలర్స్ వాహనదారులు బస్టాండ్ లోనికి రావడంతో ఇటు ఆర్టీసీ డ్రైవర్లు మరియు ప్రయాణికులు ఇబ్బంది గురి అవుతున్నారు కావున ప్రైవేట్ వాహనాలపై అదిలాబాద్ ఆర్టీసీ యాజమాన్యం నియంత్రణ చేపట్టాలని బస్సు ప్రయాణికులు  కోరుతున్నారు
    user_Godam Ramesh
    Godam Ramesh
    Adilabad Rural, Telangana•
    4 hrs ago
  • **“ *ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం* --- *ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు** ” *అంబేద్కర్ చౌక్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన * AICC, TPCC పిలుపు మేరకు “BLACK DAY – FOR INDIAN DEMOCRACY” కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారి ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కీసర్ పాషా గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ డిసిసి సాజిద్ ఖాన్ గారు, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ గారు,జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ బెజ్జంకి అనిల్ కుమార్ గారు, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్చార్జ్ గౌలి సంజీవ్ కుమార్ గారు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ బండారి సతీష్ గారు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. . బీజేపీ “ఓట్ చోరీ”కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రా గారు, సీనియర్ నాయకులు మరియు INDIA కూటమి ఎంపీలపై జరిగిన దౌర్జన్యం, లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజల ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా పారదర్శకతను నిర్ధారించాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షం లేవనెత్తుతున్న “ఓట్ చోరీ” ఆరోపణలపై సమగ్రంగా సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ డిసిసి సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా “ఓటు హక్కును కాపాడుదాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం రాజ్యాంగ విలువలను కాపాడుదాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని అయన అన్నారు . ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ది అయన ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభగాం అధ్యక్షురాలు అన్నపూర్ణ గారు, ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ గారు, మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాహిద్ గారూ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు జీశాన్ గారు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ గారు, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతీరామ్ గారు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు బండి దేవదాస్ చారి గారు, అత్తర్ అలీ గారు, మందాకిని గారు, కాడే సంతోష్ గారు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ సిరాజుద్దీన్ గారు, జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకలజితేందర్ గారు, మావల గ్రామ సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్ గారు, మామల మండల అధ్యక్షులు కుదురుపాక సురేష్ గారు, బోర చేసే విభాగం అధ్యక్షులు పొట్ట అశోక్ గారు, మావల ఎస్ఐ విభాగం అధ్యక్షులు అక్షయ్ గారు, వార్డు ప్రెసిడెంట్లు జగదీశ్వర్ రెడ్డి గారు, ఫాహిమ్ గారు, షౌకాత్ గారు, భూసం ప్రభాకర్ గారు, తుమ్మ ప్రకాష్ గారు నా పేరు కాదు, దమ్మ కీర్తి గారు, సలీం గారు, దిల్షాద్ గారు, అజర్ గారు, మోసిన్ గారు, రాజశేఖర్ గారు,పట్టణ కాంగ్రెస్ కమిటీనాయకులు, మండల అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు.
    3
    **“ *ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం* --- *ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు** ”

 *అంబేద్కర్ చౌక్‌లో  కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన
* 
AICC, TPCC పిలుపు మేరకు “BLACK DAY – FOR INDIAN DEMOCRACY” కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ గారి ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కీసర్ పాషా గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ డిసిసి సాజిద్ ఖాన్ గారు, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ గారు,జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్ బెజ్జంకి అనిల్ కుమార్ గారు, జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఇన్చార్జ్ గౌలి సంజీవ్ కుమార్ గారు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ బండారి సతీష్ గారు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వివిధ విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
. బీజేపీ “ఓట్ చోరీ”కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు, శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రా గారు, సీనియర్ నాయకులు మరియు INDIA కూటమి ఎంపీలపై జరిగిన దౌర్జన్యం, లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ప్రజల ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా పారదర్శకతను నిర్ధారించాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రతిపక్షం లేవనెత్తుతున్న “ఓట్ చోరీ” ఆరోపణలపై సమగ్రంగా సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అలాగే ఎన్నికల సంఘం విశ్వసనీయతను కాపాడేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాజీ డిసిసి సాజిద్ ఖాన్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా “ఓటు హక్కును కాపాడుదాం  ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం రాజ్యాంగ విలువలను కాపాడుదాం” అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని అయన అన్నారు . ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఓటు హక్కు కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ది అయన ఆయన గుర్తు చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభగాం అధ్యక్షురాలు అన్నపూర్ణ గారు, ఎస్సీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ గారు, మైనారిటీ విభాగం అధ్యక్షులు సయ్యద్ షాహిద్ గారూ, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చరణ్ గౌడ్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు జీశాన్ గారు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్ గారు, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతీరామ్ గారు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు బండి దేవదాస్ చారి గారు, అత్తర్ అలీ గారు, మందాకిని గారు, కాడే సంతోష్ గారు, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ సిరాజుద్దీన్ గారు, జిల్లా కాంగ్రెస్ మీడియా కోఆర్డినేటర్ మేకలజితేందర్ గారు, మావల గ్రామ సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్ గారు, మామల మండల అధ్యక్షులు కుదురుపాక సురేష్ గారు, బోర చేసే విభాగం అధ్యక్షులు పొట్ట అశోక్ గారు, మావల ఎస్ఐ విభాగం అధ్యక్షులు అక్షయ్ గారు, వార్డు ప్రెసిడెంట్లు జగదీశ్వర్ రెడ్డి గారు, ఫాహిమ్ గారు, షౌకాత్ గారు, భూసం ప్రభాకర్ గారు, తుమ్మ ప్రకాష్ గారు నా పేరు కాదు, దమ్మ కీర్తి గారు, సలీం గారు, దిల్షాద్ గారు, అజర్ గారు, మోసిన్ గారు, రాజశేఖర్ గారు,పట్టణ కాంగ్రెస్ కమిటీనాయకులు, మండల అధ్యక్షులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు దితరులు పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    1 day ago
  • నిర్మల్ జిల్లా కేంద్రంలో wisdom పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. సంబరాల సందడిలో నిర్మల్ నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు నిర్మల్ జిల్లా కేంద్రంలోని wisom పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి అధ్యాపకులు సంప్రదాయ పండుగకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చిన్నారులు, విద్యార్థులు.. బతుకమ్మ పాటల తాళానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పూల పండుగ గొప్పతనాన్ని చాటుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలతో పాఠశాల ప్రాంగణాలు పూలవనాలను తలపించాయి.
    4
    నిర్మల్ జిల్లా కేంద్రంలో wisdom  పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. సంబరాల సందడిలో నిర్మల్
నిర్మల్ జిల్లా కేంద్రంలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని wisom పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి అధ్యాపకులు సంప్రదాయ పండుగకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన చిన్నారులు, విద్యార్థులు.. బతుకమ్మ పాటల తాళానికి అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పూల పండుగ గొప్పతనాన్ని చాటుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలతో పాఠశాల ప్రాంగణాలు పూలవనాలను తలపించాయి.
    user_Douda karthik
    Douda karthik
    Local News Reporter నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    7 hrs ago
  • ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ ఎన్నికలు ఉత్సాహంగా పాల్గొంటున్న కార్మికులు నిర్మల్ ఆర్టీసీ డిపోలో పండగ వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా రెండు డిపోల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక నిర్మల్ డిపోలో 385మంది, బైంసా డిపోలో 197 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 సంవత్సరాల క్రితం రద్దు అయిన ఆర్టీసీ యూనియన్లను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించడంతో ఎన్నికలు జరుగుతున్నాయని, యూనియన్లు ఉంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికులందరూ సంతోషంగా ఉన్నారని పలువురు ఆర్టీసీ సీనియర్ నాయకులు తెలియజేశారు.
    2
    ప్రశాంతంగా కొనసాగుతున్న ఆర్టీసీ ఎన్నికలు 
ఉత్సాహంగా పాల్గొంటున్న కార్మికులు
నిర్మల్ ఆర్టీసీ డిపోలో పండగ వాతావరణం నెలకొంది. పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని నిర్మల్, బైంసా రెండు డిపోల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పోలింగ్ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక నిర్మల్ డిపోలో 385మంది, బైంసా డిపోలో 197 మంది ఆర్టీసీ కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 10 సంవత్సరాల క్రితం రద్దు అయిన ఆర్టీసీ యూనియన్లను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించడంతో ఎన్నికలు జరుగుతున్నాయని, యూనియన్లు ఉంటేనే కార్మికులకు న్యాయం జరుగుతుందని, కార్మికులందరూ సంతోషంగా ఉన్నారని పలువురు ఆర్టీసీ సీనియర్ నాయకులు తెలియజేశారు.
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    11 hrs ago
  • విజయానికి గుర్తింపు విజయదశమి: గుడిరేవు పాఠశాల హెచ్ఎం.... విజయానికి గుర్తింపు విజయదశమి అని దండేపల్లి మండలంలోని గుడిరేపు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయదశమి రోజున రావణాసురుడిపై శ్రీరాముడు గెలుపొందాడని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
    1
    విజయానికి గుర్తింపు విజయదశమి: గుడిరేవు పాఠశాల హెచ్ఎం....
విజయానికి గుర్తింపు విజయదశమి అని దండేపల్లి మండలంలోని గుడిరేపు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయదశమి రోజున రావణాసురుడిపై శ్రీరాముడు గెలుపొందాడని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • బహుజన సూర్యుడు కాన్షీరాంకు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బహుజన సూర్యుడు, బహుజన ఉద్యమ మార్గదర్శి మన్యవార్ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత, తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని కాన్షీరాం సేవలను స్మరించుకున్నారు. బహుజనుల హక్కుల సాధన, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కాన్షీరాం చేసిన పోరాటం చిరస్మరణీయమని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అణగారిన వర్గాల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాన్షీరాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లి, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    1
    బహుజన సూర్యుడు కాన్షీరాంకు ఘన నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
బహుజన సూర్యుడు, బహుజన ఉద్యమ మార్గదర్శి మన్యవార్ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత, తెలంగాణ రక్షణ సేన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొని కాన్షీరాం సేవలను స్మరించుకున్నారు. బహుజనుల హక్కుల సాధన, సామాజిక న్యాయం, సమానత్వం కోసం కాన్షీరాం చేసిన పోరాటం చిరస్మరణీయమని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అణగారిన వర్గాల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాన్షీరాం ఆశయాలను ముందుకు తీసుకెళ్లి, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.