Shuru
Apke Nagar Ki App…
విజయానికి గుర్తింపు విజయదశమి: గుడిరేవు పాఠశాల హెచ్ఎం.... విజయానికి గుర్తింపు విజయదశమి అని దండేపల్లి మండలంలోని గుడిరేపు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయదశమి రోజున రావణాసురుడిపై శ్రీరాముడు గెలుపొందాడని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
P.G. Murthy
విజయానికి గుర్తింపు విజయదశమి: గుడిరేవు పాఠశాల హెచ్ఎం.... విజయానికి గుర్తింపు విజయదశమి అని దండేపల్లి మండలంలోని గుడిరేపు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయదశమి రోజున రావణాసురుడిపై శ్రీరాముడు గెలుపొందాడని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- విజయానికి గుర్తింపు విజయదశమి: గుడిరేవు పాఠశాల హెచ్ఎం.... విజయానికి గుర్తింపు విజయదశమి అని దండేపల్లి మండలంలోని గుడిరేపు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయదశమి రోజున రావణాసురుడిపై శ్రీరాముడు గెలుపొందాడని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.1
- జన్నారం ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విద్యార్థినులు.. ఆటపాటలతో సందడిగా వేడుకలు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటపాటలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. పూల పండుగ విశిష్టతను చాటుతూ విద్యార్థినులు ఆనందోత్సాహాల మధ్య సంబరాలను జరుపుకున్నారు. తెలంగాణ అస్తిత్వానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతితో మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి. విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు పండుగల ప్రాధాన్యతను తెలియజేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి. సంప్రదాయ కళలు, జానపద గీతాలను భావితరాలకు పరిచయం చేయడంలో విద్యాసంస్థల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయి. ముందస్తు బతుకమ్మ సంబరాలతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థినుల ఉత్సాహం, సంప్రదాయాల పట్ల వారి మమకారం వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి.3
- రాష్ట్రవెలుమకార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు ప్రత్యేక పూజలు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర వెలుమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.స్వామి వార్లను దర్శించుకోవడానికి రాగా ముందుగా దేవస్థాన సాంప్రదాయ ప్రకారం సాధరంగా స్వాగతం పలికిన పిదప దర్శన అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం పక్షాన శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ ఇచ్చి సన్మానించడం జరిగింది.1
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక "బతుకమ్మ పండుగ" జిల్లా కలెక్టర్ కె.హరిత అక్టోబర్ 9, 2026: బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే పండుగ అని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక స్పోర్ట్స్ స్కూల్లో ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలకు హాజరై బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతిలో సహజంగా లభించే వివిధ రకాల రంగురంగుల పూలను సేకరించి, వాటిని అందంగా పేర్చి బతుకమ్మగా రూపొందించి, దేవతా స్వరూపంగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం తెలంగాణలో ప్రత్యేకంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రకృతిని ఆరాధించడం, పూలను పూజించడం, మహిళలంతా ఒకచోట చేరి ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవడం బతుకమ్మ పండుగలోని ప్రత్యేకతలని తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానానికి, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతిబింబమని అన్నారు. తంగేడు, గునుగు తదితర పూలతో బతుకమ్మను అలంకరించడం పర్యావరణ పరిరక్షణకు, ప్రకృతి పట్ల గౌరవభావానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన పూలతో దేవతను కొలవడం ద్వారా ప్రకృతిని గౌరవించాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుందని అన్నారు. బతుకమ్మ పండుగ ద్వారా మన సంస్కృతిని భావితరాలకు అందించడంతో పాటు, మన ప్రాంతీయ సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.1
- మానసిక సమస్యలున్న వారికి సమాన న్యాయం అందించాలి: కార్యదర్శి అనూష మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి సమాన న్యాయం, సరైన వైద్యం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అనూష అన్నారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడంపై ఆత్మన్యూనతా భావం వీడాలన్నారు. బాధితులను గుర్తించి అవసరమైన వైద్య సహాయం అందించాలని, వారిపై వివక్ష చూపకుండా అందరితో సమానంగా చూడాలని సూచించారు. మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని పేర్కొన్నారు.1
- అమ్మవారికి మొక్కు చెల్లించుకున్న 3 వ వార్డు కౌన్సిలర్ సౌజన్య విజయ్ కుమార్ దుర్గామాత కమిటీకి లక్ష రూపాయల విరాళం బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డ్ రవీంద్రనగర్ లోని దుర్గామాతను గత నవరాత్రుల్లో దర్శించుకొని మొక్కులు మొక్కుకోవడం జరిగిందని, అమ్మవారు తన చల్లని చూపుతో దీవించి తనను 3వ వార్డ్ కౌన్సిలర్ గా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించారని కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ తెలిపారు తన మొక్కు నెరవేరినందుకు గాను సంవత్సరం నవరాత్రులు వస్తున్న సందర్భంగా రవీంద్రనగర్ దుర్గామాత కమిటీ - ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులకు ఈరోజు లక్ష రూపాయలను (₹1,00,000/-) విరాళంగా అందజేయడం జరిగింది సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ రవీంద్రనగర్ లోని దుర్గామాత అమ్మవారు చాలా శక్తివంతురాలు. కోరిన కోరికలను వెంటనే తీర్చే అమ్మవారిగా పేరుంది. అమ్మవారి కృపా కటాక్షం, రవీంద్రనగర్ ప్రజల దీవెనలతోనే నేను భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అమ్మవారి చల్లని దీవెనలు 3వ వార్డ్ రవీంద్రనగర్ ప్రజలందరిపై మా కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, రవీంద్రనగర్ ను చక్కటి రూపంలో తీర్చిదిద్దాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అని అన్నారు కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నరు4
- ఇంటి గేట్ కి నిప్పు., ఇద్దరు నిందితుల అరెస్ట్., కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న NTPC పోలీసులు ఇంటి గేట్ కి నిప్పంటించి ఆస్తి నష్టం కలిగించేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్.* పోలీసులు తెలిపిన వివరాల్లో.. ఇందిరమ్మ కాలనీ లో నివాసముండే మేకల వసంత కొడుకు లవన్ తో బండి సురేష్, మరియు ధర్మారపు సాయి చరణ్ లకు జరిగిన గొడవ నేపథ్యంలో, లవన్ ఇంటిని తగులబెడతానని బెదిరించారు. ఇద్దరు ద్విచక్ర వాహనంపై లావన్ ఇంటి వద్దకు వచ్చి, అక్రమంగా ప్రహరీలోకి ప్రవేశించి ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి, గేట్ కి నిప్పటించారు. ఈ ఘటనను గమనించిన ఫిర్యాదుదారు మరియు ఆమె కుమారుడు ఇంటి నుంచి బయటకు వచ్చి నిందితులను ప్రశ్నించడంతో, నిందితులు అదే ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు..1
- గుల్లకోట యుపిఎస్ పాఠశాలలో ముగిసిన పోషణ మాస ఉత్సవాలు, ముందస్తు బతుకమ్మ సంబరాలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే అంగన్వాడీ కేంద్రాల లక్ష్యమని లక్షెట్టిపేట మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ దీపా వాహిని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మండలంలోని గుల్లకోట గ్రామంలో ఉన్న యుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో పోషణ మాసం ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో అందరూ కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు రోజా రమణి, లావణ్య, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.1