ఇంటి గేట్ కి నిప్పు., ఇద్దరు నిందితుల అరెస్ట్., కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న NTPC పోలీసులు ఇంటి గేట్ కి నిప్పంటించి ఆస్తి నష్టం కలిగించేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్.* పోలీసులు తెలిపిన వివరాల్లో.. ఇందిరమ్మ కాలనీ లో నివాసముండే మేకల వసంత కొడుకు లవన్ తో బండి సురేష్, మరియు ధర్మారపు సాయి చరణ్ లకు జరిగిన గొడవ నేపథ్యంలో, లవన్ ఇంటిని తగులబెడతానని బెదిరించారు. ఇద్దరు ద్విచక్ర వాహనంపై లావన్ ఇంటి వద్దకు వచ్చి, అక్రమంగా ప్రహరీలోకి ప్రవేశించి ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి, గేట్ కి నిప్పటించారు. ఈ ఘటనను గమనించిన ఫిర్యాదుదారు మరియు ఆమె కుమారుడు ఇంటి నుంచి బయటకు వచ్చి నిందితులను ప్రశ్నించడంతో, నిందితులు అదే ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు..
ఇంటి గేట్ కి నిప్పు., ఇద్దరు నిందితుల అరెస్ట్., కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న NTPC పోలీసులు ఇంటి గేట్ కి నిప్పంటించి ఆస్తి నష్టం కలిగించేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్.* పోలీసులు తెలిపిన వివరాల్లో.. ఇందిరమ్మ కాలనీ లో నివాసముండే మేకల వసంత కొడుకు లవన్ తో బండి సురేష్, మరియు ధర్మారపు సాయి చరణ్ లకు జరిగిన గొడవ నేపథ్యంలో, లవన్ ఇంటిని తగులబెడతానని బెదిరించారు. ఇద్దరు ద్విచక్ర వాహనంపై లావన్ ఇంటి వద్దకు వచ్చి, అక్రమంగా ప్రహరీలోకి ప్రవేశించి ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి, గేట్ కి నిప్పటించారు. ఈ ఘటనను గమనించిన ఫిర్యాదుదారు మరియు ఆమె కుమారుడు ఇంటి నుంచి బయటకు వచ్చి నిందితులను ప్రశ్నించడంతో, నిందితులు అదే ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు..
- ఇంటి గేట్ కి నిప్పు., ఇద్దరు నిందితుల అరెస్ట్., కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న NTPC పోలీసులు ఇంటి గేట్ కి నిప్పంటించి ఆస్తి నష్టం కలిగించేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్.* పోలీసులు తెలిపిన వివరాల్లో.. ఇందిరమ్మ కాలనీ లో నివాసముండే మేకల వసంత కొడుకు లవన్ తో బండి సురేష్, మరియు ధర్మారపు సాయి చరణ్ లకు జరిగిన గొడవ నేపథ్యంలో, లవన్ ఇంటిని తగులబెడతానని బెదిరించారు. ఇద్దరు ద్విచక్ర వాహనంపై లావన్ ఇంటి వద్దకు వచ్చి, అక్రమంగా ప్రహరీలోకి ప్రవేశించి ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి, గేట్ కి నిప్పటించారు. ఈ ఘటనను గమనించిన ఫిర్యాదుదారు మరియు ఆమె కుమారుడు ఇంటి నుంచి బయటకు వచ్చి నిందితులను ప్రశ్నించడంతో, నిందితులు అదే ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు..1
- రాష్ట్రవెలుమకార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు ప్రత్యేక పూజలు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర వెలుమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.స్వామి వార్లను దర్శించుకోవడానికి రాగా ముందుగా దేవస్థాన సాంప్రదాయ ప్రకారం సాధరంగా స్వాగతం పలికిన పిదప దర్శన అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం పక్షాన శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ ఇచ్చి సన్మానించడం జరిగింది.1
- అమ్మవారికి మొక్కు చెల్లించుకున్న 3 వ వార్డు కౌన్సిలర్ సౌజన్య విజయ్ కుమార్ దుర్గామాత కమిటీకి లక్ష రూపాయల విరాళం బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డ్ రవీంద్రనగర్ లోని దుర్గామాతను గత నవరాత్రుల్లో దర్శించుకొని మొక్కులు మొక్కుకోవడం జరిగిందని, అమ్మవారు తన చల్లని చూపుతో దీవించి తనను 3వ వార్డ్ కౌన్సిలర్ గా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించారని కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ తెలిపారు తన మొక్కు నెరవేరినందుకు గాను సంవత్సరం నవరాత్రులు వస్తున్న సందర్భంగా రవీంద్రనగర్ దుర్గామాత కమిటీ - ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులకు ఈరోజు లక్ష రూపాయలను (₹1,00,000/-) విరాళంగా అందజేయడం జరిగింది సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ రవీంద్రనగర్ లోని దుర్గామాత అమ్మవారు చాలా శక్తివంతురాలు. కోరిన కోరికలను వెంటనే తీర్చే అమ్మవారిగా పేరుంది. అమ్మవారి కృపా కటాక్షం, రవీంద్రనగర్ ప్రజల దీవెనలతోనే నేను భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అమ్మవారి చల్లని దీవెనలు 3వ వార్డ్ రవీంద్రనగర్ ప్రజలందరిపై మా కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, రవీంద్రనగర్ ను చక్కటి రూపంలో తీర్చిదిద్దాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అని అన్నారు కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నరు4
- ట్రినిటీ కళాశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలు.! పూల బతుకమ్మలతో పండుగ శోభ.. సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థినులు కరీంనగర్ వావిలాలపల్లిలోని ట్రినిటీ జూనియర్ కళాశాల (బాలికలు) ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. కళాశాలలోని ప్రైమ్ గ్రౌండ్ రంగురంగుల పూల బతుకమ్మలతో కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపాయి. కళాశాల ఛైర్మన్ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను నేటి యువతరం తెలుసుకోవాలన్నారు. విద్యార్థినులకు విద్యతోపాటు సంప్రదాయ విలువలను అందించాలనే ఉద్దేశంతో ఏటా కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో అలరించారు. విద్యార్థినుల ఉత్సాహంతో ప్రైమ్ గ్రౌండ్ సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంతో వేడుకలు ముగిశాయి.1
- కరీంనగర్‌లో ఎంఐఎం నూతన టౌన్ కమిటీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధికి నూతన టౌన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పట్టణాధ్యక్షుడు మహమ్మద్ ఆతీఫ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనరల్ సెక్రటరీ మోసిన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, పార్టీ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. భారీగా సభ్యత్వాలు నమోదు చేసి, వచ్చే నెలలో అసదుద్దీన్ ఒవైసీ నగరంలో సభ నిర్వహించనున్నట్లు వివరించారు.1
- ఇల్లంతకుంట మండలం లోని వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఘన సన్మానం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా సీనియర్ నాయకురాలు కొలనూరు ముత్తవ్వ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూమాల అనిల్, మహిళా మోర్చా అధ్యక్షురాలు మారవేణి దివ్య, రాజు శ్రీశైలం, చీమలగొట్టు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొలనూరు ముత్తవ్వ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, మహిళల సంక్షేమం కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయిన్ రంజిత్, గుంటి వేణు,n అజయ్ మహిళా మోర్చా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు...పలు పాఠశాలలో ఆడిపాడిన విద్యార్థులతో పాటు టీచర్లు తెలంగాణ పల్లెల్లో పూల పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి ప్రారంభమవుతుండగా శుక్రవారం పలు పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. శనివారం నుంచి పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ఉండడంతో కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల వైభవోపేతంగా విద్యార్థులు టీచర్లు ముందస్తుగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. చిగురు మామిడి మండలం రామంచ ప్రాథమిక పాఠశాలలో కన్నుల పండుగ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు టీచర్లు పలు రకాల పూలతో నిలువెత్తు బతుకమ్మలు పేర్చి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడారు. చప్పట్లు కొడుతూ కోలాటం ఆడుతూ బతకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడి పాడారు. ఆశ్వీజ శుద్ధ అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు తెలంగాణ పల్లెల్లో వైభవంగా జరుగుతాయి. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. బతుకమ్మ వేడుకలకు ప్రత్యేకత ఉంది. పకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే పండుగ బతుకమ్మ వేడుక అని మహిళలు అభిప్రాయపడుతున్నారు. రామంచ స్కూల్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో టీచర్ల పద్మ, శోభారాణితో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.3
- మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో ‘ఫైనల్ మైన్ క్లోజర్’ పనులను పరిశీలించిన IIEST ప్రొఫెసర్ గంగోపాధ్యాయ ఆర్జీ.I పరిధిలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో చేపడుతున్న తుది గని మూసివేత మరియు భూ పునరుద్ధరణ పనులను ప్రముఖ విద్యాసంస్థ IIEST - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, శిబ్‌పూర్ (పశ్చిమ బెంగాల్) కు చెందిన సీనియర్ ప్రొఫెసర్ డా. గంగోపాధ్యాయ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి గని మూసివేత పనులను థర్డ్ పార్టీ ఏజెన్సీ ద్వారా తనిఖీ చేయించడం తప్పనిసరి. ఇందులో భాగంగానే ప్రొఫెసర్ గంగోపాధ్యాయ నేతృత్వంలోని బృందం ఈ తనిఖీలు చేపట్టింది. సుమారు 30 సంవత్సరాల పాటు దేశ ఇంధన అవసరాలకు నిరంతరాయంగా బొగ్గును అందించిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో బొగ్గు నిల్వలు పూర్తిగా తరిగిపోవడంతో 2022 సంవత్సరంలో ఉత్పత్తి కార్యకలాపాలను సింగరేణి యాజమాన్యం నిలిపివేసింది. అనంతరం DGMS మరియు పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని తిరిగి యథాతథ స్థితికి తీసుకురావడానికి సింగరేణి భారీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా గనిలోని ఖాళీ ప్రదేశాన్ని (ఓవర్ బర్డెన్) మట్టితో పూడ్చడం ఉపరితలాన్ని వ్యవసాయానికి అనుకూలంగా చదును చేయడం నీటి నిల్వ మరియు నేల కోతను నివారించే చర్యలను మరియు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగినది. ప్రొఫెసర్ గంగోపాధ్యాయ మొదట మేడిపల్లి ప్రాంతంలో చేపట్టిన బ్యాక్ ఫిల్లింగ్ పనుల నాణ్యతను, నేల స్థిరత్వాన్ని, నాటిన మొక్కల పెరుగుదలను పరిశీలించారు. గనిని తిరిగి సాధారణ భూమిగా, అటవీ ప్రాంతంగా మార్చే ప్రక్రియ పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. అనంతరం ఆర్జీ.1 జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ లకిడి రమేష్ మేడిపల్లి మైన్ క్లోజర్ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పటివరకు చేసిన ఖర్చు, భవిష్యత్ నిర్వహణ ప్రణాళికలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీ.1 జనరల్ మేనేజర్ డి. లలిత్ కుమార్, కొత్తగూడెం రీజియన్ క్వాలిటీ విభాగం జీఎం సుజాయ్ ముజెందార్, యస్. ఓ. టు జియం కె. చంద్రశేఖర్, డిజియం ఫారెస్ట్ కర్ణ, కార్పొరేట్ పర్యావరణ విభాగం మరియు ప్రాజెక్ట్ ప్లానింగ్ విభాగం నుండి అడిషనల్ మేనేజర్లు తిరుపతి, శంకర్, రవీంద్రనాథ్, ఆర్జీ. ఏరియా సర్వే ఆఫీసర్ లక్ష్మి రాజం, పర్యావరణ పరిరక్షణ అధికారి వేణు తదితరులు పాల్గొన్నారు.1