logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్రవెలుమకార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు ప్రత్యేక పూజలు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర వెలుమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.స్వామి వార్లను దర్శించుకోవడానికి రాగా ముందుగా దేవస్థాన సాంప్రదాయ ప్రకారం సాధరంగా స్వాగతం పలికిన పిదప దర్శన అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం పక్షాన శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ ఇచ్చి సన్మానించడం జరిగింది.

2 hrs ago
user_Ntv నాగరాజు
Ntv నాగరాజు
వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
2 hrs ago

రాష్ట్రవెలుమకార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు ప్రత్యేక పూజలు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర వెలుమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.స్వామి వార్లను దర్శించుకోవడానికి రాగా ముందుగా దేవస్థాన సాంప్రదాయ ప్రకారం సాధరంగా స్వాగతం పలికిన పిదప దర్శన అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం పక్షాన శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ ఇచ్చి సన్మానించడం జరిగింది.

More news from తెలంగాణ and nearby areas
  • రాష్ట్రవెలుమకార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు ప్రత్యేక పూజలు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర వెలుమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.స్వామి వార్లను దర్శించుకోవడానికి రాగా ముందుగా దేవస్థాన సాంప్రదాయ ప్రకారం సాధరంగా స్వాగతం పలికిన పిదప దర్శన అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం పక్షాన శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ ఇచ్చి సన్మానించడం జరిగింది.
    1
    రాష్ట్రవెలుమకార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు ప్రత్యేక పూజలు.
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానమునకు తెలంగాణ రాష్ట్ర వెలుమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు కుటుంబ సమేతంగా వచ్చి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.స్వామి వార్లను దర్శించుకోవడానికి రాగా ముందుగా దేవస్థాన సాంప్రదాయ ప్రకారం సాధరంగా స్వాగతం పలికిన పిదప దర్శన అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం పక్షాన శ్రీ స్వామివారి శేష వస్త్రం ప్రసాదం దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్ ఇచ్చి సన్మానించడం జరిగింది.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • ఇంటి గేట్ కి నిప్పు., ఇద్దరు నిందితుల అరెస్ట్., కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న NTPC పోలీసులు ఇంటి గేట్ కి నిప్పంటించి ఆస్తి నష్టం కలిగించేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్.* పోలీసులు తెలిపిన వివరాల్లో.. ఇందిరమ్మ కాలనీ లో నివాసముండే మేకల వసంత కొడుకు లవన్ తో బండి సురేష్, మరియు ధర్మారపు సాయి చరణ్ లకు జరిగిన గొడవ నేపథ్యంలో, లవన్ ఇంటిని తగులబెడతానని బెదిరించారు. ఇద్దరు ద్విచక్ర వాహనంపై లావన్ ఇంటి వద్దకు వచ్చి, అక్రమంగా ప్రహరీలోకి ప్రవేశించి ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి, గేట్ కి నిప్పటించారు. ఈ ఘటనను గమనించిన ఫిర్యాదుదారు మరియు ఆమె కుమారుడు ఇంటి నుంచి బయటకు వచ్చి నిందితులను ప్రశ్నించడంతో, నిందితులు అదే ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు..
    1
    ఇంటి గేట్ కి నిప్పు.,
ఇద్దరు నిందితుల అరెస్ట్., కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న NTPC పోలీసులు 
ఇంటి గేట్ కి నిప్పంటించి ఆస్తి నష్టం కలిగించేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్.*
పోలీసులు తెలిపిన వివరాల్లో.. ఇందిరమ్మ కాలనీ లో నివాసముండే మేకల వసంత కొడుకు లవన్ తో బండి సురేష్, మరియు ధర్మారపు సాయి చరణ్ లకు జరిగిన గొడవ నేపథ్యంలో, లవన్ ఇంటిని తగులబెడతానని బెదిరించారు. ఇద్దరు ద్విచక్ర వాహనంపై లావన్ ఇంటి వద్దకు వచ్చి, అక్రమంగా ప్రహరీలోకి ప్రవేశించి ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి, గేట్ కి నిప్పటించారు. ఈ ఘటనను గమనించిన ఫిర్యాదుదారు మరియు ఆమె కుమారుడు ఇంటి నుంచి బయటకు వచ్చి నిందితులను ప్రశ్నించడంతో, నిందితులు అదే ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు..
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • విజయానికి గుర్తింపు విజయదశమి: గుడిరేవు పాఠశాల హెచ్ఎం.... విజయానికి గుర్తింపు విజయదశమి అని దండేపల్లి మండలంలోని గుడిరేపు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయదశమి రోజున రావణాసురుడిపై శ్రీరాముడు గెలుపొందాడని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
    1
    విజయానికి గుర్తింపు విజయదశమి: గుడిరేవు పాఠశాల హెచ్ఎం....
విజయానికి గుర్తింపు విజయదశమి అని దండేపల్లి మండలంలోని గుడిరేపు ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం బుచ్చయ్య అన్నారు. దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేశారు. విజయదశమి రోజున రావణాసురుడిపై శ్రీరాముడు గెలుపొందాడని ఆయన వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉన్నారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • జన్నారం ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విద్యార్థినులు.. ఆటపాటలతో సందడిగా వేడుకలు మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటపాటలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. పూల పండుగ విశిష్టతను చాటుతూ విద్యార్థినులు ఆనందోత్సాహాల మధ్య సంబరాలను జరుపుకున్నారు. తెలంగాణ అస్తిత్వానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతితో మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి. విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు పండుగల ప్రాధాన్యతను తెలియజేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి. సంప్రదాయ కళలు, జానపద గీతాలను భావితరాలకు పరిచయం చేయడంలో విద్యాసంస్థల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయి. ముందస్తు బతుకమ్మ సంబరాలతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థినుల ఉత్సాహం, సంప్రదాయాల పట్ల వారి మమకారం వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి.
    3
    జన్నారం ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన విద్యార్థినులు.. ఆటపాటలతో సందడిగా వేడుకలు
మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటపాటలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. పూల పండుగ విశిష్టతను చాటుతూ విద్యార్థినులు ఆనందోత్సాహాల మధ్య సంబరాలను జరుపుకున్నారు.
తెలంగాణ అస్తిత్వానికి, మహిళల ఐక్యతకు, ప్రకృతితో మానవ సంబంధాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి. విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించడంతో పాటు పండుగల ప్రాధాన్యతను తెలియజేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి. సంప్రదాయ కళలు, జానపద గీతాలను భావితరాలకు పరిచయం చేయడంలో విద్యాసంస్థల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు దోహదపడతాయి.
ముందస్తు బతుకమ్మ సంబరాలతో కళాశాల ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొనగా, విద్యార్థినుల ఉత్సాహం, సంప్రదాయాల పట్ల వారి మమకారం వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి.
    user_Naveen journalist
    Naveen journalist
    Local News Reporter Jannaram, Mancherial•
    8 hrs ago
  • ట్రినిటీ కళాశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలు.! పూల బతుకమ్మలతో పండుగ శోభ.. సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థినులు కరీంనగర్‌ వావిలాలపల్లిలోని ట్రినిటీ జూనియర్‌ కళాశాల (బాలికలు) ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. కళాశాలలోని ప్రైమ్‌ గ్రౌండ్‌ రంగురంగుల పూల బతుకమ్మలతో కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపాయి. కళాశాల ఛైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్‌ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను నేటి యువతరం తెలుసుకోవాలన్నారు. విద్యార్థినులకు విద్యతోపాటు సంప్రదాయ విలువలను అందించాలనే ఉద్దేశంతో ఏటా కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో అలరించారు. విద్యార్థినుల ఉత్సాహంతో ప్రైమ్‌ గ్రౌండ్‌ సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంతో వేడుకలు ముగిశాయి.
    1
    ట్రినిటీ కళాశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలు.!

పూల బతుకమ్మలతో పండుగ శోభ.. 

సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థినులు

కరీంనగర్‌ వావిలాలపల్లిలోని ట్రినిటీ జూనియర్‌ కళాశాల (బాలికలు) ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. కళాశాలలోని ప్రైమ్‌ గ్రౌండ్‌ రంగురంగుల పూల బతుకమ్మలతో కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపాయి. కళాశాల ఛైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్‌ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను నేటి యువతరం తెలుసుకోవాలన్నారు. విద్యార్థినులకు విద్యతోపాటు సంప్రదాయ విలువలను అందించాలనే ఉద్దేశంతో ఏటా కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో అలరించారు. విద్యార్థినుల ఉత్సాహంతో ప్రైమ్‌ గ్రౌండ్‌ సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంతో వేడుకలు ముగిశాయి.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    5 hrs ago
  • కరీంనగర్‌లో ఎంఐఎం నూతన టౌన్ కమిటీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధికి నూతన టౌన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పట్టణాధ్యక్షుడు మహమ్మద్ ఆతీఫ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనరల్ సెక్రటరీ మోసిన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, పార్టీ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. భారీగా సభ్యత్వాలు నమోదు చేసి, వచ్చే నెలలో అసదుద్దీన్ ఒవైసీ నగరంలో సభ నిర్వహించనున్నట్లు వివరించారు.
    1
    కరీంనగర్‌లో ఎంఐఎం నూతన టౌన్ కమిటీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధికి నూతన టౌన్ కమిటీని ఏర్పాటు
చేసినట్లు పట్టణాధ్యక్షుడు మహమ్మద్ ఆతీఫ్ తెలిపారు. 
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనరల్ సెక్రటరీ మోసిన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, పార్టీ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. భారీగా సభ్యత్వాలు నమోదు చేసి, వచ్చే నెలలో అసదుద్దీన్ ఒవైసీ నగరంలో సభ నిర్వహించనున్నట్లు వివరించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • అమ్మవారికి మొక్కు చెల్లించుకున్న 3 వ వార్డు కౌన్సిలర్ సౌజన్య విజయ్ కుమార్ దుర్గామాత కమిటీకి లక్ష రూపాయల విరాళం బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డ్ రవీంద్రనగర్ లోని దుర్గామాతను గత నవరాత్రుల్లో దర్శించుకొని మొక్కులు మొక్కుకోవడం జరిగిందని, అమ్మవారు తన చల్లని చూపుతో దీవించి తనను 3వ వార్డ్ కౌన్సిలర్ గా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించారని కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ తెలిపారు తన మొక్కు నెరవేరినందుకు గాను సంవత్సరం నవరాత్రులు వస్తున్న సందర్భంగా రవీంద్రనగర్ దుర్గామాత కమిటీ - ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులకు ఈరోజు లక్ష రూపాయలను (₹1,00,000/-) విరాళంగా అందజేయడం జరిగింది సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ రవీంద్రనగర్ లోని దుర్గామాత అమ్మవారు చాలా శక్తివంతురాలు. కోరిన కోరికలను వెంటనే తీర్చే అమ్మవారిగా పేరుంది. అమ్మవారి కృపా కటాక్షం, రవీంద్రనగర్ ప్రజల దీవెనలతోనే నేను భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అమ్మవారి చల్లని దీవెనలు 3వ వార్డ్ రవీంద్రనగర్ ప్రజలందరిపై మా కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, రవీంద్రనగర్ ను చక్కటి రూపంలో తీర్చిదిద్దాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అని అన్నారు కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నరు
    4
    అమ్మవారికి మొక్కు చెల్లించుకున్న 3 వ వార్డు కౌన్సిలర్ సౌజన్య విజయ్ కుమార్
దుర్గామాత కమిటీకి లక్ష రూపాయల విరాళం
బెల్లంపల్లి పట్టణంలోని 3వ వార్డ్ రవీంద్రనగర్ లోని దుర్గామాతను గత నవరాత్రుల్లో దర్శించుకొని మొక్కులు మొక్కుకోవడం జరిగిందని, అమ్మవారు తన చల్లని చూపుతో దీవించి తనను 3వ వార్డ్ కౌన్సిలర్ గా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించారని కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్  తెలిపారు
తన మొక్కు నెరవేరినందుకు గాను  సంవత్సరం నవరాత్రులు వస్తున్న సందర్భంగా రవీంద్రనగర్ దుర్గామాత కమిటీ - ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులకు ఈరోజు లక్ష రూపాయలను (₹1,00,000/-) విరాళంగా అందజేయడం జరిగింది సందర్భంగా కౌన్సిలర్  మాట్లాడుతూ రవీంద్రనగర్ లోని దుర్గామాత అమ్మవారు చాలా శక్తివంతురాలు. కోరిన కోరికలను వెంటనే తీర్చే అమ్మవారిగా పేరుంది. అమ్మవారి కృపా కటాక్షం, రవీంద్రనగర్ ప్రజల దీవెనలతోనే నేను భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అమ్మవారి చల్లని దీవెనలు 3వ వార్డ్ రవీంద్రనగర్ ప్రజలందరిపై మా కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని, రవీంద్రనగర్ ను చక్కటి రూపంలో తీర్చిదిద్దాలని అమ్మవారిని కోరుకుంటున్నాను అని అన్నారు కార్యక్రమంలో దుర్గామాత కమిటీ సభ్యులు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నరు
    user_పవన్ చారి
    పవన్ చారి
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • బ్రిలియంట్ మోడల్ స్కూల్ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వెల్గటూర్ బ్రిలియంట్ మోడల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అంబెడ్కర్ కూడలిలో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని సంప్రదాయ ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమం ఆకట్టుకుంది.
    1
    బ్రిలియంట్ మోడల్ స్కూల్ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వెల్గటూర్ బ్రిలియంట్ మోడల్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అంబెడ్కర్ కూడలిలో విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొని సంప్రదాయ ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమం ఆకట్టుకుంది.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.