Shuru
Apke Nagar Ki App…
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్బంధంతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు నిర్బంధించడాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి తీవ్రంగా ఖండించారు.మార్కాపురం గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ వలి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు.
M. ADINARAYANA
లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్బంధంతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు నిర్బంధించడాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి తీవ్రంగా ఖండించారు.మార్కాపురం గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ వలి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్బంధంతో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు నిర్బంధించడాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి తీవ్రంగా ఖండించారు.మార్కాపురం గడియార స్తంభం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మహబూబ్ వలి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు అన్నారు.1
- తాళ్లూరు మండలం తుర్పు గంగవరం లో బుధవారం తెల్లవారుజామున తేలికపాటి వర్షం కురిసింది. తాళ్లూరు మండలం తుర్పు గంగవరం లో బుధవారం తెల్లవారుజామున తేలికపాటి వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని వర్షం పడింది. గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వర్షం పడిన వెంటనే మళ్లీ ఎండ రావడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు.1
- నంద్యాల పట్టణంలో మద్యం షాపుల కేటాయింపు పారదర్శకంగా లాటరీ నంద్యాల కలెక్టరేట్‌లో మద్యం దుకాణాల కేటాయింపులో భాగంగా లాటరీ నిర్వహించారు. జిల్లాలో 27 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా 19 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల ప్రకారం 4 లేదా అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 16 దుకాణాలకు డ్రా నిర్వహించి కేటాయింపులు పూర్తి చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ తెలిపారు. బనగానపల్లెలో 2, కోవెలకుంట్లలో 1 దుకాణానికి తక్కువ దరఖాస్తులు రావడంతో లాటరీ నిర్వహించలేదు.1
- హైదరాబాద్‌లో బస్సు భవన్ ముందు వికలాంగుల ధర్నా బస్సులో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు HYD: హైదరాబాద్‌లోని బస్సు భవన్ ముందు వికలాంగులు ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. నిరసన చేస్తున్న వికలాంగులను పోలీసులు అడ్డుకున్నారు.1
- అటవీ, వన్యప్రాణులను రక్షించడం అందరి బాధ్యత : నంద్యాల డీడీపీటీ డా. సి. చైతన్య కుమార్ రెడ్డి 72వ వన్యప్రాణి వారోత్సవాలు - 2026లో భాగంగా నంద్యాల అటవీ డివిజన్ పరిధిలో ఏరియా డామినేషన్ ఎక్సర్‌సైజ్‌తో పాటు వన్యప్రాణి అవగాహన, కమ్యూనిటీ మొబిలైజేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. నంద్యాల డీడీపీటీ డా. సి. చైతన్య కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అటవీ అధికారులు, సిబ్బంది బండి ఆత్మకూరు, మహానంది మండలాల అటవీ అంచు గ్రామాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. అటవీ అంచు గ్రామాల ప్రజల సహకారం, భాగస్వామ్యం అత్యంత కీలకమని, అడవులు, వన్యప్రాణులను కాపాడటం ద్వారా పర్యావరణ సమతుల్యతతో పాటు భవిష్యత్ తరాలకు సహజ వనరులను పరిరక్షించవచ్చని అధికారులు తెలిపారు. అక్రమ వేట, అక్రమ రవాణా వంటి నేరాలపై సమాచారం తెలిస్తే వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.1
- హాస్టల్ వార్డెన్ అక్రమాలకు లాయర్, బావమరిది, అనుచరుల వత్తాసా? ఫోర్జరీ సంతకాలతో భూమి ఆక్రమణపై బాధితుడు జండాల కాసిం పీరా ధ్వజం బద్వేలు/మైదుకూరు, అక్టోబర్ 07:మైదుకూరు మండలంలో ప్రభుత్వ హాస్టల్ వార్డెన్‌గా బాధ్యతాయుత పదవిలో ఉంటూ అధికార బలంతో ప్రభుత్వ రికార్డులను, నెంబర్లను ఫోర్జరీ చేసి అక్రమంగా ఇల్లు నిర్మించారంటూ భారీ భూ అక్రమ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు పత్రికలపై లాయర్ల ద్వారా బెదిరింపు నోటీసులు పంపడం ఏ రకమైన న్యాయమని బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన జండాల కాసిం పీరా తెలిపిన వివరాల ప్రకారం - మైదుకూరు మండలంలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్న పుట్ట నాగకుమార్ విలువైన భూమికి సంబంధించిన 83, 89, 2261 లాంటి కీలక నెంబర్ల పరిధిలోని పత్రాలపై సంతకాలను ఫోర్జరీ చేశారు. ఆ ఫోర్జరీ సంతకాలతో దొంగ రికార్డులను సృష్టించి భూమిని అక్రమంగా తన స్వాధీనంలోకి తెచ్చుకుని, ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించారని ఆరోపించారు. ఈ భూ ఆక్రమణ వ్యవహారంలో వార్డెన్ బావమరిది గురు ప్రసాద్, అనుచరుడు తుపాకుల శ్రీనివాస్ కూడా భాగస్వాములై అన్ని విధాలా అండదండలు అందిస్తున్నారని, వీరంతా ఒక ముఠాగా ఏర్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని బాధితుడు ఆరోపించారు. ఈ అక్రమాలపై పత్రికల్లో కథనాలు రావడంతో తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి, లాయర్ సుధీర్ ద్వారా పత్రికా ప్రతినిధులకు బెదిరింపు నోటీసులు పంపడం సమంజసం కాదని కాసిం పీరా ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన లాయర్ వృత్తిలో ఉండి అక్రమార్కులకు మద్దతు పలకడం శోచనీయమన్నారు. ప్రభుత్వ రికార్డులను ఫోర్జరీ చేసి భూమిని ఆక్రమించిన పుట్ట నాగకుమార్, అతనికి సహకరిస్తున్న గురు ప్రసాద్, తుపాకుల శ్రీనివాస్‌లపై జిల్లా ఉన్నతాధికారులు, విజిలెన్స్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తామని, లాయర్ సుధీర్ వైఖరిని రాష్ట్ర బార్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామని కాసిం పీరా తెలిపారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, అక్రమ కట్టడాలను కూల్చివేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- బండి ఆత్మకూరులో 22వ రోజు బిక్షాటన చేస్తూ వీఆర్ఏల వినూత్న నిరసన బండి ఆత్మకూరు మండలంలో పనిచేస్తున్న వీఆర్ఏలు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా 22వ రోజు వినూత్న రీతిలో బిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బండి ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వీఆర్ఏలకు వేతన పెంపుతో పాటు పే స్కేల్ అమలు చేయాలనీ, అర్హులైన వీఆర్ఏలకు VRO, అటెండర్, వాచ్మెన్, డ్రైవర్ తదితర పోస్టుల్లో పదోన్నతులు కల్పించాలని కారుణ్య నియామకం కింద నామినీగా పనిచేస్తున్న వారిని శాశ్వత వీఆర్ఏలుగా నియమించాలనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- *నల్లకాల్వ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం....* *సైకిల్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు, కర్నూలుకు తరలింపు.....* నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లకాల్వ వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెలుగోడు వైపు నుంచి వేగంగా వస్తున్న టొయోటా ఇన్నోవా కారు (AP28 BK 4959), నల్లకాల్వ సమీపంలో సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న జిలాని భాష కాలు తీవ్రంగా గాయపడగా, మరో వ్యక్తి షాషావలి పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు సమాచారం. గాయపడిన వారిద్దరూ నల్లకాల్వ గ్రామానికి చెందినవారిగా స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానిక ప్రజలు గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర ప్రథమ చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బాధితులను ఆంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.2