logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లాలో రెండు ఏటిఎంలలో చోరీ కేసులో కీలక ఆధారాలు లభ్యం...సిసి ఫుటేజ్ ఆధారంగా నాలుగు పోలీస్ బృందాలు గాలింపు... హర్యానా గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు అనుమానం కరీంనగర్ లో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతరాష్ట్ర దొంగలు పోలీసులకు సవాల్ గా మారారు. తాజాగా మరో గ్యాంగ్ రెండు ఏటిఎం లను ద్వంసం చేసి 15 లక్షల 68 వేల నగదు అపహరించుకుపోవడంతో పక్క ప్లాన్ తో ప్రొఫెషనల్ అంతరాష్ట్ర గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తూ వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లాలో వరస చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతరాష్ట్ర ప్రొఫెషనల్ గ్యాంగ్ కరీంనగర్ ను టార్గెట్ గా చేసుకుని భారీ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులకు పెను సవాల్ గా మారుతున్నారు. తాజాగా కరీంనగర్ సమీపంలోని దుర్శెడ్, తిమ్మాపూర్ లో రాజీవ్ రహదారి పక్కన ఉన్న రెండు SBI ఏటిఎంలలో చోరీ కి పాల్పడ్డారు. దొంగలు చాకచక్యంగా లేడీస్ గెటప్ లో ఒకరు ముందుగా ఏటిఎం సెంటర్ లోకి వెళ్ళి సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. సిసి కెమెరా బ్లాక్ కావడంతో ఆ తర్వాత గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మిషన్ కట్ చేసి తిమ్మాపూర్ ఏటిఎం నుంచి 7 లక్షల 13 వేల 400 రూపాయలు, దుర్శేడ్ ఏటిఎం నుంచి 8 లక్షల 55 వేల నగదు ఎత్తుకెళ్లారు. రెండు ఏటిఎంలు రాజీవ్ రహదారి పక్కన 16 కిలోమీటర్ల దూరంలో ఉండగా గంట వ్యవధిలోనే దొంగతన కంప్లీట్ చేసి స్కార్పియో వాహనంలో పారిపోయారు. చోరీలో ముగ్గురు నుంచి నలుగురు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎంహెచ్ 03 ఈబీ 4258 నంబర్ స్కార్పియో వాహనంలో ప్రయాణించినట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అయితే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. ముందుగా తిమ్మాపూర్ ఏటిఎంలోలో చోరీ కి పాల్పడిన దొంగలు ఆ తర్వాత దుర్శేడ్ లో చోరీ చేసి పెద్దపల్లి రామగుండం రూట్ లో వెళ్ళినట్లు ఆనవాళ్ళు లభించాయి. ఒక్కో ఏటీఎం వద్ద ఆరు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే చోరీ కంప్లీట్ చేసినట్లు ఆనవాళ్ళు లభించాయి. ఇది అనుభవం ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ అనంతరం ఎక్కడ టోల్ ప్లాజాల మీదుగా కాకుండా గూగుల్ మ్యాప్ ద్వారా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చేరుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.‌ ఇదే తరహా ఏటీఎం చోరీలు మెదక్, నిజామాబాద్ జిల్లాలో జరగడంతో హర్యానాకు చెందిన గ్యాంగ్ ఇలాంటి చోరీలకు పాల్పడతారని భావిస్తూ ప్రత్యేక పోలీస్ బృందాలు హర్యానాలో గాలింపు చర్యలు చేపట్టారు. గత మే 3న కరీంనగర్ జ్యోతినగర్ లో పిఎంజే జ్యువెల్లరీ షాప్ లో చోరీకి పాల్పడి కాల్పులు జరిపి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు అపహరించుకుపోయిన తర్వాత జూలై 22న భగత్ నగర్ చౌరస్తాలో ఆయుధాలతో బెదిరించి బంగారం తోపాటు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆ రెండు చోరీలను పోలీసులు ఛేదించి బీహార్, యుపి బృందాలుగా గుర్తించి పలువురిని అరెస్టు చేశారు. జ్యువెలరీ షాప్ చోరీకి పాల్పడ్డ వారు దొరికినప్పటికి చోరీ సొత్తు రికవరీ మాత్రం కాలేదు. భగత్ నగర్ చోరీలో కుటుంబ సభ్యులే కిరాయి దుండగులతో చోరీ చేయించడంతో కొంత మాత్రమే రికవరీ అయింది. తాజాగా జరిగిన రెండు ఏటీఎంలలో చోరీ సైతం అంతరాష్ట్ర ముఠానే చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తూ నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో త్వరలోనే నిందితులను పట్టుకుంటామనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఐదు నెలల వ్యవధిలో మూడు భారీ చోరీలు జరగడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

కరీంనగర్ జిల్లాలో రెండు ఏటిఎంలలో చోరీ కేసులో కీలక ఆధారాలు లభ్యం...సిసి ఫుటేజ్ ఆధారంగా నాలుగు పోలీస్ బృందాలు గాలింపు... హర్యానా గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు అనుమానం కరీంనగర్ లో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతరాష్ట్ర దొంగలు పోలీసులకు సవాల్ గా మారారు. తాజాగా మరో గ్యాంగ్ రెండు ఏటిఎం లను ద్వంసం చేసి 15 లక్షల 68 వేల నగదు అపహరించుకుపోవడంతో పక్క ప్లాన్ తో ప్రొఫెషనల్ అంతరాష్ట్ర గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తూ వారిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కరీంనగర్ జిల్లాలో వరస చోరీలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతరాష్ట్ర ప్రొఫెషనల్ గ్యాంగ్ కరీంనగర్ ను టార్గెట్ గా చేసుకుని భారీ చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులకు పెను సవాల్ గా మారుతున్నారు. తాజాగా కరీంనగర్ సమీపంలోని దుర్శెడ్, తిమ్మాపూర్ లో రాజీవ్ రహదారి పక్కన ఉన్న రెండు SBI ఏటిఎంలలో

చోరీ కి పాల్పడ్డారు. దొంగలు చాకచక్యంగా లేడీస్ గెటప్ లో ఒకరు ముందుగా ఏటిఎం సెంటర్ లోకి వెళ్ళి సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. సిసి కెమెరా బ్లాక్ కావడంతో ఆ తర్వాత గ్యాస్ కట్టర్ తో ఏటీఎం మిషన్ కట్ చేసి తిమ్మాపూర్ ఏటిఎం నుంచి 7 లక్షల 13 వేల 400 రూపాయలు, దుర్శేడ్ ఏటిఎం నుంచి 8 లక్షల 55 వేల నగదు ఎత్తుకెళ్లారు. రెండు ఏటిఎంలు రాజీవ్ రహదారి పక్కన 16 కిలోమీటర్ల దూరంలో ఉండగా గంట వ్యవధిలోనే దొంగతన కంప్లీట్ చేసి స్కార్పియో వాహనంలో పారిపోయారు. చోరీలో ముగ్గురు నుంచి నలుగురు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారు ఎంహెచ్ 03 ఈబీ 4258 నంబర్ స్కార్పియో వాహనంలో ప్రయాణించినట్లు సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. అయితే ఆ నంబర్ ప్లేట్ నకిలీదని పోలీసుల విచారణలో తేలింది. ముందుగా తిమ్మాపూర్

ఏటిఎంలోలో చోరీ కి పాల్పడిన దొంగలు ఆ తర్వాత దుర్శేడ్ లో చోరీ చేసి పెద్దపల్లి రామగుండం రూట్ లో వెళ్ళినట్లు ఆనవాళ్ళు లభించాయి. ఒక్కో ఏటీఎం వద్ద ఆరు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే చోరీ కంప్లీట్ చేసినట్లు ఆనవాళ్ళు లభించాయి. ఇది అనుభవం ఉన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ అనంతరం ఎక్కడ టోల్ ప్లాజాల మీదుగా కాకుండా గూగుల్ మ్యాప్ ద్వారా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చేరుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.‌ ఇదే తరహా ఏటీఎం చోరీలు మెదక్, నిజామాబాద్ జిల్లాలో జరగడంతో హర్యానాకు చెందిన గ్యాంగ్ ఇలాంటి చోరీలకు పాల్పడతారని భావిస్తూ ప్రత్యేక పోలీస్ బృందాలు హర్యానాలో గాలింపు చర్యలు చేపట్టారు. గత మే 3న కరీంనగర్ జ్యోతినగర్ లో పిఎంజే జ్యువెల్లరీ షాప్ లో చోరీకి పాల్పడి కాల్పులు జరిపి భారీ ఎత్తున బంగారు ఆభరణాలు

అపహరించుకుపోయిన తర్వాత జూలై 22న భగత్ నగర్ చౌరస్తాలో ఆయుధాలతో బెదిరించి బంగారం తోపాటు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆ రెండు చోరీలను పోలీసులు ఛేదించి బీహార్, యుపి బృందాలుగా గుర్తించి పలువురిని అరెస్టు చేశారు. జ్యువెలరీ షాప్ చోరీకి పాల్పడ్డ వారు దొరికినప్పటికి చోరీ సొత్తు రికవరీ మాత్రం కాలేదు. భగత్ నగర్ చోరీలో కుటుంబ సభ్యులే కిరాయి దుండగులతో చోరీ చేయించడంతో కొంత మాత్రమే రికవరీ అయింది. తాజాగా జరిగిన రెండు ఏటీఎంలలో చోరీ సైతం అంతరాష్ట్ర ముఠానే చోరీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తూ నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో త్వరలోనే నిందితులను పట్టుకుంటామనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఐదు నెలల వ్యవధిలో మూడు భారీ చోరీలు జరగడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.

More news from తెలంగాణ and nearby areas
  • గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో........... హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
    1
    గణేశుడి చెంతకు మూషికం.. వైరల్‌గా మారిన వీడియో...........
హుస్నాబాద్ పట్టణంలోని కేబీ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలోకి ఓ మూషికం వచ్చి గణేశుడి విగ్రహం వద్ద సంచరించింది. గణేశుడి ముందు మూషికం తిరుగుతున్న దృశ్యాలు అక్కడున్న భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ ఆసక్తికర దృశ్యాలను స్థానిక యువత తమ సెల్‌ఫోన్లలో వీడియోగా చిత్రీకరించారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గణేశుడి వాహనమైన మూషికం స్వామివారి చెంతకు రావడాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • గణేశ్ నిమజ్జనానికి వెంటనే నీటిని విడుదల చేయాలి ‘ఛలో చింతకుంట’లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ/ఎల్ఎండీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద బిజెపి జిల్లా శాఖ సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఛలో చింతకుంట’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మనం ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదట వేడుకునేది విఘ్నేశ్వరుడినే. ఇయాళ ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించడం బాధాకరం. మనందరికీ తెలుసు ....తెలంగాణలో గణేశ్ నిమజ్జనం అంటే కేవలం ఒక పండుగ కాదు... ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భక్తి, మన సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. హిందువులంతా ఐకమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ. ఊరూవాడా గల్లీగల్లీలో ప్రతి ఒక్క హిందువు గణేశ్ ను ప్రతిష్టించుకుని నిర్వహించుకునే ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలేదు. ఇతర మతాల పండుగల నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. అయినా భరించాం. కానీ ఇయాళ గణపతిని నిమజ్జనం చేయడానికి నీళ్లు విడుదల చేయాలని 10 రోజుల నుండి అడుగుతున్నం. ఇరిగేషన్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రికి విజ్ఝప్త చేసినం. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. నేనడుగుతున్నా.... కాలువల్లో నీళ్లు లేవు. ఎండిపోయినయ్. “నిమజ్జనం ఎక్కడ చేయాలి?”. ఇప్పుడు నీళ్లు వదిలితే తాగడానికి నీళ్లుండవని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎస్సారెస్పీ లో 47 టీఎంసీలకు పైగా నీళ్లున్నయ్. నీళ్లు వదలడానికి ఇబ్బంది ఏంది? గణేశ్ నిమజ్జనానికి అర టీఎంసీ నీళ్లు వదిలితే చాలు. గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కూడా నీళ్లు వదిలారు కదా? మరి ఇప్పుడెందుకు వదలడం లేదు? గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నరు? ‘‘కేబినెట్ లో సీఎంకు, కొందరు మంత్రులకు పడటం లేదు. ఎవరికి వాళ్లే సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తానే సీఎం అని భావిస్తున్నారు. కాలువలకు నీళ్లు వదలకపోతే సీఎంకు చెడ్డ పేరొస్తది, హైకమాండ్ రేవంత్ రెడ్డి దించేస్తే తానే సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారేమో... మీ కొట్లాటలు మాకు అనవసరం. మాకు నీళ్లివ్వండి. గణేష్ నిమజ్జనాన్ని భక్తియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నా...’’అని చెప్పండి. ఇదిగో....కరీంనగర్‌లో చింతకుంట కాలువ. చుక్క నీరు లేదు. ఇక్కడికి వందలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయి. నీళ్లు లేకుండా ఆ గణపతులను ఏం చేయాలి? ఇక్కడే రోడ్లపై వదిలి వెళ్లాలా? ఒక్క చింతకుంటే కాదు, ఎస్సారెస్పీ పరిధిలోని దాదాపు అన్ని కాలువల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా ఆయా కాలువల్లో నిమజ్జనం చేసే వాళ్ల పరిస్థితి ఏంది? కావాల్సినన్ని నీళ్లున్నా పంటలకు నీళ్లు వదలడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా పట్టించుకోరు. చివరకు భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? గణేశ్ నిమజ్జనం తేదీలు ముందే తెలియవా? ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతాయో అధికారులకు ముందే తెలియదా? ఆ ప్రాంతాల్లో నీటి లభ్యతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, కాలువలు, చెరువులకు నీటిని ఎందుకు మళ్లించలేదు? రైతుల పంటలను కాపాడటానికి సమగ్ర నీటి విడుదల ప్రణాళిక ఎందుకు లేదు? భక్తులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చెబుతున్నారు? “తెలంగాణలో గణపతిని నిమజ్జనం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావాలా?”. తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి హిందువులే కదా? గణేశ్ నిమజ్జన ప్రాముఖ్యత, హిందువుల మనోభావాలు వాళ్లకు తెలియవా? ఇదేం పద్దతి. ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పుడు నిమజ్జనానికి కూడా నీళ్లవ్వకుండా వేధిస్తున్నరు. హిందువులంటే కాంగ్రెస్ కు అంత చులకన ఎందుకు? హిందువులు ఓటర్లు కాదా? వాళ్ల ఓట్లు అవసరం లేదా? గణేశ్ నిమజ్జనానికి కూడా నీళ్లు వదలండి మహాప్రభో వేడుకోవాల్సిన దుస్థితి కలిగిస్తారా? బీజేపీ పక్షాన, హిందువుల పక్షాన మేం కోరేదొక్కటే. తక్షణమే గణేశ్ నిమజ్జనానికి సరిపడ నీళ్లను విడుదల చేయాలి. నిమజ్జనానికి ఏ అటంకం లేకుండా భక్తిపారవశ్యంతో గణేష్ నిమజ్జనమయ్యేలా చూడాలి. అట్లాగే ప్రభుత్వం వెంటనే SRSP, కాకతీయ కాలువలు, స్థానిక చెరువులు, నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీటి విడుదలపై అత్యవసర ప్రణాళిక ప్రకటించాలి. ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం? ఎక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేస్తారు? ఎప్పుడు చేరుతుంది? నిమజ్జనానికి సురక్షితమైన ప్రాంతాలు ఏవి? .....అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. చివరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సాయంత్రంలోపు నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకపోతే....కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేస్తాం. హిందువుల దమ్మేందో చూపిస్తాం. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండారి వేణు, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, ఏపీపీ చంద్ర (టీంకు), చొప్పరి జయశ్రీ, బండ రమణ రెడ్డి, సౌగాని కొమురయ్య, సోమిడి వేణు,బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
    3
    గణేశ్ నిమజ్జనానికి వెంటనే నీటిని విడుదల చేయాలి ‘ఛలో చింతకుంట’లో ధ్వజమెత్తిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
గణేశ్ నిమజ్జన ఉత్సవాలను పురస్కరించుకుని ఎస్సారెస్పీ/ఎల్ఎండీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద బిజెపి జిల్లా శాఖ సాయిని మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘ఛలో చింతకుంట’’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు గారు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మనం ఏ పని చేపట్టినా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని మొట్టమొదట వేడుకునేది విఘ్నేశ్వరుడినే. ఇయాళ ఆ విఘ్నేశ్వరుడి నిమజ్జనానికే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు స్రుష్టించడం బాధాకరం. మనందరికీ తెలుసు ....తెలంగాణలో గణేశ్ నిమజ్జనం అంటే కేవలం ఒక పండుగ కాదు... ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన భక్తి, మన సామూహిక ఆధ్యాత్మిక ఉత్సవం. హిందువులంతా ఐకమత్యంగా జరుపుకునే గొప్ప పండుగ.
ఊరూవాడా గల్లీగల్లీలో ప్రతి ఒక్క హిందువు గణేశ్ ను ప్రతిష్టించుకుని నిర్వహించుకునే ఈ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇయ్యలేదు. ఇతర మతాల పండుగల నిర్వహణకు మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నరు. అయినా భరించాం. కానీ ఇయాళ గణపతిని నిమజ్జనం చేయడానికి నీళ్లు విడుదల చేయాలని 10 రోజుల నుండి అడుగుతున్నం. ఇరిగేషన్ అధికారులతోపాటు జిల్లా కలెక్టర్, రాష్ట్ర మంత్రికి విజ్ఝప్త చేసినం. కానీ ఇప్పటి వరకు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు.
నేనడుగుతున్నా.... కాలువల్లో నీళ్లు లేవు. ఎండిపోయినయ్. “నిమజ్జనం ఎక్కడ చేయాలి?”.
ఇప్పుడు నీళ్లు వదిలితే తాగడానికి నీళ్లుండవని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం ఎంత వరకు సమంజసం? ఎస్సారెస్పీ లో 47 టీఎంసీలకు పైగా నీళ్లున్నయ్. నీళ్లు వదలడానికి ఇబ్బంది ఏంది? గణేశ్ నిమజ్జనానికి అర టీఎంసీ నీళ్లు వదిలితే చాలు. గతంలో ఎస్సారెస్పీలో 17 టీఎంసీలు మాత్రమే నీళ్లు నిల్వ ఉన్నప్పుడు కూడా నీళ్లు వదిలారు కదా? మరి ఇప్పుడెందుకు వదలడం లేదు? గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నరు?
‘‘కేబినెట్ లో సీఎంకు, కొందరు మంత్రులకు పడటం లేదు. ఎవరికి వాళ్లే సీఎం కుర్చీలో కూర్చోవాలనుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తానే సీఎం అని భావిస్తున్నారు. కాలువలకు నీళ్లు వదలకపోతే సీఎంకు చెడ్డ పేరొస్తది, హైకమాండ్ రేవంత్ రెడ్డి దించేస్తే తానే సీఎం సీట్లో కూర్చోవాలని అనుకుంటున్నారేమో... మీ కొట్లాటలు మాకు అనవసరం. మాకు నీళ్లివ్వండి. గణేష్ నిమజ్జనాన్ని భక్తియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నా...’’అని చెప్పండి.
ఇదిగో....కరీంనగర్‌లో చింతకుంట కాలువ. చుక్క నీరు లేదు. ఇక్కడికి వందలాది గణేశ్ విగ్రహాలు నిమజ్జనం కోసం వస్తాయి. నీళ్లు లేకుండా ఆ గణపతులను ఏం చేయాలి? ఇక్కడే రోడ్లపై వదిలి వెళ్లాలా? ఒక్క చింతకుంటే కాదు, ఎస్సారెస్పీ పరిధిలోని దాదాపు అన్ని కాలువల్లోనూ ఇదే పరిస్థితి. ఏటా ఆయా కాలువల్లో నిమజ్జనం చేసే వాళ్ల పరిస్థితి ఏంది?
కావాల్సినన్ని నీళ్లున్నా పంటలకు నీళ్లు వదలడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా పట్టించుకోరు. చివరకు భక్తుల మనోభావాలను కూడా పట్టించుకోరు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?
గణేశ్ నిమజ్జనం తేదీలు ముందే తెలియవా? ఎక్కడెక్కడ నిమజ్జనాలు జరుగుతాయో అధికారులకు ముందే తెలియదా? ఆ ప్రాంతాల్లో నీటి లభ్యతను ముందుగానే ఎందుకు అంచనా వేయలేదు? అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, కాలువలు, చెరువులకు నీటిని ఎందుకు మళ్లించలేదు? రైతుల పంటలను కాపాడటానికి సమగ్ర నీటి విడుదల ప్రణాళిక ఎందుకు లేదు? భక్తులకు చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చెబుతున్నారు?
“తెలంగాణలో గణపతిని నిమజ్జనం చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావాలా?”. తెలంగాణ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి హిందువులే కదా? గణేశ్ నిమజ్జన ప్రాముఖ్యత, హిందువుల మనోభావాలు వాళ్లకు తెలియవా? ఇదేం పద్దతి.
ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరకు వెళ్లి ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన హామీలను గాలికొదిలేశారు. ఇప్పుడు నిమజ్జనానికి కూడా నీళ్లవ్వకుండా వేధిస్తున్నరు. హిందువులంటే కాంగ్రెస్ కు అంత చులకన ఎందుకు? హిందువులు ఓటర్లు కాదా? వాళ్ల ఓట్లు అవసరం లేదా? గణేశ్ నిమజ్జనానికి కూడా నీళ్లు వదలండి మహాప్రభో వేడుకోవాల్సిన దుస్థితి కలిగిస్తారా?
బీజేపీ పక్షాన, హిందువుల పక్షాన మేం కోరేదొక్కటే. తక్షణమే గణేశ్ నిమజ్జనానికి సరిపడ నీళ్లను విడుదల చేయాలి. నిమజ్జనానికి ఏ అటంకం లేకుండా భక్తిపారవశ్యంతో గణేష్ నిమజ్జనమయ్యేలా చూడాలి.
అట్లాగే ప్రభుత్వం వెంటనే SRSP, కాకతీయ కాలువలు, స్థానిక చెరువులు, నిమజ్జన ప్రాంతాలకు అవసరమైన నీటి విడుదలపై అత్యవసర ప్రణాళిక ప్రకటించాలి. ఏ ప్రాంతంలో ఎంత నీరు అవసరం? ఎక్కడి నుంచి ఎంత నీరు విడుదల చేస్తారు? ఎప్పుడు చేరుతుంది? నిమజ్జనానికి సురక్షితమైన ప్రాంతాలు ఏవి? .....అనే అంశాలపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
చివరగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. సాయంత్రంలోపు నిమజ్జనానికి నీళ్లు విడుదల చేయకపోతే....కాంగ్రెస్ ను రాజకీయ నిమజ్జనం చేస్తాం. హిందువుల దమ్మేందో చూపిస్తాం.
ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్ రావు, బండారి వేణు, గాజ శివరాం, ఎన్నం ప్రకాష్, ఏపీపీ చంద్ర (టీంకు), చొప్పరి జయశ్రీ, బండ రమణ రెడ్డి, సౌగాని కొమురయ్య, సోమిడి వేణు,బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    9 hrs ago
  • ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష. ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకుడు అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏళ్లుగా బ్రిడ్జి పూర్తికాక గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చినా నెల రోజులైనా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
    2
    ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష.
ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకుడు అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏళ్లుగా బ్రిడ్జి పూర్తికాక గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చినా నెల రోజులైనా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • సొంతింటి కల సాకారం దిశగా.. రుద్రంగి లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ.. రుద్రంగి: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. లబ్ధిదారులు పున్నూరి మల్లవ్వ–స్వామి, రేగుల మల్లవ్వ ఇళ్లకు సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
    1
    సొంతింటి కల సాకారం దిశగా.. రుద్రంగి లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ..
రుద్రంగి: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. లబ్ధిదారులు పున్నూరి మల్లవ్వ–స్వామి, రేగుల మల్లవ్వ ఇళ్లకు సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు... ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నాటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిపై అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్ల పై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడు అన్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అమూల్యమైన సేవలను అందిస్తున్న తరుణంలోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మొట్ట మొదటి మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర వహించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వారి అమూల్యమైన సూచనలు సలహాలు అందిస్తూ మార్గదర్శిగా నిలిచారు అని అన్నారు.అంతేకాకుండా అఖిలభారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పద్మశాలీల సమస్యలపై పోరాడుతూ పద్మశాలి కుల బాంధవుల ఐక్యతకై విశేష కృషి చేశారని అన్నారు. వారి ఆశయాలను గౌరవిస్తూ ఆదర్శ ప్రాయులైన కొండ లక్ష్మణ్ బాబూజీ కి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు.ఈనెల 27వ తేదీన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలందరూ ముఖ్యంగా పద్మశాలి కుల బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు,సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సబ్బని హరీష్, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, యువజన విభాగం కార్యవర్గ సభ్యులు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, చేనేత వస్త్ర వ్యాపార సంఘ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు మరియు పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి
సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో   కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు... ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నాటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిపై అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్ల పై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడు అన్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అమూల్యమైన సేవలను అందిస్తున్న తరుణంలోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మొట్ట మొదటి మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర వహించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వారి అమూల్యమైన సూచనలు సలహాలు అందిస్తూ మార్గదర్శిగా నిలిచారు అని అన్నారు.అంతేకాకుండా అఖిలభారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పద్మశాలీల సమస్యలపై పోరాడుతూ పద్మశాలి కుల బాంధవుల ఐక్యతకై విశేష కృషి చేశారని అన్నారు.
వారి ఆశయాలను గౌరవిస్తూ  ఆదర్శ ప్రాయులైన కొండ లక్ష్మణ్ బాబూజీ కి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు.ఈనెల 27వ తేదీన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలందరూ ముఖ్యంగా పద్మశాలి కుల బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు,సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్,  పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సబ్బని హరీష్, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, యువజన విభాగం కార్యవర్గ సభ్యులు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, చేనేత వస్త్ర వ్యాపార సంఘ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు మరియు పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
    1
    ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
    user_Prime 9
    Prime 9
    Dairy farm ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    13 hrs ago
  • ధర్మపురి లో ఘనంగా గణేష్ నిమజ్జనం...గణేషుడి శోభ యాత్రలో డప్పు నృత్యాలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగలా జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన గణేషుడి శోభాయాత్రలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డప్పు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర ధర్మపురి పట్టణ పురవీధుల్లో గణనాధుని ఊరేగిస్తూ గోదావరి నది తీరం వరకు సాగింది. భక్తుల కొలహాలం మధ్య గోదావరి నదిలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాంతం వైభవంగా సాగిన శోభాయాత్రకు ధర్మపురి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు.
    1
    ధర్మపురి లో ఘనంగా గణేష్ నిమజ్జనం...గణేషుడి శోభ యాత్రలో డప్పు నృత్యాలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండుగలా జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా జరిగిన  గణేషుడి శోభాయాత్రలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డప్పు నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర ధర్మపురి పట్టణ పురవీధుల్లో గణనాధుని ఊరేగిస్తూ గోదావరి నది తీరం వరకు సాగింది. భక్తుల కొలహాలం మధ్య గోదావరి నదిలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఆధ్యాంతం వైభవంగా సాగిన శోభాయాత్రకు ధర్మపురి ప్రజలు అడుగడుగున నీరాజనం పలికారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా? పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం
    3
    BJP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్
చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత
ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తల ఆగ్రహం ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ తీరుపై మండిపడుతున్న కార్యకర్తలు
కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లను  అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్ కు తరలిస్తున్న పోలీసులు
నీళ్లను వదిలేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తాం... నిమజ్జనానికి నీళ్లివ్వాలని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా?
పోలీసుల లాఠీఛార్జ్ హేయనీయం
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    10 hrs ago
  • హుస్నాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి అదుపులోకి.......... హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు స్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉంటున్నాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నట్లు, తన వివరాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు సమాచారం. అతడి ప్రవర్తనను బట్టి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వ్యక్తి వివరాలు, స్వస్థలం తదితర సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
    1
    హుస్నాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తి అదుపులోకి..........
హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు స్మశానవాటిక పరిసర ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉంటున్నాడు. అతడిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నట్లు, తన వివరాలను స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు సమాచారం. అతడి ప్రవర్తనను బట్టి మానసిక పరిస్థితి సరిగా లేనట్లు కనిపిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు వ్యక్తి వివరాలు, స్వస్థలం తదితర సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.