Shuru
Apke Nagar Ki App…
ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష. ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకుడు అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏళ్లుగా బ్రిడ్జి పూర్తికాక గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చినా నెల రోజులైనా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
Sircilla jilla updates
ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష. ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకుడు అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏళ్లుగా బ్రిడ్జి పూర్తికాక గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చినా నెల రోజులైనా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- సిరిసిల్ల పట్టణంలోని 3 వ వార్డ్ లో అభివృద్ధి పనులను భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. సిరిసిల్ల పట్టణంలోని 3 వ వార్డ్ లో అభివృద్ధి పనులను భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నిత్య అవసరాల వల్ల ఇతర కారణాలవల్ల వెలువడే మురికినీటి ప్రవాహానికి సరియైన పారుదల వ్యవస్థ లేకపోవడం వల్ల నీరు నిలిచిపోయి దోమలు తదితర కీటకాలు వృద్ధి చెందడం వల్ల స్థానిక ప్రజలకు అనారోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయని గుర్తించి ఈ సమస్య పరిష్కార క్రమంలో భాగంగా స్థానిక విద్యానగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు గల ప్రధాన మురికినీటి కాలువ మరియు కల్వర్టు నిర్మాణానికి 15 ఆర్థిక సంఘం యొక్క 5 లక్షల రూపాయల నిధులను కేటాయించుకొని అందులో భాగంగా నిర్మాణ పనులకై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రజలా అవసరాలకు అనుగుణంగా సిరిసిల్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి పనులను చేపడుతూ సిరిసిల్ల సమగ్ర అభివృద్ధికి మేము మా పాలకవర్గ సభ్యులం కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు.అనంతరం మెరుగైన నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మురికి నీటి కాలువ మరియు కల్వర్టు నిర్మాణ పనులను అనుకున్న సమయంలో పూర్తి చేయాల్సిందిగా సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా , వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు దార్నం అరుణ లక్ష్మీనారాయణ, మాజీ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ సభ్యులు మ్యాన్ రవి, గెంట్యాల శ్రీనివాస్, మాజీ శివ సాయి బాబా దేవాలయం అధ్యక్షులు మామిడాల కృష్ణ, మాజీ facs డైరెక్టర్ గడీల సురేష్, పద్మశాలి సంఘం సిరిసిల్ల ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల అధ్యక్షులు జిందం చక్రపాణి, సీనియర్ నాయకులు దూస రాజేశం, బండారి శివ, వేముల హరికృష్ణ, సబ్బని నరేందర్, జిందం దేవదాస్ మొదలగు నాయకులు పాల్గొన్నారు.1
- ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై బ్రిడ్జి పూర్తి చేయాలని ఆమరణ దీక్ష. ఇల్లంతకుంట మండలం అనంతారంలో బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల నాయకుడు అక్కెం నాగరాజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఏళ్లుగా బ్రిడ్జి పూర్తికాక గ్రామస్థులు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చినా నెల రోజులైనా పనులు పూర్తి కాలేదన్నారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు దీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు.2
- ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.1
- సొంతింటి కల సాకారం దిశగా.. రుద్రంగి లో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ.. రుద్రంగి: మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. లబ్ధిదారులు పున్నూరి మల్లవ్వ–స్వామి, రేగుల మల్లవ్వ ఇళ్లకు సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎర్రం గంగనర్సయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.1
- పవిత్ర పండుగలను రాజకీయం చేయడం తగదు, మేడిపల్లి సత్యం చోరువతో నీటి విడుదల.. అనంతుల రమేశ్, డీసీసీ అధికార ప్రతినిధి. వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో బిజెపి పార్టీ చీప్ పాలిటిక్స్ రాజకీయాలకు తెర లేపడం సిగ్గుచేటని డిసిసి అధికార ప్రతినిధి అనంతుల రమేష్ మండిపడ్డాడు.. సోమవారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు..ఈ సందర్భంగా గత కొన్నేళ్లుగా కరీంనగర్ పట్టణంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని, తాజాగా నిమజ్జనానికి నీళ్లు వదలం లేదని బిజెపి దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. కరీంనగర్ నగర పాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవాసం చేసుకున్న బిజెపి పండుగ ఏర్పాట్లను నిమజ్జనం చేసే విషయంలో బాధ్యత యుతంగా వ్యవహరించాల్సింది పోయి ధర్నాలకు దిగి,అనవసర అల్లర్లకు ఆజ్యం పోయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం ప్రతి ఏటా నిధుల కేటాయింపు తో పాటు ఎస్సారెస్పీ నీటి విడుదలపై చర్యలు తీసుకుంటున్న విషయం బిజెపికి తెలియంది కాదని, ప్రజల దృష్టి మరల్చేందుకు నిమజ్జనం ఏర్పాట్లను కూడా రాజకీయం చేయడం బిజెపికే చెందిందని మండిపడ్డారు.. ఎస్సారెస్పీ నీటి విడుదల విషయంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి తోటి మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారని అన్నారు.. నీటి విడుదల ప్రక్రియను గమనించిన బిజెపి నాయకులు నీటి విడుదల క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు చీప్ పాలిటిక్స్ కు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు.. పవిత్రమైన పండుగలను కూడా రాజకీయాలకు జోడించి లబ్ధి పొందాలని బిజెపి తీరును ప్రజలు గమనిస్తున్నారని ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని హితవు పలికారు..1
- హిందూ పండుగల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోందంటూ... బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. గణేశ్ నిమజ్జనానికి నీళ్లు ఇవ్వడంపైనా రాజకీయ రగడ..! ఆందోళన చేస్తేనే... ప్రభుత్వం దిగొచ్చిందా..? చింతకుంట కెనాల్ వద్ద బీజేపీ ఆందోళన... ఆ తర్వాతే ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలకు చర్యలా..? గణేశ్ నిమజ్జనానికి అవసరమైన నీటి కోసం... కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను, ప్రభుత్వాన్ని కోరినా... స్పందన రాలేదని ఆయన విమర్శించారు. చివరకు బీజేపీ ఆధ్వర్యంలో చింతకుంట కెనాల్ వద్ద భారీ ఆందోళన... ఆ తర్వాతే ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. అయితే... నీళ్లు విడుదల చేస్తున్నామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించారా..? లేదా కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వం నుంచి ఏమైనా అధికారిక సమాచారం వచ్చిందా..? అంటూ ప్రవీణ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల రాజకీయ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనం సజావుగా జరగడానికి నీటి విడుదల... ప్రజల విజయమని బీజేపీ నేత వ్యాఖ్యలు చేశారు.4
- కోరుట్లలో వీధి కుక్కల బెడద సెంట్రింగ్ కార్మికుడిపై కుక్కల గుంపు దాడి జగిత్యాల జిల్లా కోరుట్ల: పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం రామ్‌నగర్‌లో సెంట్రింగ్ పని చేస్తున్న ఆరిఫ్ అనే కార్మికుడిపై కుక్కల గుంపు దాడి చేయడంతో రెండు చేతులకు గాయాలయ్యాయి. స్థానికులు కుక్కలను తరిమి ఆయనను కాపాడారు. కల్లూరు రోడ్డు, ఝాన్సీ రోడ్డు, రహీంపూర్, బాబ్రీ చౌక్, హైదర్‌గూడ, హాజీపూర్, మోమిన్‌పూర్, గంగంపేట్, పాత బస్‌స్టాండ్ తదితర ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారని స్థానికులు తెలిపారు. గతంలో కూడా పలువురిపై కుక్కలు దాడి చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయని, ఫిర్యాదులు చేసినప్పటికీ మున్సిపల్ అధికారులు తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులకే సమస్య మళ్లీ తలెత్తుతోందని పేర్కొంటూ, వీధి కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుట్ల ప్రజలు కోరుతున్నారు.1
- ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు... ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నాటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిపై అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్ల పై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడు అన్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అమూల్యమైన సేవలను అందిస్తున్న తరుణంలోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మొట్ట మొదటి మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర వహించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వారి అమూల్యమైన సూచనలు సలహాలు అందిస్తూ మార్గదర్శిగా నిలిచారు అని అన్నారు.అంతేకాకుండా అఖిలభారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పద్మశాలీల సమస్యలపై పోరాడుతూ పద్మశాలి కుల బాంధవుల ఐక్యతకై విశేష కృషి చేశారని అన్నారు. వారి ఆశయాలను గౌరవిస్తూ ఆదర్శ ప్రాయులైన కొండ లక్ష్మణ్ బాబూజీ కి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు.ఈనెల 27వ తేదీన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలందరూ ముఖ్యంగా పద్మశాలి కుల బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు,సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సబ్బని హరీష్, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, యువజన విభాగం కార్యవర్గ సభ్యులు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, చేనేత వస్త్ర వ్యాపార సంఘ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు మరియు పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.2