*తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్ధన్ కు అల్తాఫ్ బాబా జన్మదిన శుభాకాంక్షలు* *ఎయిర్ పోర్టు లో టీడీ జనార్ధన్ కు ఘన స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు* విజయవాడ, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు టిడి జనార్ధన్ జన్మదినం సందర్భంగా ఆయనను గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా. ఢిల్లీ నుండి వస్తున్న ఆయనకు విమానాశ్రయంలో ఫకీర్ల మేళతాళములతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, తెలుగుదేశం పార్టీలో లో ఉన్నతమైన స్థానంలో ఉండాలని ప్రార్ధించారు. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూఖ్ షూబ్లీ ఆధ్వర్యంలో వందలాది అభిమానులు టిడి జనార్ధన్ విమానాశ్రయం చేరుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గన్నవరం హుస్సేన్ మౌలానా మదర్సా పిల్లలు గులాబి పూలతో శుభాకాంక్షలు తెలియజేశారు.

- Post by Sode Prasad1
- హన్మకొండ జిల్లా:హనుమకొండ వడ్డేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక సోదాల్లో అవినీతి వ్యవహారాలు బయటపడ్డాయి. కార్యాలయంలో 20 మంది అనధికార ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించగా, ఏడాదిలో రూ.42 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎస్ఆర్ఆలు రామనర్సింహారావు, ఆనంద్ అక్రమాలకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్ సాక్ష్యాలుగా లభించాయి. వారి ఇళ్లలో సోదాల్లో నగదు, బంగారం, వెండి, ఫిక్స్డ్ డిపాజిట్లు బయటపడగా, కార్యాలయంలో పెండింగ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.1
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఓటాయి గ్రామంలో సాంప్రదాయ జానపద కళారూపమైన “యాదవ రాజుల కథ” ప్రదర్శన గ్రామ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్లుగా టెలివిజన్, సీరియళ్లకే పరిమితమైన వినోదానికి అలవాటు పడిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక కథనాలను ఆసక్తిగా వీక్షించడం గ్రామీణ సంస్కృతికి కొత్త ఊపును తీసుకొచ్చింది. గ్రామీణ కళాకారులు తమ సాంస్కృతిక వృత్తి ధర్మంలో భాగంగా మళ్లీ ఈ జానపద కళారూపాన్ని పునరుద్ధరించి ప్రజల ముందుకు తీసుకురావడం విశేషం. గతంలో పల్లెల్లో విస్తృతంగా వినిపించిన యాదవ రాజుల వీరగాథలు, కాలక్రమేణా కనుమరుగవుతున్న వేళ, ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో కళాకారుల కంఠాల్లో ప్రతిధ్వనించడం స్థానికులను ఆనందానికి గురి చేసింది. ఈ ప్రదర్శనను చూడడానికి గ్రామ ప్రజలు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో, ఆసక్తితో కథను ఆలకించారు. చారిత్రక నేపథ్యంతో సాగిన ఈ కళారూపం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, పాత తరం జ్ఞాపకాలను తడిమింది. గ్రామీణ కళలు, జానపద సంప్రదాయాలు కేవలం వినోదమే కాకుండా, సమాజ చరిత్రను, జీవన విధానాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే గొప్ప వారసత్వమని పలువురు గ్రామ పెద్దలు అభిప్రాయపడ్డారు. ఇలాంటి జానపద కళారూపాలకు ప్రోత్సాహం లభిస్తే గ్రామీణ సంస్కృతి మరింత బలపడటంతో పాటు, కళాకారులకు కూడా గుర్తింపు, ఆదరణ లభిస్తుందని స్థానికులు పేర్కొన్నారు.1
- అంజన్న మాలధారణ స్వాములకు నిలువ నీడ లేక ఇబ్బందులు ఆలయ కమిటీపై భక్తుల ఆగ్రహం ఏటూర్ నాగారం శ్రీ రామ నవమి అనంతరం మండల దీక్షలో ఉన్న స్వాములకు తగిన సదుపాయాలు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి స్థానిక రామాలయం గుడి కళ్యాణ మండపం వద్ద శ్రీ రామ నవమి సందర్భంగా దాతల సహకారంతో చల్లటి పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. పండుగ సమయంలో భక్తులకు మంచి సౌకర్యాలు కల్పించినప్పటికీ, అనంతరం పరిస్థితులు మారడం గమనార్హం. శ్రీ రామ నవమి ముగిసిన తరువాత హనుమాన్ స్వాములు, అంజన్న స్వాములు 41 రోజుల మండల దీక్షలో భాగంగా మాలధారణ చేపట్టారు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో రామాలయం వద్ద స్వాముల కోసం ప్రత్యేకంగా కుటీరాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది మాత్రం ఆలయ కమిటీ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించకపోవడంతో మాలధారణలో ఉన్న స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిలువ నీడ లేక భక్తులు, స్వాములు బాధపడుతున్నారు. ఈ పరిస్థితిపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే స్థానిక గ్రామ పెద్దలు. స్పందించి స్వాములకు తగిన నీడ, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని,1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.1
- Post by Bondhu Suresh1
- జనగామ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమురయ్య పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు లక్ష్మీనారాయణ నాయక్, ఎర్రమల్ల సుధాకర్ తదితరులు పాల్గొని అమరుడి సేవలను స్మరించుకున్నారు.1
- Post by Arjunpandey1
- Post by Bondhu Suresh2