మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన నిందితుడికి 23 ఏళ్ల జైలు, యావజ్జీవ కారాగార శిక్ష : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్గొండ జిల్లా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు తిప్పర్తి మండలానికి చెందిన షేక్ అలియాస్ మహమ్మద్ ఖయ్యూంకు నల్గొండలోని అత్యాచారం, పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కేసు వివరాల ప్రకారం.. నిందితుడు ఖయ్యూం గతంలో ఇదే మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో సి.ఆర్.నం.242/2021, ఎస్.సి.పోక్సో.నం.94/2022 గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడి నేరం రుజువు కావడంతో న్యాయస్థానం పలు సెక్షన్ ల ప్రకారం 51 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు జరిమానా విధించింది. అయినప్పటికీ, నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం కూడా అదే మైనర్ బాలికను మరోసారి అపహరించి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై నల్గొండ-II టౌన్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో నల్గొండలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫర్ రేప్ అండ్ పోక్సో యాక్ట్ కేసెస్ నిందితుడిని పలు సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించింది. ఐ.పి.సి సెక్షన్ 344 కింద నేరం రుజువు కాకపోవడంతో ఆ అభియోగం నుంచి నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. పోక్సో యాక్ట్ లోని సెక్షన్ 42 ప్రకారం ఐపీసి సెక్షన్ 376(2)(ఎన్) కంటే పోక్సో యాక్ట్ లోని సెక్షన్ 5 ఆర్/డబ్ల్యూ 6 కింద విధించే శిక్ష అధికంగా ఉండటంతో, నిందితుడికి పోక్సో యాక్ట్ కింద శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి విధించిన శిక్షలు . సెక్షన్ 366 కింద 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా. పోక్సో సెక్షన్ 5 (జె)(ii) ఆర్/డబ్ల్యూ 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా, ఎస్సీ/ఎస్టీ (పి. ఓ. ఏ) యాక్ట్ సెక్షన్ 3(2)(వి) కింద యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలులో ఉంటాయని న్యాయస్థానం ఆదేశించిందని ఎస్పీ తెలిపారు. మొత్తం రూ.3,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన అప్పటి నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఎస్. సంపత్, నల్గొండ ఎస్.డి.పి.ఓ వి. నర్సింహారెడ్డి, ప్రస్తుత డిఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సీఐ ఆది రెడ్డి, ఎస్.హెచ్.ఓ డి. సైదా బాబు, కేసు కోర్టు ప్రాసెస్‌లో సహకరించిన డి.సి.ఆర్.బి సీఐ శ్రీను నాయక్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుమన్, లైజన్ అధికారులు నరేందర్, మల్లికార్జున్, సమర్థవంతంగా వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. మైనర్ బాలికలు, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, సమర్థవంతంగా దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన నిందితుడికి 23 ఏళ్ల జైలు, యావజ్జీవ కారాగార శిక్ష : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నల్గొండ జిల్లా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు తిప్పర్తి మండలానికి చెందిన షేక్ అలియాస్ మహమ్మద్ ఖయ్యూంకు నల్గొండలోని అత్యాచారం, పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. కేసు వివరాల ప్రకారం.. నిందితుడు ఖయ్యూం గతంలో ఇదే మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో సి.ఆర్.నం.242/2021, ఎస్.సి.పోక్సో.నం.94/2022 గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడి నేరం రుజువు కావడంతో న్యాయస్థానం పలు సెక్షన్ ల ప్రకారం 51 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు జరిమానా విధించింది. అయినప్పటికీ, నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం కూడా అదే మైనర్ బాలికను మరోసారి అపహరించి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై నల్గొండ-II టౌన్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిపై నేరం రుజువు కావడంతో నల్గొండలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫర్ రేప్ అండ్ పోక్సో యాక్ట్ కేసెస్ నిందితుడిని పలు సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించింది. ఐ.పి.సి సెక్షన్ 344 కింద నేరం రుజువు కాకపోవడంతో ఆ అభియోగం నుంచి నిందితుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. పోక్సో యాక్ట్ లోని సెక్షన్ 42 ప్రకారం ఐపీసి సెక్షన్ 376(2)(ఎన్) కంటే పోక్సో యాక్ట్ లోని సెక్షన్ 5 ఆర్/డబ్ల్యూ 6 కింద విధించే శిక్ష అధికంగా ఉండటంతో, నిందితుడికి పోక్సో యాక్ట్ కింద శిక్ష విధించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడికి విధించిన శిక్షలు . సెక్షన్ 366 కింద 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా. పోక్సో సెక్షన్ 5 (జె)(ii) ఆర్/డబ్ల్యూ 6 కింద 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా, ఎస్సీ/ఎస్టీ (పి. ఓ. ఏ) యాక్ట్ సెక్షన్ 3(2)(వి) కింద యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలులో ఉంటాయని న్యాయస్థానం ఆదేశించిందని ఎస్పీ తెలిపారు. మొత్తం రూ.3,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన అప్పటి నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఎస్. సంపత్, నల్గొండ ఎస్.డి.పి.ఓ వి. నర్సింహారెడ్డి, ప్రస్తుత డిఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సీఐ ఆది రెడ్డి, ఎస్.హెచ్.ఓ డి. సైదా బాబు, కేసు కోర్టు ప్రాసెస్‌లో సహకరించిన డి.సి.ఆర్.బి సీఐ శ్రీను నాయక్ కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుమన్, లైజన్ అధికారులు నరేందర్, మల్లికార్జున్, సమర్థవంతంగా వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. మైనర్ బాలికలు, మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, సమర్థవంతంగా దర్యాప్తు చేసి నేరస్తులకు శిక్ష పడేలా పోలీసు శాఖ కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ తెలిపారు.
- మోదీ జన్మదినం సందర్భంగా పాలడుగులో సేవా కార్యక్రమాలు పురాతన శివాలయాన్ని శుభ్రం చేసిన బీజేపీ నాయకులు – ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని మోదీ ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు మోత్కూర్,భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ మోత్కూర్ మండల పార్టీ ఆధ్వర్యంలో పాలడుగు గ్రామంలో సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పురాతన శివాలయ పరిసరాలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు శ్రమదానం చేసి శుభ్రం చేశారు. ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది, పరిశుభ్రతతో పాటు సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించాలనే సందేశాన్ని చాటారు.అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, దేశానికి మరింతకాలం సేవ చేసే శక్తిని అందించాలని స్వామివారిని ప్రార్థించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. సేవ, పరిశుభ్రత, ప్రజా సంక్షేమం అనే స్ఫూర్తితో గ్రామాల్లో నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.దేశ సేవను ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు సమాజ సేవకు నిరంతరం కృషి చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గుదే మధుసూదన్ యాదవ్, బీజేపీ మోత్కూర్ మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ బూత్ అధ్యక్షులు ఆళ్ల శివప్రసాద్, ముక్కామల గణేష్, బీజేపీ నాయకులు బరిగల శేఖర్, కందికట్ల అజయ్, ఎడ్ల సునీల్, ముక్కాముల మహేష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.4
- పెళ్లి పనుల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. తండ్రి, కుమార్తె మృతి HYD: కాటేదాన్‌లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి ఇస్మాయిల్ ఖాన్, కుమార్తె బుష్రా బేగం మృతి చెందారు. టిప్పర్ లారీ ఢీకొనడంతో టీవీఎస్ ఛాంప్‌పై వెళ్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. అక్టోబర్ 2న బుష్రా వివాహం జరగాల్సి ఉండగా, బంధువులను పెళ్లికి ఆహ్వానించి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది.1
- * గిరిజనుల ఆత్మగౌరవానికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి చారిత్రాత్మకం మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్... # గిరిజనుల ఆరాధ్య దైవం కేసీఆర్: మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ . మహబూబాబాద్ జిల్లా , కురవి మండలం పెద్దతండలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్.. మాజీ మంత్రి మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన చారిత్రక నిర్ణయానికి కృతజ్ఞతగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండా గ్రామంలో మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా *సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.. గిరిజనుల ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవ భవనాలను నిర్మించడంతో పాటు, గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడం, గిరిజన బంధు, పోడు భూములకు హక్కులు కల్పించడం వంటి నిర్ణయాలు చారిత్రాత్మక ఘట్టాలు అన్నారు రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది గిరిజనులు ఉన్నారు, గిరిజనుల జీవితాల్లో సెప్టెంబర్ 17 ఒక మైలురాయిగా నిలిచింది, రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో మరింత ప్రయోజనం కలిగింది విద్య ద్వారానే వికాసం సాధ్యమని నమ్మిన కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందించారు గిరిజన బిడ్డల భవిష్యత్తుకు బలమైన పునాది వేశారు అన్నారు దశాబ్దాలుగా పాలించిన ప్రభుత్వాల పాలన ఒక ఎత్తయితే, కేసీఆర్ పాలన మరో ఎత్తు. గత పాలనల్లో గిరిజన ప్రాంతాల్లో కనీస వసతులు కూడా సరిగా కల్పించిన దాఖలాలు లేవు. తాగునీటి కోసం గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం నడవాల్సిన పరిస్థితులు ఉండేవి. కేసీఆర్ గారి ఆశీర్వాదంతో రాష్ట్రంలో 3,416 తండాలు గ్రామపంచాయతీలుగా మారాయి. గిరిజన బిడ్డలే స్థానిక పాలకులుగా ఎన్నికై తమ తండాల అభివృద్ధిలో భాగస్వాములయ్యారు* గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, గిరిజనుల ఆత్మగౌరవానికి తగిన గుర్తింపు ఇవ్వాలి దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అభివృద్ధికి ఏం చేసిందో ప్రజలకు వివరించాలి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందిని విమర్శించారు కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని రాజకీయ కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను ప్రజల నుంచి దూరం చేయలేరు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని సత్యవతి రాథోడ్ అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు....2
- బావి భారత అభివృద్ధి నరేంద్ర మోడీ తోనే సాధ్యం. భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా అమ్మాపురం గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు... భారతదేశ అభివృద్ధి యొక్క నరేంద్ర మోడీ తోనే సాధ్యపడుతుందని బిజెపి నాయకులు గట్టు రాంబాబు గుండా సురేష్ లు అన్నారు. గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా తొర్రూరు మండలం లోని అమ్మాపురం గ్రామ గుట్టమీద రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.1
- డోర్నకల్ ఎమ్మెల్యే రామ చంద్రు నాయక్ కారులో పేలిన పవర్ బ్యాంక్.. తప్పిన ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రామ చంద్రు నాయక్ కారులో పవర్ బ్యాoక్ పేలింది.. దీంతో కారు క్యాబిన్ లో మంటలు వచ్చాయి.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మరో కారులో ఎమ్మెల్యే మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో జరుగుతున్న విమోచన దినోత్సవ జెండా కార్యక్రమనికి హాజరయ్యారు.. ఎమ్మెల్యే కి తృటిలో ప్రమాదం తప్పడం తో కాంగ్రెస్ శ్రేణులు ఉపిరి పీల్చుకున్నారు..1
- వీధి కుక్కల బెడద: అధికారుల టేబుల్‌పై సంచుల్లో కుక్కలు! అధికారులపై ఆగ్రహం మహారాష్ట్రలోని నిఫద్‌నగర్‌లో వీధి కుక్కల సమస్య తీవ్రం కావడంతో కాలనీ వాసులు వినూత్న నిరసన చేపట్టారు. సమస్యపై స్పందించని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంచుల్లో కుక్కలను తీసుకొచ్చి పంచాయతీ రాజ్ శాఖ అధికారి టేబుల్‌పై వేశారు. అంతేకాకుండా విడదీయరాని నిర్లక్ష్యానికి నిరసనగా ఆ అధికారి మెడలో నోట్ల దండ వేసేందుకు యత్నించడం స్థానికంగా సంచలనం రేపింది.1
- ఎందరో అమరవీరుల త్యాగాలతో రాచరికపు పాలన నుండి భారత దేశంలో విలీనమైన రోజు. ప్రజలకు అనుగుణంగా ప్రజాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మహబూబాబాద్ లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ డోర్నకల్ శాసన సభ్యులు డాక్టర్ జాటో రామచంద్రనాయక్. మహబూబాబాద్ జిల్లా సెప్టెంబర్ 17...... తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్, లతో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు విచ్చేసిన తెలంగాణ పోరాట యోధులకు, ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, పట్టణ పుర ప్రముఖులకు, పాత్రికేయులకు నాయొక్క శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గా నిర్వహిస్తోంది.ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలుచేయడం ప్రారంభించింది. .......రెవెన్యూ మరియు భూమి కొలతలు, రికార్డుల నిర్వహణ శాఖ....... నారాయణపురం గ్రామం – రీ-సర్వే మరియు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ నారాయణపురం గ్రామం గతంలో చినముప్పారం రెవెన్యూ గ్రామానికి చెందిన ఆవాసంగా ఉండగా, అనంతరం ప్రత్యేక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేయబడింది. గెజిట్ ప్రకారం గ్రామంలో 43 సర్వే నంబర్లు అనగా 116, 117, 145 నుండి 185 వరకు, మొత్తం ఎకరాలు 1827.12 గుంటల విస్తీర్ణం ఉంది. నారాయణపురం రెవెన్యూ గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన సర్వే నంబర్స్ 149, 150, 154, 165, 166 & 168 (వీటి విస్తీర్ణం Ac 1398.02 గుంటలు) లలో పాత రికార్డులలో కొన్ని చోట్ల “అడవి/Forest” అనే నమోదు ఉండేది. అదే నమోదు తదుపరి రెవెన్యూ రికార్డుల్లో కూడా కొనసాగుతూ, 2017-18 లో Land Records Up gradation Programme బాగంగా సైతం పట్టాదారు కాలమ్/పట్టాదారు తండ్రి పేరు కాలమ్ వద్ద “అడవి/Forest” అనే నమోదు అయింది. అదేవిధంగా RSR విస్తీర్ణం / సేత్వార్ విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిపోయింది. దీని కారణంగా సంబంధిత భూములకు పట్టాదారు పాసుపుస్తాకాలు జారీ చేసే సమయంలో భూమి Forest పరిధిలో ఉందా లేదా పట్టా భూమి గా ఉందా అనే విషయంపై స్పష్టత లేనందువల్ల పట్టాదారు పాసుపుస్తాకాలు జారీ ప్రక్రియ నిలిచిపోయింది. మన ప్రజా ప్రభుత్వం వచ్చాక, పాత రెవెన్యు మరియు Forest records మధ్య ఉన్న పరిస్థితిని పరిష్కరించే క్రమంలో, G.O.Ms.No.94, Revenue (Land Administration-I) Department, dated 11-09-2024 ద్వారా నారాయణపురం రెవిన్యూ గ్రామంలోని Sy.Nos.149, 150, 154, 165, 166 & 168 కు సంబంధించిన Ac.1398-03 గుంటాల విస్తీర్ణంలో పట్టాదారు కాలంలో నమోదైన “అడవి/ఫారెస్ట్” సబ్ డివిజన్ ను ధరణి పోర్టల్ నుంచి తొలగించింది. ఆ తర్వాత రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, భూ రికార్డులను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించేందుకు ప్రభుత్వం నారాయణపురం గ్రామంలో సమగ్ర రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. రీ-సర్వేలో భాగంగా ప్రతి రైతు చూపించిన భూమిని క్షేత్రస్థాయిలో కొలిచి, భూమి హద్దులు, విస్తీర్ణం మరియు వాస్తవ అనుభవాన్ని నమోదు చేశారు. ఈ ప్రక్రియలో ఆధునిక సర్వే పరికరాలను ఉపయోగించి సర్వేను పారదర్శకంగా నిర్వహించారు. ఈ రీ సర్వే అనంతరం నారాయణపురం గ్రామంలో 780 మంది రైతులకు, 1468.15 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలను గౌరవ రెవెన్యు శాఖ మాత్యులు మరియు గౌరవ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా తేది. 31-08-2026 న పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో మొత్తం 70 గ్రామాలకు రీ-సర్వే ఆమోదం లభించగా, ప్రస్తుతం 11 గ్రామాలలో సర్వే ప్రారంభించడం జరిగింది. ..........జిల్లా పరిశ్రమల శాఖ...... 2026–27 ఆర్థిక సంవత్సరంలో టీజీ-ఐపాస్ ద్వారా 25 పరిశ్రమలకు 42 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనుమతులు మంజూరై, 236 మందికి ఉపాధి అవకాశాలు సృష్టించబడ్డాయి. టీ-ప్రైడ్ (T-PRIDE) పథకం కింద షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన పారిశ్రామికవేత్తల 79 యూనిట్లకు 4 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేయబడింది. అలాగే డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET) ద్వారా యువతకు ఉచితంగా ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాయి. .............విద్యా శాఖ......... జిల్లాలో 1 వేయి 44 పాఠశాలలల్లో మొత్తం 94,973 మంది విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నెల్లికుదురు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నెల్లికుదురు మరియు డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నర్సింహులపేట ను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా ఎంపిక చేసుకొని అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. .......యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్శియాల్ స్కూల్....... యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్శియాల్ స్కూల్స్ ను మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గూడూర్ మండలం లోని బొద్దుగొండ గ్రామంలో, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కురవి మండలం లోని అయ్యగారిపల్లి గ్రామంలో పనులను ప్రారంభించబడినాయి. ఇంగ్లీష్ ఎన్రిచ్మేంట్ కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఆంగ్ల భాషా ఉపాధ్యాయులచే రూపొందించబడిన LEAP (Learn English Through Active Participation) పుస్తకాలను జిల్లాలోని ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. ఈ పుస్తకాల ద్వారా విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, వినడం, మాట్లాడటం, చదవడం మరియు రాయడం వంటి భాషా నైపుణ్యాలను మెరుగుపరచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు . .........ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం...... జిల్లాకు మొత్తం 10 వేల 651 ఇళ్లు కేటాయించగా, అందులో 1 వేయి 100 ఇళ్లు ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకు ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 3 వేల 685 ఇళ్ల లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే 4వ స్థానం సాదించడం జరిగింది. ఇప్పటివరకు లబ్ధిదారుల ఖాతాల్లో 234 కోట్ల రూపాయలు జమ చేసి, రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకోవడం జరిగింది. .........ఇందిరమ్మఇళ్ళు ఫేజ్-2....... రెండవ ఫేజ్‌లో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్లు (1,500 నూతన + 500 రూఫ్ రీప్లేస్‌మెంట్) కేటాయించడం జరిగింది. గుడిసెలు లేని తెలంగాణనే లక్ష్యంలో భాగంగా జిల్లాలో 1 వేయి 728 గుడిసెలను గుర్తించడం జరిగింది. మొదటి విడతగా 505 మందికి కొత్త ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. మిగిలిన లబ్దిదారులకు కూడా త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుంది. ..........మహాలక్ష్మి పథకం అమలు....... మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో డిసెంబర్ 2023 నుండి ఆగస్టు 2026 వరకు మహబూబాబాద్ మరియు తొర్రూర్ డిపో బస్సులలో 4 కోట్ల 72 లక్షల మంది మహిళలు ప్రయాణం చేసి 244 కోట్ల 73 లక్షల రూపాయలు ఆదా చేసుకున్నారు. ........విద్యుత్ శాఖ...... జిల్లాలో వ్యవసాయానికి మరియు మిగతా అన్ని రంగాలకు 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతుంది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఈ పథకంతో ఇప్పటి వరకు 1 లక్ష 16 వేల 464 కుటుంబాలకు సబ్సిడీ రూపంలో 88 కోట్ల 70 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 97 వేల 850 మంది రైతులకు సబ్సిడీ రూపంలో 1945 కోట్ల 93 లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది. ......పౌర సరఫరాల శాఖ...... ప్రజా పంపిణీ వ్యవస్థ..... రేషన్ కార్డు లేని కుటుంబాలకు కొత్త ఆహార భద్రత కార్డులు జారీ చేయబడుతున్నాయి. 558 చౌక ధరల దుకాణాల ద్వారా 2 లక్షల 62 వేల ఆహార భద్రత కార్డుదారులకు 16 వేల 793 అంత్యోదయ ఆహార భద్రత కార్డుదారులకు మరియు మూడు నెలలకు సంబంధించి 15 వేల 769 టన్నుల బియ్యం పంపిణీ చేయడం జరుచున్నది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కొత్త కార్డులు మంజూరు జారీ చేయడం మరియు పాత కార్డు నందు వ్యక్తుల పేర్లను నమోదు చేయడం జరిగింది. ఇట్టి ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు జిల్లా నందు 41 వేల 424కొత్త కార్డులు మరియు 50 వేల 935 మెంబెర్ ఆడిషన్ కార్డులు మంజూరు చేయడం జరిగినది. .........మహలక్ష్మి పథకం..... ఈ పథకం ద్వారా జిల్లాలో 1 లక్ష 25 వేల 649 లబ్దిదారులు ఫిబ్రవరి నెల 2024 నుండి లబ్ది పొందుతున్నారు. .........స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణి....... గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారి ఆదేశం మేరకు ఆగష్టు 15 స్వాంతంత్ర్య దినోత్సవం రోజున మద్యాహ్నం 2.00 గంటలకు జిల్లాలోని కార్డుదారులకు స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను పంపిణి జరిగింది. ఇట్టి స్మార్ట్ డిజిటల్ కార్డు ద్వార కార్డుదారులు రేషన్ కి సంబందించిన సేవలను T RATION MOBILE APP ద్వార పొందవచ్చును. ........రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు.... రాష్ట్రంలో నిరుపేద సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచింది. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చింది. మొత్తం 1835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది. జిల్లాలో ఈ పథకం కింద రూ.33 కోట్ల 74 లక్షలు వ్యయంతో 11,097 మందికి వైద్య చికిత్స అందించడం జరిగింది. ..........వ్యవసాయ శాఖ...... జిల్లాలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్య చరణ ప్రణాళికలో భాగంగా ప్రతి రెవెన్యూ గ్రామం కు 10 నమూనాల చొప్పున 2 వేల 880 మట్టి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించడం జరిగింది. దీనిలో 265 నేల ఆరోగ్య ఫలితాల పత్రాలను రైతులకు ఆందచేయడం జరిగింది. కల్తీ విత్తనాలు అమ్మకం అరికట్టడానికి మరియు ఎరువుల పర్యవేక్షణ కొరకు వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ అధికారులతో కలిపి ప్రతి మండల,డివిజన్, జిల్లా స్థాయి లో టాస్క్ పోర్స్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ స్థాయి లో ఎరువుల కొరకు 482 గ్రామ సమితి లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంశాలపై ప్రతి గ్రామములొ రైతులకు వ్యవసాయ అధికారుల ద్వారా రైతు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నది. రైతు భరోసా పథకం : 2026-27 వానాకాలం సీజన్ కు గాను 2 లక్షల 14 వేల 625 మంది రైతులకు 268 కోట్ల రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలలో జమచేయడం జరిగింది. రైతు భీమా : 1 లక్ష 46 వేల 52 మంది రైతులు నమోదు చేసుకోగా 770 చనిపోయిన రైతుల నామిని ఖాతాలో 38 కోట్ల రూపాయలు జమ చేయటం జరిగింది. ........ప్రకృతి వ్యవసాయం...... జిల్లా లో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా 16 మండలాలలో 17 క్లస్టర్ లను ఎంపిక చేసి క్లస్టర్ కి 125 మంది చొప్పున 2 వేల 125 రైతులని ఎంపిక చేసి వారికి ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. .......మిషన్ వైవిధ్యం..... భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడింది. అందువల్ల తక్కువ నీటి అవసరం గల మరియు స్వల్పకాలిక పంటలను ప్రోత్సహిస్తూ కాంటింజెన్సీ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించేందుకు “ మిషన్ వైవిధ్యం” కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా రైతులను వాతావరణ అనుకూల మరియు తక్కువ నీటి అవసరం గల పంటల సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. మిషన్ వైవిధ్యం ద్వారా ఈ వానాకాలం లో 21 వేల ఎకరాల పెసర, 2 వేల 6 వందల ఎకరాల కంది, ఒక వెయ్యి మూడు వందల తొంబై ఎకరాల మినుము సాగు చేయటం జరిగింది. మారుమూల గ్రామాలు, నిరుపేదలు నివసిస్తున్న ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, గౌరవ పార్లమెంటు, శాసనమండలి, శాసనసభ్యులకు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి, పాత్రికేయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అని ప్రభుత్వ విప్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ బి.లావణ్య, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె. అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హౌసింగ్ పిడి పురుషోత్తం, డిఆర్ఓ నాగలక్ష్మి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిఏఓ విజయచంద్ర, జిల్లా అధికారులు, సిబ్బంది, పుర ప్రముఖులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.2
- యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు1