Shuru
Apke Nagar Ki App…
నదీతీరాన ఆకట్టుకున్న ఈశ్వరుడి సైకత శిల్పాలు' ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారం చక్ర తీర్థ స్నానాలు సందర్భంగా శివుడు, శివలింగం కళాకృతులను తరణి ప్రసాద్ మిశ్రా నిర్మించారు. వీటికి భక్తులు పసుపు, కుంకుమలో పూజలు చేశారు.
ANR
నదీతీరాన ఆకట్టుకున్న ఈశ్వరుడి సైకత శిల్పాలు' ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారం చక్ర తీర్థ స్నానాలు సందర్భంగా శివుడు, శివలింగం కళాకృతులను తరణి ప్రసాద్ మిశ్రా నిర్మించారు. వీటికి భక్తులు పసుపు, కుంకుమలో పూజలు చేశారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- చక్ర తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు' ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో నేడు జరిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలకు భక్తులు పోటెత్తారు. దీంతో వంశధార నది తీరం జనసంద్రంగా మారింది. స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా మధ్యాహ్నం 12:15 నిమిషాలకు వంశధార నది తీరానికి చేరుకున్నారు. వేద పండితులను మంత్రోచ్ఛారణ నడుమ చక్ర తీర్థ స్నానాలను ఆచరించారు. సుమారు రెండు లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు సమాచారం.1
- టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఆలయం విగ్రహాల పునప్రతిష్ట కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజ అలంకరణ సహస్ర కుంకుమార్చన మహా హోమాలు చండీ హోమాలు పూర్ణ హుతినిర్వహించారు. భక్తుల్లో అమ్మవారందరినీ ప్రత్యేకంగా దర్శించుకున్నారు అనంతరం మహానసమారాధన కార్యక్రమం నిర్వహించారు.3
- టెక్కలికి 15 కోట్ల వ్యయంతో 50 పడగల ఆయుష్ హాస్పటల్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ,రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ల చిత్రపటాలకు టిడిపి శ్రేణులు బుధవారం పాలాభిషేకం చేశారు. టెక్కలి అన్నా క్యాంటీన్ జంక్షన్లో ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరిరావు మాట్లాడుతూ టెక్కలి అభివృద్ధికి కృషి చేస్తున్న అచ్చన్న నాయుడికి టెక్కలి ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు.1
- Post by APPARAO KONCHADA1
- పలాస: పలాసలోని రామకృష్ణాపురంలో బుధవారం, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన వ్యక్తి MPకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.1
- ప్రేమ, పెళ్ళి పేరుతో బాలికను తీసుకొనిపోయి మోసం చేసిన నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ 🎯 *బాలికను మోసం చేసిన నిందితుడికి శిక్ష విధింపబడే విధంగా చర్యలు చేపట్టామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ * 🎯 *నిందితుడికి 20 సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేసారన్న జిల్లా ఎస్పీ* 🎯 *బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం జిల్లా భోగాపురం పోలీసు స్టేషనులో 2024 సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000/-లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 5 లక్షలను మంజూరు చేయాలని ఫిబ్రవరి 18న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. భోగాపురం మండలం, ముంజేరు గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన కుమార్తె (మైనరు బాలిక) కనపడటం లేదని తేది.22.05.2024న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, భోగాపురం ఎస్ఐ పి.సూర్యకుమారి గర్ల్ మిస్సింగ్ క్రింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆ బాలికను కనిపెట్టి తన నుండి స్టేట్మెంట్ నమోదుచేసిన భోగాపురం పోలీసులు. భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖపట్నం మరియు హైదరాబాదు తిప్పి శారీరకంగా అనుభవించాడని తెలిపింది. ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తే.25.07.2024దిన పోక్సో సెక్షన్స్ క్రింద కేసును ఆల్టర్ చేశారన్నారు. అనంతరం విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. నిందితుడు రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.5,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్ధవంతంగా పని చేసిన విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ పి.సూర్యకుమారి, సి.ఎం.ఎస్. హెచ్సి సిహెచ్.రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు వి.సత్యనారాయణ, ఎపిపి జి.సత్యంలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. గడిచిన 6నెలల కాలంలో 17 పోక్సో కేసులలో నిందితులకు కఠిన కారాగార శిక్ష పడిందని, జిల్లా ఎస్పీ తెలిపారు. మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,1
- వీ.ఆర్.ఏలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేశారు. నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రభుత్వ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. వీఆర్‌ఏలుగా ఎక్కువ సంఖ్యలో వెనకబడిన తరగతుల వారు విధులు నిర్వహిస్తున్నారని, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కేవలం రూ.10,500 జీతంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు.1
- వంశధార, మహేంద్ర తనయపై వంతెనలు నిర్మించాలి.... ఎమ్మెల్యే ఎంజిఆర్ పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను అసెంబ్లీలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ప్రస్తావించారు. వంశధార, మహేంద్ర తనయ నదులపై వంతెనలు నిర్మిస్తే ప్రజల జీవన స్థాయి మెరుగుపడుతుందని తెలిపారు. గొట్టా బ్యారేజీకి ప్రత్యామ్నాయంగా హిరమండలం వద్ద మరో వంతెన అవసరమని అన్నారు.1