logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వేములవాడ లో మహాశివరాత్రి జాతర... పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి అధికారులు వేములవాడలో మహాశివరాత్రి జాతర వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే మహా జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి శోభను వేములవాడ సంతరించుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మహాశివరాత్రి వేడుకలను భీమేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు.‌ రాజన్న ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో మహా లింగార్చన లింగోద్భవ సమయంలో మహా అన్యాస పూర్వక రుద్రాభిషేకం భీమేశ్వరాలయంలో నిర్వహించేలా రాజన్న గుడిలో ఏకాంతంగా సేవలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం టిటిడి తరఫున శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పించారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ స్వామివారికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆదివారం సాయంత్రం శంకరమఠంలో అనువంశిక అర్చకులచే మహా లింగార్చన, రాత్రి 11 గంటల 30 నిమిషాలకు లింగోద్భవ కాలమందు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. మూడు రోజులపాటు 1200 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు సరిపడా రెండు లక్షల 50 వేల లడ్డు ప్రసాదాలు తయారీ చేశామని, భక్తులకు అన్నదానం తోపాటు టిఫిన్స్ ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.‌ రెండు కోట్లతో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. స్పాట్...

3 days ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 days ago

వేములవాడ లో మహాశివరాత్రి జాతర... పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి అధికారులు వేములవాడలో మహాశివరాత్రి జాతర వైభవంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే మహా జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి శోభను వేములవాడ సంతరించుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మహాశివరాత్రి వేడుకలను భీమేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు.‌ రాజన్న ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో మహా లింగార్చన లింగోద్భవ సమయంలో మహా అన్యాస పూర్వక రుద్రాభిషేకం భీమేశ్వరాలయంలో నిర్వహించేలా రాజన్న గుడిలో ఏకాంతంగా సేవలు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. శనివారం సాయంత్రం టిటిడి తరఫున శ్రీ స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పించారు. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు రాష్ట్ర

ప్రభుత్వం తరఫున శ్రీ స్వామివారికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆదివారం సాయంత్రం శంకరమఠంలో అనువంశిక అర్చకులచే మహా లింగార్చన, రాత్రి 11 గంటల 30 నిమిషాలకు లింగోద్భవ కాలమందు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. మూడు రోజులపాటు 1200 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు సరిపడా రెండు లక్షల 50 వేల లడ్డు ప్రసాదాలు తయారీ చేశామని, భక్తులకు అన్నదానం తోపాటు టిఫిన్స్ ఏర్పాటు చేశామని ఆలయ అధికారులు తెలిపారు.‌ రెండు కోట్లతో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి ప్రకటించారు. స్పాట్...

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్ గా మారారు.‌ పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్పారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో  విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇంచార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు.‌ వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి  అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ టీచర్ గా మారారు.‌ పిల్లల ప్రతిభకు పరీక్ష పెట్టి పాఠాలు చెప్పారు. కోనరావుపేట మండలం మర్రిమడ్ల గ్రామంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్) ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. సీబీఎస్ఈ విధానంలో పదో తరగతి మ్యాథ్స్ పరీక్షలు కొనసాగుతుండగా, ఇంచార్జి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా లైబ్రరీ పరిశీలించారు. స్కిల్ ఇండియా లో భాగంగా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద విద్యాలయంలో రిటైల్ ల్యాబ్ లో  విద్యార్థులు శిక్షణ పొందుతుండగా, ఇంచార్జి కలెక్టర్ వారితో మాట్లాడారు.‌ వ్యాపారంలో మెలకువలు, వివిధ అంశాల్లో విద్యార్థులు పొందిన అనుభవాన్ని వివరించారు. అనంతరం 9వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. అన్ని సబ్జెక్టులకు సంబందించిన సెలబస్ పూర్తి అయిందా అని ఆరా తీశారు. ప్రతి విద్యార్థి  అన్ని సబ్జెక్టుల పాఠాలు మరోసారి చదివి వార్షిక పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు. ఈ తరగతిలోని అంశాలు పై తరగతుల్లో ఇంకా వివరంగా ఉంటాయని తెలిపారు. ఇప్పుడే ప్రతి సబ్జెక్టు, పాఠాలపై మంచి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ విద్యాలయంలో చదివేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివిధ వృత్తులు, ఆర్మీ, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఇంచార్జి కలెక్టర్ ఆకాంక్షించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    14 hrs ago
  • కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    1
    కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనకు రంగం సిద్ధమైంది. Asian Paints గోదాంలో గత పదేళ్లుగా పనిచేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ వాహన యజమానులు, డ్రైవర్లు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. హమాలి చార్జీలు పెంపు, కిలోమీటర్ల వారీగా కిరాయిల సవరణ, లోడింగ్–అన్‌లోడింగ్ బాధ్యతలు కంపెనీ తీసుకోవడం, డ్రైవర్లకు ఇన్సూరెన్స్ వంటి అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • इंदौर कमिश्नर की जन सुनवाई में पहुचे पीड़ित
    1
    इंदौर कमिश्नर की जन सुनवाई में पहुचे पीड़ित
    user_पत्रकार नासिफ खान
    पत्रकार नासिफ खान
    कूर्डीनेटर నంగ్నూర్, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • మంగళవారం రోజు అర్ధరాత్రి నాయుడు పంపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో కారు నుజులు అయింది కారు వెనుక ముందు నెంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం
    3
    మంగళవారం రోజు అర్ధరాత్రి నాయుడు పంపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదంలో కారు నుజులు అయింది కారు వెనుక ముందు నెంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    1 hr ago
  • వర్ధన్నపేట | వరంగల్ జిల్లా: ప్రజలిచ్చిన తీర్పును కాదని, ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అడ్డగోలు ప్రచారాలు చేస్తూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వర్ధన్నపేటలో “తట్టెడు మట్టి కూడా తీయలేదని” ఎద్దేవా చేశారు. సబ్జెక్ట్ మాట్లాడడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేఆర్ నాగరాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నైతికంగా మాట్లాడాలని హితవు పలికారు. ఇసుక మాఫియా నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వరంగల్‌లో కోట్ల విలువైన గెస్ట్ హౌస్ కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కులాలు, మతాలు, సంప్రదాయాలను గౌరవించని ఎమ్మెల్యే ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు డైవర్షన్ రాజకీయాలకు దిగితే గట్టిగా ఎదుర్కుంటామని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.
    1
    వర్ధన్నపేట | వరంగల్ జిల్లా:
ప్రజలిచ్చిన తీర్పును కాదని, ఎక్స్ అఫీషియో ఓటుతో అడ్డదారిలో వర్ధన్నపేట మున్సిపాలిటీని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆరోపించారు.
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా వర్ధన్నపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజుపై ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక అడ్డగోలు ప్రచారాలు చేస్తూ డైవర్షన్ డ్రామాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. వర్ధన్నపేట మున్సిపాలిటీని అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా వర్ధన్నపేటలో “తట్టెడు మట్టి కూడా తీయలేదని” ఎద్దేవా చేశారు.
సబ్జెక్ట్ మాట్లాడడం చేతకాక వ్యక్తిగత దూషణలకు దిగుతున్న కేఆర్ నాగరాజు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నైతికంగా మాట్లాడాలని హితవు పలికారు. ఇసుక మాఫియా నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి వరంగల్‌లో కోట్ల విలువైన గెస్ట్ హౌస్ కొనుగోలు చేశారని ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.
కులాలు, మతాలు, సంప్రదాయాలను గౌరవించని ఎమ్మెల్యే ఇకపై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వర్ధన్నపేట అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు సహకరిస్తామని, అయితే వ్యక్తిగత దూషణలు మరియు డైవర్షన్ రాజకీయాలకు దిగితే గట్టిగా ఎదుర్కుంటామని ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.
    user_Ibrahim sulthana
    Ibrahim sulthana
    Tailor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    1
    ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు...
రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర...
మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి....
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ....
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు.
కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం.
ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు.
ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు.
ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు.
తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు.
కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం.
మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ...
తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం.
రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది.
రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము.
తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది.
ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ....
ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది.
తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు.
రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు.
బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్.
దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు
నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    user_Venkatgoud kallepu
    Venkatgoud kallepu
    Singer రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    19 hrs ago
  • వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    1
    వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    17 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో రాష్ట్ర స్థాయి 8 వ వాలీబాల్ పోటీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. రాబోయే ఒలంపిక్స్ లో రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం క్రీడాజ్యోతి పథకంలో భాగంగా 40 క్రీడల్లో యువతీ, యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో వేములవాడ ప్రాంతంలోని క్రీడాకారులు అనేక పథకాలు సాధించారని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వేములవాడలో జరిగే ఈ పోటీల్లో యువతీ యువకులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించాలని కోరారు.
    2
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో రాష్ట్ర స్థాయి 8 వ వాలీబాల్ పోటీలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. 33 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. వేములవాడలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఆది శ్రీనివాస్. రాబోయే ఒలంపిక్స్ లో రాటు తేలిన క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం క్రీడాజ్యోతి పథకంలో భాగంగా 40 క్రీడల్లో యువతీ, యువకులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో వేములవాడ ప్రాంతంలోని క్రీడాకారులు అనేక పథకాలు సాధించారని, గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  వేములవాడలో జరిగే ఈ పోటీల్లో యువతీ యువకులు తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శించాలని కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.