Shuru
Apke Nagar Ki App…
మత్తు పదార్థాలకు ప్రజల దూరంగా ఉండాలని పలు స్లోగన్ల ద్వారా తెలిపిన ఎస్ బి ఎస్ విద్యార్థులు నసా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ఎస్బిఎస్ పాఠశాల విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. ప్రిన్సిపల్ పి వెంకట్రావు ఆధ్వర్యంలో ఓం శాంతి వారితో కలిపి విద్యార్థులు ర్యాలీని కేటీ రోడ్డు లో నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు సేవించడం వలన జ్ఞానాన్ని కోల్పోతామని, వాటితో అనేక రకాలైన దుష్పరిమానాలు చోటు చేసుకుంటాయని వీటిని ప్రజలందరూ దూరంగా ఉండాలని విద్యార్థుల పలు స్లోగన్ల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలిపారు.
Ratnala Ramesh
మత్తు పదార్థాలకు ప్రజల దూరంగా ఉండాలని పలు స్లోగన్ల ద్వారా తెలిపిన ఎస్ బి ఎస్ విద్యార్థులు నసా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో గల ఎస్బిఎస్ పాఠశాల విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. ప్రిన్సిపల్ పి వెంకట్రావు ఆధ్వర్యంలో ఓం శాంతి వారితో కలిపి విద్యార్థులు ర్యాలీని కేటీ రోడ్డు లో నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు సేవించడం వలన జ్ఞానాన్ని కోల్పోతామని, వాటితో అనేక రకాలైన దుష్పరిమానాలు చోటు చేసుకుంటాయని వీటిని ప్రజలందరూ దూరంగా ఉండాలని విద్యార్థుల పలు స్లోగన్ల ద్వారా ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రాన అయ్యులను పరామర్శించిన బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి.. బొబ్బిలి నియోజకవర్గం తేదీ 09-08-2026 విజయనగరం జిల్లా జనసేన సీనియర్ నాయకులు గుర్రానా అయ్యులపై కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసిపి ప్రభుత్వం దాడి చేసిన విషయం తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ అప్పలస్వామి గారు అయ్యలు స్వగృహంలో వారిని పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని బొబ్బిలి నియోజకవర్గం ఎల్లవేళలా అండగా ఉంటుందని బొబ్బిలి నియోజకవర్గం నుంచి అయ్యలు గారిని కలవడానికి లెంక రమేష్ గారు, ఉల్లి సంతోష్ కుమార్ పొట్నూరు జనార్దహనరావు,కొటేడ సురేష్,గొల్లపల్లి జాను, దాకారపు చంద్రమౌళి, పాచిపెంట మండలం నుంచి మాదిరెడ్డి సతీష్ జన సైనికులు పాల్గొన్నారు..4
- విజయనగరం: సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ఉద్రిక్తత నెలకొంది విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్లు తమ కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించి తీర్చాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కలెక్టరేట్ ముట్టడిలో పోలీసులకు ఆశ వర్కర్లకు కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో సిఐటియు, జిల్లా ఆశా వర్కర్లు, తదితర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి : క్రైస్తవ దళిత ప్రజా సంఘాల స్థానిక కలెక్టరేట్ వద్ద డిమాండ్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి 1950 రాష్ట్రపతి ఉత్తర వలలో పేరా త్రిను రద్దు చేయాలి 12 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న రాజ్యాంగ విరుద్ధమైన మత మార్పిడి నిరోధక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త నిరసనలలో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద తెలుగు రీజియన్ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇండియా వారి పిలుపుమేరకు బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ 1950లో ఆగస్టు 10న భారత రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యాంగం షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వులు పేరా నెంబర్ 3 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైనదని ఆ ప్రజాస్వామికమైనదని అన్నారు ఎవరైనా స్వీకరించవచ్చు అనే భారత రాజ్యాంగం చెబుతూ ఉంటే ఎస్సీలు మాత్రమే క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ముస్లిం మతానికి వెళ్లిన ఎస్సీ హోదా ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ 15 ప్రకారము మతం, కులం ప్రాంతం లింగం ఆధారంగా వివక్షత చూపరాదని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులు చట్టాలు సమాన రక్షణ అందరికీ కల్పించాలని ఆర్టికల్ 21 ద్వారా జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పిస్తున్న ఈ ప్రాథమిక హక్కులకు ఈ ఉత్తరము తీవ్ర విఘాతాన్ని కలిగించిందని తెలిపారు. మతం మారినంత మాత్రాన కులము మారదని కుల వివక్షత అంటరానితనం వివిధ రూపాల్లో కొనసాగుతూ ఉందని జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ చిదంబరం కమిషన్ కాకా కమిషన్ నివేదికలు ఇచ్చిన నేటికీ దళిత క్రైస్తవులు ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు గురవుతున్నారు. అంతేకాకుండా గత 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఉన్న రెడ్డి పిటిషన్లు విచారణకు నోచుకోకపోవడం తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఉన్న రెడ్ పిటిషన్లను పరిష్కరించేందుకు తగిన చర్యలు చూపించాలని కోరారు విశాఖపట్నం ఆర్చ్ డయాసిస్ ప్రతినిధి విజయనగరం డీనరీ మత గురువు ఫాదర్ అంతయ్య మాట్లాడుతూ భారతదేశంలో 12 రాష్ట్రాల్లో తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాలు రద్దు చేయాలని అందుకొనుగుణంగా కేంద్రానికి సిఫార్సు చేయాలని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి వినతి వినతి పత్రాలు దేశమంతా ఇస్తున్నట్లు తెలియజేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కన్వీనర్ పాస్టర్ ప్రమాదం మాట్లాడుతూ మతం మారిన కుల వ్యవస్థ కుల వ్యవక్షత కొనసాగుతున్నది అనేది సామాజిక వాస్తవం దళిత క్రైస్తవులపై అనేక రకాలైన దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయి ఈ క్రమంలో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. 2023లో 734 సంఘటనలు 2024లో 834 సంఘటనలు 2025లో దాదాపు 900 సంఘటనలు నమోదు అయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తెలియజేస్తున్నది. ప్రతి ఏటా పెరుగుతున్న దాడులు పట్ల క్రైస్తవ మైనారిటీ సమాజం ఆందోళన చెందుతుందన్నారు. కార్యక్రమంలో పీపుల్స్ యాక్షన్ ఫోరం అసిస్టెంట్ డైరెక్టర్ ఫాదర్ సింహరాయులు, వివిధ క్రైస్తవ సంఘ మత పెద్దలు యమ్మల రవి, కె థామస్, ఉర్లపు చిరంజీవి, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ జిల్లా అధ్యక్షులు లండ రాజబాబు, దళిత బహుజన శ్రామిక్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కే సిహెచ్ బంగారు రాజు, జిల్లా కార్యదర్శి ఎం పి రాజు సివిఎంసి జిల్లా కన్వీనర్ కె జగదీష్ , సోషల్ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ కోరుకొండ వరలక్ష్మి, అంకురం సంఘం ఫోరం రమణ, రమణ నిరీక్షణ ప్రసాద్, వివిధ సంఘాల ప్రతినిధులు పి సత్యవతి, సియాధుల పార్వతి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ప్రధానమంత్రి కి పంపించే వినత పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అందించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రైస్తవ సంఘాల, దళిత ఆదివాసి సంఘాల, మానవ హక్కు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.1
- 2025 డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐ విచారణ జరపాలి: వైసీపీ 2025 డీఎస్సీ నియామక ప్రక్రియలో జరుగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్య లింగం డిమాండ్ చేశారు. ఈ మేరకు వైసీపీ శ్రేణులతో సోమవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు నుండి స్ధానిక తాహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ తలపెట్టి, రెవెన్యూ అధికారులకు వినతి ఇచ్చారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలన్నారు. జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఫాల్గుణ తదితరులు పాల్గొన్నారు.1
- కఠోర శ్రమతోనే విజయం సాధ్యం: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు స్థానిక విజ్జి స్టేడియంలో కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎఆర్ దామోదర్ ప్రారంభించారు. కఠోర శ్రమ, అంకితభావంతో క్రీడల్లో రాణించాలని కలెక్టర్ క్రీడాకారులకు సూచించారు. మేజర్ ధ్యాన్‌చంద్‌ను ఆదర్శంగా తీసుకుని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలను కలెక్టరేట్‌లో ఘనంగా సత్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్రీడా అధికారులు, అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.3
- ఆదివాసీల అభ్యున్నతి కూటమి ప్రభుత్వంతోనే : ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో మంత్రి సంధ్యారాణి అరకులోయ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ ఆదివాసీ దినోత్సవంను సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, పాడేరు ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ స్ధానిక వేషధారణలో పాల్గొన్నారు. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. విద్యార్ధినుల సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. టీడీపీ అరకు ఇంఛార్జ్, ఆర్టీసీ ప్రాంతీయ జోన్ చైర్మన్ దొన్నుదొర, పాడేరు ఇంఛార్జ్ గిడ్డి ఈశ్వరమ్మ, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్,ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డా. వంపూరు గంగులయ్య, మాజీ ఎస్సీ, ఎస్టీ కమీషన్ సభ్యుడు సివేరి అబ్రహం, బీజేపీ నాయకుడు కురస ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.2
- లక్కిడాం గ్రామంలో సీసీ రోడ్లు, కాలువలు ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని లక్కీడాం గ్రామంలో 127. 50 లక్షల ఖర్చుతో నిర్మించిన సిసి రోడ్లు కాలువలను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరనాయుడు తదితరులు పాల్గొన్నారు.1