logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పరిధిలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో గురువారం ఒక నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఆలయంలోకి వచ్చిన భక్తులు వెంటనే పామును గమనించి దేవస్థాన సిబ్బందికి సమాచారం అందించారు. ఇటీవల ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలుమార్లు పాములు సంచరిస్తుండటంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ జగదీష్ హుటాహుటిన అక్కడికి చేరుకుని నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పాముకు ఎటువంటి హాని కలగకుండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టారు. ఆలయ పరిసరాల్లో పాముల సంచారాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలని భక్తులు దేవస్థాన అధికారులను కోరుతున్నారు.

1 hr ago
user_సిరిసిల్ల స్వరం
సిరిసిల్ల స్వరం
సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
1 hr ago

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పరిధిలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో గురువారం ఒక నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఆలయంలోకి వచ్చిన భక్తులు వెంటనే పామును గమనించి దేవస్థాన సిబ్బందికి సమాచారం అందించారు. ఇటీవల ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలుమార్లు పాములు సంచరిస్తుండటంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ జగదీష్ హుటాహుటిన అక్కడికి చేరుకుని నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పాముకు ఎటువంటి హాని కలగకుండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టారు. ఆలయ పరిసరాల్లో పాముల సంచారాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలని భక్తులు దేవస్థాన అధికారులను కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పరిధిలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో గురువారం ఒక నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఆలయంలోకి వచ్చిన భక్తులు వెంటనే పామును గమనించి దేవస్థాన సిబ్బందికి సమాచారం అందించారు. ఇటీవల ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలుమార్లు పాములు సంచరిస్తుండటంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ జగదీష్ హుటాహుటిన అక్కడికి చేరుకుని నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పాముకు ఎటువంటి హాని కలగకుండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టారు. ఆలయ పరిసరాల్లో పాముల సంచారాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలని భక్తులు దేవస్థాన అధికారులను కోరుతున్నారు.
    1
    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పరిధిలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో గురువారం ఒక నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఆలయంలోకి వచ్చిన భక్తులు వెంటనే పామును గమనించి దేవస్థాన సిబ్బందికి సమాచారం అందించారు. ఇటీవల ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలుమార్లు పాములు సంచరిస్తుండటంతో భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో కొంతసేపు భయాందోళన వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న పట్టణానికి చెందిన స్నేక్ క్యాచర్ జగదీష్ హుటాహుటిన అక్కడికి చేరుకుని నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పాముకు ఎటువంటి హాని కలగకుండా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టారు. ఆలయ పరిసరాల్లో పాముల సంచారాన్ని నివారించడానికి తగిన చర్యలు చేపట్టాలని భక్తులు దేవస్థాన అధికారులను కోరుతున్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు, సంకల్పాలు నిర్వహించిన అనంతరం భక్తులు ఈ ప్రదక్షిణను ప్రారంభించారు. బెజ్జంకి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృప కోసం ప్రార్థనలు చేశారు. “ఓం లక్ష్మీనరసింహాయ నమః” నామస్మరణతో పాటు భజనలు, కీర్తనలు చేస్తూ భక్తులు గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశారు. కొండ లేదా దేవాలయాన్ని దైవ స్వరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణ చేయడం అనే పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా, భక్తులు ఆలయ ముఖద్వారం వద్ద ప్రార్థనలు చేసి, కొండను కుడివైపున ఉంచుకుంటూ సవ్యదిశలో నడిచి ప్రదక్షిణ పూర్తి చేశారు. చాలామంది భక్తులు పాదరక్షలు లేకుండా నడుస్తూ దైవనామ స్మరణలో పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలు, భజనలతో ఆలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటం ఆనందదాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా, భక్తి భావంతో విజయవంతంగా ముగిసింది.
    4
    బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తెల్లవారుజామున ఆలయ ప్రవేశ ద్వారం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు, సంకల్పాలు నిర్వహించిన అనంతరం భక్తులు ఈ ప్రదక్షిణను ప్రారంభించారు. బెజ్జంకి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృప కోసం ప్రార్థనలు చేశారు.

“ఓం లక్ష్మీనరసింహాయ నమః” నామస్మరణతో పాటు భజనలు, కీర్తనలు చేస్తూ భక్తులు గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశారు. కొండ లేదా దేవాలయాన్ని దైవ స్వరూపంగా భావించి భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణ చేయడం అనే పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగంగా, భక్తులు ఆలయ ముఖద్వారం వద్ద ప్రార్థనలు చేసి, కొండను కుడివైపున ఉంచుకుంటూ సవ్యదిశలో నడిచి ప్రదక్షిణ పూర్తి చేశారు. చాలామంది భక్తులు పాదరక్షలు లేకుండా నడుస్తూ దైవనామ స్మరణలో పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణలు, భజనలతో ఆలయ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.

ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామివారి అనుగ్రహం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతుండటం ఆనందదాయకమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా, భక్తి భావంతో విజయవంతంగా ముగిసింది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • నగరంలోని 47వ డివిజన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, ఏ ఒక్క అసలైన ఓటరుకూ అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు. మ్యాపింగ్ కాని ఓటర్లు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను బీఎల్ఏలు దగ్గరుండి చూసుకోవాలని ఆయన సూచించారు. మ్యాపింగ్ అయిన ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలను స్వయంగా నింపించి, బీఎల్ఓల ద్వారా అప్‌లోడ్ చేయించాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారమ్‌లు నింపి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ లిస్ట్‌లో ఓటు నమోదు కాదని, కాబట్టి ప్రతి ఎన్యూమరేషన్ ఫారమ్ తప్పకుండా నింపించి ఇవ్వాలని బీఎల్ఏలకు స్పష్టమైన సూచనలు చేశారు. అలాగే, బీఎల్ఓలతో కలిసి బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా ఎన్యూమరేషన్ పత్రాలు తప్పకుండా నింపించి ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, బీఎల్ఓ సునీత, బీఎల్ఓ సూపర్ వైజర్ జమున, శ్రీనివాస్ గౌడ్, కేశవ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    నగరంలోని 47వ డివిజన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, ఏ ఒక్క అసలైన ఓటరుకూ అన్యాయం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.

మ్యాపింగ్ కాని ఓటర్లు, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను బీఎల్ఏలు దగ్గరుండి చూసుకోవాలని ఆయన సూచించారు. మ్యాపింగ్ అయిన ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలను స్వయంగా నింపించి, బీఎల్ఓల ద్వారా అప్‌లోడ్ చేయించాలని ఆదేశించారు. ఎన్యూమరేషన్ ఫారమ్‌లు నింపి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ లిస్ట్‌లో ఓటు నమోదు కాదని, కాబట్టి ప్రతి ఎన్యూమరేషన్ ఫారమ్ తప్పకుండా నింపించి ఇవ్వాలని బీఎల్ఏలకు స్పష్టమైన సూచనలు చేశారు.

అలాగే, బీఎల్ఓలతో కలిసి బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా ఎన్యూమరేషన్ పత్రాలు తప్పకుండా నింపించి ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్, బీఎల్ఓ సునీత, బీఎల్ఓ సూపర్ వైజర్ జమున, శ్రీనివాస్ గౌడ్, కేశవ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించబడదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఓటరు జాబితా ప్రక్షాళన చేయడమేనని శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలో 316 పోలింగ్ కేంద్రాలకు 316 మంది బీఎల్‌వోలు, 32 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. నియోజకవర్గంలో మొత్తం 2,26,250 మంది ఓటర్లు ఉండగా, వారిలో రెండు లక్షల మందికి పైగా ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. సుమారు 24 వేల మంది ఓటర్ల మ్యాపింగ్ ఇంకా జరగాల్సి ఉండగా, 47 వేల మంది ఓటర్ల మ్యాపింగ్‌లో సవరణలు అవసరమని గుర్తించారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మ్యాపింగ్ డేటా ఆధారంగా బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించి, ఓటర్లకు ముద్రిత ప్రతులను అందజేస్తారని తెలిపారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని బీఎల్‌వోలకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
    2
    జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు కూడా ఓటరు జాబితా నుంచి తొలగించబడదని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామంలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. ఓటర్లకు ఫారాల పంపిణీ, వివరాల నమోదు, అవగాహన కల్పన వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఓటరు జాబితా ప్రక్షాళన చేయడమేనని శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలో 316 పోలింగ్ కేంద్రాలకు 316 మంది బీఎల్‌వోలు, 32 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. నియోజకవర్గంలో మొత్తం 2,26,250 మంది ఓటర్లు ఉండగా, వారిలో రెండు లక్షల మందికి పైగా ఓటర్ల మ్యాపింగ్ పూర్తయింది. సుమారు 24 వేల మంది ఓటర్ల మ్యాపింగ్ ఇంకా జరగాల్సి ఉండగా, 47 వేల మంది ఓటర్ల మ్యాపింగ్‌లో సవరణలు అవసరమని గుర్తించారు. కొత్తగా ఓటరుగా నమోదు కావాలనుకునే వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మ్యాపింగ్ డేటా ఆధారంగా బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిర్వహించి, ఓటర్లకు ముద్రిత ప్రతులను అందజేస్తారని తెలిపారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలను అందజేయాలని, ఓటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని బీఎల్‌వోలకు సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిబంధనల ప్రకారం పనిచేయాలని ఆయన ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
  • కోరిన కోర్కెలు తీర్చే వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమన్న గుడిలో కోడెనాగు ప్రత్యక్షమై భక్తులు, ఆలయ సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో భయపడిన ఆలయ అధికారులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. దాదాపు రెండు గంటల పాటు కష్టపడి స్నేక్ క్యాచర్ జగదీష్ ఆ కోడెనాగును పట్టుకున్నారు. పట్టుకున్న అనంతరం జగదీష్ ఆ కోడెనాగును అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
    1
    కోరిన కోర్కెలు తీర్చే వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన భీమన్న గుడిలో కోడెనాగు ప్రత్యక్షమై భక్తులు, ఆలయ సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనతో భయపడిన ఆలయ అధికారులు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. దాదాపు రెండు గంటల పాటు కష్టపడి స్నేక్ క్యాచర్ జగదీష్ ఆ కోడెనాగును పట్టుకున్నారు. పట్టుకున్న అనంతరం జగదీష్ ఆ కోడెనాగును అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    23 min ago
  • కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ శివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భిక్కనూరు గ్రామానికి చెందిన 45 ఏళ్ల రమేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. రమేశ్ గౌడ్ తో పాటు మరో నలుగురు ఆటోలో ప్రయాణిస్తుండగా, ఒక కంటైనర్ లారీ వారి వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రమేశ్ గౌడ్ తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్ శివారులోని 44వ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భిక్కనూరు గ్రామానికి చెందిన 45 ఏళ్ల రమేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

రమేశ్ గౌడ్ తో పాటు మరో నలుగురు ఆటోలో ప్రయాణిస్తుండగా, ఒక కంటైనర్ లారీ వారి వాహనాన్ని ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రమేశ్ గౌడ్ తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    3 hrs ago
  • యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో శాంతినగర్ నుండి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద విద్యార్థులు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై నాటికలు ప్రదర్శించారు. అలాగే పోస్టర్ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొని, హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఇన్స్పెక్టర్ కోరారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన శిక్షలను వివరించారు. చెడు స్నేహితుల ప్రభావం, సామాజిక ఒత్తిళ్లు యువతను డ్రగ్స్ వైపు మళ్లించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, వాటికి దూరంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం విద్య, భవిష్యత్ కెరీర్, కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 8712671111కు లేదా సమీప పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
    4
    యాంటీ-డ్రగ్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో శాంతినగర్ నుండి గాంధీ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ఒక ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ చౌరస్తా వద్ద విద్యార్థులు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై నాటికలు ప్రదర్శించారు. అలాగే పోస్టర్ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొని, హ్యూమన్ చైన్ ఏర్పాటు చేసి యాంటీ-డ్రగ్ ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు, యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ విద్యలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని ఇన్స్పెక్టర్ కోరారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక దుష్పరిణామాలపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడంతో పాటు, ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా, విక్రయాలకు సంబంధించిన చట్టపరమైన శిక్షలను వివరించారు. చెడు స్నేహితుల ప్రభావం, సామాజిక ఒత్తిళ్లు యువతను డ్రగ్స్ వైపు మళ్లించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, వాటికి దూరంగా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మాదక ద్రవ్యాల వినియోగం విద్య, భవిష్యత్ కెరీర్, కుటుంబం మరియు సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్‌లైన్ 8712671111కు లేదా సమీప పోలీస్ అధికారులకు తెలియజేయాలని సూచించారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి గ్రామం సమీపంలోని ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం, తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన షేక్ బాజీబాబా నడుపుతున్న ప్లైవుడ్ లోడు లారీ బెంగళూరు నుండి శ్రీకాళహస్తి సమీపంలోని చింపేడు గ్రామంలోని కట్టెల ఫ్యాక్టరీకి బయలుదేరింది. ఇదే సమయంలో యాదమరి మండలం పెరుమల్లపల్లి గ్రామం నుండి తిరుపతిలో బంధువుల వివాహానికి వెళ్తున్న ఆటో గాదంకి ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 12:55 గంటల ప్రాంతంలో ముందుగా వెళ్తున్న లారీ ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండా అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, దాని వెనుక వస్తున్న ఆటో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తవణంపల్లి మండలం ఏనుగుంటపల్లికి చెందిన యనమల మాధవి (40), ఆమె కుమార్తె మేఘన (15) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యాదమరి మండలం పెరుమల్లపల్లికి చెందిన పులకింటి రాజశేఖర్ (25)ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదంలో పులకింటి నవీన్ (14), కొమ్ము విష్ణు (19), యనమల సూరి (17), పులకింటి బేబి (50), పులకింటి చిన్నబ్బ (50), పులకింటి రఘు (55), చాముండేశ్వరి (30) మరియు ఆటో డ్రైవర్ పులకింటి సుబ్రమణ్యం (50) గాయపడ్డారు. ప్రస్తుతం వారికి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఎలాంటి ఇండికేటర్లు ఇవ్వకుండా వాహనాన్ని నిలిపివేయడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్‌పై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పాకాల పోలీసులు తెలిపారు.
    1
    తిరుపతి జిల్లా పాకాల మండలం గాదంకి గ్రామం సమీపంలోని ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద బుధవారం జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

పోలీసుల వివరాల ప్రకారం, తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన షేక్ బాజీబాబా నడుపుతున్న ప్లైవుడ్ లోడు లారీ బెంగళూరు నుండి శ్రీకాళహస్తి సమీపంలోని చింపేడు గ్రామంలోని కట్టెల ఫ్యాక్టరీకి బయలుదేరింది. ఇదే సమయంలో యాదమరి మండలం పెరుమల్లపల్లి గ్రామం నుండి తిరుపతిలో బంధువుల వివాహానికి వెళ్తున్న ఆటో గాదంకి ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్దకు చేరుకుంది. మధ్యాహ్నం 12:55 గంటల ప్రాంతంలో ముందుగా వెళ్తున్న లారీ ఎలాంటి హెచ్చరికలు ఇవ్వకుండా అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, దాని వెనుక వస్తున్న ఆటో లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న తవణంపల్లి మండలం ఏనుగుంటపల్లికి చెందిన యనమల మాధవి (40), ఆమె కుమార్తె మేఘన (15) సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన యాదమరి మండలం పెరుమల్లపల్లికి చెందిన పులకింటి రాజశేఖర్ (25)ను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదంలో పులకింటి నవీన్ (14), కొమ్ము విష్ణు (19), యనమల సూరి (17), పులకింటి బేబి (50), పులకింటి చిన్నబ్బ (50), పులకింటి రఘు (55), చాముండేశ్వరి (30) మరియు ఆటో డ్రైవర్ పులకింటి సుబ్రమణ్యం (50) గాయపడ్డారు. ప్రస్తుతం వారికి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఎలాంటి ఇండికేటర్లు ఇవ్వకుండా వాహనాన్ని నిలిపివేయడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్‌పై ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పాకాల పోలీసులు తెలిపారు.
    user_Srinivas Nerella
    Srinivas Nerella
    Yoga instructor మల్యాల, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.