Shuru
Apke Nagar Ki App…
కేశంపేటలో ఎండల ఎఫెక్ట్ – 42°C వైపు ఉష్ణోగ్రతలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేశంపేట మండలంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం నుంచే ఉక్కపోతలు ప్రారంభమై, 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు భానుడు భగభగ మంటున్నాడు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వద్ద ఉండగా, మధ్యాహ్నానికి 42 డిగ్రీల వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.
S M S R R
కేశంపేటలో ఎండల ఎఫెక్ట్ – 42°C వైపు ఉష్ణోగ్రతలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కేశంపేట మండలంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం నుంచే ఉక్కపోతలు ప్రారంభమై, 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు భానుడు భగభగ మంటున్నాడు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల వద్ద ఉండగా, మధ్యాహ్నానికి 42 డిగ్రీల వరకు పెరిగే సూచనలు ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగుతూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కరీంనగర్ వైపు నుండి పెద్దపల్లి కి వస్తున్న ఎక్సైజ్ కార్యాలయ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది అతివేగంతో వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఇంజన్ ముందు భాగం బ్లాస్ట్ అవ్వగా వాహనం స్థానభ్రంశం చెందింది. వాహనంలో ఎక్సైజ్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సర్వర్ డ్రైవ్ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు ప్రమాదం జరిగిన సమయంలో ఇతర వాహనాలు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు1
- నల్గొండ నల్ల రిబ్బన్లతో రోడ్డెక్కిన కాంగ్రెస్ శ్రేణులు.. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు... తెలంగాణను పాకిస్తాన్ విభజనతో పోల్చడం దుర్మార్గ రాజకీయమని మండిపడ్డ పున్న కైలాష్ నేత.! సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కల సాకారం చేసింది... బిజెపి తెలంగాణపై విషం చిమ్ముతుంది.. అనేకమంది బలిదానాలు పోరాటాలు, త్యాగాలను అవహేళన చేస్తుంది... ఖబర్దార్ బిజెపి నాయకుల్లారా! తెలంగాణలో బిజెపి పార్టీని భూస్థాపితం చేస్తాం అంటూ హెచ్చరిక.. మహిళా బిల్లు ముసుకులో బీజేపీ కాంగ్రెస్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ చర్చలు పక్క ద్రోవ పట్టిస్తుంది... త్వరలో తెలంగాణలో బిజెపి గద్దెలు కూలుతాయని హెచ్చరిక... డిలిమిటేషన్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం లేకే బీజేపీ డ్రామాలు చేస్తోందని విమర్శ... తేజస్వి సూర్య చేసిన వాక్యాలపై మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్.. కార్యక్రమంలో ఎండి ముంతాజ్ అలీ, పేరిక వెంకటేశ్వర్లు, నోముల జనార్ధన్, కోమటిరెడ్డి అంజిరెడ్డి, వేముల గోపీనాథ్, అంబల హరీష్, పల్లా రవితేజతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.1
- అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నాడు స్థానిక ఫైర్ స్టేషన్ నుండి డీఎఫ్ఓ వేణు జండా ఊపి ర్యాలీ ప్రారంభించారు వాహనాల ర్యాలీని కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకుంది ఎన్ డి ఆర్ ఎఫ్ అగ్నిమాపక శకటాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి కొత్త బస్టాండ్ మీదుగా ఆటోనగర్ చేరుకొని అక్కడినుండి మళ్లీ పోలీస్ స్టేషన్ చేరుకున్నాయి డీఎఫ్ఓ వేణు ఎస్ ఎఫ్ ఓ వెంకటేష్ ఎస్ ఎఫ్ ఓ ప్రశాంత్ అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలలో అగ్ని ప్రమాదాల నివారణ భద్రత చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎల్ ఎఫ్ ఎఫ్ ప పి నరసయ్య ఎఫ్ ఎఫ్ టి ఎండి కలలుద్దీన్ ఎఫ్ ఎఫ్ ఫరీద్ ఖాన్ ఎఫ్ ఎఫ్ ఎన్ నరేష్ కే సురేష్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం స్వామి హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎం ప్రదీప్ హెచ్ జి ఎఫ్ ఎఫ్ ఎస్ నాగరాజు హెచ్ జి ఎఫ్ ఎఫ్ యు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు1
- Devi5
- Post by Mallikarjuna1
- మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండలం పరిధిలో కంబలదిన్నె గ్రామంలో వెలసిన నూతన ఆలయంలో నందు శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధన గురుపూజ మహోత్సవం ఆహ్వానం 26వ కంబలదిన్నె గ్రామంలో జరగబోయే శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవం 27వ తేదీ నాడు ఏప్రిల్ రథోత్సవం ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి ఉంటుంది కావున రాథోత్సవాన్ని ప్ర మా లలు ధరించిన 19 మంది ప్రతి సంవత్సరం దరిస్తున్నారు నేటి కి దాదాపుగా 12 సంవత్సరాలు కావొస్తుంది ప్రతి ఏటా స్వాములు కొత్తగా మాలలు దరిస్తూ ఉంటారు వివరాలకు వస్తే ఇలా ఉన్నాయి స్వామి పేరులు వచ్చేసి గురు స్వాములు జాల్వడప్ప స్వామి దేవేంద్ర స్వామి వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచ్ఈరన్న స్వామి గంగన్న స్వామి ఇరు స్వామి సురేష్ స్వామి రఘు స్వామి చిన్న రెడ్డి స్వామి ప్రకాసుస్వామి బ్రహ్మయ్య స్వామి స్వామి మాలలు ధరించారు1
- సంగారెడ్డి మండలం ఫసల్ వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఈనెల 20వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా ఆద్య శిలా స్థాపనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి మహేశ్వర శర్మ సిద్ధాంతి వెల్లడించారు. శనివారం ఆశ్రమంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉదయం 10 గంటలకు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుందని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు శిలలపై బీజాక్షరాలు భక్తులతో వ్రాయించే కార్యక్రమం జరుగుతుందన్నారు.1
- నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై *నేషనల్ హైవే అధికారులు* హుటాహుటిన రంగంలోకి.. *బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగవర్షిత్ రెడ్డి* ఫిర్యాదుతో శుక్రవారం చీఫ్ ఇంజనీర్ ధర్మారెడ్డి, రీజనల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ నేతృత్వంలోని బృందం ఆకస్మిక తనిఖీలు... పరిశీలించిన అధికారులు పనుల్లో లోపాలు ఉన్నాయన్న ప్రాథమిక సమాచారం... అధికారులు పలు ప్రాంతాల నుంచి మట్టి,మెటీరియల్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినట్లు సమాచారం... నివేదికలో అవకతవకలు తేలితే పెద్దఎత్తున చర్యలు తప్పవని, కాంట్రాక్టర్లపై ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని అధికార వర్గాల్లో చర్చ.? నాణ్యత లేని మట్టితో రోడ్లు నిర్మిస్తున్నారని, నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు లాభాలు చేకూరుస్తున్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు... నల్లగొండ చుట్టుపక్కల చెరువుల నుంచి మట్టిని తరలించి హైవే పనులకు వినియోగిస్తున్నారని, ఇది భవిష్యత్తులో రోడ్డు కుంగిపోవడానికి దారితీస్తుందని వర్షిత్ రెడ్డి ఫైర్... "రాష్ట్రానికి ఆర్ అండ్ బీ మంత్రి అయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లాలోనే ఇలా జరుగుతుంటే మిగతా జిల్లాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి" అంటూ ఘాటు విమర్శలు... ఈ వ్యవహారం జిల్లాలో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారగా, మంత్రి సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్... సమాధానం రాకపోతే హైవే పనుల వద్ద మహాధర్నా, చలో కలెక్టరేట్, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని *బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి* హెచ్చరిక చేశారు...☝️1
- 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలలో షెడ్యూల్డ్ కులములు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ గురుకులాలలో, విద్యాలయాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్య విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని, వసతి గృహాలలో మరమ్మత్తు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ గురుకులాలలో, వసతి గృహాలలో వంటగది, పారిశుధ్యం, మరమ్మత్తు పనులు చేపడుతామని, విద్యార్థులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని, రైతుల రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఓ సురేష్ , గృహ నిర్మాణ శాఖాధికారి మాణిక్యం, డిడబ్ల్యుఓ హేమ భార్గవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..1