logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన చైర్ పర్సన్ రెహనా కమల్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కొమ్మేపల్లిలో ఉండటంతో,పట్టణంలోని చెత్తను ఆ యార్డు లో తరలిస్తున్నారు. చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన రెహానా కమల్ శనివారం సాయంత్రం డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. చెత్త ఎక్కువగా ఉండటంతో జెసిబి సహాయంతో లెవెల్ చేయించి, ప్లాస్టిక్ ఎంత మేరకు వస్తుంది,రోజుకి ఎన్ని ట్రాక్టర్లు వస్తున్నాయి అని, రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఆదాయాన్ని పెంచాలని, ప్లాస్టిక్ ను వేరు చేయాలని, మున్సిపాలిటీ అభివృద్ధిలో నడవాలి అంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ, సిబ్బంది బాబురావు ఉన్నారు.

22 hrs ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
22 hrs ago
3ddb6cb6-5d88-49bb-9a34-4c38618903cd

డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన చైర్ పర్సన్ రెహనా కమల్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కొమ్మేపల్లిలో ఉండటంతో,పట్టణంలోని చెత్తను ఆ యార్డు లో తరలిస్తున్నారు. చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన రెహానా కమల్ శనివారం సాయంత్రం డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు. చెత్త ఎక్కువగా ఉండటంతో జెసిబి సహాయంతో లెవెల్ చేయించి, ప్లాస్టిక్ ఎంత మేరకు వస్తుంది,రోజుకి ఎన్ని ట్రాక్టర్లు వస్తున్నాయి అని, రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. ఆదాయాన్ని పెంచాలని, ప్లాస్టిక్ ను వేరు చేయాలని, మున్సిపాలిటీ అభివృద్ధిలో నడవాలి అంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ, సిబ్బంది బాబురావు ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
  • మహిళా బిల్లుకు కాంగ్రెస్ అడ్డుగోడ..? నేలకొండపల్లిలో బీజేపీ ఆగ్రహ జ్వాలలు.. పొట్టి శ్రీరాములు సెంటర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు. మహిళల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపాటు నేలకొండపల్లి బిజెపి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్... మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నేలకొండపల్లిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకోవటంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకుడు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి, సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్, అసలు సమయంలో మాత్రం మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని తీవ్రంగా దుయ్యబట్టారు. బిజెపి జిల్లా నాయకుడు. నున్న రవి కుమార్ మాట్లాడుతూ.. దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్న రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే మహిళల హక్కులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ వైఖరిని దేశవ్యాప్తంగా మహిళలు ఖండిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళల గౌరవం, సమాన హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని, అన్ని పక్షాలను ఏకం చేసి మహిళా బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు బిజెపి సీనియర్ నాయకులు భావనాసి దుర్గారావు బిజెపి నాయకులు సూరేపల్లి గ్యానరత్నం కొండ హర్షవర్ధన్ కే స్వామి దాస్ ఎలిగేటి గిరి కందరబోయిన గోపి బిజెపి మైనార్టీ మోర్చా స్టేట్ ఈసీ నెంబర్ ఎస్కే షర్ఫుద్దీన్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ ఎలిగేటి వెంకటేష్ ఎస్సీ మోర్చా గుండె పొంగు క్రాంతి తోకటి నాగ చారి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ నాగరాజు పాల్గొన్నారు.
    3
    మహిళా బిల్లుకు కాంగ్రెస్ అడ్డుగోడ..?
నేలకొండపల్లిలో బీజేపీ ఆగ్రహ జ్వాలలు..
పొట్టి శ్రీరాములు సెంటర్‌లో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం అడ్డుకున్న పోలీసులు.
మహిళల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని మండిపాటు
నేలకొండపల్లి బిజెపి మండల అధ్యక్షుడు
పాగర్తి సుధాకర్...
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు నేలకొండపల్లిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకోవటంతో తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకుడు పాగర్తి సుధాకర్  మాట్లాడుతూ, దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు న్యాయం చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. మహిళల అభివృద్ధి, సాధికారతపై పెద్ద పెద్ద మాటలు చెప్పే కాంగ్రెస్, అసలు సమయంలో మాత్రం మహిళల హక్కులకు విరుద్ధంగా వ్యవహరించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మహిళల ఆశయాలను నీరుగార్చిందని తీవ్రంగా దుయ్యబట్టారు.
బిజెపి జిల్లా నాయకుడు.
నున్న రవి కుమార్ మాట్లాడుతూ.. 
దశాబ్దాలుగా మహిళలు పోరాడుతున్న రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మహిళల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అదే మహిళల హక్కులను నిర్లక్ష్యం చేయడం అత్యంత దురదృష్టకరమని, ఈ వైఖరిని దేశవ్యాప్తంగా మహిళలు ఖండిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మహిళలే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
మహిళల గౌరవం, సమాన హక్కుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని, అన్ని పక్షాలను ఏకం చేసి మహిళా బిల్లును తప్పనిసరిగా ఆమోదింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు బిజెపి సీనియర్ నాయకులు భావనాసి దుర్గారావు బిజెపి నాయకులు సూరేపల్లి గ్యానరత్నం కొండ హర్షవర్ధన్ కే స్వామి దాస్ ఎలిగేటి గిరి కందరబోయిన గోపి బిజెపి మైనార్టీ మోర్చా స్టేట్ ఈసీ నెంబర్ ఎస్కే షర్ఫుద్దీన్ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు కందరబోయిన వెంకటరమణ ఎలిగేటి వెంకటేష్ ఎస్సీ మోర్చా గుండె పొంగు క్రాంతి తోకటి నాగ చారి ఎస్టి మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ నాగరాజు   పాల్గొన్నారు.
    user_Shivaji Prees Repoter
    Shivaji Prees Repoter
    Nelakondapalli, Khammam•
    12 hrs ago
  • ​.పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ​ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు. ​గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు. మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి
    1
    ​.పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రం నుండి వచ్చిన ఓ నిరుపేద కూలీని దురదృష్టం వెన్నాడింది. తేనె అనుకుని పొరపాటున పురుగుల మందు తాగడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
​
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాకు చెందిన హిడ్మా సోరి (46), మామిడికాయలు కోసే పని నిమిత్తం కురవి మండలం బలపాల గ్రామానికి వలస వచ్చాడు. ప్రతిరోజూ రాత్రి సమయంలో తేనె తాగే అలవాటు ఉన్న హిడ్మా సోరి.. నిన్న రాత్రి 8 గంటల సమయంలో చీకట్లో పొరపాటు పడ్డాడు. తేనె డబ్బాకు బదులుగా పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను తీసి తాగాడు.
​గంట తర్వాత కడుపులో తీవ్రమైన నొప్పి రావడంతో అనుమానం వచ్చి పరిశీలించగా.. తాను తాగింది పురుగుల మందని గుర్తించాడు. వెంటనే తన బంధువులకు విషయం తెలపడంతో, వారు అతడిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తెల్లవారుజామున 1:30 గంటలకు హిడ్మా సోరి తుదిశ్వాస విడిచాడు.
మృతుని అల్లుడు ముడమి దేవా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, మృతుడి కుటుంబం అత్యంత పేదరికంలో ఉండటం, మృతదేహాన్ని ఛత్తీస్‌గఢ్‌కు తరలించే స్తోమత లేకపోవడంతో కురవి పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. కురవి రెండో ఎస్సై జయకుమార్, మృతదేహాన్ని తరలించే ఖర్చుల నిమిత్తం తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీలు హరిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద కూలీ మృతి పట్ల స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    55 min ago
  • PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
    1
    PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by SHOT NEWS
    1
    Post by SHOT NEWS
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో కలిసి స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో కలిసి స్థానిక సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    4 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.