వర్షాభావంతో రైతు కన్నీరు.. జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలి: సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ జూపాడుబంగ్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జూపాడుబంగ్లా కు చెందిన కౌలు రైతు రవీంద్ర 5 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట వర్షాభావంతో పూర్తిగా దెబ్బతిన్నది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరకు ట్రాక్టర్‌తో దున్నవలసి వచ్చినదని అని ఆయన తెలిపారు. పార్టీ నాయకులతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో తక్కువ వర్షపాతం కారణంగా జూపాడుబంగ్లా మండలంలోని రైతులు సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, మినుము, కంది తదితర పంటలు నష్టపోయాయని తెలిపారు. నంద్యాల జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా ఎకరాకు రూ.40 వేల పరిహారం ఇవ్వాలని, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రుణాలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్‌కు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని, 60 ఏళ్లు దాటిన రైతులు, కౌలు రైతులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా మండల కార్యదర్శి ఈ. నరసింహుడు, నందికొట్కూరు మండల కార్యదర్శి సామన్న, పగిడ్యాల మండల కార్యదర్శి గుంపుల త్యాగరాజు, కౌలు రైతు రవీంద్ర, మనోహర్, శరత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వర్షాభావంతో రైతు కన్నీరు.. జూపాడుబంగ్లాను కరువు మండలంగా ప్రకటించాలి: సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ జూపాడుబంగ్లా మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. జూపాడుబంగ్లా కు చెందిన కౌలు రైతు రవీంద్ర 5 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట వర్షాభావంతో పూర్తిగా దెబ్బతిన్నది. చేతికి వచ్చే దశలో ఉన్న పంట ఎండిపోవడంతో చివరకు ట్రాక్టర్‌తో దున్నవలసి వచ్చినదని అని ఆయన తెలిపారు. పార్టీ నాయకులతో కలిసి పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో తక్కువ వర్షపాతం కారణంగా జూపాడుబంగ్లా మండలంలోని రైతులు సాగు చేసిన మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, మినుము, కంది తదితర పంటలు నష్టపోయాయని తెలిపారు. నంద్యాల జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు, కౌలు రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా ఎకరాకు రూ.40 వేల పరిహారం ఇవ్వాలని, రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రుణాలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. రబీ సీజన్‌కు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందించాలని, 60 ఏళ్లు దాటిన రైతులు, కౌలు రైతులకు నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. డిమాండ్లు పరిష్కరించకపోతే రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూపాడుబంగ్లా మండల కార్యదర్శి ఈ. నరసింహుడు, నందికొట్కూరు మండల కార్యదర్శి సామన్న, పగిడ్యాల మండల కార్యదర్శి గుంపుల త్యాగరాజు, కౌలు రైతు రవీంద్ర, మనోహర్, శరత్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
- మార్కాపురం జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాను జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్లో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి ఓటర్లకు సంబంధించిన సాఫ్ట్ కాపీని వారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 8,22,972 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో పురుషులు 4,18,727, మహిళలు 4,07208 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీటిపై ఆగస్టు 30 వ తేది వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం -6, మరణించిన వారిని తొలగించేందుకు ఫారం -7, పేరు, చిరునామా, వయస్సు, వేరే చోటికి మారేందుకు ఫారం -8 ద్వారా ప్రక్రియను నిర్వహిస్తారని తెలిపారు. అక్టోబర్ 3వ తేదిన తుది జాబితా ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని జాబితాలో చేర్చేందుకు అధికారులు, సిబ్బంది అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.1
- రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ ..పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్ల రూ.5కే టిఫిన్ లేదా భోజనం.. పేదలకు కూటమి ప్రభుత్వం అండ1
- ప్రొద్దుటూరు పట్టణంలోని పప్పుల బట్టి వీధిలో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయంలో ఆషాఢ మాసం శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.1
- బ్రిస్బేన్ లో బోనాల పండుగను జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ శుభాకాంక్షలు: కవిత బ్రిస్బేన్ లో బోనాల పండుగను జరుపుకుంటున్న తెలంగాణ బిడ్డలందరికీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేసారు.1
- స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారాల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని తీర్మానం. -లెన్స్‌కార్ట్ అంశంపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం. శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం పట్టణంలో లెన్స్‌కార్ట్ షోరూమ్ ఏర్పాటుకు సంబంధించిన అంశంపై శనివారం అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాల ప్రతినిధులు, స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక చిన్న వ్యాపారుల భవిష్యత్, ఉద్యోగుల ఉపాధి, కార్పొరేట్ సంస్థల ప్రభావం, ప్రభుత్వ శాఖల స్పందన, చట్టబద్ధ అనుమతుల అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, ధర్మవరంలో దశాబ్దాలుగా స్థానిక ఆప్టికల్ వ్యాపారాలపై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ కుటుంబాలు గత తొమ్మిది నెలలుగా తమ ఉపాధి, భవిష్యత్తు మరియు చిన్న వ్యాపారాల పరిరక్షణ కోసం ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి తమ సమస్యలను వివరించినప్పటికీ, ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం పట్ల సమావేశంలో తీవ్ర ఆవేదన వ్యక్తమైంది. స్థానిక వ్యాపారులు మాత్రమే కాకుండా పట్టణంలోని వివిధ వ్యాపార వర్గాలు, కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు కూడా ఈ సమస్యకు మద్దతుగా నిలిచి తమ అభిప్రాయాలను తెలియజేసినప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో నిరాశ, ఆందోళన వ్యక్తమవుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధికి సంబంధించిన అంశాల్లో మరింత సున్నితంగా, బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, సంబంధిత భవనం మరియు వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన భవన నిర్మాణ అనుమతులు, కమర్షియల్ వినియోగ అనుమతులు, ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ అనుమతులు మరియు ఇతర చట్టబద్ధ అనుమతులపై సంబంధిత శాఖలు పూర్తి పారదర్శకతతో విచారణ నిర్వహించి ప్రజలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ఇప్పటికే స్థానిక వ్యాపారులు మున్సిపల్ కమిషనర్, ఆర్‌డీఓ, టౌన్ ప్లానింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సహా పలువురు అధికారులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో పలు సందేహాలకు తావిస్తోందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ప్రజల సమస్యల విషయంలో అధికారులు ఆలస్యం చేయకుండా చట్టబద్ధంగా, నిష్పక్షపాతంగా స్పందించాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే, ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి స్థానిక ప్రజలు, చిన్న వ్యాపారులు, ఉద్యోగుల జీవనోపాధిని కాపాడే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోని పక్షంలో, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఆర్ఎస్పీ, సీపీఐ(ఎంఎల్), సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌బీ, ఎంఆర్పీఎస్తో పాటు అన్ని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్థానిక వ్యాపార సంఘాలు ఐక్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి, స్థానిక చిన్న వ్యాపారులు మరియు ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. బాధితులకు తగిన న్యాయం జరిగే వరకు అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు మరియు స్థానిక వ్యాపారులు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని, త్వరలోనే ఉద్యమ కార్యాచరణను ప్రకటించి ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలను చేపడతామని సమావేశంలో వెల్లడించారు. స్థానిక ఉపాధి, చిన్న వ్యాపారుల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు జంగాలపల్లి పెద్దన్న, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, కాంగ్రెస్ నాయకులు తుంపర్తి పరమేష్, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి యర్రంశెట్టి రమణ, సీపీఐ(ఎంఎల్) నాయకులు పోలా లక్ష్మీనారాయణ, సీఐటీయూ నాయకులు జేవీ రమణ, బీఎస్పీ నాయకులు వినయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగార్జున, ఏఐఎస్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతలయ్య, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు వెంకటేష్తో పాటు స్థానిక ఆప్టికల్ వ్యాపారులు, ఉద్యోగులు మరియు పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. "స్థానిక ఉపాధి – స్థానిక హక్కు", "చట్టం ముందు అందరూ సమానమే", "చిన్న వ్యాపారాల పరిరక్షణే సమాజ అభివృద్ధికి పునాది" అనే నినాదాలతో సమావేశం ముగిసింది.2
- నలగొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గంగ దేవమ్మ గుడి నైట్ నైట్ మట్టి కొడుతున్నారు ఇటుక బట్టీలకు మట్టి అమ్ముతున్నారు అధికారులు యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను1
- సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలి: సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు జూపాడు బంగ్లా మండలం మండ్లెం సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేయాలని సీపీఎం నేత నాగేశ్వరరావు పేర్కొన్నారు. పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి పలువురు రైతులు వచ్చారని అయితే నాలుగు గంటలకే సచివాలయ సిబ్బంది రైతు కేంద్రాలకు తాళం వేసి ఉండడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యమన్నారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసి సంప్రదించిన ఫోన్ ఎత్తలేదని విచారణ వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వీరిని సస్పెండ్ చేయాలన్నారు.1
- జిల్లాలో సుమారు 85,800 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో చేరాయని వెల్లడించిన కలెక్టర్ విజయ సునీత ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా 85800 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో చేరాయని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. వీటిని ఎన్నికల సంఘం అన్ కలెక్టబుల్ గా పరిగణించబడినట్లు పేర్కొన్నారు. జూలై 31వ తేదీ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా పై ఆగస్టు 30 వరకు ఓటర్ల క్లయిములు అభ్యంతరాలు తెలియజేయవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి తుది జాబితా అక్టోబర్ 3 ప్రచురిస్తామన్నారు1
- కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా: రఘునాథ్ రెడ్డి సంక్షేమ, అభివృద్ధి పాలనపై కూటమి ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు భరోసా లభిస్తోందని టీడీపీ నేత రఘునాథ్ రెడ్డి అన్నారు. వేంపల్లి లోని పుల్లయ్య తోట ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరాతీసారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు ద్వారా ప్రతి ఇంటా ఆనందం వ్యక్తం అవుతోందన్నారు.1