Shuru
Apke Nagar Ki App…
*నూతన ఎమ్మార్వో సురేష్ ఘన శాలువాతో సన్మానం. మాజీ సర్పంచ్ * *నూతన ఎమ్మార్వో సురేష్ ఘన సన్మానం* రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఈరోజు మంగళవారం రోజున :21/04/2026: కేంద్రంలోని నూతన నూతన ఎమ్మార్వో సురేష్,ఘన శాలువా కప్పి సన్మానం. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బిళ్ళ మీద పరుశురాములు. శ్రీనివాస్, కంఠం పరశురాం, దొంతి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
Bollam Saireddy జయం న్యూస్ మీడ
*నూతన ఎమ్మార్వో సురేష్ ఘన శాలువాతో సన్మానం. మాజీ సర్పంచ్ * *నూతన ఎమ్మార్వో సురేష్ ఘన సన్మానం* రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఈరోజు మంగళవారం రోజున :21/04/2026: కేంద్రంలోని నూతన నూతన ఎమ్మార్వో సురేష్,ఘన శాలువా కప్పి సన్మానం. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బిళ్ళ మీద పరుశురాములు. శ్రీనివాస్, కంఠం పరశురాం, దొంతి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం, ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాప్యం జరగవచ్చు.. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి నలుగురు అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి గారు ,నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని సమస్యలు పరిష్కారం చేస్తాం.. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు.. ఈ బస్సు ప్రయాణం పేదవాళ్ళకి లైఫ్ లైన్ ఉద్యోగులుగా మీరు ప్రభుత్వం గా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉంది ఆర్టీసీ సంస్థ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం ప్రయాణికుల సౌలభ్యం చూస్తాం.. ఎలాంటి బెషజాలలకు పోకుండా అధికారుల కమిటీ కి మీ సమస్యలు విన్నవించండి.. ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సుభాష్ నగర్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో ఇందిరానగర్ కు చెందిన వృద్దుడు అలువాల అంకయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో బైక్ కు ట్రాక్టర్ తగలగా బైక్ కింద పడింది. తృటిలో ఆ బైకిస్ట్ కు ప్రమాదం తప్పింది. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. అతివేగం అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- జగిత్యాల జిల్లాలో నేడు జరగబోయే కేసీఆర్ బహిరంగ సభకు కొద్దిసేపటి క్రితం కెసిఆర్ చేరుకోవడం జరిగింది కాంగ్రెస్ నాలుగు శతాబ్దాలుగా చేసిన సేవను విడిచి టిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మన ఊరు బడిలో సకల సదుపాయాలు కల్పిస్తూ బంగారు బాటలకు కృషి చేస్తుందని ఈ పాటల పేర్కొన్నారు ఆంగ్ల మాధ్యం కాకుండా తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేసుకుంటూ ఉన్నత శిఖరాలన ఎదిగారని తెలిపారు.1
- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం పంచాయతీ అంకన్నగూడెం సమీప గోదావరి మడుగులో చేపల వేటకు వెళ్లిన కుర్సం నాగేశ్వరరావు (45) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, రాత్రి వరకు గాలించినా మృతదేహం లభించలేదు. మంగళవారం పడవలు, ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు.1
- Post by Tagore1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తులు భక్తుశ్రద్ధలతో మొక్కులను చెల్లించుకున్నారు.1
- ప్రజా సమస్యలు గాలికి వదిలి బలప్రదర్శన దిగిన పాలకపక్షం మరియు ప్రధాన ప్రతిపక్షం. *జీవన్ రెడ్డి చేరిక ద్వార తెలంగాణ ప్రజలతో బిఆర్ఎస్ పార్టీ పేగు బంధం తెగిపోయింది.* *రాజశేఖరరెడ్డి మెప్పు కోసం తెలంగాణ ప్రయోగాలను తాకట్టు పెట్టిన జీవన్ రెడ్డిని బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుచేటు.* రేవంత్ రెడ్డికి ఇన్ని రోజులు గుర్తుకురసని మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇంపుడే ఎందుకుగుర్తుకు వచ్చిందో సామధానం చెప్పాలి గుంజపడుగు హరిప్రసాద్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ జాగృతి, కరీంనగర్. కరీంనగర్ నగరానికి చెందిన తెలంగాణ ఉద్యమకారిణి మరియు జాగృతి నాయకురాలు కొమిరి పద్మ. మరియు మనకోండూర్ మండలానికి కొలిపాక గౌతమి ఆద్వర్యంలో పలువురు నాయకులు మహిళల కవితక్కను తెలంగాణ రాష్టానికి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా తెలంగాణ జాగృతిలో పనిచేస్తామని ఈరోజు తెలంగాణ జాగృతిలో చేరడం జరిగింది. వారికి జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువాలు కప్పి సాదరంగా జాగృతిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 25.న తెలంగాణ ప్రజల ఉజ్వలమైన భవిష్యత్త్ కోసం కవితక్క నూతన రాజకీయ పార్టీ ప్రారంభిస్తారని అ యొక్క పార్టీలో పనిచేయడం కోసం ఇప్పటికే చాలా మంది ముందుకు వస్తున్నారని ఈ రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీలను భారతదేశంలో ఉన్న అనేక జాతీయ అంశాలతోపాటు తెలంగాణ ఒకటని కానీ తెలంగాణ జాగృతి కేవలం ఈ రాష్ట్ర ప్రయోగాలే ప్రధాన అజెండా ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికే మా కృషి ఉంటుందని వారు అన్నారు. తెలంగాణలో ఉన్న పాలకపక్షం మరియు ప్రధాన ప్రతిపక్షం రెండు జాతీయ పార్టీలే ముఖ్యంగా కేసిఆర్ నాయకత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలతో పేగు బంధాన్ని తెంచుకుని జాతీయ రాజకీయలోకి పోయిందని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడ తెలంగాణ ప్రయోగాల విషయంలో పట్టించుకోలేదని. మరో జాతీయ పార్టీ బిజెపికి కూడ ఉత్తర భారతదేశ ప్రయోగాలే ముఖ్యం అని వారు అన్నారు. నిన్నటి రోజున బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ఈ రెండు రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి బల ప్రదర్శన దిగిన సంగతి ప్రజలకు తెలుసని అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు గుర్తుకురాని మేడిగడ్డ ముఖ్యమంత్రి గారికి నిన్ననే గుర్తుకు వచ్చిందని పోని ప్రాజెక్ట్ సంబంధించిన మంచి విషయాలు కానీ, రైతులకు నీళ్ళు అందించే ముచ్చట ఎదైనా చెబుతాడు కావచ్చు అనుకుంటే కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితం అయ్యాడు ముఖ్యమంత్రి. మరి ప్రధాన ప్రతిపక్షం తీరు కూడ అదేవిధంగా ఉంది నిన్న జగిత్యాలలో తెలంగాణకు బద్దవ్యతిరేకి, కేవలం తాను ఒక్కడే ఉండాలి మరెవ్వరూ కూడ ఉండోద్దు అని యువతను రాజకీయంగా అనగదొక్కిన కలం చెల్లిన నాయకుడిని బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని వారి గొయ్యిని వారే తీసుకున్నారు వరుసగా ఓటమిలో హైట్రిక్ కొట్టిన జీవన్ రెడ్డితో బిఆర్ఎస్ కు ఏం లాభం జరుగుతుందో వారే చెప్పాలని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కవితక్క నాయకత్వంలో తెలంగాణ ప్రయోగాల కోసం తెలంగాణలో పేరుకు పోయిన సమస్యల పరిష్కారం కోసం కవితక్క కృషి చేస్తుందని రోజురోజుకు తెలంగాణ జాగృతి ఒక బలపడుతుందని ఈ రాష్ట్రానికి కవితక్క ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.1
- సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. జగిత్యాల సభలో జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన వెంటనే ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించిన తో ఆ హోదాలో జగిత్యాల బిఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్వార్థ, ఆర్థిక ప్రయోజనాలే ప్రధానమని విమర్శించారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలిపారు. రేవంత్ – బీజేపీ మధ్య చంద్రబాబు రాయబారిగా ఉన్నాడని ఆరోపించారు. చంద్రబాబు కాపాడుతాడనే భ్రమలో రేవంత్ ఉన్నాడని చెప్పారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం అసాధ్యమని భావించి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి పంపారని తెలిపారు. టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్‌లో కీలక పదవి దక్కించుకున్నాడని తెలిపారు. అభివృద్ధి కోసం పని చేయాలంటే ముందుగా బీజేపీలో చేరేవారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పై జరుగుతున్న కుట్రలపై ఆ పార్టీ నేతల మౌనం ఎందుకని ప్రశ్నించారు. నాకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మగౌరవమే ముఖ్యమని స్పష్టం చేశారు.1