ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ పై "నల్ల బ్యాడ్జీలతో నిరసన" .... ఏపీటీఎఫ్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ కు సవరణలు చేయాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.మంగళవారం మండలంలోని గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సీనియర్ ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం కలిగించని ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ సవరణకై ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కల్పించాలని,ప్రత్యేక టెట్ ఏర్పాటు చేయాలని,ఉపాధ్యాయులందరికీ అర్హత మార్కులు 40 శాతం గా నిర్ణయించాలని,పరీక్షలను ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ లో నిర్వహించాలని, గణితం సైన్స్ ఉపాధ్యాయులకు వారి వారి సబ్జెక్టులో మాత్రమే 60 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు విన్నవించిన సంఘాల ప్రాతినిధ్యాలను పట్టించుకోకుండా ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణిలో ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యము మేరకు సీనియర్ ఉపాధ్యాయులకు మేలు కలిగించేలా ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ కు సవరణలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ గడివేముల మండల శాఖ గౌరవాధ్యక్షులు ఎల్.బాలస్వామి,అధ్యక్షులు ఎం.ప్రతాపరెడ్డి,సీనియర్ ఉపాధ్యాయులు ఎం. వెంకటరమణారెడ్డి,వినయ్ కుమార్,కళ్యాణ్,మల్లికార్జునయ్య,చెన్నయ్య, చంద్రావతి,ప్రసన్నలక్ష్మి,ఆదిశేషమ్మ, లక్ష్మీ,భూషమ్మ,సుభాషిని,లలిత,శ్రీలత,అనిల్ లు పాల్గొన్నారు.
ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ పై "నల్ల బ్యాడ్జీలతో నిరసన" .... ఏపీటీఎఫ్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ కు సవరణలు చేయాలని ఏపీటీఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు డిమాండ్ చేశారు.మంగళవారం మండలంలోని గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో సీనియర్ ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం కలిగించని ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ సవరణకై ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కల్పించాలని,ప్రత్యేక టెట్ ఏర్పాటు చేయాలని,ఉపాధ్యాయులందరికీ అర్హత మార్కులు 40 శాతం గా నిర్ణయించాలని,పరీక్షలను ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్
లైన్ లో నిర్వహించాలని, గణితం సైన్స్ ఉపాధ్యాయులకు వారి వారి సబ్జెక్టులో మాత్రమే 60 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధ్యాయ సంఘాలు విన్నవించిన సంఘాల ప్రాతినిధ్యాలను పట్టించుకోకుండా ఉపాధ్యాయులపై కక్ష సాధింపు ధోరణిలో ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యము మేరకు సీనియర్ ఉపాధ్యాయులకు మేలు కలిగించేలా ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ కు సవరణలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ గడివేముల మండల శాఖ గౌరవాధ్యక్షులు ఎల్.బాలస్వామి,అధ్యక్షులు ఎం.ప్రతాపరెడ్డి,సీనియర్ ఉపాధ్యాయులు ఎం. వెంకటరమణారెడ్డి,వినయ్ కుమార్,కళ్యాణ్,మల్లికార్జునయ్య,చెన్నయ్య, చంద్రావతి,ప్రసన్నలక్ష్మి,ఆదిశేషమ్మ, లక్ష్మీ,భూషమ్మ,సుభాషిని,లలిత,శ్రీలత,అనిల్ లు పాల్గొన్నారు.
- పోలీసులపై అసత్య ఆరోపణలు: నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ కొట్కూరు పీఎస్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో ముద్దాయిలపై ఎలాంటి చిత్రహింసలకు పాల్పడలేదని సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులు స్వయంగా గాయాలు చేసుకొని నందికొట్కూరు సీహెచ్‌సీ వద్ద మీడియా ముందు పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవసరమైనప్పుడు విచారణకు మళ్లీ హాజరు కావాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.1
- సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం బ్రహ్మానంద చారి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలో జే కే ఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జే ఎస్ ఎస్ బ్రహ్మానంద చారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి భక్త మండలి సహకారంతో డి పి యు పి మరియు ఉర్దూ ప్రాథమిక పాఠశాల యందు 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు పంపిణీ మరియు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై సదస్సు ఏర్పాటు చేయడం జరిగినది. బ్రహ్మానంద చారి మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఐదు సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలతో పని చేయించుకోవడం చట్టరితే నేరమని, ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించాలని పిల్లలకు మధ్యాహ్న భోజనం, దుస్తులు మరియు పుస్తకాలు,, 15000 నగదు పురస్కారం అందిస్తుందని పిల్లలకు విద్య నేర్పిస్తే ఆస్తులు ఇచ్చిన దానికంటే ఎక్కువ అని బ్రహ్మానంద చారి వివరించారు. డిపియుపి ఇన్చార్జి హెచ్ఎం పుష్పరాజు ఉర్దూ స్కూల్ హెచ్ఎం ఫాతిమా అలియానా మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే సదుపాయాలు వివరించారు. ప్రాత పుస్తకాలు పెన్నులు ఇచ్చిన ఆంజనేయ స్వామి భక్తి మండలి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకోబారావు, నాగేంద్రుడు, కే పుష్పరాజు, మంగళ్ లక్ష్మన్న, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు, అనంతరం 115 మంది విద్యార్థులకు రాత పుస్తకాలు పెన్నులు బ్రహ్మానందం పంపిణీ చేశారు.2
- గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు *ప్రజల మధ్య శేఖరన్న – అభివృద్ధి బాటలో కులుమల గ్రామం *గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు.* *ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.* *ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా శేఖరన్న గారి పర్యటన కొనసాగింది.1
- అలంపూర్: మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్!! మొక్కలను నాటుదాం దానిని చెట్లగా మారుద్దాం.. మున్సిపల్ కమిషనర్ రాజేష్ పిలుపు అలంపూర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ రాజేష్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందేటట్లు చూడాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు , మున్సిపల్ చైర్మన్ పీజయరాముడు, వైస్ చైర్మన్ విక్రం,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.1
- స్వచ్ఛందంగా త్రాగునీటి కొరకు రోడ్డు పైకీ ఎక్కి ఆగ్రహించిన మహిళలు. ఎవరి పర్మిషన్ తీసుకున్నారు అంటున్న పోలీసులు. ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కొండపేట చెందిన మహిళలు స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్డుపైకి ఎక్కి అగ్రహంతో ధర్నాకు దిగారు. మహిళలు మాట్లాడుతూ ఏ ఒక్క నాయకుడు వచ్చినా తూతూ మంత్రంగానే మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప కోడుమూరు పట్టణానికి శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఇంకిత జ్ఞానం నాయకులకు లేదు. మాకు 20 రోజులైనా కుళాయిల నుంచి నీరు అందటం లేదు మేము ఎందుకు రోడ్డుపైకి వస్తాం మాకు ఏమైనా పొగరా..? మాకు నీళ్లు వస్తే ఎందుకు ఎక్కుతం రోడ్డు. అదే మీ ఇండ్లలో నీళ్లు లేకుంటే మీ ఆడవాళ్లు ఎలా ఉంటారు మీకు అర్థమవుతుంది మాలాగైతేనే మీకు తెలుస్తుంది ఉద్యోగాలు చేసుకుని జీతాలు తినేది కాదు.. నీటి సమస్యను తీరేంతవరకు ఈ ధర్నా నుంచి విరమించుకునేదే లేదు కలెక్టర్ రావాలి అంటూ పట్టు పట్టారు. పోలీసులు వచ్చి మహిళలు మాట్లాడిన మాటలు విని పోలీసులు మాట్లాడుతూ మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు. పరిమిషన్ ఉంటేనే ధర్నాకు దిగాలి మీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కితే సరిపోదు మీ మీద కేసులు పెడతాం జాగ్రత్త అంటూ ఆగ్రహించారు. అంబులెన్స్ లో నాలుగు వెళ్లాయి గర్భవతులు అందులో ఉన్నారు అందులో గర్భవతులు చనిపోతే మీ మీద కేసులు పెడతాం . ఇదంతా సిపిఎం పార్టీ వాళ్లే చేసినట్టు ఉన్నారు.అంటూ గాంభీరంగా పోలీసులు మాట్లాడారు .దురుసు ఎక్కువ అయిపోతున్నది అంటూ మహిళలు పోలీసులపై మండిపడ్డారు. మాకు ఏ నాయకులతో సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్ ఎక్కాం.మా ఇండ్లలో మాదిరిగా మీకు మా పరిస్థితి వస్తే సరిపోతుంది. ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులు మాట్లాడేది కాదు మాకు ఏ నాయకుడు చెప్పలేదు రోడ్డు ఎక్కమని.మేమే స్వచ్ఛందంగా వచ్చాం త్రాగునీటి కొరకు మా ఇండ్లలో నీళ్లు ఉన్నాయో లేదో పోలీసులైన పంచాయతీ అధికారులు అయిన మీరు వచ్చి చూడండి మీకు అర్థం అవుతుంది. అంటూ మహిళల ఆగ్రహించి మాట్లాడారు. ఒక్కసారిగా పోలీసులు ఏమీ ఆలోచించకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగా ధర్నాకు దిగిన మహిళలను పోలీసు స్టేషన్ కు తరలించారు. మరి కోడుమూరు త్రాగునీటి సమస్య ఎంతవరకు అవుతుందో సమస్యను తీరుస్తారో లేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ వీడియో చూస్తే అధికారులకు తెలుస్తుంది. వేచి చూడాలి.1
- రాజుపాలెం లో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు పెద్దారవీడు మండలం రాజుపాలెం గ్రామంలో వెలిసిన ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామున స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ప్రత్యేక అలంకారం చేసి ఆకు పూజ జరిపించారు. పరిసర ప్రాంతాలలోని భక్తులు తరలివచ్చి స్వామివారికి కయా కర్పూరం సమర్పించారు. అనంతరం దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు1
- 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 ఏళ్లు నిండిన ప్రతి యువతకు R&R ప్యాకేజీ కల్పించి, వారి భవిష్యత్తుకు న్యాయం చేయాలి. ఇది భిక్షం కాదు — మా న్యాయమైన హక్కు! 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హ నిర్వాసిత యువతి, యువకుడికి R&R ప్యాకేజీ ఇవ్వాలి. 2019లో కట్‌ఆఫ్ తేదీ ప్రకటించిన తర్వాత కూడా మమ్మల్ని ఖాళీ చేయించకుండా, మా అమ్మానాన్నలకు రావాల్సిన నష్టపరిహారం కూడా పూర్తిగా అందకపోవడం మా తప్పా? ఏళ్లుగా మేము ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మా ఇళ్లను ఖాళీ చేయమంటున్నారు. మరి మా భవిష్యత్తు పరిస్థితి ఏమిటి? మా త్యాగానికి న్యాయం చేయండి. 18+ అర్హ నిర్వాసిత యువతకు R&R విషయంలో న్యాయం చేయండి. 🙏✊1
- వెలుగొండ ప్రాజెక్ట్ కు కృష్ణా జలాలను విడుదల చేస్తున్న సందర్భంగా కూటమి నాయకులు ట్రాక్టర్స్ ర్యాలీ వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం జిల్లా తో పాటు మరికొన్ని జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కి నీటిని విడుదల చేస్తున్న సందర్భంగా మార్కాపురం పట్టణ కూటమి నేతల ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆగస్టు 30వ తేదీ సీఎం చేతుల మీదుగా కృష్ణా జలాలు విడుదల చేయబోతున్నట్లు నాయకులు తెలిపారు. అందులో భాగంగా మార్కెట్ యాడ్ నుండి అల్లూరి పోలేరమ్మ ఆలయం వరకు ట్రాక్టర్ ర్యాలీ చేసి, నల్గొండ ప్రాజెక్టు జలాలను ప్రారంభించేందుకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని కూటమిన్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1