నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అశ్రునివాళులు.. అమరవీరుల స్థూపం వద్ద భారీగా తరలివచ్చిన ప్రజలు వరంగల్ జిల్లా నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల నర్సంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతితో గులాబీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలిస్తుండటంతో నర్సంపేట పట్టణానికి భారీగా జనసందోహం తరలివచ్చింది. తమ అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను తోటి ఉద్యమకారులు, నాయకులు స్మరించుకున్నారు. తమతో కలిసి పనిచేసిన నాయకుడిని కోల్పోయామంటూ పలువురు కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. "పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే" అంటూ నినాదాలతో నర్సంపేట మారుమోగింది. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ చివరి వీడ్కోలు పలికేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అశ్రునివాళులు.. అమరవీరుల స్థూపం వద్ద భారీగా తరలివచ్చిన ప్రజలు వరంగల్ జిల్లా నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల నర్సంపేటలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతితో గులాబీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలిస్తుండటంతో నర్సంపేట పట్టణానికి భారీగా జనసందోహం తరలివచ్చింది. తమ అభిమాన నాయకుడిని చివరిసారిగా చూసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డికి నివాళులర్పించేందుకు అభిమానులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి చేసిన సేవలను తోటి ఉద్యమకారులు, నాయకులు స్మరించుకున్నారు. తమతో కలిసి పనిచేసిన నాయకుడిని కోల్పోయామంటూ పలువురు కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు. "పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ రహే" అంటూ నినాదాలతో నర్సంపేట మారుమోగింది. ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ చివరి వీడ్కోలు పలికేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
- గ్రోమోర్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ కొత్తగూడ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలు, విక్రయాల రికార్డులు, స్టాక్ వివరాలను పరిశీలించి నిబంధనల మేరకు రైతులకు ఎరువులు అందించాలని అధికారులకు సూచించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.1
- *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* *పత్రిక మరియు మీడియా మిత్రులకు నమస్కారములు* 🙏🙏🙏🙏🙏 *ఢిల్లీ లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్తూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు* ఈరోజు ఢీల్లి లోని తెలంగాణ భవన్ అమరవీరుల స్థూపం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన కాజిపేట్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమం లో ఉద్దేశించి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి *నార్లగిరి రమేష్* మాజీ కార్పొరేటర్ *జోరిక రమేష్* గార్లు మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా బి ఆర్ ఎస్ పార్టీ కి తీరని నష్టమని పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ మలిదిశ ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు అని మచ్చలేని ఎమ్మెల్యేగా సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేశాడని పెద్దికి రైతుల పట్ల ఉద్యమకారుల పట్ల ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేదని 2001 నుండి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉద్యమంలో కలిసి పనిచేసినమని పెద్దన్న మరణం నాలాంటి ఉద్యమకారులకు బి ఆర్ ఎస్ పార్టీకి తీవ్ర నష్టమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూన్నాము అని తెలియజేసినారు ఇంకా ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి *గబ్బెట శ్రీనివాస్* శిరుమల్ల దశరథం సంకు నర్సింగ రావు MD ఆఫ్జాల్ MD హుస్సేన్ సుంచు అశోక్ కోండ్ర శంకర్ తండమళ్ళ వేణు కుమ్మరి రాజ్ కుమార్ పోలేపల్లి రామ్మూర్తి గడ్డం రఘు వంశీ మాచర్ల గణేష్ కనకం రమేష్ మారపాక గణేష్ రాబర్ట్ అయాన్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు *మీ.. గబ్బేట శ్రీనివాస్ బి ఆర్ యస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి* 86866186642
- హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకై మహబూబాబాద్ లో సంతకాల సేకరణ. మహబూబాబాద్ జిల్లా జులై 31 హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని హమాలి సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబాబాద్ పట్టణ హమాలీ సంఘం ఆధ్వర్యంలో మార్కెట్‌లోని కాటన్ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కార్మికుల నుంచి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి కుమ్మరికుంట్ల నాగన్న పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హమాలీ కార్మికులకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి హమాలీ కార్మికుడికి నెలకు రూ.6,000 పెన్షన్ అందించాలని కోరారు. అలాగే ప్రతి హమాలీ కార్మికుడికి రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, విధి నిర్వహణలో కార్మికుడు మరణిస్తే ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.50 వేల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా హమాలీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అసెంబ్లీలో కూడా చర్చించకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ఇప్పటికే హమాలీ కార్మికులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆగస్టు 13న తహసీల్దార్ కార్యాలయం ఎదుట, ఆగస్టు 24న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హమాలీ కార్మికులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బత్తుల వెంకన్న, బానోత్ రవి, హేమ, వీరన్న, రవి, రాము, చంద్రయ్య, వీరు, రమేష్, బాలు, రామారావు, రాములు, శ్రీను, చందు, నవీన్, కృష్ణ, మోహన్‌రావు, వెంకన్న, చారి, హరి, బిట్టు, సూర్య, లక్ష్మణ్, సేవ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.1
- జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు జనసంద్రంగా మారిన నల్లబెల్లి పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు దీంతో పెద్ది స్వగ్రామం నల్లబెల్లి జనసంద్రంగా మారింది కాసేపట్లో పెద్ది భౌతికకాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.1
- నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికఖాయం. పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద పెద్ది భౌతికఖాయానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు.కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ శ్రేణులు.శోకసంద్రంలో మునిగిపోయిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలు. కొనసాగుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర.1
- ఉద్యమ గాయాలతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానన్న పెద్ది సుదర్శన్ రెడ్డి వరంగల్:నర్సంపేట పట్టణంలో 2023లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో గాయపడటంతో కుడి కన్ను చూపు కోల్పోయానని, లాఠీచార్జీల్లో చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం శరీర నొప్పులతో బాధపడుతూ వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ చేయించుకుంటేనే నడవగలుగుతున్నానని పేర్కొంటూ, తనను అపార్థం చేసుకోవద్దని ప్రజలను కోరారు.1
- రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం.... రాగికి పసిడి పూతపూసి ఏకంగా ప్రైవేటు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు.... ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్టు తెలిపిన కారేపల్లి సిఐ సాగర్.. రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారం తీరున కనిపించేలా తయారు చేస్తారు అనంతరం ఆ నకిలీ ఆభరణాలను వివిధ బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలలో తాకట్టు పెట్టి రుణాలు పొందుతారు ఈ విధంగా ప్రవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసి అక్రమంగా డబ్బు సంపాదించడంలో ఈ ముఠా రూటే సపరేటు.. సిఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం... రామ్ చందర్ అనే వ్యక్తి తన ఏజెంట్ అయిన సునీల్ ను ఇల్లందులోని ఒక ముత్తూట్ ఫైనాన్సులో 52 గ్రాముల బంగారం పెట్టించి (390000) ఋణం తీసుకున్నారు దానిని విడిపించేందుకు మరో ప్లాన్ చేశారు... ఈసారి ఏకంగా ఈ నకిలీ బంగారం విడిపించేందుకు హైదరాబాదుకు చెందిన మరో కంపెనీని మోసం చేసే ఎత్తుగడ వేశారు.. అందులో భాగంగా హైదరాబాదులోని మన గోల్డ్ కంపెనీని సంప్రదించి వారి యొక్క ప్రతినిధి ద్వారా 5 లక్షల 80 వేల రూపాయలు సునీల్ తీసుకొని కారేపల్లి మండల సమీపంలో అతని నమ్మించి మోసం చేసి పారిపోయాడు.. దీనితో ఆ సంస్థ ప్రతినిధి పోలీసులకు ఫిర్యాదు చేయగా కారేపల్లి పోలీసులు పక్కా ప్రణాళికతో నిందితులను అరెస్టు చేయడoతో ఈ నకిలీ బంగారం విషయాలు వెలుగులోకి వచ్చాయి.. కారేపల్లి మండలం భాగ్యనగర్ కు చెందిన గుగులోతు సునీల్ కుమార్ ను ఇప్పటికే రిమాండ్ చేయగా మరొకరు రామ్ చందర్ ను విలేకరుల సమావేశంలో చూపించారు.. పరారీలో ఉన్న సూర్య తండా కు చెందిన రాకేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని కారేపల్లి పోలీసులు తెలిపారు.. నిందితులు అంత సులువుగా నకిలీ బంగారం తనకా పెడుతున్నరూ అంటే దీని వెనుక ఫైనాన్సర్ సంస్థలలో ఉన్న కొందరి ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. బంగారం తాకట్టు పెట్టేముందు లేదా కొనుగోలు చేసే ముందు సంబంధిత బంగారు ఆభరణాల స్వచ్ఛతను కచ్చితంగా పరీక్షించుకోవాలని అనుమానాధస్పద లావాదేవీలు లేదా వ్యక్తుల సమాచారం ఉంటే తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.1
- బ్రేకింగ్ న్యూస్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. తీవ్ర ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మరణవార్త రాజకీయ, సామాజిక వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.1
- ముల్కలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షల నగదు సహా విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. జిల్లా:భద్రాద్రికొత్తగూడెం సెంటర్:అశ్వారావుపేట స్లగ్: షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం.. లక్షల ఆస్థి నష్టం యాంకర్:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో షార్ట్ సర్క్యూట్‌తో ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో రూ.2 లక్షల నగదు సహా విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైంది. మూకమామిడి గ్రామానికి చెందిన ఊకె రాజులు పూరిల్లు తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో చిక్కుకుంది. కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడగా, ఇల్లు పూర్తిగా కాలిపోయింది. రూ.2 లక్షల నగదు, రెండు క్వింటాళ్ల బియ్యం, టీవీ, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న సర్పంచ్ ఆదిలక్ష్మి, గ్రామ యువత బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందజేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.1