పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హొలీ సంబరాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ ఆయనో జిల్లా అధికారి... నిత్యం వత్తిడితౌ ఉండే ఉద్యోగ ధర్మం... అయినా అవకాశం దొరికినప్పుడు... ఆటవిడుపుగా తనలో ఉన్న కళకు... లయబద్ధంగా అడుగులు వేస్తూ...తన తోటి వారి మనస్సు దోచేస్తాడు... ఆయనే డ్యాన్స్ వీరుడు రోహిత్ రాజ్... సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు,...... హొలీ సందర్భంగా కొత్తగూడెం లోని హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హొలీ సంబరాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీసులతో కలిసి స్టెప్పులేశాడు. "బాయిలోనే బల్లి పలికే" అనే ఈ మధ్య యూట్యూబ్ లో ఫెమస్ అయిన పాటకు మాస్ స్టెప్పులేసి అదరగొడుతూ జిల్లా పోలీసులలో ఉత్సాహాన్ని నింపాడు. డ్యూటీ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండే ఎస్పీ రోహిత్ రాజ్ హొలీ సందర్భంగా చాలా ఉత్సాహంగా గడిపారు. తన కింద పనిచేసే పోలీసులు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహ పరిచారు. తరుచూ అనేక కేసుల్లో జిల్లా ప్రజల్లో హీరోగా నిలిచే ఎస్పీ తాజాగా పోలీసులతో కలిసి స్టెప్పులేసి వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాడు.
పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హొలీ సంబరాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ ఆయనో జిల్లా అధికారి... నిత్యం వత్తిడితౌ ఉండే ఉద్యోగ ధర్మం... అయినా అవకాశం దొరికినప్పుడు... ఆటవిడుపుగా తనలో ఉన్న కళకు... లయబద్ధంగా అడుగులు
వేస్తూ...తన తోటి వారి మనస్సు దోచేస్తాడు... ఆయనే డ్యాన్స్ వీరుడు రోహిత్ రాజ్... సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు,...... హొలీ సందర్భంగా కొత్తగూడెం లోని హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హొలీ సంబరాల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్
రాజ్ పోలీసులతో కలిసి స్టెప్పులేశాడు. "బాయిలోనే బల్లి పలికే" అనే ఈ మధ్య యూట్యూబ్ లో ఫెమస్ అయిన పాటకు మాస్ స్టెప్పులేసి అదరగొడుతూ జిల్లా పోలీసులలో ఉత్సాహాన్ని నింపాడు. డ్యూటీ విషయంలో చాలా నిక్కచ్చిగా ఉండే ఎస్పీ రోహిత్ రాజ్ హొలీ సందర్భంగా
చాలా ఉత్సాహంగా గడిపారు. తన కింద పనిచేసే పోలీసులు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహ పరిచారు. తరుచూ అనేక కేసుల్లో జిల్లా ప్రజల్లో హీరోగా నిలిచే ఎస్పీ తాజాగా పోలీసులతో కలిసి స్టెప్పులేసి వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచాడు.
- జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గణితశాస్త్రం పేపర్–IIA, వృక్షశాస్త్రం పేపర్–II, రాజకీయ శాస్త్రం పేపర్–II పరీక్షలు జిల్లాలోని 37 కేంద్రాల్లో నిర్వహించబడ్డాయి. మొత్తం 8,805 మంది విద్యార్థులకు గాను 8,584 మంది హాజరై, 221 మంది గైర్హాజరయ్యారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.1
- shining glitter lamination photo frame acrylic photo frames LED photo frames Digital Art photo frames mug print, pillow print, tshirts print, Readymade gifts, LED lighting boards, Steel letters birthday gifts, marriage gifts, Anniversary gifts...1
- మహబూబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వనదేవత ఉత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఉన్న భక్తులు భారీ సంఖ్యలో వస్తున్నారు. జాతరలో భాగంగా మొదటి రోజు అమ్మవారికి భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా భక్తులు తెల్లవారుజాము నుంచే పవిత్ర స్నానాలు ఆచరించి, కొత్త కుండలలో నైవేద్యాన్ని వండి, వేపాకులతో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకుంటున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, మంగళహారతుల మధ్య అడవి మార్గమంతా ఆధ్యాత్మిక శోభతో నిండిపోయింది.1
- వరంగల్ జిల్లా.దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభ బండ్లను నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. జాతర సందర్భాన్ని పురస్కరించుకుని గులాబీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో పార్టీ శక్తిని మరింత బలోపేతం చేయాలని, ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జాతర వేళ ప్రభ బండ్ల ద్వారా ప్రజల్లో ఉత్సాహం నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, నియోజకవర్గ యూత్ కన్వీనర్, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మండల నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.7
- .వరంగల్ జిల్లా గీసిగొండ మండలంలోని శ్రీ కొమ్మల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం జాతర సందర్భంగా ప్రభ బండ్లు ఘనంగా వెళ్లాయి. పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభ బండ్ల ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగగా, జాతర ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.1
- తూ.గో జిల్లా రంగంపేట మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త నాగేంద్రను భార్య వీరలక్ష్మి, ఆమె ప్రియుడు శివ కిరాతకంగా హత్య చేశారు. ఫిబ్రవరి 27న జరిగిన ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించినట్లు రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ DSP బి. విద్య వెల్లడించారు.1
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహామూద్‌పట్నం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన మెనూను పాటించకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన విషయంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. KGBV స్పెషల్ ఆఫీసర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. విద్యార్థుల సంక్షేమంపై రాజీ ఉండదని స్పష్టం చేసిన కలెక్టర్, పాఠశాలల నిర్వహణలో ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.1
- దమ్మపేట మండల కేంద్రంలో మల్లారం రైతు వేదిక నందు నూతనంగా గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులకు మండల స్థాయిలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ శిక్షణ కార్యక్రమాల మొదటి విడత తరగతులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామపంచాయతీ వ్యవస్థ గ్రామాల అభివృద్ధికి మొదటి మెట్టు అని పేర్కొన్నారు అభివృద్ధి పరిశుభ్రత తాగునీరు విద్య ఆరోగ్యం వంటి అంశాలలో వార్డు సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి కర్తవ్యమని గ్రామాల్లో పారదర్శకంగా నిబద్ధతతో పని చేయాలని సూచించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయాలని గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా సమన్వయంతో పరిష్కరించాలని పిలుపునిచ్చారు మూడువిడతలుగా నిర్వహించనున్న ఈ శిక్షణలో గ్రామపాలన విధానం నిధుల వినియోగం అభివృద్ధి పనుల పర్యవేక్షణ గ్రామసభల నిర్వహణ వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు3