Shuru
Apke Nagar Ki App…
पब्लिक गवर्नेंस-प्रोग्रेस प्लान, 99-दिन के एक्शन प्लान के तहत, आज म्युनिसिपल कमिश्नर बी तिरुपति की देखरेख में गांधी पार्क में SHG महिलाओं ने पौधे लगाए। इस प्रोग्राम में ऑनरेरी म्युनिसिपल चेयरपर्सन श्रीमती शाहीन सुल्ताना, वाइस चेयरपर्सन श्रीमती डॉ. कोथापल्ली अनीता और म्युनिसिपल स्टाफ ने हिस्सा लिया।
Ramesh Solanki
पब्लिक गवर्नेंस-प्रोग्रेस प्लान, 99-दिन के एक्शन प्लान के तहत, आज म्युनिसिपल कमिश्नर बी तिरुपति की देखरेख में गांधी पार्क में SHG महिलाओं ने पौधे लगाए। इस प्रोग्राम में ऑनरेरी म्युनिसिपल चेयरपर्सन श्रीमती शाहीन सुल्ताना, वाइस चेयरपर्सन श्रीमती डॉ. कोथापल्ली अनीता और म्युनिसिपल स्टाफ ने हिस्सा लिया।
More news from తెలంగాణ and nearby areas
- మ్యాదరిపేటలో విషాదం: ఇనుప స్టాండ్‌కు తగిలిన హైఓల్టేజ్ వైర్లు.. ఒకరు సజీవ దహనం, మరొకరు అక్కడికక్కడే మృతి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట గ్రామంలో సోమవారం ఒక పెను విషాదం చోటుచేసుకుంది. పని నిమిత్తం వెళ్ళిన ఇద్దరు యువకులను విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. హైఓల్టేజ్ విద్యుత్ తీగలు తగలడంతో ఒక యువకుడు కళ్లెదుటే మంటల్లో కాలిపోగా, మరొకరు తీవ్రమైన షాక్‌తో ప్రాణాలు విడిచారు. అసలేం జరిగింది? స్థానికుల కథనం ప్రకారం.. మ్యాదరిపేటలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో ఒక భారీ ఇనుప స్టాండ్ ఉంది. మ్యాదరిపేటకు చెందిన సల్ల లక్ష్మీనారాయణ (ఎడ్డన్న), వెల్గనూర్ గ్రామానికి చెందిన చందనగిరి నాగరాజు ఆ స్టాండ్‌ను రోడ్డుపై నుంచి జరుపుతున్నారు. అయితే, పైన తక్కువ ఎత్తులో వేలాడుతున్న హైఓల్టేజ్ విద్యుత్ మెయిన్ లైన్లను వారు గమనించలేదు. ఆ ఇనుప స్టాండ్ ఒక్కసారిగా విద్యుత్ తీగలకు తగలడంతో భారీ స్థాయిలో కరెంట్ ప్రవహించింది. ఈ క్రమంలో: సజీవ దహనం: విద్యుత్ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. స్టాండ్‌ను పట్టుకుని ఉన్న లక్ష్మీనారాయణ శరీరం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. అందరూ చూస్తుండగానే ఆయన సజీవ దహనమయ్యాడు. అక్కడికక్కడే మృతి: మరో యువకుడు నాగరాజు తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామాల్లో మిన్నంటిన రోదనలు చేతికొచ్చిన కొడుకులు కళ్లెదుటే విగతజీవులుగా పడి ఉండటంతో మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వారిని కలచివేశాయి. మ్యాదరిపేట, వెల్గనూర్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విద్యుత్ శాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. "విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగింది. వైర్లు తక్కువ ఎత్తులో వేలాడుతున్నా పట్టించుకోకపోవడం వల్లే ఇద్దరు యువకులు బలైపోయారు." > — స్థానికుల ఆవేదన విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.1
- బజార్ హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమంతుని ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శిఖర ఆవిష్కరణ వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ పథకం అందని ఇండ్లు లేదని హనుమంతుని గుడి లేని ఊరు లేదని గ్రామానికి అండగా ప్రతీ గ్రామంలో హనుమంతుని గుడి ఉంటుందని ఈరోజు గంగాపూర్ గ్రామం చిన్న గ్రామమైన భక్తి శ్రద్ధలతో గ్రామంలో అద్భుతమైన హనుమాన్ ఆలయాన్ని నిర్మించడం గొప్ప విషయమని ఆలస్యంగా కట్టిన గంగాపూర్ గ్రామస్తులు అద్భుతంగా నిర్మించారని,కలియుగంలో గ్రామాలు బాగుండాలని కలిని తొక్కడానికే ఆంజనేయ స్వామిగా శివుడు అవతరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.2
- జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.1
- రెండవ సారి సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ గా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళాచక్రపాణి ని సన్మానించిన బిఆర్ఎస్ వార్డు శాఖ అధ్యక్షులు. సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ గా రెండవసారి ఎన్నికైన జిందం కళ చక్రపాణిని బిఆర్ఎస్ పార్టీ వార్డు శాఖ అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.1
- కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం దోపిడి దొంగలకు అడ్డగా మారింది. మెట్ పల్లి గ్రామంలో ఏకంగా 9 ఇళ్ళలో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసి చోరీలకు పాల్పడి బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్ళారు. గ్రామపంచాయతీ సమీపంలో తాళం వేసి ఉన్న తొమ్మిది ఇండ్లలో దొంగతనాలకు పాల్పడడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ను రంగంలో దించి విచారణ చేపట్టారు. ఇటీవల ఇదే మండలం కొత్తగట్టు , మొలంగూర్ గ్రామాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనలకు పాల్పడ్డ దొంగలు తాజాగా అదే తరహాలో దొంగతనాలకు పాల్పడ్డారు. మండలంలో దొంగలు రెచ్చిపోవడంతో స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. గత రెండు మూడు మాసాల నుంచి ఇండ్లు, కిరణ షాపులు, మేకలు, కోళ్లు తేడా లేకుండా చోరీలు జరుగుతుండడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.1
- ప్రతి గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పోతారం (ఎస్) గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణకు FMD టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పక్షాన రాష్ట్రంలో పశు సంపద పెంచడానికి వ్యాదులు నివారించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసే FMD టీకా ఉచితంగా వేయడం జరుగుతుందన్నారు. మనకు ఆరోగ్యాన్నిచ్చే పాల ఉత్పత్తి పెంచడానికి రైతులంతా పాడి సంపద పెంచాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యావరణాన్ని కాపాడాలని.. ప్లాస్టిక్ నిర్మూలించేలా కృషి చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి స్టీల్ బ్యాంక్ అందజేశామని వాటిని వినియోగించాలని సూచించారు.1
- నెరడిగొండ : మండలంలోని తేజాపూర్ గ్రామంలో జరుగుతున్న వేదాంత విజ్ఞాన మహా సభలు,సాధు సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా శివానంద భారతి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం చేస్తామని కోరుకొని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని మొట్టమొదటగా కలిసి తెలియజేయగానే ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పి ఈయొక్క సమ్మేళనానికి అండగా నిలిచారని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని ఘనంగా సన్మానించి అభినందన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. శివానంద స్వామి కలిసి సాకారం అందించాలని కోరారు. కానీ నా సాకారం కాదు దేవుడి ఆశీర్వాదంతోనే మీతో ఒకడిగా మీలో ఒకడిగా ఉంటానన్నారు. ఋషులు ఎన్నో తపస్సులు చేసి ధర్మాన్ని కాపాడుతున్నారని వారి మార్గదర్శనమీ మనకు నిదర్శనమని మనం ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్లలో సెస్ విద్యుత్ కార్మికుల 72 గంటల విధులు బహిష్కరణ. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ విధులు బహిష్కరించి సెస్ కార్యాలయం ఆవరణలో నిరసన తెలుపుతున్న విద్యుత్ కార్మికులు.1
- కరీంనగర్ వరంగల్ నగరాల్లో డంపింగ్ యార్డ్ సమస్య శాశ్వత పరిష్కారానికి త్వరలో ఒక్క విధానం అమలు చేయబోతున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామని, ఏడాదిలోగా కరీంనగర్ డంపింగ్ యార్డ్ ను తరలిస్తామని స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి కరీంనగర్ లో పర్యటించారు. పలు హోటళ్ళను సందర్శించి ప్లాస్టిక్ నిషేధం, పరిసరాలు పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించవద్దని, స్టీల్ వస్తువులు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనంతరం డంపింగ్ యార్డును సందర్శించి పెద్దపెద్ద నగరాల్లో చెత్త సేకరణ వ్యర్థాల తరలింపు సమస్యగా మారిందన్నారు. గతంలో కేంద్ర మంత్రి కట్టర్ కరీంనగర్ కి వచ్చినప్పుడు ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉన్న అనారోగ్యాలకు కారణం అవుతున్న డంపింగ్ యార్డ్ తరలించాలని విజ్ఞప్తి చేశామని, ఇటీవల సీఎం చొప్పదండి వచ్చినప్పుడు కరీంనగర్ డంపింగ్ యార్డ్ సమస్య స్థానిక జిల్లా నేతలం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళామని తెలిపారు. సీఎం సభా వేదిక మీద నుండి కరీంనగర్ ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న డంపింగ్ యార్డ్ తరలిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. డంపింగ్ యార్డ్ తరలింపులో డైలీ వచ్చే వెస్ట్ మేనేజ్మెంట్... ఇప్పటికే స్టోర్ అయిన వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా తరలించాలని దానిపై ఒక విధానాన్ని తీసుకుంటామన్నారు. ఒక స్వచ్ఛంద సంస్థ చెత్త తరలించడానికి ముందుకు వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రజాప్రతినిధులం, అధికారులు బాధ్యత తీసుకున్నామని త్వరలోనే శాశ్వత పరిష్కార మార్గం చూపుతామని తెలిపారు. 40 సంవత్సరాలుగా పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ ను ఇప్పటికిప్పుడు తరలించేందుకు ఒక రోజులో అయ్యేది కాదని, సంవత్సరంలోపు పూర్తి స్థాయిలో తరలిస్తామని స్పష్టం చేశారు.4