*గుంటూరు జిల్లా పోలీస్...* *నల్లపాడు పోలీస్ స్టేషన్* *ది:14.03.2026* _*//మైనర్ బాలికను మోసగించి, లైంగికంగా వేధించి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడిని అరెస్ట్ చేసిన నల్లపాడు పోలీసులు,.//*_ 🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ IPS గారి ఆదేశాల మేరకు, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. మైనర్ బాలికలపై జరిగే నేరాలకు సంబంధించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, మైనర్ బాలికలకు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకున్నా వారితో శారీరకంగా కలవడం లేదా వివాహం చేసుకోవడం వంటి చర్యలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, రిమాండ్ కు తరలించడం జరుగుతుందని గౌరవ జిల్లా ఎస్పీ గారు హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. *కేసు వివరాలు:* Cr.No.180/2026 U/s 137(2), 64(1), 64(2)(m), 351(2) BNS & Sec.6 r/w 5(l) POCSO Act–2012 (ముందుగా Girl Missing కేసుగా నమోదు చేయబడినది) 🔅*నిందితుడు:* యాకసిరి ఆనంద్, తండ్రి: దుర్గారావు, వయస్సు 22 సం.లు, 3వ వార్డు, పొట్లూరివారి వీధి, రేపల్లె, బాపట్ల జిల్లా. 📍*సంఘటన వివరాలు:* బాధితురాలు 2025 అక్టోబర్ నెలలో గుంటూరు నగరంలోని ఒక స్వీట్ షాపులో సేల్స్ గర్ల్‌గా పని చేయడం ప్రారంభించింది. అదే షాప్‌లో నిందితుడు సేల్స్ బోయ్‌గా పనిచేస్తూ ఉండేవాడు. మొదట్లో బాధితురాలితో స్నేహంగా మాట్లాడి, ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు. తర్వాత ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను మోసగించడానికి ప్రయత్నించాడు. బాధితురాలు తనకు ఇష్టం లేదని పలుమార్లు చెప్పినా వినకుండా ఫోన్‌లో మాట్లాడాలని బలవంతం చేయడం, ఇంట్లో చెప్పితే కుటుంబ సభ్యులకు హాని చేస్తానని బెదిరించడం చేసేవాడు. ఒక రోజు షాప్ స్టాఫ్ ఎవరూ లేని సమయంలో నిందితుడు బాధితురాలిని బెదిరించి దేవపురం 4వ లైన్‌లో ఉన్న తన గదికి తీసుకెళ్లి, ఆమె ఇష్టం లేకపోయినా బలవంతంగా శారీరకంగా కలిసాడు. తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆమెతో శారీరకంగా సంబంధం పెట్టుకున్నాడు. చివరిసారిగా ది 06.03.2026 తేదీన కూడా అదే విధంగా ఆమెతో శారీరకంగా కలసి, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. తదుపరి ది.07.03.2026 తేదీన బాధితురాలు ఇంటి నుండి బయటకు వచ్చిన సమయంలో నిందితుడు ఆమెను బెదిరించి గుంటూరు బస్టాండ్‌కు తీసుకెళ్లి, అక్కడి నుండి ఒంగోలు తీసుకెళ్లి సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయంలో బలవంతంగా తాళి కట్టి వివాహం చేసుకున్నట్లు నమ్మించాడు. అనంతరం ఆమెను తన తల్లిదండ్రులు ఉన్న రేపల్లెకు తీసుకెళ్లాడు.ఇంతలో తమ కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ది.07.03.2026 తేదీన నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేయబడింది. *దర్యాప్తు వివరాలు:* ది.09.03.2026 తేదీన బాధితురాలు రేపల్లెలోని నిందితుడి ఇంటి నుండి ఎవరికి తెలియకుండా గుంటూరులోని తన ఇంటికి చేరుకుని జరిగిన విషయాలను తన తల్లిదండ్రులకు తెలిపింది. అనంతరం బాధితురాలి తల్లిదండ్రులు ఆమెను నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి జరిగిన సంఘటనపై ఫిర్యాదు ఇచ్చారు.దీని ఆధారంగా మైనర్ బాలికను మోసగించి లైంగికంగా వేధించి బలవంతంగా వివాహం చేసుకున్న నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. *నిందితుడు అరెస్ట్:* దర్యాప్తులో భాగంగా వచ్చిన విశ్వసనీయ సమాచారంతో, జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ IPS గారి ఆదేశాల మేరకు, 14–03–2026 ఉదయం 11:00 గంటలకు నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ Phase–II, శిల్పారామం వద్ద నిందితుడు యాకసిరి ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపించారు. * దర్యాప్తు అధికారి: శ్రీ బి.వి. మధుసూదన రావు, DSP CCS మరియు ఇన్‌చార్జ్ SDPO,సౌత్ సబ్ డివిజన్, గుంటూరు జిల్లా.*

- గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.1
- #Ambedkar #AmbedkarJayanti #Motivation #Inspiration #Success #Education #Shorts #Trending1
- Post by Paramesh Ratnagiri1
- Post by V Ramarao1
- Post by Ramprasad islavath1
- నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ *నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.* పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1