Shuru
Apke Nagar Ki App…
మేడారం మహా జాతరకు ఇంకా 20 రోజులే మిగిలి ఉంది..! మేడారం మహా జాతరకు ఇంకా 20 రోజులే మిగిలి ఉంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే మహా జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్థానిక మంత్రి సీతక్క మేడారం మహా జాతరకు భక్తులను ఆహ్వానిస్తున్నారు.
Swathi
మేడారం మహా జాతరకు ఇంకా 20 రోజులే మిగిలి ఉంది..! మేడారం మహా జాతరకు ఇంకా 20 రోజులే మిగిలి ఉంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే మహా జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. స్థానిక మంత్రి సీతక్క మేడారం మహా జాతరకు భక్తులను ఆహ్వానిస్తున్నారు.
More news from Warangal and nearby areas
- మడికొండ టెక్స్టైల్ పార్క్‌లో రూ.11 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో టిజీఐఐసి కార్పొరేషన్ ద్వారా రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండలంలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 7 మందికి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- జనగామ జిల్లా చిల్పూర్‌లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరుతో భారీగా దోపిడీ జరిగిందని, ప్రభుత్వ పథకాలు, పదవులు, పనులను అమ్ముకున్న చరిత్ర గత పాలకులదని విమర్శించారు. బీ ఫారాలు, దళిత బంధు వంటి పథకాల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.1
- వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లలో చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు1
- Post by Ravi Poreddy1
- రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం. ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ మున్సిపల్ కార్మికులు గత 17 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలంటూ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్య దర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత ఆరు నెలల నుంచి వేతనాలు రావడం లేదని, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్మికుల వేతనాలు వెంటనే విడుదల చేయాలని, బకాయి ఈఎస్ఐ, పీఎఫ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.1
- పులి సంచరిస్తోంది..జర పైలం జన్నారం మండలంలోని చింతగూడ, మొహమ్మదాబాద్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం చింతగూడ అటవీలో పెద్దపులి అరుపులను అధికారులు గుర్తించారు. అలాగే మహమ్మదాబాద్ అడవిలో పులి సంచరిస్తుందని ఎఫ్డిఓ రామ్మోహన్ తెలిపారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో చింతగూడ, మొహమదాబాద్, తపాలాపూర్ గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అడవి వైపు ఎవరూ వెళ్లొద్దన్నారు. విద్యుత్ వైర్లు పెడితే వన్యప్రాణులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. పులి సంచారం దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎఫ్డిఓ రామ్మోహన్ కోరారు.1
- యాదాద్రి భువనగిరి జిల్లాలో 6000 లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి పట్టుబడ్డ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరణ ప్రకారం తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ఇంటి నిర్మాణ బిల్లులు విడుదల చేసేందుకు 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు తెలిపారు. దీంతో 6000 రూపాయలు కృష్ణకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. దీంతో కృష్ణ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు చెప్పారు.1
- *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..1