Shuru
Apke Nagar Ki App…
ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీల్లో నుండి కొండా సురేఖ ఫోటో ఔట్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో. ఈ కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్, పొంగులేటి, ఎంపీలు బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం పట్ల కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది.
Shareef pasha
ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీల్లో నుండి కొండా సురేఖ ఫోటో ఔట్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో. ఈ కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్, పొంగులేటి, ఎంపీలు బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం పట్ల కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది.
More news from తెలంగాణ and nearby areas
- పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాలలో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు జనగామ జిల్లా : పాలకుర్తి మండల కేంద్రంలోని గోశాల లో వినూత్నంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెంపుడు గోవులకు రాఖీలు కట్టిన కుటుంబం. అర్చకుల వేదమంత్రాల మధ్య గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోవులకు తిలకం దిద్ది, రాఖీలు కట్టి గోవులకు దీపహారతి ఇచ్చారు. స్వీట్లకు బదులుగా అరటిపండ్లు, ఆకుకూరలతో గోవులకు విందు ఇచ్చారు. గోవులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ రక్షాబంధన్ వేడుకలు చేశారు.మూగజీవులపై ప్రేమాభిమానాలు చాటుకున్న ఆ కుటుంబం. సంప్రదాయానికి జీవకారుణ్యాన్ని జోడించిన వినూత్న వేడుకలు జరిగాయి.పాలకుర్తిలో ఆకట్టుకున్న గోమాతలతో రక్షాబంధన్ వేడుకలు చేసుకున్నారు.1
- బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నేతలపై స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు జనగామ జిల్లా జఫర్గడ్ మండలం సాగరం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... బిఆర్ఎస్ పార్టీ సన్నాసులకు దమ్ముంటే, కాస్తంతయినా బుద్ది ఉంటే కేసీఆర్ బిడ్డ కవిత స్వయంగా బిఆర్ఎస్ పార్టీ పై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న 1,400 కోట్లు అక్రమంగా వచ్చినవే అని ఆ మొత్తాన్ని పార్టీ కార్యకర్తలకు పంచాలని డిమాండ్ చేస్తూంటే దానికి సమాధానం చెప్పే దమ్ము బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయామనే అక్కసుతో, మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆశతో కొన్ని యూట్యూబ్ చానళ్ళు కొని వాటి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొంతమందికి జీతాలు ఇచ్చి మరి నీచ స్థాయికి దిగజారి అబద్దాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టె ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుటుందని ఆరోపించారు. తెలంగాణ నుండి 8ఎంపీలు ఉండి, 8మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణకు ఒక వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయినా తీసుకువచ్చారా ప్రశ్నించారు. అసలు ప్రధాని మోడీకి మొదటి నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడో జరిగిన సంఘటన వీడియోలో నేనే ఉన్నానని బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తున్నారన్నారు.1
- హనుమకొండలో హరీశ్‌రావు అరెస్ట్.. బీఆర్‌ఎస్ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత హనుమకొండ: కలెక్టరేట్ వద్ద ఉద్యోగుల మహాధర్నాకు సంఘీభావం తెలిపి తిరిగి వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కలెక్టరేట్ పరిసరాల్లో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకెళ్లే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్‌లను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొనసాగించాలని కోరారు. విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.1
- మరి చెట్టుకు మర్రి కల్లు.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో అరుదైన సంఘటన. కల్లు తాగడానికి చెట్టును చూడడానికి భయపడుతున్న జనం... బయ్యారం మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 27... మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని తహాశీల్డార్ కార్యాలయం సమీపంలో ని చిన్నాల కుంట చెరువు వద్ద మర్రి చెట్టు వేరు నుండి కళ్ళు రావడం చూసి గీత కార్మికుడు నాలుగైదు రోజుల నుండి దానిని పరిశీలించగా ప్రధాన వేరు నుండి మర్రి కళ్ళు రావడానికి చూసి ఆశ్చర్యానికి లోనై వేరుకు గీత కత్తితో గీతలు పెట్టి కల్లు లొట్టిని కట్టారు. లొట్టిలో కళ్ళు పడటం చూసి పలువురు మర్రి కల్లు తాగేందుకు క్యూలు కడుతున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో పలువురు ఆ చెట్టును చూడటానికి వెళుతున్నారు. దీనిపై గీత కార్మికుడు ఆకుల శ్రీను తెలిపిన వివరాల ప్రకారం మర్రిచెట్టు పక్కనే గండు పెద్ద వెంకన్న వ్యవసాయ బావి పాడుబడి పూడిక తో ఉండడంతో ఏలిననో ప్రభావంతోతన వారి సాగు పొలానికి నీరు సరిపోక పోవడంతో తన బావిని ప్రోక్లిన్ సహాయంతో పూడిక పనులు చేశారు . పూడిక తీస్తున్న సందర్భంలో పక్కనే ఉన్న మర్రి పెద్ద వేరు తెగి పోవడం వల్ల, వేరు నుంచి మూడు నాలుగు రోజులుగా మర్రి కల్లు జాలు వారడం చూశానని తెలిపాడు.మర్రికల్లును తీసి విక్రయిస్తున్నట్లు గీత కార్మికుడు తెలిపాడు.1
- వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం............. ఉమ్మడి వరంగల్ హనుమకొండ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. గురువారం వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లిన సంఘటన లో మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. భీమదేవరపల్లి మండలం రాంనగర్ శివారులో జరిగిన ఈ విషాద సంఘటనలో హుస్నాబాద్ మండలం పోతారం లో జరిగిన వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుందనీ ఈ సంఘటనలో ఏలూరి రాధా (61) అక్కడికక్కడే మృతి చెందగా వీరారెడ్డి,కిరణ్,రవీందర్ రెడ్డి అనే మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి నట్లు, వీరంతా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.1
- *ఆడబిడ్డలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు* తెలిపిన *BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు* అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పండుగ ప్రతి ఇంటా ఆనందం, ప్రేమ, ఆప్యాయతలను నింపాలని కోరుకుంటూ *రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు* *ఆడబిడ్డలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు* తెలిపిన *BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు* అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ప్రతీకగా నిలిచే ఈ రాఖీ పండుగ ప్రతి ఇంటా ఆనందం, ప్రేమ, ఆప్యాయతలను నింపాలని కోరుకుంటూ *రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు*1
- ఆలేరులో బీసీల...........................................1
- ప్రభుత్వ కార్యక్రమాల ఫ్లెక్సీల్లో నుండి కొండా సురేఖ ఫోటో ఔట్ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో. ఈ కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్, పొంగులేటి, ఎంపీలు బలరాం నాయక్, వేం నరేందర్ రెడ్డి ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. జిల్లా మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం పట్ల కాంగ్రెస్ నేతల్లో చర్చ మొదలైంది.1