logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం — కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిపివేత వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. రైల్వే ట్రాక్ సమీపంలో మంటలు ఎగిసిపడటంతో సికింద్రాబాద్–భద్రాచలం మార్గంలో నడిచే కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలును న సుమారు 30 నిమిషాలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌ల సమీపంలో అజాగ్రత్తగా వ్యవహరించరాదని అధికారులు సూచించారు.

4 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
4 hrs ago

నెక్కొండ రైల్వే స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం — కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిపివేత వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. రైల్వే ట్రాక్ సమీపంలో మంటలు ఎగిసిపడటంతో సికింద్రాబాద్–భద్రాచలం మార్గంలో నడిచే కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలును న సుమారు 30 నిమిషాలు నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్‌ల సమీపంలో అజాగ్రత్తగా వ్యవహరించరాదని అధికారులు సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • తొర్రూరు వ్యవసాయ మార్కెట్ వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ఆలస్యం నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు – “అత్త, కోడలు రావాలి” అంటూ రాస్తారోకోతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. 40 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తొర్రూరు–మహబూబాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ కేంద్రానికి సంబంధించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అత్త (ఝాన్సీ రెడ్డి), కోడలు (యశస్విని రెడ్డి) రావాలి” అంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
    1
    తొర్రూరు వ్యవసాయ మార్కెట్ వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ఆలస్యం నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు – “అత్త, కోడలు రావాలి” అంటూ రాస్తారోకోతో భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ కేంద్రం వద్ద మొక్కజొన్న, వరి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. 40 రోజుల క్రితం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కాంటాలు వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో తొర్రూరు–మహబూబాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ కేంద్రానికి సంబంధించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ “అత్త (ఝాన్సీ రెడ్డి), కోడలు (యశస్విని రెడ్డి) రావాలి” అంటూ నినాదాలు చేశారు.
రైతుల ఆందోళనతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    19 min ago
  • వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    2
    వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.
    user_Karam jeevan
    Karam jeevan
    Photographer మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు...భారీగా తరలివస్తున్న భక్తులు....హనుమాన్ దీక్ష స్వాములతో కాషాయవర్ణ శోభితంగా మారిన కొండగట్టు కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.‌ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బాగంగా రెండవ రోజు కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభితంగా మారింది. రామనామ స్మరణలు, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దుచేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాల ధారణతో కొండగట్టుకు చేరుకునే భక్తులు, మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురి కాకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేపు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పలు ప్రాంతాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టు ను సందర్శించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ఇరుముడితో పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తున్నారు.‌ భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.
    4
    కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు...భారీగా తరలివస్తున్న భక్తులు....హనుమాన్ దీక్ష స్వాములతో కాషాయవర్ణ శోభితంగా మారిన కొండగట్టు
కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.‌ హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బాగంగా రెండవ రోజు కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభితంగా మారింది. రామనామ స్మరణలు, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దుచేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాల ధారణతో కొండగట్టుకు చేరుకునే భక్తులు, మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురి కాకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేపు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పలు ప్రాంతాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టు ను సందర్శించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ఇరుముడితో పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తున్నారు.‌ 
భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో  కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    1
    తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    13 hrs ago
  • Post by Mana Velugu
    1
    Post by Mana Velugu
    user_Mana Velugu
    Mana Velugu
    Teacher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    15 hrs ago
  • తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.
    1
    తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    16 hrs ago
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    1
    సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    23 hrs ago
  • నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం – 40 మొక్కజొన్న బస్తాలు దగ్ధం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు అజ్మీర లలిత పంట చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 40 బస్తాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు.
    1
    నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం – 40 మొక్కజొన్న బస్తాలు దగ్ధం
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు అజ్మీర లలిత పంట చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 40 బస్తాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.